Samantha New Business: Samantha Invests In 'SustainKart' E-Commerce Platform - Sakshi
Sakshi News home page

Samantha: మరో కొత్త బిజినెస్‌లోకి సామ్‌, ఇది నాగ చైతన్యకు పోటీగానా?

Published Wed, Mar 9 2022 10:48 AM | Last Updated on Wed, Mar 9 2022 11:21 AM

Samantha Announce Her New Business Sustainkart - Sakshi

Samantha Announce Her New Bussiness: ఎంతో మంది సినీ తారలు వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నారు. ఇప్పటికే రామ్‌ చరణ్‌, మంచు ఫ్యామిలీ, సమంత, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వంటి తదితర స్టార్‌ హీరోహీరోయిన్లు వ్యాపారంలోకి అడుగు పెట్టి సత్తా చాటుతున్నారు. ఇటీవల అక్కినేని హీరో నాగచైతన్య కూడా బిజినెస్‌లోకి దిగి రెస్టారెంట్‌ స్టార్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. షోయు అనే పేరుతో హైదరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. అంతేకాదు తన బిజినెస్‌ ప్రమోషన్‌లో చేస్తూ యాడ్ ద్వారా ప్రకటన ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కొత్త బిజినెస్‌లోకి అడుగు పెట్టింది సమంత.

చదవండి: రాధేశ్యామ్‌ షూటింగ్‌లో ప్రభాస్‌తో గొడవ, క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే

ఇప్పటికే సాఖి అనే క్లాత్‌ బ్రాండ్‌తో పాటు ఎడ్యూకేషన్‌, రెస్టారెంట్‌ బిజినెస్‌లో రాణిస్తున్నా సామ్‌ తాజాగా మరో వ్యాపారంలో పెట్టుబుడులు పెట్టింది. ఉమెన్స్‌ డే సందర్భంగా తన కొత్త బిజినెస్‌ను అందరికి పరిచయం చేసింది. ఫ్లిప్ కార్ట్ తరహాలో సస్టైన్ కార్ట్ అనే ఓ ఈ కామర్స్ సంస్థను సమంత లాంచ్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ..‘సస్టైన్ కార్ట్‌లో ఇన్వెస్టర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇటీవల భారతదేశంలో కొనుగోలుదారులు నేచర్ ఫ్రెండ్లి ప్రొడక్ట్స్‌లపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి ప్రొడక్ట్స్‌ని వారి అభిరుచికి తగ్గట్టుగా అందచేయడానికే ఈ సస్టైన్ కార్ట్‌’ అంటూ రాసుకొచ్చింది. 

చదవండి: కండోమ్‌ టెస్టర్‌గా రకుల్‌, ఆమె తల్లిదండ్రులు ఏమన్నారంటే..

ఇటీవల నాగ చైతన్య తన కొత్త బిజినెస్‌ ప్రకటించిన కొద్ది రోజులకే సమంత కూడా తన కొత్త వ్యాపారాన్ని ప్రకటించడంతో ఆసక్తి నెలకొంది. దీంతో సామ్‌ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మాజీ భర్తకు పోటీగా సమంత తన కొత్త బిజినెస్‌ను ప్రకటించందూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇటూ హీరోయిన్‌గా వరస సినిమాలు చేస్తూనే పలు వ్యాపారంలో కూడా సమంత యాక్టివ్‌గా ఉంటూ క్షణం తీరిక లేకుండ ఉన్న సామ్‌ కొత్త బిజినెస్‌ను అనౌన్స్‌ చేయడంతో ఇది చైతూకు పోటీగానే ఆమె ప్రకటించందంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement