ఢిల్లీ: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం ప్రకటనలో తెలిపింది. సెంట్రల్ శాల్టెంగ్ స్థానం నుంచి జమ్ము కశ్మీర్ పీసీసీ చీఫ్ తారిక్ హమీద్ కర్రాను బరిలోకి దించింది కాంగ్రెస్. అదేవిధంగా రియాసీ-ముంతాజ్ ఖాన్, శ్రీ మాతా వైష్ణోదేవీ- భూపేందర్ జమ్వాల్, రాజౌరీ (ఎస్టీ)- ఇఫ్తికార్ అహ్మద్, ఠాణామండీ (ఎస్టీ)- షాబీర్ అహ్మద్ ఖాన్, సురాన్‌కోట్ (ఎస్టీ)- మొహమ్మద్ షానవాస్ ఛౌదరీ పోటీ చేస్తారని తెలిపింది.
Congress releases a list of 6 candidates for the upcoming Assembly elections in J&K. pic.twitter.com/mx8NdsRdgk
— ANI (@ANI) September 2, 2024
ఇక ఇప్పటి వరకు కాంగ్రెస్ మొత్తం 15 మంది అభ్యర్థులను ప్రకటించింది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలో కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఇప్పటికే ఇరుపార్టీల మధ్య సీట్ల పంపకం కూడా ఖరారు అయింది. నేషనల్ కాన్ఫరెన్స్ 51 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 32 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. జమ్ము కశ్మీర్‌లో సెప్టెంబర్18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్‌లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment