
( ఫైల్ ఫోటో )
సాక్షి, విజయవాడ: ఏపీఎస్‌డీసీఎల్ రాష్ట్ర కార్యాలయంలో ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పెర్రాటి హేమ సుష్మిత మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే కాకని గోవర్ధన్ రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని అన్నారు. విత్తనాబివృద్ధి చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించవచ్చని సీఎం భావిస్తున్నారని పేర్కొన్నారు.
శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణుల సారధ్యంలో వ్యవసాయ రంగంలో పెను మార్పులు రాబోతున్నాయని తెలిపారు. నాణ్యమైన విత్తనాలు అభివృద్ధి చేసి సంస్థ బలోపేతం కోసం నుతన కమిటీ పని చేయాలని సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి సముచిత స్థానం దక్కుతుందని ఎమ్మెల్యే కాకని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలో క్రియాశీలకంగా వైఎస్సార్సీపీ బలోపేతం కోసం పని చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment