ఇద్దరు సలహాదారులు సహా 59 మందికి పదవులు
చాగంటికి సలహాదారు పదవి
జనసేనకు 9, బీజేపీకి రెండు పదవులు
ఓ సలహాదారు సహా కీలక పదవులన్నీ టీడీపీకే
18 కుల కార్పొరేషన్లు, 13 అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలకు చైర్మన్ల నియామకం
సాక్షి, అమరావతి: రెండో విడత నామినేటెడ్ పదవుల్లోనూ మిత్రపక్షాలైన జనసేన, బీజేపీకి చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. కంటి తుడుపుగా ఇచ్చామంటే ఇచ్చామన్నట్లుగా పదవులు ఇచ్చారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం రెండో దఫా 59 నామినేటెడ్ పదవులను ప్రకటించింది. వీటిలో రెండు సలహాదారుల పదవులు ఉన్నాయి. ఏ పార్టీతో సంబంధం లేని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు సలహాదారు పదవి ఇచ్చారు. ఆయనకు విద్యార్థులకు నైతిక విలువలు బోధించే పదవిని ఇచ్చారు. మిగిలిన 58 పదవుల్లో జనసేనకు దక్కింది 9 మాత్రమే. బీజేపీకి రెండే పదవులు ఇచ్చారు.
ఓ సలహాదారు పదవి సహా మిగిలినవన్నీ టీడీపీకే. మొదటి విడత ప్రకటించిన 20 కార్పొరేషన్లలోనూ కేవలం మూడు జనసేనకు, ఒకటి బీజేపీకి ఇచ్చి అవమానించారు. వీటితో సంబంధం లేకుండా టీటీడీ ఛైర్మన్ పదవిని చంద్రబాబు తన ఇష్ట్రపకారం భర్తీ చేసుకున్నారు. ఇప్పుడు రెండో విడతలో 58 పదవులు ప్రకటించినా, అంతకంటే ఘోరంగా జనసేన, బీజేపీకి నామమాత్రంగా.. అదీ కూడా అసలు ప్రాధాన్యత లేని పదవులు ఇచ్చారని ఆ పార్టీల నేతలు వాపోతున్నారు. కీలకమైన, ప్రాధాన్యం ఉన్న పదవులన్నీ టీడీపీ నేతలకే కట్టబెట్టారు. టీడీపీ సీనియర్ నాయకుడు ఎంఏ షరీఫ్‌ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించి కేబినెట్ ర్యాంకు ఇచ్చారు. మిగిలిన 57 మందిని ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లు, సంస్థలకు చైర్‌పర్సన్లుగా నియమించింది. వీటిలో 18 కుల కార్పొరేషన్లు, 13 అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలు ఉన్నాయి. పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో టికెట్టు దక్కని నేతలకు ఈ జాబితాలో అవకాశం కల్పించారు.
రెండోదఫా నామినేటెడ్ పదవులు సలహాదారులు
1. మహమ్మద్ షరీఫ్ – మైనారిటీ వ్యవహారాలు
2. చాగంటి కోటేశ్వరరావు – స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్
వివిధ సంస్థల చైర్మన్లు
1. కుడిపూడి సత్తిబాబు – ఏపీ శెట్టి బలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
2. మాల సురేంద్ర – ఏపీ గవర వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
3. రోణంకి కృష్ణంనాయుడు – ఏపీ కళింగ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
4. పీవీజీ కుమార్ – ఏపీ కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
5. దేవేంద్రప్ప – ఏపీ కురుబ – కురుమ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
6. ఆర్ సదాశివ – ఏపీ నాయీబ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
7. సావిత్రి – ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (బీజేపీ)
8. పాలవలస యశస్వి – ఏపీ తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (జనసేన)
9. కప్పట్రాల సుశీలమ్మ – ఏపీ వాల్మీకి – బోయ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
10. సీఆర్ రాజన్ – ఏపీ వన్యకుల క్షత్రియ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్
11. నరసింహ యాదవ్ – ఏపీ యాదవ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
12. చిలకలపూడి పాపారావు – ఏపీ అగి్నకుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (జనసేన)
13. వీరంకి వెంకట గురుమూర్తి – ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
14. గండి బాబ్జి – ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్
15. మంజులారెడ్డి రెంటచింతల – ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్టŠస్ అండ్ కల్చరల్ సొసైటీ
16. నీలాయపాలెం విజయ్‌కుమార్ – ఏపీ స్టేట్ బయో డైవర్సిటీ బోర్డు
17. జీవీ రెడ్డి – ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్
18. మన్నవ మోహన్‌కృష్ణ – ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్
19. తేజస్వి – ఏపీ కల్చరల్ కమిషన్
20. పోలంరెడ్డి దినే‹Ùరెడ్డి – ఏపీ ఎని్వరాన్మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్
21. సుజయ్‌కృష్ణ రంగారావు – ఏపీ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
22. గోనుగుంట్ల కోటేశ్వరరావు – ఏపీ గ్రంధాలయ పరిషత్
23. డేగల ప్రభాకర్ – ఏపీ ఇండ్రస్టియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
24. కేకే చౌదరి – ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు
25. చిల్లపల్లి శ్రీనివాసరావు – ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (జనసేన )
26. ప్రగడ నాగేశ్వరరావు – ఏపీ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
27. మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి – ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్
28. ఆనం వెంకట రమణారెడ్డి – ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ
29. రఘురామరాజు – ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్సస్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ
30. సావల దేవదత్ – ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్టŠస్ సర్టిఫికేషన్ అథారిటీ
31. రావి వెంకటేశ్వరరావు – ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్
32. కావలి గ్రీష్మ – ఏపీ ఉమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్
33. ఏపీఎస్‌ఆర్టీసీ రీజనల్ బోర్డు ఛైర్మన్లు – దొన్ను దొర, రెడ్డి అప్పలనాయుడు (జనసేన), సురేష్ రెడ్డి (బీజేపీ), పోలా నాగరాజు
34. సజ్జా హేమలత – ఏపీ హ్యాండ్‌లూమ్ కోఆపరేటివ్ సొసైటీ
35. గుమ్మడి గోపాలకృష్ణ – ఏపీ నాటక అకాడమీ
36. సీతంరాజు సుధాకర్ – ఎనీ్టఆర్ వైద్య సేవ
37. కొమ్మారెడ్డి పట్టాభిరామ్ – స్వచ్ఛాంధ్ర మిషన్
38. అల్లాడ స్వామినాయుడు – అమలాపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ
39. టీసీ వరుణ్ – అనంతపూర్ – హిందూపూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (జనసేన)
40. రూపానందరెడ్డి – అన్నమయ్య అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ
41. సలగల రాజశేఖర్‌బాబు – బాపట్ల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ
42. తెంటు లక్ష్మీనాయుడు – బొబ్బిలి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ
43. కె హేమలత – చిత్తూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ
44. తుమ్మల రామస్వామి – కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (జనసేన)
45. సోమిశెట్టి వెంకటేశ్వర్లు – కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ
46. మట్టా ప్రసాద్ – మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (బీజేపీ )
47. కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి – నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ
48. బొడ్డు వెంకట రమణచౌదరి – రాజమండ్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ
49. కె. రవికుమార్ – శ్రీకాకుళం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (జనసేన)
50. ప్రణవ్ గోపాల్ – విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ
51. ముస్తాక్ అహ్మద్ – ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్
52. డి. రాకేష్ – ఏపీ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
53. వి. సూర్యనారాయణరాజు (కనకరాజు సూరి) – ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెం ట్ కార్పొరేషన్ (జనసేన)
54. కొత్తపల్లి సుబ్బారాయుడు – ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (జనసేన)
55. ఉండవల్లి శ్రీదేవి – ఏపీ మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్
56. పి. విజయ్‌కుమార్ – ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (జనసేన )
57. కిడారి శ్రావణ్ – ఏపీ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్
Comments
Please login to add a commentAdd a comment