Nominated posts in AP
-
రెండో విడత నామినేటెడ్ పందేరం
సాక్షి, అమరావతి: రెండో విడత నామినేటెడ్ పదవుల్లోనూ మిత్రపక్షాలైన జనసేన, బీజేపీకి చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. కంటి తుడుపుగా ఇచ్చామంటే ఇచ్చామన్నట్లుగా పదవులు ఇచ్చారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం రెండో దఫా 59 నామినేటెడ్ పదవులను ప్రకటించింది. వీటిలో రెండు సలహాదారుల పదవులు ఉన్నాయి. ఏ పార్టీతో సంబంధం లేని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు సలహాదారు పదవి ఇచ్చారు. ఆయనకు విద్యార్థులకు నైతిక విలువలు బోధించే పదవిని ఇచ్చారు. మిగిలిన 58 పదవుల్లో జనసేనకు దక్కింది 9 మాత్రమే. బీజేపీకి రెండే పదవులు ఇచ్చారు.ఓ సలహాదారు పదవి సహా మిగిలినవన్నీ టీడీపీకే. మొదటి విడత ప్రకటించిన 20 కార్పొరేషన్లలోనూ కేవలం మూడు జనసేనకు, ఒకటి బీజేపీకి ఇచ్చి అవమానించారు. వీటితో సంబంధం లేకుండా టీటీడీ ఛైర్మన్ పదవిని చంద్రబాబు తన ఇష్ట్రపకారం భర్తీ చేసుకున్నారు. ఇప్పుడు రెండో విడతలో 58 పదవులు ప్రకటించినా, అంతకంటే ఘోరంగా జనసేన, బీజేపీకి నామమాత్రంగా.. అదీ కూడా అసలు ప్రాధాన్యత లేని పదవులు ఇచ్చారని ఆ పార్టీల నేతలు వాపోతున్నారు. కీలకమైన, ప్రాధాన్యం ఉన్న పదవులన్నీ టీడీపీ నేతలకే కట్టబెట్టారు. టీడీపీ సీనియర్ నాయకుడు ఎంఏ షరీఫ్‌ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించి కేబినెట్ ర్యాంకు ఇచ్చారు. మిగిలిన 57 మందిని ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లు, సంస్థలకు చైర్పర్సన్లుగా నియమించింది. వీటిలో 18 కుల కార్పొరేషన్లు, 13 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఉన్నాయి. పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో టికెట్టు దక్కని నేతలకు ఈ జాబితాలో అవకాశం కల్పించారు.రెండోదఫా నామినేటెడ్ పదవులు సలహాదారులు 1. మహమ్మద్ షరీఫ్ – మైనారిటీ వ్యవహారాలు 2. చాగంటి కోటేశ్వరరావు – స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ వివిధ సంస్థల చైర్మన్లు 1. కుడిపూడి సత్తిబాబు – ఏపీ శెట్టి బలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2. మాల సురేంద్ర – ఏపీ గవర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 3. రోణంకి కృష్ణంనాయుడు – ఏపీ కళింగ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 4. పీవీజీ కుమార్ – ఏపీ కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 5. దేవేంద్రప్ప – ఏపీ కురుబ – కురుమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 6. ఆర్ సదాశివ – ఏపీ నాయీబ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 7. సావిత్రి – ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (బీజేపీ) 8. పాలవలస యశస్వి – ఏపీ తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జనసేన) 9. కప్పట్రాల సుశీలమ్మ – ఏపీ వాల్మీకి – బోయ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 10. సీఆర్ రాజన్ – ఏపీ వన్యకుల క్షత్రియ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ 11. నరసింహ యాదవ్ – ఏపీ యాదవ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 12. చిలకలపూడి పాపారావు – ఏపీ అగి్నకుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జనసేన) 13. వీరంకి వెంకట గురుమూర్తి – ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 14. గండి బాబ్జి – ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ 15. మంజులారెడ్డి రెంటచింతల – ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్టŠస్ అండ్ కల్చరల్ సొసైటీ 16. నీలాయపాలెం విజయ్‌కుమార్ – ఏపీ స్టేట్ బయో డైవర్సిటీ బోర్డు 17. జీవీ రెడ్డి – ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ 18. మన్నవ మోహన్‌కృష్ణ – ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ 19. తేజస్వి – ఏపీ కల్చరల్ కమిషన్ 20. పోలంరెడ్డి దినే‹Ùరెడ్డి – ఏపీ ఎని్వరాన్‌మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ 21. సుజయ్‌కృష్ణ రంగారావు – ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 22. గోనుగుంట్ల కోటేశ్వరరావు – ఏపీ గ్రంధాలయ పరిషత్ 23. డేగల ప్రభాకర్ – ఏపీ ఇండ్రస్టియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 24. కేకే చౌదరి – ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు 25. చిల్లపల్లి శ్రీనివాసరావు – ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జనసేన ) 26. ప్రగడ నాగేశ్వరరావు – ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 27. మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి – ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ 28. ఆనం వెంకట రమణారెడ్డి – ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ 29. రఘురామరాజు – ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్సస్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ 30. సావల దేవదత్ – ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్టŠస్ సర్టిఫికేషన్ అథారిటీ 31. రావి వెంకటేశ్వరరావు – ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ 32. కావలి గ్రీష్మ – ఏపీ ఉమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ 33. ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు ఛైర్మన్లు – దొన్ను దొర, రెడ్డి అప్పలనాయుడు (జనసేన), సురేష్ రెడ్డి (బీజేపీ), పోలా నాగరాజు 34. సజ్జా హేమలత – ఏపీ హ్యాండ్లూమ్ కోఆపరేటివ్ సొసైటీ 35. గుమ్మడి గోపాలకృష్ణ – ఏపీ నాటక అకాడమీ 36. సీతంరాజు సుధాకర్ – ఎనీ్టఆర్ వైద్య సేవ 37. కొమ్మారెడ్డి పట్టాభిరామ్ – స్వచ్ఛాంధ్ర మిషన్ 38. అల్లాడ స్వామినాయుడు – అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 39. టీసీ వరుణ్ – అనంతపూర్ – హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (జనసేన) 40. రూపానందరెడ్డి – అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 41. సలగల రాజశేఖర్‌బాబు – బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 42. తెంటు లక్ష్మీనాయుడు – బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 43. కె హేమలత – చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 44. తుమ్మల రామస్వామి – కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (జనసేన) 45. సోమిశెట్టి వెంకటేశ్వర్లు – కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 46. మట్టా ప్రసాద్ – మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (బీజేపీ ) 47. కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి – నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 48. బొడ్డు వెంకట రమణచౌదరి – రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 49. కె. రవికుమార్ – శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (జనసేన) 50. ప్రణవ్ గోపాల్ – విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ 51. ముస్తాక్ అహ్మద్ – ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ 52. డి. రాకేష్ – ఏపీ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 53. వి. సూర్యనారాయణరాజు (కనకరాజు సూరి) – ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెం ట్ కార్పొరేషన్ (జనసేన) 54. కొత్తపల్లి సుబ్బారాయుడు – ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జనసేన) 55. ఉండవల్లి శ్రీదేవి – ఏపీ మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ 56. పి. విజయ్‌కుమార్ – ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (జనసేన ) 57. కిడారి శ్రావణ్ – ఏపీ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ -
ఇదేమి మిత్ర‘ధర్మం’?
సాక్షి, అమరావతి: నామినేటెడ్ పదవుల పంపిణీలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరుపై మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన పార్టీల నేతలు మండిపడుతున్నారు. ఇదేమి మిత్రధర్మమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మొత్తం 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లను ప్రకటించగా అందులో జనసేనకు 3, బీజేపీకి కేవలం ఒకటి ఇచ్చారు. ప్రకటించిన కార్పొరేషన్లలో ఛైర్మన్లు, ఒక వైస్ ఛైర్మన్‌తోపాటు కొన్నింటిలో డైరెక్టర్ పదవులుండడంతో వాటినీ భర్తీ చేశారు. డైరెక్టర్లతో కలిసి మొత్తం 99 నామినేటెడ్ పదవులు భర్తీ చేసినట్లు టీడీపీ ప్రకటన విడుదల చేసింది.కీలకమైన కార్పొరేషన్లను చంద్రబాబు తమ పార్టీ వారికే ఇచ్చుకున్నారు. ఆర్టీసీ, ఏపీఐఐసీ, శాప్, హౌసింగ్ బోర్డు, సీడాప్, మారిటైమ్ బోర్డు, మార్క్‌ఫెడ్, ఏపీటీడీసీ వంటి ప్రధానమైన కార్పొరేషన్లు టీడీపీ ఖాతాలోకి వెళ్లాయి. జనసేనకు ఇచ్చిన మూడు కార్పొరేషన్లు కూడా అప్రాధాన్యమైనవేనని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. పెద్దగా గుర్తింపు లేని, ఎవరూ పట్టించుకోని సివిల్ సప్లైస్ కార్పొరేషన్, టిడ్కో, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్లను జనసేనకు కేటాయించారు. బీజేపీకి 20 సూత్రాల కమిటీ చైర్మన్ పదవి ఒకటే దక్కింది. అది కూడా టీడీపీ పాత నాయకుడు లంకా దినకర్‌కు ఇవ్వడంతో అది పేరుకు బీజేపీ ఖాతాయే తప్ప పదవి టీడీపీదేనని చెబుతున్నారు.ఒరిజినల్ బీజేపీ నేతలు ఎంతో మంది ఉండగా వారెవ్వరినీ పట్టించుకోకుండా టీడీపీ నుంచి వలస వచ్చిన నాయకుడికి ఇవ్వడంపై ఆ పార్టీలో అసంతృప్తి నెలకొంది. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే బీజేపీ ముఖ్య నాయకులందరినీ పక్కన పెట్టి ఆ పార్టీలో ఉన్న తన శిష్యుడైన లంకా దినకర్‌కు పదవి ఇచ్చినట్లు చెబుతున్నారు. పొత్తు ధర్మాన్ని విస్మరించి కంటి తుడుపుగా ఒక పదవి ఇవ్వడం ఏమిటని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. లోపించిన సామాజిక సమతూకంమరోవైపు నామినేటెడ్ పదవుల్లో చంద్రబాబు ఓసీలకే ప్రాధాన్యత ఇవ్వడంపై మిగతా సామాజికవర్గాల నేతలు గుర్రుగా ఉన్నారు. 20 పదవుల్లో 9 ఓసీలకే కట్టబెట్టారు. బీసీల పార్టీ అని చెప్పుకుంటున్నా ఏడు పదవులే ఇచ్చారని వెనుకబడిన వర్గాల నేతలు వాపోతున్నారు. ఎస్సీలకు రెండు, ఎస్టీ ఒకటి, మైనారిటీలకు ఒకటి కేటాయించి చేతులు దులుపుకున్నారని ఆ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తాజా పదవుల పంపకంపై టీడీపీ నేతలు సైతం అసహనంగానే ఉన్నారు. పదవులు ఆశించిన ఆలపాటి రాజా, దేవినేని ఉమామహేశ్వరరావు వంటి ముఖ్యమైన నేతలకు మొండి చేయే చూపారు. దీంతో సీనియర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. -
జనసేన, బీజేపీకి షాక్ ఇచ్చిన టీడీపీ
సాక్షి, విజయవాడ: నామినేటెడ్ పోస్టుల భర్తీలో జనసే, బీజేపీకి చంద్రబాబు షాక్ ఇచ్చారు. 20 పదవుల్లో 3 జనసేనకి, బీజేపీకి ఒక్కటి మాత్రమే దక్కింది. బీజేపీ నుంచి మాజీ టీడీపీ నేత లంక దినకర్‌కి 20 సూత్రాల ఛైర్మన్ పదవి కేటాయించగా, ఒరిజినల్ బీజేపీ నేతలకు నామినేటెడ్ పదవులు దక్కలేదు. జనసేనకు పవర్ లేని డమ్మీ కార్పొరేషన్లను చంద్రబాబు అంటగట్టారు.కార్పొరేషన్ ఛైర్మన్ల వివరాలువక్ఫ్బోర్డు- అబ్దుల్ అజీజ్ (టీడీపీ)శాప్- ఏ. రవి నాయుడు (టీడీపీ)గృహనిర్మాణ సంస్థ- బత్తుల తాతయ్యబాబు (టీడీపీ)ఏపీ ట్రైకార్- బొరగం శ్రీనివాసులు (టీడీపీ)ఏపీ మారిటైం బోర్డు- దామచర్ల సత్య (టీడీపీ)సీడాప్- దీపక్‌రెడ్డి (టీడీపీ)20 సూత్రాల అమలు కమిటీ- లంకా దినకర్ (బీజేపీ)మార్క్‌ఫెడ్- కర్రోతు బంగార్రాజు (టీడీపీ)సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్- మన్నె సుబ్బారెడ్డి (టీడీపీ)ఏపీఐఐసీ- మంతెన రామరాజు (టీడీపీ)పద్మశాలి కార్పొరేషన్- నందం అబద్ధయ్య (టీడీపీ)ఏపీటీడీసీ- నూకసాని బాలాజీ (టీడీపీ)ఏపీఎస్ ఆర్టీసీ- కొనకళ్ల నారాయణ, వైస్ ఛైర్మన్ పీఎస్ మునిరత్నం (టీడీపీ)పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కార్పొరేషన్- పీలా గోవింద సత్యనారాయణ (టీడీపీ)లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్- పిల్లి మాణిక్యాల రావు (టీడీపీ)వినియోగదారుల రక్షణ కౌన్సిల్- పీతల సుజాత (టీడీపీ)ఎంఎస్ఎంఈ- తమ్మిరెడ్డి శివశంకర్ (జనసేన)పౌరసరఫరాల కార్పొరేషన్- తోట మెహర్ సీతారామ సుధీర్ (జనసేన)ఏపీటీపీసీ- వజ్జ బాబూరావు (టీడీపీ)ఏపీ టిడ్కో- వేములపాటి అజయ్‌కుమార్ (జనసేన) -
కూటమిలో తేలని ‘పదవుల’ పంచాయితీ
సాక్షి, అమరావతి : రాష్ట్ర ఎన్డీఏ కూటమిలో నామినేటెడ్ పదవుల పంపకం ఎటూ తేలడంలేదు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటినా ఒక్క నామినేటెడ్ పదవిని కూడా సీఎం చంద్రబాబు భర్తీ చేయలేదు. అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), ఏపీఐఐసీ, ఆర్టీసీ వంటి కార్పొరేషన్ పదవులు సైతం ఇంకా ఎవరికీ ఇవ్వకపోవడంతో మూడు పార్టీల శ్రేణుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ప్రధానంగా టీడీపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సహజంగానే నాన్చుడు ధోరణి ప్రదర్శించే చంద్రబాబు ఇప్పుడు కూటమిలో మూడు పార్టీల మధ్య పదవుల పంపకం జరగాల్సి ఉండటంతో మరింత తాత్సారం చేస్తున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీలకు ఏ నిష్పత్తిలో పదవులు ఇవ్వాలనే దానిపై ఒక అవగాహన కుదిరినా ఆశావహులు ఎక్కువగా ఉండడంతో చంద్రబాబు త్వరగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.రాష్ట్ర స్థాయిలో 90కి పైగా కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యుల పదవులు వందల సంఖ్యలో ఉన్నాయి. మొత్తం పదవుల్లో 70 శాతం టీడీపీకి, 25 శాతం జనసేనకు, 5 శాతం బీజేపీకి కేటాయించాలనే ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. తొలి విడతగా వాటిలో 30 శాతం పదవులనైనా భర్తీ చేయాలని ప్రయత్నిస్తున్నా పార్టీలు, సమీకరణలు, లాబీయింగ్‌తో గందరగోళం ఏర్పడి ఇప్పటివరకు ఒక్క పదవినీ భర్తీ చేయలేకపోయారు. నియోజకవర్గాలకు సంబంధించిన పదవుల్లో గెలిచిన ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీకి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. టీటీడీకి తీవ్ర పోటీ అత్యంత కీలకమైన టీటీడీ చైర్మన్ పదవిపై కూటమిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చైర్మన్ పదవిని టీడీపీకి కేటాయించుకున్నా దాన్ని ఎవరికి ఇవ్వాలనే దానిపై చంద్రబాబు ఎటూ తేల్చలేకపోతున్నారు. ఎల్లో మీడియాకి చెందిన ఓ ఛానల్ యజమానికి ఈ పదవి ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అంత ప్రాధాన్యత ఉన్న పదవిని పార్టీకి చెందిన వారికి కాకుండా బయటి వ్యక్తులకు ఎలా ఇస్తారనే అభ్యంతరాలు టీడీపీ నుంచి వచ్చినట్లు తెలిసింది. దీంతో సీనియర్ నేత కళా వెంకట్రావు పేరును పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఎల్లో మీడియా తరఫున ఓ ఛానల్ అధినేతకు చంద్రబాబు మాట ఇచ్చేశారని, ఆయనకే టీటీడీ ఛైర్మన్ పదవి లభిస్తుందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. టీటీడీ బోర్డు సభ్యుల పదవుల కోసం కూడా విపరీతమైన పోటీ నెలకొంది. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు, పారిశ్రామికవేత్తల నుంచి కూడా బోర్డు సభ్యత్వం కావాలని వినతులు వచ్చాయి. పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యులు, ఇతర రాష్ట్రాల పెద్దల నుంచి బోర్డు మెంబర్ల కోసం సిఫారసులు రావడంతో చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం. అయితే జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నుంచి కూన రవికుమార్, వేమిరెడ్డి ప్రశాంతికి బోర్డు సభ్యులుగా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది.ప్రచారంలో ఉన్న పేర్లు ఇవే? ఎన్టీఆర్ జిల్లా మైలవరం సీటును వదులుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకి ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కడప జిల్లాకు చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి ఏపీఐఐసీ చైర్మన్, టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కి పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా మాజీ మంత్రి పీతల సుజాత, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ పేర్లు ఖరారైనట్లు చెబుతున్నారు. తెనాలి సీటు వదులుకున్న ఆలపాటి రాజాకి కీలకమైన పదవి దక్కుతుందని సమాచారం. -
ఏపీఐఐసీ ఛైర్మన్‌గా మెట్టు గోవిందరెడ్డి నియామకంపై ఉత్తర్వులు
సాక్షి, విజయవాడ: ఏపీఐఐసీ ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మారిటైం బోర్డు ఛైర్మన్‌గా కాయల వెంకటరెడ్డిని నియమించారు. కాగా జూలై 17న ఏపీ నామినేటెడ్ పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
సీఎం జగన్ సామజిక న్యాయం పాటించారంటూ సంతోషం
-
ఏపీనామినేటెడ్ పదవుల భర్తీలో కొత్త అధ్యయనానికి నాంది
-
సామాజిక న్యాయంలో ఏపీ ఫస్ట్
సాక్షి అమరావతి, సాక్షి నెట్వర్క్: ‘అన్ని వర్గాల వారికి రాజకీయంగా అవకాశం కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త తరం రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, పేదలకు వైఎస్ జగన్ పాలన సువర్ణ యుగం’ అని పలువురు మంత్రులు కొనియాడారు. రాష్ట్రంలో శనివారం భర్తీ చేసిన 137 నామినేటెడ్ పదవుల్లో సగం మహిళలకు కేటాయించడంతో పాటు సింహభాగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్థానం కల్పించడం సాహసోపేతం అని పేర్కొన్నారు. ఆదివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వారు మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి. సామాజిక సమన్యాయం నామినేటెడ్ పోస్టులను అన్ని వర్గాల వారికి అప్పగించి సీఎం వైఎస్ జగన్ సామాజిక సమన్యాయం చేశారు. కొత్తతరం రాజకీయాలకు జగన్ శ్రీకారం చుట్టారు. సామాజిక న్యాయంలో ఏపీ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. – శ్రీకాకుళంలో ధర్మాన కృష్ణదాస్, ఉప ముఖ్యమంత్రి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయ సమానత్వం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇన్నాళ్లకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయ సమానత్వం లభించింది. నామినేటెడ్ పదవుల్లో 58 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పదవులు దక్కాయి. అధికారంలో ఉండగా డబ్బు తూకం పెట్టి పదవులను అమ్ముకున్న నీచ చరిత్ర చంద్రబాబుది. – తిరుపతిలో నారాయణ స్వామి, ఉప ముఖ్యమంత్రి మహిళా పక్షపాతిగా సీఎం జగన్ దేశానికే ఆదర్శం 137 నామినేటెడ్ పదవుల్లో 50.4 శాతం అంటే.. 69 పదవులను మహిళలకు కట్టబెట్టడం ద్వారా.. తాను మహిళా పక్షపాతిననే విషయాన్ని ముఖ్యమంత్రి మరోసారి నిరూపించుకుని దేశానికి ఆదర్శంగా నిలిచారు. ఒక మహిళను ఉప ముఖ్యమంత్రిగా, మరో మహిళను హోం మంత్రిగా నియమించడమే కాకుండా.. 56 బీసీ కార్పొరేషన్ పదవుల్లోనూ సగం మహిళలకే ఇచ్చారు. – పుష్ప శ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి స్వతంత్ర భారతంలో రికార్డు 74 ఏళ్ల స్వతంత్ర భారతంలో అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం, పదవుల్లో సమతుల్యత ఇప్పుడు ఏపీలో సాధ్యమైంది. నమ్మిన సిద్ధాంతాన్ని చేతల్లో చూపిస్తూ 137 నామినేటెడ్ పదవుల్లో 79 పదవులు అట్టడుగు వర్గాలకు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌దే. ఒక్క మైనార్టీలకే 12 నామినేటెడ్ పదవులు ఇవ్వడం గర్వకారణం. – కడపలో అంజాద్ బాషా, ఉప ముఖ్యమంత్రి గాంధీజీ, పూలే, అంబేడ్కర్ ఆశయాల కొనసాగింపు రాష్ట్ర ప్రజల మనసు, సమస్యలు తెలిసిన ఒకే ఒక్క నాయకుడు సీఎం జగన్. అధికారంలోకి రాగానే బలహీన వర్గాలకు పెద్దపీట వేశారు. ఇందుకు నిదర్శనం.. కురుబ కులానికి చెందిన నాకు కీలకమైన మంత్రి పదవి ఇవ్వడమే. గాంధీ, పూలే, అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం పాలన సాగిస్తున్నారు. – అనంతపురంలో శంకరనారాయణ, ఆర్అండ్బీ మంత్రి చంద్రబాబుకు మాటల్లేవ్ 14 ఏళ్ల పాలనలో ఏనాడైనా చంద్రబాబు సామాజిక న్యాయం పాటించారా? ఎన్నికల ముందు ప్రచారం కోసం బీసీలను, ఎస్సీ, ఎస్టీలను వాడుకున్నారు తప్ప వారికేం గౌరవం ఇవ్వలేదు. సామాజిక న్యాయం, రాజకీయ సమానత్వం.. సీఎం జగన్ సాధించిన విజయాల్లో ముందు వరుసలో ఉంటాయి. – శ్రీకాకుళంలో సీదిరి అప్పలరాజు, పశుసంవర్ధక శాఖ మంత్రి -
బడుగు బలహీన వర్గాలకు సీఎం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు :అవంతి శ్రీనివాస్
-
సమన్యాయంతో సీఎం జగన్ ఆదర్శంగా నిలిచారు
సాక్షి, శ్రీకాకుళం: నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారని డిప్యూటీ సీఎం కృష్ణదాస్ అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మహిళలకు సముచిత స్థానం కల్పించారన్నారు. చంద్రబాబు హయాంలో నోరున్న వారికే పదవులు ఇచ్చారన్నారు. సమ న్యాయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదర్శంగా నిలిచారన్నారు. ఏ అభివృద్ధికీ నోచుకోని వర్గాలకు సీఎం జగన్ న్యాయం చేశారని మంత్రి కృష్ణదాస్ కొనియాడారు. మహిళలకు సముచిత స్థానం కల్పించారు: మంత్రి అప్పలరాజు నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేశారని మంత్రి అప్పలరాజు అన్నారు. అణగారిన వర్గాలకు రాజకీయ అధికారం కల్పించారన్నారు. సామాజిక న్యాయ సాధన దిశగా సీఎం జగన్ మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించారని పేర్కొన్నారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50.40 శాతం పదవులు దక్కాయని మంత్రి అప్పలరాజు అన్నారు. ఏపీలో సామాజిక న్యాయం: మంత్రి శంకర్‌నారాయణ అనంతపురం: ఏపీలో సామాజిక న్యాయం జరుగుతోందని మంత్రి శంకర్‌నారాయణ అన్నారు. మహిళలకు అత్యధిక పదవులు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దేనన్నారు. సీఎం జగన్ పాలనతో బాబు బెంబేలెత్తుతున్నారని శంకర్ నారాయణ ఎద్దేవా చేశారు. -
‘సీఎం జగన్ కాపులకు పెద్ద పీట వేశారు’
-
పార్టీని నమ్ముకున్న వారికీ న్యాయం జరిగింది : పుణ్యశీల
-
‘సీఎం జగన్ కాపులకు పెద్ద పీట వేశారు’
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ నేత అడపా శేషుకు రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. ఆంధ్రప్రదేశ్‌లో శనివారం నామినేటెడ్ పోస్టులను ప్రకటించారు. దీనిలో భాగంగా అడపా శేషుకు కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. తనకు ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అడపా శేషు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సీఎం జగన్.. వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఎప్పుడూ మరువలేదు. రాష్ట్రంలో సీఎం జగన్ కాపులకు పెద్ద పీట వేశారు. పార్టీకి మంచి పేరు తీసుకుని వచ్చే విధానంగా పని చేస్తాను’’ అని అడపా శేషు తెలిపారు. ‘‘రాష్ట్రంలో అతిపెద్ద కార్పొరేషన్ కాపు కార్పొరేషన్. నిబద్ధతతో పని చేస్తాను. కాపు కులానికి అండగా ఉంటాను. ముఖ్యమంత్రి జగనన్నను నమ్ముకుంటే కచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. రాష్ట్రంలో సీఎం జగన్ అవినీతి రహిత పాలన అందిస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం జగన్ కాపు కార్పొరేషన్‌కే ఎక్కువగా నిధులు ఇచ్చారు’’ అని అడపా శేషు తెలిపారు. -
నాకు అప్పగించిన పదవికి వన్నెతెచ్చేలా పనిచేస్తా : మహాలక్ష్మి శ్రీనివాస్
-
ఏపీఎస్ ఆర్టీసీ అభివృద్ధికి అన్ని విధాలా కృషిచేస్తా : మల్లికార్జున రెడ్డి
-
నామినేటెడ్ పదవుల్లో సగం మహిళలకే కట్టబెట్టారు : విజయనిర్మల
-
మాట నిలబెట్టుకున్న సీఎం జగన్.. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక పదవి కట్టబెట్టారు. రాష్ట్ర స్పోర్ట్స్ అథారటీ చైర్మన్ పదవి(శాప్)ని బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డికి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో శనివారం నామినేటెడ్ పోస్టులను ప్రకటించారు. దీనిలో భాగంగా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పదవిని సిద్ధార్థ్‌రెడ్డికి అప్పచెప్పారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ గెలుపునకు బైరెడ్డి కీలక పాత్ర పోషించారు. చదవండి: AP Nominated Posts 2021: ఏపీలో నామినేటెడ్ పోస్టుల ప్రకటన కాగా పాదయాత్ర సమయంలో నందికొట్కూరు ప్రచార సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. బైరెడ్డి తన మనసులో ఉన్నాడని, అధికారంలోకి వచ్చాక కచ్చితంగా మంచి ప్రాధాన్యత గల పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. పాదయాత్ర సయమంలో సీఎం జగన్ ఇచ్చిన హామీని ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా నెరవేర్చారని బైరెడ్డి అభిమానులు, నియోజకవర్గ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు పోస్ట్ ఇస్తున్నట్లు ప్రకటించగానే బైరెడ్డి ఇంటి దగ్గర. పార్టీ ఆఫీసు దగ్గర కార్యకర్తలు, అభిమానులు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకుంటున్నారు. చదవండి: AP Nominated Posts List 2021: ఏపీ నామినేటెడ్ పదవులు దక్కించుకుంది వీరే.. ప్రస్తుతం నందికొట్కూరు నియోజవకర్గ ఇంచార్జ్‌గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తనకు శాప్ పదవి రావడంపై బైరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు కడపలోని ఆయన నివాసంలో సిద్ధార్థ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చారు. -
ఏపీ నామినేటెడ్ పదవులు దక్కించుకుంది వీరే..
-
ఏపీ నామినేటెడ్ పదవులు దక్కించుకుంది వీరే..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టుల వివరాలను మంత్రులు మేకతోటి సుచరిత, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ శనివారం ప్రకటించారు.పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. 137 పోస్టుల్లో మహిళలకు 69, పురుషులకు 68 పదవులు ఇచ్చారు. నామినేటెడ్ పోస్టుల ఎవరెవరు దక్కించుకున్నారనేది ఒకసారి పరిశీలిస్తే.. ►కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా అడపా శేషు ►క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పాతపాటి సర్రాజు ►కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్‌గా తుమ్మల చంద్రశేఖర్ ►బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సుధాకర్ ►రెడ్డి కార్పొరేషన్ ఛైర్మన్‌గా చింతలచెరువు సత్యనారాయణరెడ్డి ►ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్‌గా ఎ.మల్లికార్జునరెడ్డి ►ఏపీఐఐసీ ఛైర్మన్‌గా మెట్టు గోవిందరెడ్డి ►వక్ఫ్‌బోర్డ్ ఛైర్మన్‌గా ఖాదర్ బాషా ►శ్రీశైలం దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా రెడ్డివారి చక్రపాణిరెడ్డి ►శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా బి. బీరేంద్రవర్మ ►కాణిపాకం దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా రెడ్డి ప్రమీలమ్మ ►ఉమెన్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా హేమమాలినిరెడ్డి ►గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నర్తు రామారావు ►ఉపాధి కల్పన అభివృద్ధి సొసైటీ ఛైర్మన్‌గా శ్యాంప్రసాద్‌రెడ్డి ►ఏపీ మారిటైం బోర్డ్ ఛైర్మన్‌గా కాయల వెంకటరెడ్డి ►ఏపీ టిడ్కో ఛైర్మన్‌గా జమ్మన ప్రసన్నకుమార్ ►ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మొండితోక అరుణ్‌కుమార్ ►మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా షేక్ ఆసిఫ్ ►హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా దవులూరి దొరబాబు ►నాట్యకళ అకాడమీ ఛైర్మన్‌గా కుడుపూడి సత్య శైలజ ►సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ ఛైర్‌పర్సన్‌గా టి.ప్రభావతి ►సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి ►రూరల్ వాటర్ సప్లై సలహాదారుగా బొంతు రాజేశ్వరరావు ►ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ ఛైర్మన్‌గా వంకా రవీంద్రనాథ్ ►కార్మిక సంక్షేమ బోర్డు వైస్‌ఛైర్మన్‌గా దాయల నవీన్‌బాబు ►సాహిత్య అకాడమీ ఛైర్‌పర్సన్‌గా పిల్లంగొల్ల శ్రీలక్ష్మి ►రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కనుమూరి సుబ్బరాజు ►కనీస వేతన సలహా బోర్డు ఛైర్‌పర్సన్‌గా బర్రి లీల ►సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌గా సుస్మిత ►స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌గా పొనాక దేవసేన ►రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మేరుగ మురళీధర్ ►సంగీత నృత్య అకాడమీ ఛైర్‌పర్సన్‌గా పొట్టెల శిరీష యాదవ్ ►ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్సోర్స్డ్ ఎంప్లాయిస్ ఛైర్మన్‌గా షేక్ సైదాని ►పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మెట్టుకూరు చిరంజీవిరెడ్డి ►ఆగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నవీన్ నిశ్చల్ ►ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌గా నదీం అహ్మద్ ►నాటక అకాడమీ ఛైర్మన్‌గా యెట్టి హరిత ►APSRTC రీజనల్ బోర్డ్ ఛైర్మన్‌గా ఎం.మంజుల (అనంతపురం) ►APSRTC రీజనల్ బోర్డ్ ఛైర్‌పర్సన్‌గా జి.బంగారమ్మ (విజయనగరం) ►APSRTC రీజనల్ బోర్డు ఛైర్మన్‌గా తాతినేని పద్మావతి (కృష్ణా) ►APSRTC రీజనల్ బోర్డ్ ఛైర్మన్‌గా మెట్టపల్లి చిన్నప్పరెడ్డి విజయానందరెడ్డి ►APSRTC రీజనల్ బోర్డ్ ఛైర్మన్‌గా బత్తుల సుప్రజ ►విద్యాసంస్థలు, వసతుల కార్పొరేషన్ ఛైర్మన్‌గా మళ్ల విజయప్రసాద్ ►న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ (NEDCAP) ఛైర్మన్‌గా కె.కన్నప్పరాజు ►క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా బొల్లవరపు జాన్‌వెస్లీ ►బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా సీతంరాజు సుధాకర్ ►సామాజిక న్యాయ సలహాదారుగా జూపూడి ప్రభాకర్‌రావు ►రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా షమీమ్ అస్లామ్ ►ఫోక్ అండ్ క్రియేటివిటీ అకాడమీ ఛైర్మన్‌గా కొండవీటి నాగభూషణం ►లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కాకుమాను రాజశేఖర్ ►సొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్(SAPNET) ఛైర్మన్‌గా బాచిన కృష్ణచైతన్య ►రాష్ట్ర టైలర్ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ ఛైర్మన్‌గా షేక్ సుభాషిణి ►రాష్ట్ర పర్యావరణ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా గుబ్బ చంద్రశేఖర్ ►పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఆరెమండ వరప్రసాద్‌రెడ్డి ►హ్యాండిక్యాప్ అండ్ సీనియర్ సిటిజన్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ముంతాజ్ పఠాన్ ►షేక్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా షేక్ ఆషా బేగం ►హిస్టరీ అకాడమీ ఛైర్మన్‌గా కుర్రా నాగమల్లేశ్వరి ►గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్‌గా మందపాటి శేషగిరిరావు ►స్పోర్ట్ అథారిటీ ఛైర్మన్‌గా బైరెడ్డి సిద్దార్థరెడ్డి ►ఏపీ ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ ఛైర్మన్‌గా పెర్లప్పగారి భాగ్యమ్మ ►మార్క్‌ఫెడ్ ఛైర్మన్‌గా పమిరెడ్డిగారి పెద్దనాగిరెడ్డి ►ఏపీ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కర్ర గిరిజ ►ఏపీ మీట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మాదిగ శ్రీరాములు ►ఏపీ ఆయిల్ ఫెడరేషన్ ఛైర్మన్‌గా షేక్ గౌసియా బేగం ►రాష్ట్ర వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కరీముల్లా షేక్ అమీన్ ►APCOB ఛైర్మన్‌గా మల్లెల ఝాన్సీరెడ్డి ►హ్యండ్‌క్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా బడిగించల విజయలక్ష్మి ►రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డ్ ఛైర్మన్‌గా పులి సునీల్‌కుమార్ ►రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా కోడూరు అజయ్‌రెడ్డి ►రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్‌గా బద్వేల్ షేక్ గౌస్ లాజమ్ ►అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా వి.లీలావతి ►జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా సువ్వారి సువర్ణ (శ్రీకాకుళం) ►అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా కోరాడ ఆశాలత (శ్రీకాకుళం) ►కోపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఛైర్‌పర్సన్‌గా చల్లా సుగుణ (శ్రీకాకుళం) ►డీసీసీబీ ఛైర్మన్‌గా కరిమి రాజేశ్వరరావు (శ్రీకాకుళం) ►జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా రెడ్డి పద్మావతి (విజయనగరం) ►బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్‌పర్సన్‌గా పార్వతి ►డీసీఎంఎస్ ఛైర్మన్‌గా అవనాపు భావన (విజయనగరం) ►డీసీసీబీ ఛైర్మన్‌గా నెక్కల నాయుడుబాబు (విజయనగరం) ►VKPCPIR ఛైర్మన్‌గా చొక్కాకుల లక్ష్మి (విశాఖ) ►VMRDA ఛైర్మన్‌గా అక్రమాని విజయనిర్మల (విశాఖ) ►విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్‌గా జి.వెంకటేశ్వరరావు (విశాఖ) ►జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా కొండా రమాదేవి (విశాఖ) ►జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్‌గా పళ్ల చిన్నతల్లి (విశాఖ) ►జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్ ఛైర్మన్‌గా సీహెచ్.అనిత (విశాఖ) ►రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా ఎం.షర్మిలారెడ్డి ►రాజమండ్రి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా చందన నగేష్ ►కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా రాజబాబు యాదవ్ ►హితకారిణి సమాజం ఛైర్మన్‌గా మునికుమారి (తూ.గో) ►ఏలేశ్వరం డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్‌గా తోలాడ శైలజ పార్వతి ►జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా దూలం పద్మ (తూ.గో) ►కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా రాగిరెడ్డి దీప్తి ►సహకార మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్‌గా మణికుమారి (తూ.గో) ►రాజమండ్రి అర్బన్ బ్యాంక్ ఛైర్మన్‌గా గిరిజాల తులసి ►ఈస్టర్న్ డెల్టా బోర్డ్ ఛైర్మన్‌గా ఏడిద చక్రపాణిరావు (తూ.గో) ►సహకార సెంట్రల్ బ్యాంక్ ఛైర్మన్‌గా ఆకుల వీర్రాజు (తూ.గో) ►సెంట్రల్ డెల్టా బోర్డ్ ఛైర్మన్‌గా కుడుపూడి వెంకటేశ్వర్ (తూ.గో) ►ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా ఎం.ఈశ్వరి ►ఏలూరు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా బొడ్డాని అఖిల ►జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా చిర్ల పద్మశ్రీ (ప.గో) ►వెస్టర్న్ డెల్టా బోర్డ్ ఛైర్మన్‌గా గంజిమాల దేవి (ప.గో) ►జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్‌గా వేండ్ర వెంకటస్వామి (ప.గో) ►జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్ ఛైర్మన్‌గా పీవీఎల్ నరసింహరావు (ప.గో) ►జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా తిప్పరమల్లి పూర్ణమ్మ (కృష్ణా) ►కోపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్‌గా పడమట స్నిగ్ధ (కృష్ణా) ►అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా భవాని (కృష్ణా) ►సహకార సెంట్రల్ బ్యాంక్ ఛైర్మన్‌గా తన్నేరు నాగేశ్వరరావు (కృష్ణా) ►జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా బత్తుల దేవానంద్ (గుంటూరు) ►జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్‌గా వై.భాగ్యలక్ష్మి (గుంటూరు) ►జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్ ఛైర్మన్‌గా సీతారామాంజనేయులు (గుంటూరు) ►ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా ఎస్.మీనాకుమారి (ప్రకాశం) ►జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా రాచగొర్ల వెంకట సుశీల (ప్రకాశం) ►జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్‌గా రావి పద్మావతి (ప్రకాశం) ►జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్ ఛైర్మన్‌గా మాదాశి వెంకయ్య (ప్రకాశం) ►నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా ఎం.ద్వారకానాథ్ ►జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా డి.శారద (నెల్లూరు) ►జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్ ఛైర్మన్‌గా కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి (నెల్లూరు) ►జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్‌గా వి.చలపతి (నెల్లూరు) ►తిరుపతి స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నారమల్లి పద్మజ ►జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్‌గా సామకోటి నాగలక్ష్మి (చిత్తూరు) ►జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్(DCCB) ఛైర్మన్‌గా ఎం.రెడ్డమ్మ (చిత్తూరు) ►జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా నైనార్ మధుబాల (చిత్తూరు) ►పలమనేరు-కుప్పం-మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ ఛైర్మన్‌గా వెంకట్‌రెడ్డి యాదవ్ ►కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి ►జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా మద్దూరు సుభాష్ చంద్రబోస్ (కర్నూలు) ►జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్ ఛైర్మన్‌గా సన్నాల మహలక్ష్మి (కర్నూలు) ►జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్‌గా చెంచన్నగారి శిరోమణి (కర్నూలు) ►AHUDA ఛైర్మన్‌గా మహాలక్ష్మి శ్రీనివాసులు (అనంతపురం) ►జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా లోమాడ ఉమాదేవి (అనంతపురం) ►పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా లక్ష్మీనరసింహ ►జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్ ఛైర్మన్‌గా మానుకింద లిఖిత (అనంతపురం) ►జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్‌గా టి.చంద్రశేఖర్‌రెడ్డి (అనంతపురం) ►జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా ఎల్.ఉషారాణి (వైఎస్ఆర్ జిల్లా) ►అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా గురుమోహన్ ►జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్‌గా చంద్రలీల (వైఎస్ఆర్ జిల్లా) ►జీసీసీ ఛైర్‌పర్సన్‌గా శోభాస్వాతిరాణి (విజయనగరం) ►ట్రైకార్ ఛైర్మన్‌గా సటక బుల్లిబాబు (విశాఖపట్నం) నామినేటెడ్ పదవుల పీడీఎఫ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నామినేటెడ్ పదవులు అలంకార ప్రాయం కాదు: సజ్జల
-
ఏపీలో నామినేటెడ్ పోస్టుల ప్రకటన
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టుల వివరాలను మంత్రులు మేకతోటి సుచరిత, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ శనివారం ప్రకటించారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలు, వెనకబడిన వర్గాలు, దళితులకు ప్రాధాన్యం ఇచ్చారు. పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, నామినేటెడ్ పదవులు అలంకార ప్రాయం కాదని.. పదవులు తీసుకున్నవారు బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. పదవుల భర్తీలో సీఎం సామాజిక న్యాయం పాటిస్తున్నారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 76 పదవులు ఇచ్చామని సజ్జల వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా: 7 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు, విజయనగరం జిల్లా: 7 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు విశాఖ జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు తూర్పు గోదావరి: 17 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 9 పోస్టులు పశ్చిమగోదావరి: 12 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు కృష్ణా జిల్లా : 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు గుంటూరు జిల్లా : 9 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు ప్రకాశం జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు నెల్లూరు జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు చిత్తూరు జిల్లా: 12 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 7 పోస్టులు అనంతపురం : 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు వైఎస్సార్ జిల్లా: 11 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు కర్నూలు జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు -
మా సీటు.. యమ స్వీటు..
సాక్షి, రాజమహేంద్రవరం: ‘చింత చచ్చినా పులుపు చావలేద’న్నట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీ నేతల తీరు. అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ద్వారా సంక్రమించిన నామినేటెడ్ పదవులను ఏ స్థాయి నాయకుడైనా అనుభవించడం సర్వసాధారణం. కానీ అధికారం కోల్పోయినప్పుడు ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవులను వదులుకోవడం ఒక సంప్రదాయం. ఏ రాజకీయ పార్టీకి చెందిన నాయకులైనా ఎప్పుడైనా ఇదే సంప్రదాయాన్ని పాటిస్తారు. ఇటువంటి సంప్రదాయాలు, నైతిక విలువలపై నమ్మకం లేకనో, లెక్కలేనితనమో తెలియదు కానీ.. కొందరు తెలుగు తమ్ముళ్లు మాత్రం పదవులను పట్టుకుని వేలాడుతున్నారు. పదవీ కాంక్షతో వాటిని వదల్లేక ఇంకా ఆ సీట్లను అంటిపెట్టుకునే ఉన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలే కావొచ్చు, ఆలయాల పాలకమండళ్లే కావచ్చు.. ఇలా టీడీపీ హయాంలో పలు నామినేటెడ్ పదవులు పొందిన ఆ పార్టీ నేతలు ఇంకా అక్కడే తిష్ట వేశారు. మార్కెట్ కమిటీల్లో.. జిల్లాలో 20 వ్యవసాయ మార్కెట్ కమిటీలున్నాయి. ఒక్కో మార్కెట్ కమిటీకి చైర్మన్‌తో పాటు 18 మంది డైరెక్టర్లు ఉంటారు. టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం ఈ పదవుల్లో కొనసాగిన కొంతమంది.. ఎన్నికల్లో ఆ పార్టీ చిత్తుగా ఓడిన తరువాత నైతిక బాధ్యతగా చైర్మన్‌గిరీల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోగా, మరికొందరు గడువు ముగియడంతో రాజీనామాలు చేశారు. కొంతమంది మాత్రం ఇంకా చైర్మన్ పీఠాలను విడిచిపెట్టడం లేదు. ఆగస్ట్ ఆరో తేదీ వరకూ పదవీ కాలం ఉందన్న పేరుతో కొత్తపేట ఏఎంసీ చైర్మన్ వేగేశ్న చంద్రరాజు రాజీనామా చేయలేదు. టీడీపీ అధికారం కోల్పోయినా ఆయన ఇంకా చైర్మన్‌గిరీని విడిచిపెట్టకపోవడం విడ్డూరంగా ఉందని స్థానికులు ఆక్షేపిస్తున్నారు. అల్లవరం ఏఎంసీ చైర్మన్ కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఈ కమిటీకి మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సిఫారసుతో ఉప్పలగుప్తం మండలానికి చెందిన నిమ్మకాయల సూర్యనారాయణమూర్తి (సూరిబాబు)ని నియమించారు. పార్టీ అధికారం కోల్పోయిందనే విషయం తెలియదో ఏమో కానీ సూరిబాబు మాత్రం ఇంకా చైర్మన్ పీఠాన్ని వదలలేకపోతున్నారు. అనపర్తి కమిటీ చైర్మన్ పాలిక శ్రీను తీరూ ఇలాగే ఉంది. ఇక్కడ నిన్నమొన్నటి వరకూ ఎమ్మెల్యేగా పని చేసి ఘోర ఓటమి చవిచూసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్పే వరకూ రాజీనామా చేయరా ఏమిటని ఆయనను స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లో నైతిక విలువలు లేకపోవడమంటే ఇదేనంటూ వారి తీరును విమర్శిస్తున్నారు. అంబాజీపేట, రామచంద్రపురం మార్కెట్ కమిటీల చైర్మన్లు మద్దాల సుబ్బారావు, కొమరిన వీర్రాజు కూడా ఇందుకు తీసిపోరనే చెప్పవచ్చు. నైతిక విలువల గురించి వేదికలపై ఉపన్యాసాలు చెప్పే వీరికి ఆ విలువలు వర్తించవా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రాజమహేంద్రవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఈ నెల 24తో ముగిసింది. చైర్మన్ తనకాల నాగేశ్వరరావు గడువు ముగిసినా రాజీనామా మాత్రం చేయలేదు. సత్కారం కూడా అందుకున్నా పదవిపై మాత్రం ఆయనకు వ్యామోహం పోవడం లేదు. చైర్మన్ల దారి ఒకటైతే డైరెక్టర్ల దారి మరొకటి ఎలా అవుతుంది? ఒక్కో మార్కెట్ కమిటీలో చైర్మన్ కాకుండా ఉన్న 18 మంది డైరెక్టర్లు కూడా రాజీనామా చేయకుండా పదవులను అంటిపెట్టుకునే కొనసాగుతున్నారు. దేవదాయ శాఖలో.. దేవదాయ శాఖలో కూడా ఇలా చైర్మన్ పదవులు వదిలిపెట్టని వారి సంఖ్య లెక్కకు మిక్కిలిగానే ఉంది. ఎన్నికల ముందు హడావుడిగా అప్పగించిన పదవులను ఇంత తక్కువ కాలంలో వారు వదులుకోలేకపోతున్నారు. రాజమహేంద్రవరం హితకారిణి సమాజం చైర్మన్ డాక్టర్ ప్రదీప్ సుకుమార్, జీవకారుణ్య సంఘ చైర్మన్‌గా కొనసాగుతున్న టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ వర్రే శ్రీను, ఉమాకోటిలింగేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ అరిగెల బాబూ రాజేంద్రప్రసాద్, ఆర్యాపురం సత్యనారాయణస్వామి దేవాలయం చైర్మన్ మళ్ల వెంకట్రాజు, ఉమా మార్కండేయేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ మజ్జి రాంబాబు, చందా సత్రం యున్నమూరి ప్రదీప్, పందిరి మహదేవుడి సత్రం చైర్మన్ రెడ్డి మణి కూడా తమ పదవులకు రాజీనామాలు చేయలేదు. తామేమన్నా తక్కువ తిన్నామా అన్నట్టుగా పాలక మండలి సభ్యులు కూడా రాజీనామాలకు ససేమిరా అంటున్నారు. అమలాపురం వేంకటేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ కర్రి రామస్వామి (దత్తుడు), మురమళ్ల వీరేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ దంతులూరి ప్రసాదవర్మ, తలుపులమ్మ దేవస్థానం చైర్మన్ గాడి రాజబాబు, కాకినాడ జగన్నాథపురం వేంకటేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ సూర్యారావు, కోటిపల్లి సోమేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ పప్పుల మసేను వెంకన్న.. ఇలా చాలామంది టీడీపీ నేతలు చైర్మన్ పీఠాలను విడిచిపెట్టకుండా వేలాడుతున్నారు.నామినేటెడ్ పదవులను రద్దు చేస్తూ జీవో ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనా తెలుగు తమ్ముళ్లు మాత్రం పదవులపై మమకారంతో విడిచిపెట్టలేకపోతున్నారు. పార్టీ అధికారం కోల్పోవడం, గడువు ముగిసిపోవడం వంటి కారణాలతో పదవులకు రాజీనామా చేసిన ఆలమూరు, తాళ్లరేవు, రాజోలు, ముమ్మిడివరం, పెద్దాపురం, సామర్లకోట వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లకు ఉన్న నైతికత ఇతర నేతలకు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఏపీలో పలు నామినేటెడ్ పోస్టుల భర్తీ
విజయవాడ: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన పలు నామినేటెడ్ పోస్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భర్తీ చేసింది. చాలాకాలంగా వాయిదా వేస్తూ వచ్చిన నామినేటెడ్ పోస్టులను సర్కార్ గురువారం శ్రీకారం చుట్టింది. టీడీపీ ఆశావాహులు నామినేటెడ్ పోస్టులపై కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. విజయవాడ దుర్గగుడి చైర్మన్ గా యలమంచిలి గౌరంగబాబు (కృష్ణా) ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా మహముద్ హిదాయత్ (గుంటూరు) ఏపీ మేదర కో-ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ గా ఎం. సుందరయ్య (చిత్తూరు) ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా జయరామిరెడ్డి (చిత్తూరు) ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పాలి ప్రసాద్ (పశ్చిమ గోదావరి) ఏపీ కనీస వేతనాలు బోర్డు చైర్మన్ గా డొక్కా మాణిక్య వరప్రసాద్ (గుంటూరు) కృష్ణ బలిజ, పూసల కో-ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ చైర్మన్ గా కావేటి సామ్రాజ్యం (గుంటూరు) ఏపీ గీత కార్మికుల కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా తోట జయప్రకాశ్ నారాయణ (గుంటూరు)