రాజమండ్రి: ఏడో రోజు పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమ, మంగళవారాలు కూడా పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో పుణ్య స్నానాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని పుష్కర ఘాట్ల వద్ద భక్తులు బారులు తీరారు. పుష్కరాలకు వచ్చే భక్తులు ట్రాఫిక్ కారణంగా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వీరికి సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో టీటీడీ రోజు లక్ష ఆహార పొట్లాలు అందించాని నిర్ణయించింది. కాగా, రాజమండ్రి, సామర్లకొట నుంచి పుష్కరాల సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
ఏడో రోజుకు చేరుకున్న పుష్కరాలు
Published Mon, Jul 20 2015 7:35 AM | Last Updated on Sun, Sep 3 2017 5:51 AM
Advertisement
Advertisement