
ఇల వైకుంఠానికి పోటెత్తిన భక్తజనం
సాక్షి, తిరుమల: ఇల వైకుంఠం తిరుమలక్షేత్రంలో ఆదివారం వైకుంఠ ఏకాదశి పర్వదినం వైభవంగా సాగింది. ముక్కోటి దర్శనం కోసం అంచనాలకు మించి భక్తులు పోటెత్తారు. క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. క్యూలైన్లలోకి భక్తులు వెళ్లే సమయంలో తోపులాటలు జరిగాయి. గతేడా ది 2,800 వీఐపీ టికెట్లు కేటాయించగా.. ఈ ఏడాది వాటిని 4,200లకు పెంచారు. అర్ధరాత్రి తర్వాత వీఐపీలకు శ్రీవారి దర్శనం కల్పించారు. తర్వాత 4.09 గంటకు సామాన్య భక్తులను అనుమతిం చారు. ముక్కోటి దర్శనానికి వచ్చే భక్తులను తొలుత 54 కంపార్ట్‌మెంట్లలోకి అనుమ తించారు. తర్వాత నారాయణగిరి ఉద్యావనంలో 16 తాత్కాలిక కంపార్ట్ మెంట్లలోకి, ఆలయ నాలుగుమాడ వీధుల్లోకి అనుమతించారు. వైకుంఠద్వార ప్రవేశంతో సామాన్య భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
ఆలయ వీధుల్లో.. గ్యాలరీల్లో తోపులాటలు
ఆలయ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉండే భక్తుల మధ్య తోపులాటలు జరిగాయి. భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకురావటంతో రావడంతో భక్తులు కింద పడ్డారు. ముందస్తు ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు చవిచూసారు.
సామాన్యులకే ప్రాధాన్యం: ఈవో సాంబశివరావు
వైకుంఠ ఏకాదశిలో శ్రీవారి దర్శనాన్ని సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం ఇచ్చామని, అందుకు అనుగుణంగానే భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతించామని టీటీడీ ఈవో సాంబశివరావు చెప్పారు. అధిక సమయం సామాన్య భక్తులకు కేటాయించటం ఆనందంగా ఉందన్నారు. కంపార్ట్‌మెంట్లలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
తిరుమల శ్రీవారిని ఆదివారం తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్, చల్లా కోదండరామ్, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సభ్యుడు జస్టిస్ రవిబాబు, తమిళ నాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంతోష్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మాల దర్శిం చుకున్నారు. వైకుంఠ ఏకాదశి శుభగడియల్లో స్వామివారిని దర్శించుకున్నారు.