ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. 43 అభ్యర్థులతో రెండో జాబితా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ విడుదల చేశారు. రెండో జాబితాలో.. అస్సాం, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులను ప్రకటించారు.
ఈ జాబితాలో జనరల్ కేటగిరీకి చెందిన 10 మంది అభ్యర్థులు, 13 మంది ఓబీసీలు, 10 మంది ఎస్సీ అభ్యర్థులు, 9 మంది ఎస్టీ అభ్యర్థులు, ఒకరు ముస్లిం అభ్యర్థి ఉన్నట్లు కేసీ వేణుగోపాల్ తెలిపారు. అస్సాం నుంచి 12 మంది, గురజరాత్ నుంచి 7 మంది, మధ్యప్రదేశ్ 10 మంది, రాజస్థాన్ 10 మంది, ఉత్తరఖండ్ 3, డయ్యూ అండ్ డామన్ నుంచి ఒక్కరికి రెండో జాబితాలో చోటు దక్కింది.
మధ్యప్రదేశ్‌లోని చింద్వారా సెగ్మెంట్ నుంచి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కుమారుడు నకుల్‌నాథ్‌ను మరోసారి బరిలోకి దింపింది. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కుమారుడు వైభవ్ గెహ్లాత్‌కు రాజస్థాన్‌లోని జలోర్ సెగ్మెంట్‌ను కేటాయించారు. అదేవిధంగా సోమవారం బీజేపీకీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన రాహుల్ కుశ్వాన్‌ను రాజస్థాన్‌లోని చురూ లోకసభ నియోజకవర్గం బరితో దింపింది.
LIVE: Congress party briefing by Shri @kcvenugopalmp in New Delhi. https://t.co/K3nuDYA7P9
— Congress (@INCIndia) March 12, 2024
Comments
Please login to add a commentAdd a comment