![Congress announces candidates for Punjab](/styles/webp/s3/filefield_paths/punjab-congress.jpg.webp?itok=sGYtmZwt)
పంజాబ్‌లో మరో నాలుగు లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను సోమవారం ప్రకటించింది. పంజాబ్‌లో మొత్తం 13 లోక్‌సభ స్థానాలు ఉండగా ప్రస్తుతం ప్రకటించిన నాలుగు స్థానాలను కలుపుకొని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకూ 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
గురుదాస్‌పూర్ నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి సుఖ్‌జిందర్ సింగ్ రంధవా, లూథియానా నుంచి పార్టీ రాష్ట్ర చీఫ్ అమరీందర్ సింగ్ బ్రార్ (రాజా వారింగ్) బరిలోకి దిగుతున్నారు. ఖదూర్ సాహిబ్ నుంచి కుల్బీర్ సింగ్ జిరా, ఆనంద్‌పూర్ సాహిబ్ నుంచి విజయ్ ఇందర్ సింగ్లాలను పోటీలోకి దింపింది హస్తం పార్టీ.
కొత్త అభ్యర్థులను పేర్లను కాంగ్రెస్‌పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. రాష్ట్రంలోని మొత్తం 13 స్థానాలకు జూన్ 1న చివరి దశలో ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment