పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలితో ఒక్కసారిగా ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఈ చిత్రంతో దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్స్ బేస్ సంపాదించుకున్నాడు. ఇందుకు రీసెంట్‌గా ఆయన ఇచ్చిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకేనే నిదర్శనం. ఈ యంగ్ రెబల్ స్టార్ ఎపిసోడ్‌ను చూసేందుకు ఒకేసారి అంతా ఎగబడంతో ఆహా యాప్ క్రాష్ అయిన సంగతి తెలిసిందే. ఇక అమ్మాయిల కలల రాకూమారుడైన ఈ డార్లింగ్ నాలుగు పదులు వయసులో కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్నాడు. ఆయన పెళ్లి ఎప్పుడెప్పుడా అని అభిమానులే కాదు సినీ సెలబ్రెటీలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
చదవండి: సోనూసూద్.. తప్పుడు సందేశాలివ్వొద్దు!: నార్త్ రైల్వే ఆగ్రహం
వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న ప్రభాస్ కోట్లలో పారితోషికం అందుకుంటున్నాడు. ప్రస్తుతం తను చేస్తున్న సినిమాలన్ని కలిసి దాదాపు రూ. 400 కోట్ల నుంచి రూ. 500 కోట్ల వరకు ఉంటుందని అంచనా. భారత చలన చిత్ర రంగంలో అత్యధిక పారితోషికం అందుకునే నటుల్లో ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. అలాంటి ప్రభాస్ సినిమాల్లోకి రాకపోయింటే ఎలా ఉండేది. ఆ ఊహే ఇబ్బంది పెడుతుంది కదా! మరి తను హీరో కాకపోయింటే ఏం చేయాలనుకున్నాడో ఇటీవల ఓ ఇంటర్య్వూలో చెప్పాడు ప్రభాస్. రీసెంట్‌గా ఓ ఇంటర్య్వూలో ప్రభాస్ మాట్లాడుతూ.. తాను సినిమాల్లోకి రాకపోయింటే వ్యాపారం రంగంలోకి అడుగుపెట్లేవాడిని అని చెప్పాడు.
చదవండి: అవికా గోర్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన నాగ్
తాను అసలు హీరో అవుతానని అనుకోలేదన్నాడు. చిన్నప్పటి నుంచి వ్యాపారం చేయాలని కలలు కనేవాడినని, అయితే అందులో హోటల్ బిజినెస్‌పై ఎక్కువ ఆసక్తి ఉండేదన్నాడు. ‘చిన్నప్పటి నుంచి ఏదైన వ్యాపారం చేయాలని చాలా ఆసక్తిగా ఉండేది. నేను మంచి ఫుడ్డి కాబట్టి హోటల్ బిజినెస్ చేయాలని అనుకున్నా. కానీ అప్పుడు మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అందువల్ల నేను అనుకున్న వ్యాపారం చేయాలేకపోయాను. ఆ తర్వాత చూస్తే ఇలా సినిమా రంగంలోకి వచ్చాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రభాస్ మంచి ఫుడ్డి అనే విషయం తెలిసిందే. అతడు చేపల పులుసు చాలా ఇష్టం తింటాడని ఆయన పెద్దమ్మ, దివంగత నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి ఓ ఇంటర్య్వూలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment