దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలివి: రాహుల్‌ గాంధీ | Rahul Gandhi Telangana Congress bus Yatra Begin Live Updates | Sakshi
Sakshi News home page

ములుగు బహిరంగ సభ: దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలివి: రాహుల్‌ గాంధీ

Published Wed, Oct 18 2023 4:15 PM | Last Updated on Wed, Oct 18 2023 8:22 PM

Rahul Gandhi Telangana Congress bus Yatra Begin Live Updates  - Sakshi

కాంగ్రెస్‌ బస్సు యాత్ర.. ములుగు బహిరంగ సభ లైవ్‌ అప్‌డేట్స్‌

06:55PM
ములుగు సభలో రాహుల్‌ గాంధీ ప్రసంగం
►రామప్ప ఆలయం అద్భుతంగా ఉంది
►ఇంత అందమైన ఆలయాన్ని ఎప్పుడు చూడలేదు
►దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి
►కాంగ్రెస్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకుని తెలంగాణ ఇచ్చింది
►రాజకీయ పార్టీలు తమకు నష్టం జరిగే నిర్ణయం తీసుకోవు
►కానీ, కాంగ్రెస్‌ ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంది
►తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్‌ గౌరవించింది
►కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చి మోసం చేశారు
►అందరికీ ఉద్యోగాలిస్తామని కేసీఆర్‌ మోసం చేశారు
►ధరణి పోర్టల్‌లో అవినీతి జరిగింది
►రూ.లక్ష రుణమాపీ అన్నారు.. గుర్తుందా? చేశారా?
►కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు తన జేబులో వేసుకున్నారు
►దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశారు
►బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే
►తెలంగాణ కోసం మరికొన్ని గ్యారెంటీలను ప్రకటిస్తున్నాం
►మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతినెల మహిళలకు రూ.2,500
►రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌
►ఇళ్లకు 200 యూనిట్ల లోపు విద్యుత్‌ ఉచితం
►తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములకు 250 గజాల జాగా
►నిరుద్యోగ యువతను కేసీఆర్‌ మోసం చేశారు
►సీఎం ఇస్తామన్న మూడెకరాల భూమి వచ్చిందా?
►కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఏం చెప్పామో.. అదే చేశాం
►రాజస్థాన్‌లో ఉచిత వైద్యం అన్నాం .. ఇస్తున్నాం, అదీ దేశంలోనే అత్యుత్తమ సేవలతో!
►ఛత్తీస్‌గడ్‌లో రైతులకు రుణమాఫీ చేశాం
►రూ.2,500 మద్దతు ధరతో వరి కొనుగోలు చేస్తున్నాం
►కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నాం
►ప్రతీనెలా మహిళలు, రైతుల ఖాతాలో నేరుగా నగదు జమ చేస్తున్నాం
►జల్‌, జమీన్‌, జంగల్‌ హామీలను కాంగ్రెస్‌ నెరవేర్చింది
►బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రోజులు చెల్లాయి
►పోడు భూములు, అసైన్డ్‌ భూముల విషయంలో న్యాయం చేస్తాం
►అభివృద్ధి అనే గ్యారెంటీతో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది
►తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

06:26PM
ములుగు సభలో ప్రియాంక గాంధీ వాద్రా ప్రసంగం
►రామప్ప లాంటి అందమైన గుడిని ఎప్పుడూ చూడలేదు
►ఉద్యోగాలు, నిధుల కోసం మీరు కలలు కన్నారు
►మీ కలలు సాకారం అవుతాయని నమ్మి బీఆర్‌ఎస్‌కి ఓటేశారు
►పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని.. భవిష్యత్తు మారుతాయని అనుకున్నారు
►బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది
►తెలంగాణ కలను బీఆర్‌ఎస్‌ నాశనం చేసింది
►తెలంగాణ ఏర్పడినా సామాజిక న్యాయం జరగలేదు
►మీ కలను కాంగ్రెస్‌ అర్థం  చేసుకుంది
►సామాజిక న్యాయం జరగాలన్నదే కాంగ్రెస్‌ సిద్ధాంతం
►కాంగ్రెస్‌ హయాంలోనే ఐఐటీ, ఐఐఎంలు వచ్చాయి
►తెలంగాణ కోసం కాంగ్రెస్‌ రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేసింది
►తెలంగాణ ఇస్తే రాజకీయ మూల్యం చెల్లించాల్సి వస్తుందని సోనియాగాంధీకి తెలుసు
►అయినా సోనియా గాంధీ మీ కోసం  నిర్ణయం తీసుకున్నారు
►దూరదృష్టితో తెలంగాణ ఏర్పాటునకు కృషి చేశారు
►రాజకీయ లబ్ధి కోసం కాకుండా.. ప్రజల కోసం నిర్ణయం తీసుకున్నారు
►మీ అందరి ఆకాంక్షలు నెరవేర్చేందుకే నిర్ణయం తీసుకున్నారు
►తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు
► లక్ష ఉద్యోగాల్ని కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భర్తీ చేయలేకపోయింది
►నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే.. వారి వ్యక్తిత్వాన్ని అగౌరవ పరుస్తున్నారు 
►కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం
►తెలంగాణలో రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది
►వరి రూ. 2,500, మొక్కజొన్నకు రూ.2,200 మద్దతు ధర ఇస్తాం
►రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం
► ఇందిరమ్మ రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తాం
►బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో వారి కుటుంబానికే ప్రాధాన్యత దక్కింది
►అమరులను కాంగ్రెస్‌ గౌరవిస్తుంది.. శ్రీకాంత్‌ చారికి నా నివాళి
►బీఆర్‌ఎస్‌ కేబినెట్‌లో ముగ్గురే బీసీ మంత్రులు ఉన్నారు
►గల్ఫ్‌ బాధితుల్ని ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడతాం
►ఆదివాసీల హక్కుల్ని బీఆర్‌ఎస్‌ పెద్దలు లాక్కుంటున్నారు
►మీ భూముల నుంచి మిమ్మల్ని వెళ్లగొడుతున్నారు
►మీకు రావాల్సిన డెవలప్‌మెంట్‌ ఫండ్‌ను మళ్లిస్తున్నారు
►ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గిరిజనులకు ఇళ్లు
►గత కాంగ్రెస్‌ ప్రభుత్వం మీకు పోడు భూముల పట్టాలు ఇచ్చింది
►18 ఏళ్లు దాటిన యువతులకు ఎలక్ట్రిక్‌ స్కూటీలు ఇస్తాం
►ఈ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల భర్తీపై దృష్టి పెట్టలేదు
►రకరకాల మాఫియాలను ప్రొత్సహించింది
►మీ కోసం ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్‌ తెచ్చింది
►గ్యారెంటీలు ఇస్తామన్న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక పనులు మొదలుపెట్టాం




06:10PM
ములుగు సభలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కామెంట్స్‌
►తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు
►అందుకే సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించారు
►ఆడబిడ్డల కోసం మహాలక్ష్మి పథకం తెస్తాం
►ప్రతీ నెల 1వ తేదీన రూ. 2,500 ఆడబిడ్డల ఖాతాలో జమ చేస్తాం
►అధికారంలోకి వస్తే రూ.500 కే సిలిండర్‌ఇస్తాం
►రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు రూ.15వేలు జమ చేస్తాం
►ప్రతీ ఇంటికి ఉచిత విద్యుత్‌ 200 యూనిట్ల లోపు ఫ్రీ
►మన బతుకులు బాగుపడాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి
►కళ్యాణ లక్ష్మి పేరుతో ఆడబిడ్డలకు తులం బంగారం
►ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని కరీంనగర్‌ గడ్డ నుంచి సోనియా గాంధీ ప్రకటించారు
►ఇచ్చిన మాటకు సోనియా తెలంగాణ ప్రకటించారు
►తెలంగాణలో ఎక్కడ చూసిన అరాచకం, అవినీతి అధిపత్యం రాజ్యమేలుతోంది
►అవినీతి పాలనను పాతాలంలోకి తొక్కాలి
►తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదని గాంధీ కుటుంబం వచ్చింది
►ఆరు గ్యారంటీ స్కీమ్ లతో ప్రజల ముందుకు వచ్చారు
►మహాలక్ష్మి గ్యారంటీ స్కీమ్ మహిళల కోసం సోనియా గాంధీ తెచ్చారు
►ప్రతినెల మహిళలకు 2500 ఇచ్చేందుకు సోనియా ముందుకు వచ్చారు
►500 రూ.లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే భాద్యత సోనియా గాంధీ తీసుకున్నారు
►రైతులకు మద్దతు ధర తో పాటు క్వింటాల్ కు 500 బోనస్  ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది
►నిరుద్యోగ యువతకు యువ వికాస్ పథకం క్రింద 5 లక్షలు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది
►షాదీముబారక్ కళ్యాణ లక్ష్మీ సహాయంతో పాటు తులం బంగారం ఇవ్వాలని నిర్ణయించాం



06:05PM
►రాష్ట్ర సంపదను ప్రజలకు పంచాలనే ఆరు గ్యారెంటీలను ప్రకటించాం: భట్టి
►ప్రతీ గ్యారెంటీని ప్రతీ ఇంటికి తీసుకెళ్లాలి: భట్టి
►గిరిజనులకు పోడు భూములు పంచాలన్న చట్టాన్ని నిర్వీర్యం చేశారు.. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి: భట్టి
►ఆరు గ్యారంటీ స్కీమ్ లను తప్పకుండా అమలు చేస్తాం: భట్టి

06:00PM
►ములుగు బహిరంగ సభలో రాహుల్‌, ప్రియాంక
►మహిళా  డిక్లరేషన్‌ ప్రకటించనున్న రాహుల్‌, ప్రియాంక

►తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమే అంటూ రాహుల్‌ ఫేస్‌బుక్‌ రీల్‌
►బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రోజులు చెల్లాయి 
►ఈ విజయయాత్ర రాబోయే మార్పుకి సంకేతమంటూ పోస్ట్‌

►రాహుల్‌ మాటిస్తే కట్టుబడి ఉంటారు: ఎమ్మెల్యే సీతక్క
►కాంగ్రెస్‌ వస్తే పోడు భూములకు పట్టాలు ఇస్తాం
►అధికారంలోకి వచ్చాక ఆరుగ్యారంటీలు అమలు చేస్తాం

05:20PM
►రామప్ప ఆలయం వద్ద కాంగ్రెస్‌ విజయభేరి తొలి విడత బస్సు యాత్రను ప్రారంభించిన రాహుల్‌, ప్రియాంక
►ములుగు రామానుజాపురం బహిరంగ సభా స్థలికి ర్యాలీగా బయల్దేరిన కాంగ్రెస్‌ నేతలు
►కాసేపట్లో బహిరంగ సభ
►బహిరంగ సభ నుంచే మహిళా డిక్లరేషన్‌ ప్రకటన

05:10PM
►ప్రత్యేక పూజల అనంతరం.. రామప్ప ఆలయ ప్రాంగణంలో తిరుగుతున్న రాహుల్‌ గాంధీ, ప్రియాంకలు
►ఆలయ చరిత్రను వివరిస్తున్న అధికారులు



04:52PM
►రామప్ప ఆలయంలో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్‌ కీలక నేతల ప్రత్యేక పూజలు
►కాసేపట్లో కాంగ్రెస్‌ తొలి విడత బస్సు యాత్ర ప్రారంభం

04:42PM
►ములుగు జిల్లా రామప్ప కు చేరిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు
►స్వాగతం పలికిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు సీతక్క, శ్రీధర్ బాబు.

04:30PM
►మరి కాసేపట్లో రామప్పకు చేరుకోనున్న రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ.
►రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
►అనంతరం విజయభేరి బస్సు యాత్ర ప్రారంభం
►ఆదివాసీ  గిరిజన సంప్రదాయ పద్ధతిలో రాహుల్, ప్రియాంక గాంధీ లకు స్వాగతం
►కోయ కళాకారులు లంబాడీలు డప్పు నృత్యాలతో స్వాగతం

04:15PM
►రామప్ప ఆలయం వద్దకు చేరుకున్న టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి
►రేవంత్ రెడ్డికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే సీతక్క

►కాసేపట్లో రామప్ప ఆలయానికి రాహుల్‌, ప్రియాంకలు

► రామప్ప ఆలయం నుంచి ప్రారంభం కానున్న కాంగ్రెస్‌ విజయభేరి బస్సు యాత్ర



► బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో రామప్పకు బయల్దేరిన రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా

►బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు

► ములుగు జిల్లా నక్సల్‌ ప్రభావిత ప్రాంతం కావడంతో రాహుల్‌ పర్యటన కోసం భారీ బందోబస్తు ఏర్పాటు

నేటి నుంచి కాంగ్రెస్‌ విజయభేరి తొలి విడత బస్సు యాత్ర. ములుగు జిల్లా రామప్పలో ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభించనున్న రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ. అనంతరం సాయంత్రం జరిగే రామానుజాపురంలో  బహిరంగ సభలో ప్రసంగించడంతో పాటు మహిళా డిక్లరేషన్‌ ప్రకటించనున్న రాహుల్‌, ప్రియాంకలు. మూడు రోజులపాటు బస్సు యాత్రలో పాల్గొనున్న రాహుల్‌ గాంధీ. బస్సు యాత్రతో పాటు పాదయాత్రలో కూడా పాల్గొనున్న రాహుల్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement