ముంబయి:మహారాష్ట్రలో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారం(నవంబర్18) సాయంత్రం ముగిసింది. ప్రచారం చివరి రోజు మరింత వేడెక్కి పార్టీల మధ్య యాడ్‌వార్ నడిచింది. ప్రత్యర్థుల వైఫల్యాలివే అంటూ అధికార, విపక్షాలు వార్తాపత్రికల్లో భారీ ప్రకటనలిచ్చాయి.
కర్ణాటక పథకాలపై మహారాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలను కన్నడ సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వ హయాంలో జరిగిన వాటిపై బీజేపీ పత్రికల్లో భారీ ప్రకటనలు ఇచ్చింది. ముంబయి ఉగ్రదాడులు మొదలుకొని కొవిడ్ కిట్ స్కామ్ వరకు అనేక అంశాలను ప్రకటనల్లో బీజేపీ ప్రస్తావించింది.
పాల్గర్‌లో సాధువుల హత్య, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు సీబీఐ విచారణ నిలివేసిన ఉద్ధవ్ ఠాక్రే, ముంబయి రైలు పేలుళ్లు, అంబానీ ఇంటికి బెదిరింపులతో పాటు ఎంవీఏ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలతో పత్రికల్లో బీజేపీ ప్రకటనలు ఇచ్చింది. ఇదే సమయంలో రాష్ట్రంలో మహాయుతి ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై ఎంవీఏ కూడా ప్రకటనలు ఇచ్చింది. బుధవారం(నవంబర్20) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment