సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో పోటీచేసే బీజేపీ అభ్యర్థుల రెండో విడత జాబితాను ఆ పార్టీ అధిష్టానం శుక్రవారం ప్రకటించింది. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, నేతలు కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా 28 మందితో రెండో జాబితాకు బీజేపీ ఎన్నికల కమిటీ ఆమోదముద్ర వేసింది. ఇప్పటివరకు 66 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. మిగతా వాటిని దీపావళి తర్వాత మూడో జాబితాలో ప్రకటించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
బీజేపీ రెండో జాబితా అభ్యర్థులు వీరే..
సిర్పూర్– డా. శ్రీనివాసులు, అసిఫాబాద్ (ఎస్టీ)– అజ్మీరా ఆత్మారామ్ నాయక్, ఖానాపుర్ (ఎస్టీ)– సట్ల అశోక్, నిర్మల్– డా.ఎ.సువర్ణారెడ్డి, నిజామాబాద్ అర్బన్– యెండల లక్ష్మీనారాయణ, జగిత్యాల– ముడుగంటి రవీందర్‌రెడ్డి, రామగుండం– బాల్‌మూరి వనిత, సిరిసిల్ల– ఎం.నర్సారెడ్డి, సిద్దిపేట– నాయిని నరోత్తంరెడ్డి, కూకట్‌పల్లి– మాధవరం కాం తారావు, రాజేంద్రనగర్– బద్దం బాల్‌రెడ్డి, శేరిలిం గంపల్లి– జి. యోగానంద్, మలక్‌పేట్– ఆలె జితేంద్ర, చార్మినార్– టి. ఉమామహేంద్ర, చాంద్రాయణ్‌గుట్ట– సయ్యద్ షహెజాది, యాఖుత్‌పుర– చర్మాని రూప్‌రాజ్, బహదూర్‌పుర– హనీఫ్ అలీ, దేవరకద్ర– అగ్గాని ఎన్. సాగర్, వనపర్తి– కొత్త అమరేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్– ఎన్. దిలీప్‌చారీ, నాగార్జున సాగర్– కె. నివేదిత, ఆలేరు– డి. శ్రీధర్‌రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ (ఎస్సీ)– పెరుమండ్ల వెంకటేశ్వర్లు, వరంగల్ వెస్ట్– ఎం. ధర్మారావ్, వర్ధన్నపేట (ఎస్సీ) – కొత్త సరంగారావ్, ఇల్లందు (ఎస్టీ)– మోకల్ల నగ స్రవంతి, వైరా (ఎస్టీ) – రేష్మా రాథోర్, అశ్వారావుపేట– డా.భూక్యా ప్రసాద్‌రావు
నో సూర్యనారాయణ..
నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీచేసేందుకు యెండల లక్ష్మీనారాయణను ఎంపిక చేయడంతో ఇదే స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న సూర్యనారాయణకు నిరాశే మిగిలింది. ఈ స్థానం కోసం వీరిద్దరి మధ్య తీవ్ర పోటీ ఏర్పడిన నేపథ్యంలో అధిష్టానం యెండల వైపే మొగ్గుచూపింది.
నటి రేష్మాకు వైరా టికెట్
సినీ నటి ‘ఈ రోజుల్లో’ ఫేం రేష్మా రాథోర్‌కు వైరా టికెట్ దక్కింది. ఇల్లందుకు చెందిన రేష్మా ఈ ఏడాది ఏప్రిల్‌లో బీజేపీలో చేరారు. రాజేంద్రనగర్ స్థానానికి మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డిని అధిష్టానం ఎంపిక చేయడంతో ఇదే స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్ శ్రీనివాస్ తండ్రి తోకల శ్రీశైలంరెడ్డికి నిరాశే ఎదురైంది. 5 ఎస్టీ, 2 ఎస్సీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటుగా చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, మలక్‌పేట్, బహదూర్ పురలో బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది.
28 మందితో బీజేపీ రెండో జాబితా
Published Sat, Nov 3 2018 2:43 AM | Last Updated on Sat, Nov 3 2018 2:43 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment