13 స్థానాలకు జూన్ 1న పోలింగ్
విడిగా పోటీ చేస్తున్న ఆప్, కాంగ్రెస్
వాటితో పాటు బీజేపీకీ ప్రతిష్టాత్మకమే
2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పెద్దగా రాణించని రాష్ట్రాల్లో పంజాబ్ ఒకటి. 13 లోక్‌సభ స్థానాల్లో ఎనిమిది కాంగ్రెస్ హస్తగతం కాగా బీజేపీ రెండింటికే పరిమితమైంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అద్భుత విజయంతో గద్దెనెక్కింది. దాన్ని లోక్‌సభ ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని ఆశ పడుతోంది. దాంతో కాంగ్రెస్‌తో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలో దిగింది. అకాలీదళ్ దూరమవడంతో బీజేపీ కూడా సొంతంగానే పోటీ చేస్తోంది. దాంతో రాష్ట్రంలో చతుర్ముఖ పోరు నెలకొంది. ఆప్, బీజేపీ పోటీని తట్టుకుని సిట్టింగ్ స్థానాలను కాపాడుకోవడం కాంగ్రెస్‌కు సవాలే...
జలంధర్
కాంగ్రెస్‌కే గాక ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన మాజీ సీఎం చరణ్‌సింగ్ చన్నీకి సైతం ఇక్కడ గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. 2009, 2014, 2019ల్లో ఇక్కడ కాంగ్రెస్ వరుసగా గెలిచింది. 2023 ఉప ఎన్నికలో ఆప్ నేత సుశీల్‌కుమార్ రింకు నెగ్గారు. ఇప్పుడాయన బీజేపీ అభ్యర్థిగా పోటీలోకి దిగడం విశేషం! ఆప్ నుంచి పవన్‌కుమార్ టిను, అకాలీదళ్ నుంచి మోహింద్ సింగ్ బరిలో ఉన్నారు. బీఎస్పీ, సీపీఎం, అకాలీదళ్ (అమృత్‌సర్) కూడా పోటీ చేస్తున్నాయి. జలంధర్‌లో కాంగ్రెస్ ఏకంగా 13సార్లు ఇక్కడ గెలవడం విశేషం!
గురుదాస్‌పూర్
ఇక్కడా ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే! సిట్టింగ్ ఎంపీ, బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ స్థానంలో దినేశ్ సింగ్ బబ్బుకు బీజేపీ టికెటిచ్చింది. అకాలీదళ్ అండ లేకపోవడం పారీ్టకి ప్రతికూలం. మోదీపైనే బీజేపీ భారం వేసింది. కాంగ్రెస్ నుంచి సుఖ్‌జిందర్ సింగ్ రాండ్వ, ఆప్ నుంచి అమన్õÙర్ సింగ్ కల్సి, అకాలీదళ్ తరఫున దల్జీత్‌సింగ్ చీమ పోటీలో ఉన్నారు. అకాలీదళ్ (అమృత్‌సర్) సైతం అభ్యరి్థని పోటీకి పెట్టింది.
ఆనంద్‌పూర్ సాహిబ్
కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మనీశ్ తివారీ బదులు విజయ్ ఇందర్ సింగ్లా బరిలో ఉన్నారు. ఆప్ నుంచి మాలీ్వందర్ సింగ్, అకాలీదళ్ తరఫున ప్రేమ్‌సింగ్ చందూమజ్రా, బీజేపీ తరఫున సుభాష్ శర్మ పోటీ చేస్తున్నారు. బీఎస్పీ, అకాలీదళ్ (అమృత్‌సర్) సైతం పోటీలో ఉన్నాయి. ఇక్కడ 2014లో గెలిచిన అకాలీదళ్ నేత ప్రేమ్‌సింగ్ 2019లో ఓటమి పాలయ్యారు.
పటియాలా
మాజీ సీఎం అమరిందర్‌సింగ్ భార్య ప్రణీత్ కౌర్ ఇక్కడ పోటీలో ఉన్నారు. 2019 ఇక్కడ కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన ప్రణీత్ ఈసారి బీజేపీ టికెట్‌పై బరిలో దిగడం విశేషం. ఆప్ నుంచి దల్బీర్ సింగ్, అకాలీదళ్ తరఫున నరీందర్ కుమార్ శర్మ, కాంగ్రెస్ నుంచి ధరంవీర్ గాంధీ పోటీ చేస్తున్నారు. ప్రధాన పోటీ ప్రణీత్, ధరంవీర్ మధ్యే నెలకొంది. సంప్రదాయంగా కాంగ్రెస్‌కే మద్దతిచ్చే ఇక్కడి ఓటర్లకు నచ్చజెప్పి బీజేపీకి ఓటేయించడం ప్రణీత్, అమరీందర్‌లకు సవాలుగా మారింది. ఆమె ఫిరాయింపుదారు అంటూ రైతులు నిరసన తెలుపుతుండటం తలనొప్పిగా మారింది. అయితే గణనీయంగా ఉన్న హిందూ ఓటర్లపై అమరీందర్ దంపతులు ఆశలు పెట్టుకున్నారు.
లుధియానా
పంజాబ్‌లో ముఖ్యమైన పారిశ్రామిక ప్రాంతం. ఒకప్పుడు కాంగ్రెస్–అకాలీదళ్ మధ్యే పోటీ ఉండేది. 2014, 2019ల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన మాజీ సీఎం బియాంత్‌సింగ్ కుమారుడు రవనీత్ సింగ్ భిట్టు ఈసారి బీజేపీ అభ్యరి్థగా బరిలో దిగారు! 65.96 శాతం మంది హిందువులుండటం బీజేపీకి అనుకూలిస్తుందని భావిస్తున్నారు. దాంతో కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ బరిలో దిగారు. ఆప్ నుంచి అశోక్ పరాశర్ పప్పీ, అకాలీదళ్ తరఫున రంజిత్‌సింగ్ ధిల్లాన్ బరిలో ఉన్నారు. అకాలీదళ్ (అమృత్‌సర్)తో పాటు పలువురు స్వతంత్రులూ గట్టి పోటీ ఇస్తున్నారు.
అమృత్‌సర్
ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎంపీ గుర్జీత్ సింగ్ అజ్లా, బీజేపీ నుంచి తరణ్‌జిత్ సింగ్ సంధు బరిలో ఉన్నారు. మాజీ ఐఎఫ్‌ఎస్ అధికారి సంధు ఇటీవలే బీజేపీలో చేరారు. రాష్ట్రంలో 22 శాతం మేర ఉన్న జాట్ సిక్కు వర్గానికి చెందిన వ్యక్తి. ప్రచారంలోనూ దూసుకెళ్తున్నారు. కెపె్టన్ అమరిందర్ సింగ్ చేరిక బీజేపీకి సానుకూలాంశం. ఆప్ నుంచి మంత్రి కులదీప్‌సింగ్ దలైవాల్ రంగంలో ఉన్నారు.
పోలింగ్ జరగనున్న లోక్‌సభ స్థానాలు...
అమృత్‌సర్, గురుదాస్‌పూర్, ఖదూర్‌సాహిబ్, హోషియార్‌పూర్, జలంధర్, ఆనందపూర్ సాహిబ్, లుధియానా, ఫతేగఢ్ సాహిబ్, ఫరీద్‌కోట్, ఫిరోజ్‌పూర్, భటిండా, సంగ్రూర్, పాటియాలా.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment