తెరుచుకున్న కేదార్‌నాథ్‌ ఆలయం | Kedarnath Temple Reopen After Winter Break | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 29 2018 11:13 AM | Last Updated on Wed, Sep 18 2019 2:52 PM

Kedarnath Temple Reopen After Winter Break - Sakshi

డెహ్రాడూన్‌: కేదార్‌నాథ్‌ ఆలయం తెరుచుకుంది. ఈ రోజు ఉదయం భక్తుల సందర్శనార్థం ఆలయాన్ని తెరిచారు. సంవత్సరంలో ఈ ఆలయం ఆరు నెలలు మూసి ఉంచడం, ఆరు నెలలు తెరిచి ఉంచడం చేస్తారన్న సంగతి తెలిసిందే. భక్తుల సందర్శనార్థం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్‌ ఆలయాన్ని ఈ ఆరునెలల్లో లక్షల మంది సందర్శిస్తారు. భక్తుల తాకిడితో ఆ ప్రాంతం అంతా కోలాహలంగా ఉంటుంది. భక్తుల​​ కోసం వైద్య, విద్యుత్‌, నీటి సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్రసింగ్‌ పేర్కొన్నారు.  మళ్లీ నవంబర్‌లో ఈ ఆలయాన్ని మూసివేస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement