
సాక్షి, విజయవాడ: ఏపీఐఐసీ ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మారిటైం బోర్డు ఛైర్మన్‌గా కాయల వెంకటరెడ్డిని నియమించారు. కాగా జూలై 17న ఏపీ నామినేటెడ్ పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చిన సంగతి తెలిసిందే.