ముగిసిన నాలుగో దశ ప్రచారం | Campaign ends for fourth phase of elections | Sakshi
Sakshi News home page

ముగిసిన నాలుగో దశ ప్రచారం

Published Sun, Apr 28 2019 5:35 AM | Last Updated on Sun, Apr 28 2019 5:35 AM

Campaign ends for fourth phase of elections - Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ ప్రచారం శనివారంతో ముగిసింది. 8 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్‌ జరగనుంది. వివిధ నియోజకవర్గాల పోలింగ్‌ సమయాలు వేర్వేరుగా ఉండటంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య ముగిసింది. ఓటింగ్‌ ప్రక్రియ ముగియడానికి ముందు ఉండే 48 గంటల కాలాన్ని ‘నిశ్శబ్ద కాలం’గా పిలుస్తారు. ఈ సమయంలో ఎలాంటి రాజకీయ ప్రచారమైనా నిషిద్ధం. ప్రచారం గడువు ముగియడంతో మహారాష్ట్రలోని 17, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లో 13 చొప్పున, పశ్చిమబెంగాల్లో 8, మధ్యప్రదేశ్, ఒడిశాలో 6 చొప్పున, బిహార్‌లో 5, జార్ఖండ్‌లో 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ర్యాలీలకు, వీధి కూడలి సమావేశాలకు తెరపడింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement