సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. ఇక, అన్ని అసెంబ్లీ స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలిపేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి.. ఈనెల 21వ తేదీన రెండో లిస్టును విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాగా, రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో జాబితాను 21న ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక, సెకండ్ లిస్ట్ కోసం టీకాంగ్రెస్ నేతలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు, సెకండ్ లిస్ట్ ప్రకటనలోపు పలువురు నేతల చేరికకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ తొలి జాబితాలో భాగంగా 55 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి.
మరోవైపు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోకి దిగబోతోంది. ఇందుకోసం బస్సు యాత్రలు చేపట్టాలని నిర్ణయించింది. బస్సు యాత్రని ఆరంభించేందుకు జాతీయ స్థాయి నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు బుధవారం రాష్ట్రానికి రానున్నారు. మూడు రోజులపాటు.. 8 నియోజకవర్గాల్లో సాగే బస్సు యాత్రలో రాహుల్ గాంధీ పర్యటిస్తారు. ఈ యాత్రలో నిరుద్యోగులు , సింగరేణి కార్మికులు, పసుపు.. చెరుకు రైతుల, మహిళలతో భేటీ ఆయన అవుతారు.
బస్సు యాత్ర పూర్తి షెడ్యూల్..
►బుధవారం మధ్యాహ్నాంకల్లా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న రాహుల్, ప్రియాంక
►బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో రామప్ప టెంపుల్‌కు ఇద్దరు కాంగ్రెస్ నేతలు
►రామప్ప టెంపుల్లో అన్నాచెల్లెళ్ల ప్రత్యేక పూజలు
►సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ బస్సు యాత్రను ప్రారంభించనున్న రాహుల్, ప్రియాంక
►రామప్ప గుడి నుంచి ములుగు చేరుకోనున్న కాంగ్రెస్ బస్సు యాత్ర
►ములుగులో బహిరంగ సభలో మహిళలతో రాహుల్ ,ప్రియాంకా ప్రత్యేక సమావేశం
►ములుగు సభ తరువాత తిరిగి ఢిల్లీ వెళ్లనున్న ప్రియాంకా గాంధీ
►ములుగు బహిరంగ సభ తర్వాత.. భూపాలపల్లి చేరుకొనున్న బస్సు యాత్ర
►భూపాలపల్లిలో నిరుద్యోగ యువతతో కలిసి రాహుల్ ర్యాలీ
►రాత్రికి.. భూపాలపల్లిలోనే బస చేయనున్న రాహుల్ గాంధీ
19వ తేదీన భూపాలపల్లి నుంచి మంథనికి చేరుకోనున్న బస్సు యాత్ర
►మంథని లో పాదయాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ. వెంట పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతరులు
►మంథని నుంచి పెద్దపల్లి వెళ్లనున్న బస్సు యాత్ర
►పెద్దపల్లి నుంచి కరీంనగర్కు బస్సు యాత్ర
►కరీంనగర్లో రాహుల్ గాంధీ రాత్రి బస
20వ తేదీన కరీంనగర్ నుంచి బోధన్ ఆర్మూరు మీదుగా నిజామాబాద్‌కు కాంగ్రెస్ బస్సు యాత్ర
►బోధన్ లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించనున్న రాహుల్ గాంధీ
►ఆర్మూరులో కాంగ్రెస్ బహిరంగ సభ
►పసుపు.. చెరుకు రైతులతో రాహుల్ ప్రత్యేక సమావేశం
►నిజామాబాద్ లో పాదయాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ
►20వ తేదీ సాయంత్రం తో ముగియనున్న టీ కాంగ్రెస్ మొదటి విడత బస్సుయాత్ర
Comments
Please login to add a commentAdd a comment