మేడారంలో మృతి చెందిన వినయ్ మృత దేహం (ఇన్‌సెట్‌లో )
సాక్షి, వరంగల్ : మేడారం జాతరలో అపశ్రుతి చోటుచేసుకుంది. జంపన్నవాగులో పడి ఇద్దరు మృతి చెందారు. మృతులు సికింద్రాబాద్‌కు చెందిన వినయ్, దుమ్ముగూడెం మండలం సుబ్బారావుపేటకు చెందిన వినోద్‌గా గుర్తించారు. వీరిద్దరు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారక్క అమ్మవార్ల దర్శనానికి వచ్చి స్నానాలు చేసేందుకు జంపన్నవాగులో దిగారు. ఈ క్రమంలో వారికి మూర్ఛ వచ్చి వాగులో పడి మృతిచెందారు. మరోవైపు లక్షలాది మంది భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి మేడారం బాటపట్టారు. పెద్ద మొత్తంలో వాహనాలు బారులు తీరడంతో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ కోసం కసరత్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment