central election committee
-
రేపు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న మూడు ఎంపీ టికెట్ల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానం శనివారం ఓ నిర్ణయానికి రానుంది. ఢిల్లీలో జరగనున్న పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో అభ్యర్థులను ఖరారు చేయనుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ ఈ భేటీ కోసం ఢిల్లీకి వెళ్లారు. పార్టీ అగ్రనేతలను కలిసి.. ఆయా నియోజకవర్గాల పరిస్థితులు, అభ్యర్థుల ఎంపికపై చేసిన కసరత్తును వివరించనున్నారు. సీఈసీ సమావేశానికి ముందే ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్‌లతో రేవంత్ భేటీ కానున్నట్టు తెలిసింది. భువనగిరిలో పార్టీ నిర్వ హించే బహిరంగ సభకు రావాలని అగ్రనేతలను రేవంత్ ఆహ్వానించనున్నట్టు సమాచారం. మూడు స్థానాలపై ఉత్కంఠ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకుగాను 14 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి ఎవరికి దక్కుతాయన్నది హాట్‌టాపిక్‌గా మారింది. ఖమ్మం టికెట్ ఇవ్వాలంటూ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన సతీమణి కోసం, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన సోదరుడి కోసం, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తన కుమారుడి కోసం ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. వీరితోపాటు అదే జిల్లాకు చెందిన ఓ వ్యాపారవేత్త కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుతోపాటు మరో ఇద్దరు బీసీ నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు కరీంనగర్ ఎంపీ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి, వెలిచాల రాజేందర్రావు, తీన్మార్ మల్లన్న పోటీపడుతున్నారు. ఇక హైదరాబాద్ ఎంపీ స్థానంలో అలీ మస్కతీ పోటీ చేస్తారనుకున్నా.. ఆయన వెనక్కి తగ్గినట్టు తెలిసింది. దీంతో హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు సమీర్ వలీఉల్లా పేరు వినిపిస్తోంది. -
చేయందుకున్న వారికి చాన్స్.. ఐదుగురితో కాంగ్రెస్ రెండో జాబితా
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పోటీ చేసే మరో ఐదుగురు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజిగిరి నుంచి సునీతా మహేందర్‌రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, చేవెళ్ల నుంచి గడ్డం రంజిత్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి మల్లు రవి బరిలో ఉంటారని తెలిపింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీలో ఆమోదించిన జాబితాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం రాత్రి విడుదల చేశారు. తాజాగా ప్రకటించిన ఐదుగురిలో మల్లు రవి మినహా మిగతా నలుగురు కొత్తగా కాంగ్రెస్‌లో చేరినవారే కావడం గమనార్హం. బీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఇంకా ఆ పార్టీకి రాజీనామా కూడా చేయలేదు. గడ్డం వంశీకృష్ణ తండ్రి గడ్డం వివేకానంద బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉండి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, సునీతా మహేందర్ రెడ్డి కూడా ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. రెండో జాబితాలో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నేతలకు, ఒక బీసీకి, ఇద్దరు ఎస్సీలకు అవకాశం కల్పించింది. తొలి జాబితాతో కలిపి మొత్తం నలుగురు రెడ్డి, ఇద్దరు బీసీ, ఒక ఎస్టీ, ఇద్దరు ఎస్సీ నేతలకు కాంగ్రెస్ చాన్స్ ఇచ్చినట్టయింది. తొలి జాబితాలో నలుగురి ప్రకటన కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్ స్థానాలపై ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)లో చర్చ జరగలేదు. ఇక భువనగిరి, ఖమ్మం, మెదక్ స్థానాల విషయంలో ఇంకా ఏకాభిప్రాయం రాలేదు. మరోవైపు ఆదిలాబాద్ ఖరారైందనుకున్నా, చివరకు అక్కడ అభ్యర్థిని మార్చాలని భావించారు. దీంతో ఆయా స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన మరో సీఈసీ భేటీకి వాయిదా పడింది. దీంతో ఈ నెల 25 (హోలీ) తర్వాతే వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఇప్పటివరకు 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, మరో 8 సీట్లు పెండింగ్‌లో ఉన్నాయి. తొలి జాబితాలో నలుగురు అభ్యర్థులు.. వంశీచంద్ రెడ్డి (మహబూబ్‌నగర్), బలరాం నాయక్ (మహబూబాబాద్), రఘువీర్ రెడ్డి (నల్లగొండ), సురేష్ షెట్కార్ (జహీరాబాద్) పేర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఖమ్మంపై మున్షీ భేటీ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న ఖమ్మం టికెట్‌కు డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు ఈ టికెట్‌ను ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ గురువారం ఆ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (మధిర), మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (పాలేరు), తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం), మట్టా రాగమయి (సత్తుపల్లి), రాందాస్‌నాయక్ (వైరా), జారె ఆదినారాయణ (అశ్వారావుపేట) భేటీలో పాల్గొన్నారు. వీరితో ఉమ్మడిగా, విడివిడిగా సమావేశమైన మున్షీ ఖమ్మం నుంచి ఎవరు పోటీ చేస్తే బాగుంటుందన్న దానిపై అభిప్రాయాలు తీసుకున్నారు. కాంగ్రెస్‌లో చేరిన టీచర్ ఆత్రం సుగుణ ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉంటారని భావిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణ గురువారం కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్కల సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. సుగుణ బుధవారమే తన ఉద్యోగానికి సుగుణ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆమె అభ్యర్థిత్వం ఖరారైనట్టేనని అంటున్నారు. అయితే రిమ్స్‌లో వైద్యురాలిగా ఉన్న సుమలత కూడా ఇటీవల సీఎంను కలిశారు. ఆమె కూడా ఉద్యోగానికి రాజీనామా చేయాలని భావించారు. ఆమె పేరు ఖరారైందనే వార్తలు వెలువడ్డాయి. కానీ తాజాగా ఆత్రం సుగుణ పేరు తెరపైకి వచ్చింది. రెండు మాలలకా? మూడు ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో రెండు మాలలకు ఇవ్వడంపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నాగర్‌కర్నూల్ (మల్లు రవి), పెద్దపల్లి (గడ్డం వంశీ) రెండు స్థానాలను మాలలకే ఎలా ఇస్తారని మాదిగ సామాజిక వర్గం నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే మెదక్ స్థానానికి మంత్రి దామోదర రాజనర్సింహ కుమార్తె త్రిష పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ నీలం మధు ముదిరాజ్‌కు ఖరారు కాని పక్షంలో త్రిష పేరు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నిజామాబాద్‌లో జీవన్‌రెడ్డి, కరీంనగర్లో ప్రవీణ్‌రెడ్డి, హైదరాబాద్‌లో షెహనాజ్ తబుస్సమ్, ఖమ్మంలో పొంగులేటి ప్రసాదరెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. భువనగిరికి చామల కిరణ్ లేదా కోమటిరెడ్డి లక్ష్మిలలో ఒకరు ఖరారయ్యే అవకాశాలున్నాయి. -
నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో బీజేపీ మూడో జాబితాపై కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్ తోపాటు, పార్లమెంటరీ బోర్డు సభ్యులు పాల్గొంటారు. సీఈసీ భేటీలో తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని 13 రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించి ఆమోద ముద్రవేయనున్నారు. ఇప్పటికే ప్రకటించిన రెండు జాబితాల్లో తెలంగాణలోని 15 స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. మూడో జాబితాలో తెలంగాణలోని రెండు స్థానాలు, ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు సీట్లకు అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు, సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో పది రాష్ట్రాలకు చెందిన కోర్ కమిటీ నేతలతో జేపీ నడ్డా, అమిత్ షా, బీఎల్ సంతోష్ భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల పేర్లపై చర్చించి జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది. -
నేడు కాంగ్రెస్ తొలి జాబితా.. మళ్లీ వయనాడ్ నుంచే రాహుల్
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈసారి కూడా కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ(సీఈసీ) ఢిల్లీలో సమావేశమైంది. 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి 60 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. పోటీ చేసే 40 మంది అభ్యర్థుల పేర్లను సీఈసీ గురువారం రాత్రి ఖరారు చేసింది. అభ్యర్ధులను నేడు ప్రకటించనుంది హస్తం పార్టీ.. ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయా, లక్షద్వీప్‌కు సంబంధించి పలు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. సీఈసీ సమావేశంలో ఖర్గే, సోనియా గాం«దీ, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. కేరళలో తమ పార్టీ 16 స్థానాల్లో పోటీ చేయబోతోందని కాంగ్రెస్ నేత వి.డి.సతీశన్ చెప్పారు. తమ మిత్రపక్షాలకు 4 స్థానాలు కేటాయించామన్నారు. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భుపేష్ బఘేల్ రాజ్‌నంద్‌గావ్ నుంచి, మాజీ మంత్రి తామ్రధ్వజ్ సాహూ మహసముంద్ నుంచి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అభ్యరి్థత్వం సైతం ఖరారైంది. రాహుల్ గాంధీ వయనాడ్‌తోపాటు ఉత్తరప్రదేశ్‌లోని ఆమేథీ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాయ్‌బరేలీ నుంచి ఈసారి ప్రియాంకాగాంధీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. 2019 నాటి ఎన్నికల్లో ఆమేథీ నుంచి ఓడిపోయిన రాహుల్ గాంధీ వయనాడ్‌లో గెలిచిన సంగతి తెలిసిందే. తొలి జాబితాను త్వరలో అధికారికంగా విడుదల చేస్తామని కాంగ్రెస్ వెల్లడించింది. -
నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం
-
బీజేపీ స్ట్రాటజీ.. తొలి జాబితాపై సర్వత్రా ఆసక్తి!
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను ఓ కొలిక్కి తెచ్చేందుకు బీజేపీ సిద్ధమయ్యింది. ఇందుకోసం గురువారం బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం భేటీ కానుంది. భేటీ తర్వాత.. శుక్రవారం తొలి జాబితాలో వందకిపైగా అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అంతకు ముందు.. ఇవాళ అనేక రాష్ట్రాల నేతలతో బీజేపీ అధిష్టానం మేధోమథనం జరిపింది. బుధవారం బీజేపీ సీనియర్ నేత అమిత్ షా, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పలు రాష్ట్రాలకు చెందిన పార్టీ నేతలతో మాట్లాడారు. మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నేతలతో భేటీ జరిగింది. జాబితా తుది కూర్పుపై షా, నడ్డాలు వాళ్లతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఇక.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 370 స్థానాల్లో విజయం సాధించాలని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం ప్రకటించబోయే తొలి జాబితాలో.. మూడొంతుల అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో దిగే అభ్యర్థుల జాబితాపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్ షా వంటి అగ్రనేతల పేర్లు తొలి జాబితాలోనే ఉండనున్నట్లు పార్టీ వర్గాలు లీకులు ఇచ్చాయి. అయితే.. 2019లోనూ ఇలానే అగ్రనేతల పేర్ల జాబితాను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించింది. కానీ, ఆ సమయంలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యాక లిస్ట్ ఇచ్చింది. అయితే.. స్ట్రాటజీ ఇలా.. ఈసారి మాత్రం ముందుగానే లిస్ట్‌ను రిలీజ్ చేయాలని నిర్ణయించుకుంది. అందుకు కారణం.. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు. ఆ అనుభవం దృష్ట్యా ఈసారి భిన్నంగా ముందుగానే ప్రకటించాలనుకుంటోంది. తద్వారా ఎన్నికల ప్రచారానికి సమయం దొరుకుతుందనేది బీజేపీ స్ట్రాటజీ. ఉదాహరణకు.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం గతంలో ఎన్నడూ గెలవని 39 స్థానాలకు అభ్యర్థులను బీజేపీ తొలి జాబితా ప్రకటించింది. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో సత్ఫలితాలను రాబట్టింది. అందుకే.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల తొలి జాబితా కోసం అదే స్ట్రాటజీని ఫాలో కానున్నట్లు స్పష్టమవుతోంది. ఫస్ట్ లిస్ట్‌లో.. 2019 ఎన్నికల్లో గెలవని స్థానాలను కూడా చేర్చాలనే యోచనలో కమల అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఆ సంఖ్య 130 దాకా ఉండొచ్చని.. తొలి జాబితాలో దక్షిణ ప్రాంతం నుంచి అత్యధిక స్థానాల ప్రకటన ఉండొచ్చని తెలుస్తోంది. తెలంగాణలో ఆయనకు పక్కా.. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నేతృత్వంలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. తెలంగాణ నుంచి 6 నుంచి పదిమంది అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ ఎంపీ రాములు గురువారం నాడే బీజేపీలో చేరనున్నారు. అయితే.. రేపటి లిస్ట్‌లో ఆయన పేరును కూడా ప్రకటించే ఛాన్స్ ఉందని.. నాగర్ కర్నూల్ టికెట్ ఇవ్వనున్నారని ప్రచారం నడుస్తోంది. -
ఏ క్షణమైనా మలి జాబితా
సాక్షి, న్యూఢిల్లీ/ సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థులను ఆ పార్టీ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసింది. కమ్యూనిస్టులకు వదిలేసిన స్థానాలు, కొత్తగా నేతల చేరిక ఉండే సీట్లు, పోటీ ఎక్కువగా ఉన్న కొన్ని స్థానాలు మినహా 50కిపైగా అభ్యర్థుల పేర్లతో మలి జాబితాను సిద్ధం చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో ఆమోదించిన ఈ జాబితాను ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఇక పొత్తు, ఇతర అంశాలతో పెండింగ్ పెట్టిన మిగతా స్థానాలకు సంబంధించి బుధవారం రాత్రి కేసీ వేణుగోపాల్ నివాసంలో రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పెండింగ్ స్థానాల్లో అభ్యర్థులు, చేరికలపై చర్చించి, పలు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు తెలిసింది. గురువారం జరిగే సీఈసీ భేటీలో ఈ సిఫార్సులను అందజేయనున్నట్టు సమాచారం. సీఈసీ దీన్ని పరిశీలించి, పొత్తు సీట్లు, అభ్యర్థు లను ఖరారు చేసే అవకాశం ఉందని తెలిసింది. గెలుపు అవకాశాలు, విధేయత ఆధారంగానే.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఇప్పటికే ఒకసారి భేటీ అయిన సీఈసీ.. 55మందితో తొలి జాబితాను ప్రకటించిన విష యం తెలిసిందే. మిగతా స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులపై భిన్నాభిప్రాయాల నేపథ్యంలో మలిజాబితాపై జాప్యం జరుగుతూ వచ్చింది. మురళీధరన్ నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీ గత వారం రెండుసార్లు భేటీ అయి అభ్యర్థుల వడపోతను పూర్తిచేసింది. ఇటీవలే అభ్యర్థుల జాబితాను సీఈసీకి నివేదించింది. బుధవారం ఏఐసీసీ కార్యాలయంలో ఖర్గే అధ్యక్షతన సీఈసీ భేటీ జరిగింది. ఇందులో పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, మురళీధరన్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాహుల్‌గాంధీ పాల్గొని చర్చించారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీలో గెలుపు అవకాశాలు, కుల సమీకరణాలు, సర్వేల ఆధారంగా సుమారు 50 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, వనపర్తి, నారాయణ్‌ఖేడ్, శేరిలింగంపల్లి, తాండూరు వంటి 15కుపైగా నియోజకవర్గాల్లో ఇద్దరేసి అభ్యర్థులను గుర్తించిన చోట గెలుపు అవకాశాలు, విధేయతను దృష్టిలో పెట్టుకొని సీఈసీ అభ్యర్థులను ఫైనల్ చేసినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఖరారైన అభ్యర్థుల జాబితాను ఏ క్షణమైనా విడుదల చేయవచ్చని పేర్కొంటున్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల కోసం.. బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోసం మునుగోడు స్థానాన్ని ఖాళీగా ఉంచారు. ఆయనతోపాటు బీజేపీ నుంచి చేరుతారని భావిస్తున్న మరో ఇద్దరు సీనియర్లకు సంబంధించిన సీట్లనూ పెండింగ్‌లో పెట్టారు. ఇక సీపీఎం కోరుతున్న మిర్యాలగూడ, వైరా సీట్లపై ఎలాంటి స్పష్టత రాని నేపథ్యంలో అక్కడ అభ్యర్థులను ఖరారు చేయలేదు. కాగా సీఈసీ సమావేశం జరుగుతున్న సమయంలో ఏఐసీసీ కార్యాలయం బయట ఇల్లందు నియోజకవర్గ కార్యకర్తలు కొందరు నిరసన తెలిపారు. ఇల్లందు సీటును పారాచూట్ నేతలకు కేటాయించవద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణలో పాగా వేస్తాం: ఖర్గే తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎన్నుకోవడం ఖాయమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఓటమి ఖాయమని గుర్తించిన బీఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్‌పై దాడులు చేస్తూ నిరాశను వ్యక్తం చేస్తున్నారని ట్వీట్లో ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు అన్ని నేరాల్లో భాగస్వాములనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. ఆ మూడు పార్టీలకు అబద్ధాలు, దోపిడీ, కమీషన్లు తప్ప తెలంగాణ ప్రజలకు చెప్పుకోవడానికి వేరే అంశాలేవీ లేవని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ప్రజలతో పంచుకునే అపార ప్రేమాభిమానాలు న్యాయం, సంక్షేమం, ప్రగతికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఆ స్థానాలపై మాత్రం పీటముడి పోటీ తీవ్రంగా ఉన్న కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారిందని సమాచారం. సూర్యాపేట, తుంగతుర్తి, వరంగల్ (వెస్ట్), నిజామాబాద్ అర్బన్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, పరకాల, ఎల్బీనగర్ తదితర సీట్లతోపాటు ఇతర పార్టీల నుంచి నేతలు వస్తారనే అంచనాలున్న స్థానాలపై పీటముడి పడిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వామపక్షాలతో పొత్తులు ఖాయమే అంటున్నా.. వారికిచ్చే సీట్లపై ఏకాభిప్రాయం రావడం లేదని అంటున్నాయి. సీపీఎం ఆశిస్తున్న పాలేరు, మిర్యాలగూడ స్థానాలను వదులుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదని పేర్కొంటున్నాయి. పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి బలమైన అభ్యర్థులని, ఆ సీట్లను సీపీఎంకు ఇచ్చినా ఓటు బదిలీ జరగక ఇరుపక్షాలు నష్టపోయే పరిస్థితి ఉంటుందని కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతోంది. సీపీఐ అడుగుతున్న కొత్తగూడెం, చెన్నూరు విషయంలోనూ ఇదే తరహా పరిస్థితి ఉందని అంటున్నారు. కీలకనేతలపై పోటీ ప్రతిపాదన లేనట్టే! ఈసారి ఎన్నికల్లో బీజేపీ తరహా ప్రయోగం చేయాలని కాంగ్రెస్ నేతలు తొలుత భావించినా వెనక్కితగ్గినట్టు తెలిసింది. బీఆర్ఎస్ కీలక నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులపై పార్టీ సీనియర్లను రంగంలోకి దించితే ఎలా ఉంటుందన్న దానిపై కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నేతలతో చర్చించినట్టు సమాచారం. కామారెడ్డిలో రేవంత్, సిద్దిపేటలో ఉత్తమ్, సిరిసిల్లలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, గజ్వేల్‌లో రాజగోపాల్‌రెడ్డి ఇలా ఎవరెక్కడ పోటీ చేయాలన్న ప్రతిపాదనలపైనా చర్చ జరిగినట్టు సమాచారం. కానీ ఎక్కువ మంది నాయకులు రెండు చోట్ల పోటీ చేయడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతుందని... ఈ ప్రభావం రెండు స్థానాలపైనా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. ముందే బుజ్జగింపులు షురూ! కాంగ్రెస్ అధిష్టానం మలి జాబితా విడుదలకు ముందే అసంతృప్తులను అంచనావేసి చక్కదిద్దే పనిలో పడింది. ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్న నియోజకవర్గాల్లో టికెట్ వచ్చే అవకాశం లేని వారిని బుజ్జగించేందుకు సిద్ధమైంది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ అంశంపై బుధవారం రాత్రి భేటీ అయి చర్చించినట్టు తెలిసింది. టికెట్ రాని నేతలకు భవిష్యత్తులో తగిన న్యాయం చేస్తామని పక్కాగా హామీ ఇవ్వాలని.. రెబెల్ అభ్యర్థులు లేకుండా చూసుకుంటూ, పార్టీలో అంతర్గత కుమ్ములాటలేవీ లేవన్న సందేశాన్ని ప్రజల్లోకి పంపాలని ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో ఆశావహులతో ఫోన్లో మాట్లాడటం లేదా సీనియర్ నేతలను పంపి బుజ్జగించడం, ఢిల్లీకి పిలిపించుకుని హామీ ఇవ్వడం వంటి మార్గాల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై వేణుగోపాల్, రేవంత్ చర్చించినట్టు తెలిసింది. కాగా నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానాన్ని ముస్లిం అభ్యర్థికి ఇవ్వాలని నిర్ణయించిన కాంగ్రెస్ పెద్దలు.. ఆ సీటును ఆశిస్తున్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌గౌడ్‌ను బుజ్జగించేందుకు ప్రయతి్నస్తున్నట్టు సమాచారం. మహేశ్‌గౌడ్‌ను కేసీ వేణుగోపాల్ ఢిల్లీకి పిలిపించి మాట్లాడినట్టు తెలిసింది. -
TS: ముగిసిన కాంగ్రెస్ సీఈసీ సమావేశం
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా కసరత్తు ముగిసింది. బుధవారం హస్తినలో ఐదు గంటలపాటు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. అలాగే వామపక్షాలతో పొత్తులపై కమిటీ చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సోనియా గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, భట్టి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే పాల్గొన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాందీద ఈ భేటీకి హాజరు కాలేకపోయారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే తొలి విడతలో 55 మంది అభ్యర్థులను ప్రకటించింది హస్తం పార్టీ. పొత్తులో భాగంగా.. నాలుగు సీట్లను వామపక్షాలకు కేటాయించిన కాంగ్రెస్ మరో 60 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేయనుంది. -
ఎడతెగని ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ దగ్గరపడుతున్నా బీజేపీ అభ్యర్థుల విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే కొందరు అభ్యర్థులను ఖరారు చేశారని, మరికొందరి విషయంలోనూ ఏకాభిప్రాయం వ్యక్తమైందని పార్టీ నేతలు చెప్తున్నా.. అధికారికంగా జాబితా విడుదల కాకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. అయితే పక్కాగా ఖరారైన సుమారు 35–40 సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థులకు ఫోన్ చేసి సమాచారం అందించినట్టు తెలిసింది. వారు వెంటనే ప్రచార కార్యక్రమాలు, ఇతర ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్టు సమాచారం. మిగతా అభ్యర్థులకు సంబంధించి పరిశీలన పూర్తిచేసి.. ఆదివారం సాయంత్రానికి 55 మంది పేర్లతో అధికారికంగా తొలి జాబితా విడుదల చేయనున్నట్టు తెలిసింది. తొలి జాబితా దాదాపు ఖరారైనా జాప్యం కావడం వెనుక.. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయంగా పునరాలోచన చేయడం, కొందరు అటూ, ఇటూ మారే అవకాశం ఉండటమే కారణమని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ రెండో జాబితా వెలువడితే.. అవకాశం దక్కనివారు బీజేపీ వైపు చూడవచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయని అంటున్నాయి. అభ్యర్థులు, సీట్ల మార్పుతో.. అధికార బీఆర్ఎస్ నెలన్నర ముందే అభ్యర్థులను ప్రకటించడంతోపాటు చాలా మందికి బీ ఫారాలు కూడా అందజేసింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తొలి జాబితా విడుదల చేసి, మిగతా అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పటికే బీజేపీ నుంచి అభ్యర్థులపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. నిజానికి ఈ నెల 15 లేదా 16న తొలి జాబితా ఉంటుందని ముఖ్యనేతలు ప్రకటించినా విడుదల చేయలేదు. శనివారానికి దీనిపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కసరత్తు ఒక కొలిక్కి వచ్చిందని.. 55 మంది అభ్యర్థులతో తొలి జాబితా సిద్ధమైందని పార్టీ నేతలు చెప్పారు. కానీ ఇందులోని దాదాపు 15 వరకు స్థానాల్లో అభ్యర్థుల మార్పు, నేతలు పోటీకి సుముఖత వ్యక్తం చేయని చోట్ల ఇతరులను ఎంపిక చేయాల్సి రావడంతో ప్రకటన ఆగిపోయినట్టు తెలిసింది. ఫోన్ చేసి సమాచారమిస్తూ.. అభ్యర్థుల ఎంపిక కసరత్తు కోసం ఢిల్లీ వెళ్లిన కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తదితరులు శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. అయితే జాబితా విడుదల కాని నేపథ్యంలో.. కచ్చితంగా ఖరారైన అభ్యర్థులకు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి స్వయంగా ఫోన్ చేసి ఎంపిక విషయాన్ని తెలియజేసిట్టు సమాచారం. సదరు అభ్యర్థులు వెంటనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి, పకడ్బందీ కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించినట్టు తెలిసింది. పార్టీ తీసుకున్న బీసీ అజెండా, ఇతర అంశాలను ప్రజలకు వివరించాలని.. ఇతర పార్టీల కంటే బీజేపీ ఏ విధంగా భిన్నమైనదో స్పష్టంగా తెలియజేయాలని దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. అభ్యర్థుల తీరు ఎలా ఉంది? ముగ్గురు ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు (కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్ మినహా), ఇద్దరు ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావులకు తొలి జాబితాలోనే అవకాశం కల్పించినట్టు తెలిసింది. సీఎం కేసీఆర్ పోటీచేస్తున్న గజ్వేల్‌తోపాటు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ రెండు చోట్లా ఈటల రాజేందర్‌ను బరిలోకి దింపుతున్నట్టు సమాచారం. ఇక గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై విధించిన సస్పెన్షన్ ఎత్తేసి, ఆయనకు అదే స్థానంలో పోటీ చేసే అవకాశంపై ఢిల్లీలో చర్చ జరిగినట్టు తెలిసింది. అయితే దీనిపై స్పష్టత రాలేదు. మరోవైపు చెన్నూరు నుంచి వివేక్ వెంకటస్వామి, ధర్మపురి నుంచి ఎస్.కుమార్ల పేర్లు ఖరారయ్యాయని.. అయితే వివేక్ ధర్మపురి నుంచి పోటీకి మొగ్గుచూపుతుండటంతో కుమార్‌ను చెన్నూరుకు మార్చడంపై ఆలోచన జరుగుతోందని సమాచారం. ఇదే జరిగితే ఈ రెండు సీట్ల అభ్యర్థులు మారనున్నారు. మరోవైపు కాంగ్రెస్ మలివిడత జాబితా ఇంకా ప్రకటించనందున.. ఒకవేళ అక్కడ టికెట్లు దక్కని బలమైన నాయకులు, బీఆర్ఎస్లోని అసంతృప్తులు బీజేపీలోకి వచ్చే అవకాశాలను కూడా ఢిల్లీ పెద్దలు పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. జనసేన పొత్తులపై అస్పష్టత ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేనతో తెలంగాణలో బీజేపీ పొత్తుపై ప్రచారం జరిగినా ఎలాంటి స్పష్టత రాలేదు. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ జరిపిన చర్చల్లో రాష్ట్రంలో బీజేపీకి మద్దతివ్వాలని, పోటీ ఆలోచనను విరమించుకోవాలని కోరిన సంగతి తెలిసిందే. దీనిపై ఢిల్లీ భేటీల్లో చర్చ జరిగినా.. ఇరువైపుల నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. నెలాఖరులోగా మిగతా జాబితాలు రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జాతీయ నేతలతో రాష్ట్ర ముఖ్య నేతలు చర్చించారు. అభ్యర్థుల పేర్లపై ప్రాథమిక పరిశీలన పూర్తి చేశారు. ఇందులో ఒక్కరే బలమైన అభ్యర్థులున్న సీట్లు, ఏకాభిప్రాయం కుదిరిన స్థానాలు కలిపి 55 సీట్లలో అభ్యర్థులపై స్పష్టత వచ్చిందని, బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని నేతలు వెల్లడించారు. ఆదివారం సాయంత్రానికల్లా ఈ 55 మందితో జాబితా వెలువడే అవకాశం ఉందని తెలిపారు. నెలాఖరులోగా మిగతా అభ్యర్థులను ఖరారు చేసి, ప్రకటించనున్నట్టు వెల్లడించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల కంటే అధికంగా బీసీలు, మహిళలు, యువతకు సీట్లు కేటాయించేలా కసరత్తు జరిగిందని వివరించారు. -
బీజేపీ తొలి జాబితా రెడీ!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాపై రాష్ట్ర స్థాయిలో కసరత్తు పూర్తయింది. గురువారం రాత్రి ఢిల్లీలో జరగనున్న పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీలో, లేదా ఉన్నతస్థాయి సమావేశంలో అభ్యర్థులపై చర్చించి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రాధాన్యతాంశాల వారీగా తెలంగాణ అభ్యర్థుల జాబితాపై చర్చ రాత్రికల్లా ముగిస్తే వెంటనే 40మందితో తొలి జాబితా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ముఖ్య నేతలు చెప్తున్నారు. ఒకవేళ ఆలస్యమైతే శుక్రవారం ఉదయం లేదా తర్వాతిరోజున విడుదల చేయనున్నారని పేర్కొంటున్నారు. అయితే సీఈసీ/ఉన్నతస్థాయి భేటీకన్నా ముందే.. అంటే గురువారం ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డాతో రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అభ్యర్థుల తొలి జాబితాకు సంబంధించి తమ కసరత్తు, 40మంది అభ్యర్థుల ముసాయిదాపై చర్చించి.. సీఈసీకి సమర్పించే జాబితాకు తుదిరూపం ఇవ్వనున్నట్టు తెలిసింది. వీలైతే సాయంత్రం ప్రధాని మోదీతోనూ రాష్ట్ర నేతల బృందం సమావేశమయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. రోజంతా కసరత్తు చేసి.. బీజేపీ ముఖ్య నేతలు బుధవారం పొద్దంతా హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్ నివాసంలో, పార్టీ కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ సమక్షంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ జి.వివేక్ వెంకటస్వామి తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. బీసీ ఎజెండాతో తెలంగాణ ఎన్నికలకు వెళ్లాలన్న ప్రధాని మోదీ సూచనల మేరకు.. 40కి మందికిపైగా బీసీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ సీట్లపై ఏకాభిప్రాయం రాష్ట్ర నేతల చర్చల సందర్భంగా పోటీలేని, బలమైన క్యాండిడేట్లు ఉన్న నియోజకవర్గాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ఇందులో అంబర్‌పేట (కిషన్‌రెడ్డి), హుజూరాబాద్ (ఈటల రాజేందర్), గద్వాల (డీకే అరుణ), దుబ్బాక (ఎం.రఘునందన్‌రావు), మునుగోడు (కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి), మహబూబ్‌నగర్ (ఏపీ జితేందర్‌రెడ్డి), సూర్యాపేట (సంకినేని వెంకటేశ్వర్రావు), కల్వకుర్తి (టి.ఆచారి), నిర్మల్ (మహేశ్వర్‌రెడ్డి), వరంగల్ ఈస్ట్ (ఎర్రబెల్లి ప్రదీప్‌రావు), వర్ధన్నపేట (కొండేటి శ్రీధర్), బోథ్ (సోయం బాపూరావు), ఖానాపూర్ (రమేశ్ రాథోడ్), మహబూబాబాద్ (హుస్సేన్‌నాయక్), చొప్పదండి (బోడిగె శోభ), మహేశ్వరం(అందెల శ్రీరాములు యాదవ్), భూపాలపల్లి (చందుపట్ల కీర్తి) తదితర నియోజకవర్గాలు ఉన్నాయి. మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి రెండు పేర్లలో జాబితాను రూపొందించినట్టు తెలిసింది. ఇక బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్ వంటి ముఖ్యనేతలు పోటీచేసే సెగ్మెంట్ల విషయానికొస్తే.. కామారెడ్డిలో ధర్మపురి అర్వింద్, గజ్వేల్‌లో ఈటల రాజేందర్, సిరిసిల్లలో బండి సంజయ్.. ఇలా బీజేపీ ముఖ్య నేతలను బరిలో నిలపాలనే అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. జనసేన పోటీ నుంచి విరమించుకునేలా? బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్ బుధవారం ఉదయం జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ కార్యాలయానికి వెళ్లి చర్చించారని.. తెలంగాణలో పోటీచేయాలనే ఆలోచనను విరమించుకోవాలని సూచించినట్టు విశ్వసనీయ సమాచారం. తెలంగాణలో బీజేపీకి మద్దతు ప్రకటించాలని కోరినట్టు తెలిసింది. తెలంగాణలో పోటీ చేయాలని జనసేన నాయకులు, కార్యకర్తల నుంచి ఒత్తిడి ఉందని పవన్ వివరించగా.. పొత్తు కుదుర్చుకునే ప్రసక్తే లేదని, పోటీ విరమించుకుని మద్దతు ఇవ్వాలని బీజేపీ నేతలు స్పష్టం చేసినట్టు సమాచారం. కాగా హైదరాబాద్‌లో సమావేశాలు ముగిశాక ప్రకాశ్ జవదేకర్, బన్సల్, కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్, ఈటల, డీకే అరుణ, రాజగోపాల్‌రెడ్డి తదితరులు ఢిల్లీ వెళ్లినట్టు పార్టీ నేతలు తెలిపారు. -
రేపు బీజేపీ తొలి జాబితా?
సాక్షి. హైదరాబాద్: బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను గురువారం ఢిల్లీలో ప్రకటించే అవకాశముంది. బుధవారం ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఒకవేళ అవకాశం ఉంటే బుధవారం రాత్రే జాబితా ప్రకటించే అవకాశాన్నీ కొట్టిపారేయలేమని పార్టీ నేతలు చెబుతున్నారు. జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ ఇలా అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత దక్కేలా కసరత్తు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 60–70 స్థానాల్లో అభ్యర్థుల పేర్లపై రాష్ట్రపార్టీ ముఖ్యనేతలు ఓ అంచనాకు రాగా... ఏకాభిప్రాయం కుదిరిన సింగిల్ క్యాండిడేట్ నియోజకవర్గాలు కొన్నింటిని రెండు లేదా మూడో జాబితాలో ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు. తొలి జాబితాలో 35–40 మంది అభ్యర్థులు ఉండొచ్చునని చెబుతున్నారు. మొత్తంగా ఇతర పార్టీల కంటే కూడా బీసీలు (దాదాపు 40 సీట్లు), మహిళలకు ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశముంనే చర్చ జరుగుతోంది. మేనిఫెస్టోకు ఓపిక పట్టండి అధికార బీఆర్ఎస్ 98 మంది అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వగా, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ 55 మందితో తొలిజాబితా ప్రకటించేసింది. అదీగాక ఈ రెండు పార్టీలు మేనిఫెస్టోను సైతం ప్రకటించి ప్రచారంలో ముందున్న నేపథ్యంలో బీజేపీ ఇంకా తొలి జాబితాను కూడా ప్రకటించకపోవడంపై పార్టీ నాయకుల్లో ఒకింత ఆందోళన ఉంది. అదీగాక మేనిఫెస్టోను ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై స్పష్టత కొరవడటంతో దిగాలు చెందుతున్నారు. ఆయా అంశాలను కొందరు ముఖ్య నేతలు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లగా... ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో తెలంగాణలో చివర్లో ఎన్నికలు జరగనుండటంతో ఎందుకు తొందర పడుతున్నారని ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో మేనిఫెస్టో ప్రకటనకు మరికొంత సమయం పట్టొచ్చని సమాచారం. మేనిఫెస్టోలో ప్రతిపాదించే విషయాలను రాష్ట్ర పార్టీ జాతీయ నాయకత్వానికి నివేదించాక... వారే ఏయే అంశాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలనే దానిపై స్పష్టతనిస్తారని చెబుతున్నారు. మేనిఫెస్టో ప్రకటనతోపాటే అన్ని మాధ్యమాల ద్వారా ప్రచారం విస్తృతంగా చేపట్టేలా ఢిల్లీ పెద్దలు వ్యూహ రచన చేస్తున్నట్టు సమాచారం. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన, బీసీలకు తగిన గుర్తింపు, కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు తదితర అంశాలపై దృష్టి సారించినట్టు తెలిసింది. సకల జనుల ద్రోహి పేరుతో... కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేశారంటూ ‘సకల జనుల ద్రోహి కేసీఆర్’ పేరిట ఎన్నికల ప్రచారం చేపట్టాలని కమలం పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. మంగళవారం రాష్ట్ర పార్టీ ఎన్నికల సహ ఇన్చార్జి సునీల్ బన్సల్ సమక్షంలో ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, పార్టీ వ్యవహారాల సమన్వయకర్త నల్లు ఇంద్రసేనారెడ్డి, పార్టీ ప్రధానకార్యదర్శి బంగారు శ్రుతి తదితరులు ప్రచార కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు సంబంధించిన అంశాలను బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు భిన్నంగా ప్రజల దృష్టిని ఆకర్షించేలా కొత్తపంథాలో ప్రచారం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. కాగా, ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన 14 కమిటీల (మేనిఫెస్టో, క్యాంపెయిన్, సోషల్ ఔట్రీచ్, స్క్రీనింగ్ తదితరాలు) సమావేశాలతో పార్టీ కార్యాలయమంతా సందడి నెలకొంది. మేనిఫెస్టో, అభ్యర్థుల స్క్రీనింగ్, క్యాంపెయిన్, ఎన్నికల మేనేజ్మెంట్ తదితరాలపై చర్చించేందుకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఈటల, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి భేటీ అయినట్టు తెలుస్తోంది. -
నేడు సగానికి పైగా అభ్యర్థుల ఖరారు!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కు పార్టీ అభ్యర్థులను ఖ రారు చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమి టీ (సీఈసీ) శుక్రవారం భేటీ కానుంది. చైర్మన్ మల్లికార్జున ఖర్గే అ ధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల తో పాటు కమిటీ సభ్యులు పాల్గొననున్నారు. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్ అభ్యర్థుల ఎంపికపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. మురళీధరన్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే 70కి పైగా స్థానాల్లో సింగిల్ పేరును, మరో 30 స్థానాల్లో రెండేసి పేర్లను సీఈసీకి పంపింది. ఈ పేర్లపై సీఈసీ చర్చించి ఆమోదం తెలపనుంది. రెండేసి పేర్లున్న చోట పార్టీ పెద్దలు కొన్ని మార్గదర్శకాలు సూచించనున్నారు. ఈ నెల 15 లేదా 16వ తేదీన తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. -
14న భేటీ తర్వాత అభ్యర్థుల జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఈ నెల 14న ఢిల్లీలో భేటీ కానుంది. అంతకంటే ముందురోజు తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ సమావేశం మరోమారు జరగనున్నట్టు తెలుస్తోంది. ఈనెల 14న సీఈసీ భేటీ తర్వాత ఏ క్షణమైనా తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితా వస్తుందని, దసరా తర్వాత మలి జాబితా రానుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియ పూర్తిచేసి, స్క్రీనింగ్ కమిటీ సమరి్పంచిన నివేదికల ఆధారంగా సీఈసీ ఫైనల్ చేయనుంది. ఏఐసీసీ కార్యాలయంలో జరిగే ఈ భేటీపై ఇప్పటికే కమిటీ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 9న భేటీ అయిన స్క్రీనింగ్ కమిటీ 70కిపైగా స్థానాల్లో ఒక్కో అభ్యర్థిని, మిగతా స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థుల పేర్లతో జాబితాను రూపొందించింది. ఒక్కో స్థానంలో ఖరారైన అభ్యర్థుల జాబితాపై సీఈసీలో ఎలాంటి అభ్యంతరాలు లేనిపక్షంలో వాటిని యథావిధిగా ఆమోదించనున్నారు. ఏవైనా అభ్యంతరాలుంటే సహేతుక కారణాలను చూపి మరో అభ్యర్థిని ముందుకు తెచ్చే అవకాశాలుంటాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఇద్దరేసి అభ్యర్థులున్న చోట్ల ఎంపిక నిర్ణయానికి సీఈసీ కొన్ని మార్గదర్శకాలు సూచిస్తుందని, వాటికనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారని చెబుతున్నాయి. ఈ నెల 16 లేదా 18న తొలి జాబితా విడుదల చేసేలా ఇప్పటికే నేతల నుంచి హైకమాండ్‌కు ఒత్తిళ్లు పెరిగాయి. దానికి అనుగుణంగా వారంలోనే జాబితా విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
నేడు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపికపై మలి దఫా కసరత్తు చేసేందుకు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఆదివారం భేటీ కానుంది. ఇప్పటికే ఎంపిక చేసిన స్థానాలతోపాటు మిగతా చోట్ల అభ్యర్థుల ఖరారు ప్రక్రియను పూర్తి చేయనుంది. ఇందుకోసం కమిటీ చైర్మన్ మురళీధరన్ శనివారం ఉదయమే ఢిల్లీకి చేరుకోగా.. మిగతా నేతలు కూడా ఒక్కొక్కరుగా వస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఇతర సభ్యులు ఆదివారం ఉదయం ఢిల్లీకి చేరుకుంటారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కసరత్తు పూర్తి చేసే దిశగా.. గత నెల 21, 22 తేదీల్లో నిర్వహించిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీల్లో 40 స్థానాల్లో ఒక్కో అభ్యర్థిని, మరో 35 స్థానాల్లో ఇద్దరి పేర్ల చొప్పున ఎంపిక చేశారు. ఈ దఫా భేటీలో రెండేసి పేర్లను ఎంపిక చేసినచోట్ల ఇటీవల నిర్వహించిన ఫ్లాష్ సర్వేల ఆధారంగా ఒకరి పేరును ఖరారు చేయనున్నట్టు తెలిసింది. వీటితోపాటు మిగతా స్థానాల్లోనూ అభ్యర్థులను వడపోయనున్నట్టు సమాచారం. మొత్తంగా 75–80 స్థానాల్లో ఒక్కో అభ్యర్థి పేరు, మరో 30–35 వరకు స్థానాల్లో ఇద్దరి పేర్లను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఈ నెల 10న జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తీసుకునే నిర్ణయాల మేరకు.. ఈ నెల 14 తర్వాత తొలిజాబితా విడుదల చేసే అవకాశం ఉందని పార్టీవర్గాలు చెప్తున్నాయి. ఇలా అభ్యర్థుల ఎంపిక కసరత్తు చివరిదశకు వచ్చిన నేపథ్యంలో.. ఆశావహులు చాలా మంది ఢిల్లీలో మకాం వేసి.. ఏఐసీసీ పెద్దలు, రాష్ట్ర ముఖ్యనేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. -
సాయంత్రం తెలంగాణ ఓటర్ల తుది జాబితా విడుదల
-
కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ.. తెలంగాణ నేతకు చోటు
సాక్షి, ఢిల్లీ: ఎన్నికల వేళ కాంగ్రెస్ హైకమాండ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 16 మంది సభ్యులతో కాంగ్రెస్ ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కీలక కమిటీలో మాజీ టీపీసీసీ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి చోటు కల్పించడం విశేషం. వివరాల ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగానే ఎన్నికల కమిటీని కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కేంద్ర ఎన్నికల కమిటీని ఏర్పాటు చేశారు. 16 మంది సభ్యులతో కేంద్ర ఎన్నికల కమిటీ ఏర్పాటైంది. అయితే, రానున్న ఎన్నికలకు ఎన్నికల కమిటీనే అభ్యర్థులను ఎంపిక చేయనుండటం విశేషం. ఇక, ఈ కీలకమైన ఎన్నికల కమిటీలో టీపీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చోటు కల్పించింది హైకమాండ్. ఇక, సీఈసీలో సభ్యులుగా మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అంబికా సోనీ, అధిర్ రంజన్ చౌదరీ, సల్మాన్ ఖుర్షీద్, మధుసూదన్ మిస్త్రీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీఎస్ సింగ్ డియో, కేజీ జార్జ్, ప్రీతమ్ సింగ్, మహ్మాద్ జావేద్, ఆమ్మె యాజ్నిక్, పీఎల్ పూనియా, ఓంకార్ మాక్రామ్, కేసీ వేణుగోపాల్‌కు చోటు కల్పించారు. Congress President Shri @kharge has constituted the Central Election Committee. The list is as follows- pic.twitter.com/jfdcR8KSEN — Congress (@INCIndia) September 4, 2023 ఇది కూడా చదవండి: వన్ నేషన్-వన్ ఎలక్షన్.. ప్రశాంత్ కిషోర్ ఏమన్నారంటే? -
టీమ్ కమలం – 2024
యుద్ధం సమీపిస్తున్నప్పుడు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకోవాల్సిందే! వరుసగా మూడోసారీ ఢిల్లీ గద్దెనెక్కాలనే ముమ్మర ప్రయత్నంలో ఉన్న బీజేపీ ఇప్పుడు ఆ పనే చేస్తోంది. రానున్న 2024 ఎన్ని కల దృష్ట్యా పార్టీలో భారీ సంస్థాగత మార్పులు చేపట్టింది. పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలిగా పేరున్న పార్లమెంటరీ బోర్డ్నూ, కేంద్ర ఎన్నికల కమిటీనీ బుధవారం పునర్వ్యవస్థీ కరించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించిన పేర్లు, ఈ పునర్వ్యవస్థీకరణ జరిగిన తీరు అటు సొంత పార్టీ వారికీ, ఇటు సామాన్య ఓటర్లకూ తగిన సంకేతాలిస్తోంది. నితిన్ గడ్కరీ, యోగి ఆదిత్యనాథ్ లాంటి వారికి చెక్‌పెడుతూనే, తక్షణ ఎన్నికల ప్రయోజనాలున్న చోట యడియూరప్ప లాంటి వారిని దువ్వడంలోనూ మోదీ – అమిత్ షాల ముద్రే కనిపిస్తోంది. అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, అనంతకుమార్ లాంటి వారి మృతి, వెంకయ్య నాయుడు తదితరుల నిష్క్రమణతో చాలాకాలంగా బోర్డులో 5 ఖాళీలున్నాయి. కొన్నేళ్ళుగా వాటి ఊసే వదిలేసి, మరో అయిదు నెలల్లో జనవరి 20తో నడ్డా పదవీకాలం ముగుస్తుందనగా భర్తీ చేయడం విచిత్రమే. పార్లమెంటరీ బోర్డులో పేరున్న సీనియర్లయిన కేంద్ర మంత్రి గడ్కరీ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు ఇద్దరికీ ఉద్వాసన పలికారు. ఎన్నికల దృష్ట్యా ఎక్కడికక్కడ బలం పెంచుకోవాలని చూస్తున్న కమలనాథులు తెలంగాణకు చెందిన కె. లక్ష్మణ్ సహా కొత్తగా ఆరుగురికి స్థానం కల్పించారు. అలా బోర్డ్ సభ్యుల సంఖ్య 11కు చేరింది. ఓబీసీ (కె. లక్ష్మణ్, హరియాణా మాజీ ఎంపీ సుధా యాదవ్), ఎస్సీ (ఉజ్జయిన్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి సత్యనారాయణ జతియా), సిక్కు (జాతీయ మైనార్టీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్‌సింగ్ లాల్పురా) – ఇలా వివిధ సామాజిక సమీకరణాలు, ఉత్తర– దక్షిణాదులతో పాటు ఈశాన్యం (గిరిజన నేత – కేంద్ర మంత్రి శర్బానంద్ సోనోవాల్) – ఇలా భౌగోళిక లెక్కలు వేసుకొని మరీ ఈ మార్పులు చేశారనేది స్పష్టం. బోర్డ్‌లోని 11 మందితో పాటు పార్టీ నామినేట్ చేసే ముగ్గురు, ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా మహిళా మోర్చా ఛీఫ్ ఉండే మొత్తం 15 మంది సభ్యుల పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)లోనూ మోదీ మార్కే! వివాదంలో ఇరుక్కున్న కేంద్ర మాజీ మంత్రి షానవాజ్ హుస్సేన్ సహా ముగ్గురు పాతవారికి స్వస్తి పలికారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్, ఓం మాథుర్లకు కొత్తగా చోటిచ్చారు. పార్టీలోని నలుగురు అగ్రశ్రేణి నేతల్లో ఒకరైన గడ్కరీకి బోర్డు నుంచి ఉద్వాసన ఒకింత ఆశ్చర్యకరమే. అయితే, పార్టీకి వరుస విజయాలు అందిస్తున్నంత కాలం సంఘ్ పరివార్ సైతం తమను కాదనదని మోదీ – షా ద్వయానికి తెలుసు. ఈ గుజరాతీ మిత్రులు పార్టీపై తమ పట్టు చూపడానికి పునర్వ్యవస్థీకరణను అంది పుచ్చుకున్నారు. ఆరెస్సెస్‌కు సన్నిహితుడూ, మితవాద ముఖచిత్రమైన గడ్కరీ ఎన్నికల రాజకీయాల పట్ల ఇటీవల ప్రకటించిన వైరాగ్యం, అభిప్రాయాలు అధినేతల్ని చీకాకు పరిచాయి. వ్యక్తుల కన్నా వ్యవస్థ, సిద్ధాం తమే గొప్పదని నిరూపించడానికి గడ్కరీని తప్పించారని ఓ విశ్లేషణ. పార్టీలో మార్పులు తెచ్చి, 2009 నాటికే అధ్యక్షుడైన గడ్కరీ ఇప్పుడు బోర్డ్కూ, సీఈసీకీ వెలుపలే మిగిలిన పరిస్థితి. పార్టీలో ఆధిపత్యానికి అడ్డు లేకుండా మోదీ చూసుకున్నారు. తనను మించి ఎదుగుతున్నాడని పేరుపడ్డ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు పార్టీలో బలం పెరగకుండా జాగ్రత్తపడ్డారు. ఆ మధ్య యూపీ ఎన్నికలు, రానున్న లోక్‌సభ ఎన్నికల రీత్యా ఆయనను సహిస్తూ వస్తున్నా, విధాన నిర్ణాయక మండలిలో చోటివ్వలేదు. ఎన్నికల రాజకీయాలకు స్వస్తి పలుకుతానని చెప్పిన కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పను బోర్డులోకి తీసుకోవడం వెనుక వ్యూహం సుస్పష్టం. అంతర్గత కలహాలు, ఆరోప ణల వల్ల సీఎం కుర్చీ వదులుకోవాల్సి వచ్చిన యడియూరప్ప కొన్నాళ్ళుగా పార్టీపై అలకబూనారు. లింగాయత్ ఓటుబ్యాంక్ ముఖ్యమైన కర్ణాటక ఎన్నికలు మరి 9 నెలల్లోనే ఉన్నాయి. బీజేపీ పాలిత ఏకైక దక్షిణాది రాష్ట్రంలో బలమైన ఈ లింగాయత్ నేతను దూరం చేసుకోవడం తెలివైనపని కాదని కమలనాథులకు తెలుసు. అందుకే కినుక వహించిన కురువృద్ధుడిని వ్యూహాత్మకంగా లాలించి, బుజ్జగించి ఇటు బోర్డులో, అటు సీఈసీలో చేర్చారు. 1989 తర్వాత ఏ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాని కర్ణాటకలో బీజేపీ అభ్యర్థుల ఎంపికలో ఆయన కీలకం కానున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగినప్పుడే కొత్తవారిని ప్రోత్సహిస్తూ, రాగల పాతికేళ్ళకు సిద్ధం కావాలని పార్టీ పిలుపునిచ్చింది. అందుకు తగ్గట్లే ఇప్పుడు ఫడ్నవీస్, భూపేంద్ర యాదవ్ లాంటి కొత్త నేతలకు పార్టీలో ప్రాధాన్యం పెంచారనుకోవాలి. యువ రక్తం నింపే సాకుతో ఇదే అధినేతలు గతంలో అద్వానీ, మురళీమనోహర్ జోషీలను నామమాత్ర పార్టీ మార్గదర్శక్ మండలికే పరిమితం చేశారు. మరి ఇప్పుడు ఏడున్నర పదులు దాటిన యడియూ రప్ప, జతియాలకు బోర్డ్‌లో ఎలా స్థానమిచ్చారంటే ఎన్నికల అవసరాలనే అనుకోవాలి. గడ్కరీకి బదులు అదే వర్గానికి చెందిన నాగ్‌పూర్ వాసి, ఆరెస్సెస్ సన్నిహితుడైన ఫడ్నవీస్‌కు సీఈసీలో చోటిచ్చి సమతూకం చేసేశారు. అయితే, ఆ మధ్య కేంద్ర మంత్రివర్గంలో నక్వీ, ఇప్పుడు సీఈసీలో షానవాజ్ల ఉద్వాసనతో ముస్లిమ్‌ల ప్రాతినిధ్యం లోపించింది. ఆ లోటు భర్తీకి కాషాయపార్టీ వ్యూహమేమిటో చూడాలి. మొత్తానికి గెలిచినా, ఓడినా ఒక ఎన్నిక తర్వాత మరో ఎన్నికకు అవిశ్రాం తంగా సిద్ధమవడమే మంత్రమైన మోదీ – షా మార్కు కొత్త ‘బీజేపీ టీమ్ 2024’ సిద్ధమైంది. -
కొత్త పార్లమెంటరీ బోర్డు, ఎన్నికల కమిటీలను ప్రకటించిన బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ బుధవారం కొత్త పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీలను ప్రకటించింది. 11 మందితో పార్లమెంటరీ బోర్డు ఏర్పాటు చేయగా.. 15 మంది సభ్యులతో కేంద్ర ఎన్నికల కమిటీని బీజేపీ ప్రకటించింది. ఇక, తెలంగాణ నుంచి కె లక్ష్మణ్‌కు రెండు కమిటీల్లోనూ అవకాశం దక్కింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ, నడ్డా బీఎస్ యడ్యూరప్ప, సర్బానంద సోనోవాల్, కే లక్ష్మణ్, ఇక్బాల్ లాల్పుర, సుధా యాదవ్, సత్యనారాయణ జాతియా, బీఎల్ సంతోష్‌లను సభ్యులుగా నియమించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డును జేపీ నడ్డా నియమించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో ముగ్గురు కొత్త నేతలకు చోటు కల్పించారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, సర్బానంద సోనోవాల్, ఎంపీ కే లక్షణ్‌కు అవకాశం లభించింది. ఇక కొత్త పార్లమెంటరీ బోర్డులో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు స్థానం దక్కలేదు. చదవండి: మోదీగారు.. మహిళలంటే గౌరవం ఉంటే గనుక..!: కేటీఆర్ भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने पार्टी के केंद्रीय संसदीय बोर्ड का गठन किया है। जिसके सदस्य निम्न प्रकार रहेंगे :- pic.twitter.com/pmxGE5fJ7E — BJP (@BJP4India) August 17, 2022 అదే విధంగా 15 మంది సభ్యులతో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీని కూడా ప్రకటించారు. ఈ కమిటీలోనూ కె లక్ష్మణ్‌కు చోటు లభించింది. దీనికి జేపీ నడ్డా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने पार्टी की केंद्रीय चुनाव समिति का गठन किया है। जिसके सदस्य निम्न प्रकार रहेंगे :- pic.twitter.com/jUw5ei8VzE — BJP (@BJP4India) August 17, 2022 -
నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం
-
28 మందితో బీజేపీ రెండో జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో పోటీచేసే బీజేపీ అభ్యర్థుల రెండో విడత జాబితాను ఆ పార్టీ అధిష్టానం శుక్రవారం ప్రకటించింది. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, నేతలు కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా 28 మందితో రెండో జాబితాకు బీజేపీ ఎన్నికల కమిటీ ఆమోదముద్ర వేసింది. ఇప్పటివరకు 66 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. మిగతా వాటిని దీపావళి తర్వాత మూడో జాబితాలో ప్రకటించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ రెండో జాబితా అభ్యర్థులు వీరే.. సిర్పూర్– డా. శ్రీనివాసులు, అసిఫాబాద్ (ఎస్టీ)– అజ్మీరా ఆత్మారామ్ నాయక్, ఖానాపుర్ (ఎస్టీ)– సట్ల అశోక్, నిర్మల్– డా.ఎ.సువర్ణారెడ్డి, నిజామాబాద్ అర్బన్– యెండల లక్ష్మీనారాయణ, జగిత్యాల– ముడుగంటి రవీందర్‌రెడ్డి, రామగుండం– బాల్మూరి వనిత, సిరిసిల్ల– ఎం.నర్సారెడ్డి, సిద్దిపేట– నాయిని నరోత్తంరెడ్డి, కూకట్పల్లి– మాధవరం కాం తారావు, రాజేంద్రనగర్– బద్దం బాల్‌రెడ్డి, శేరిలిం గంపల్లి– జి. యోగానంద్, మలక్‌పేట్– ఆలె జితేంద్ర, చార్మినార్– టి. ఉమామహేంద్ర, చాంద్రాయణ్‌గుట్ట– సయ్యద్ షహెజాది, యాఖుత్‌పుర– చర్మాని రూప్‌రాజ్, బహదూర్‌పుర– హనీఫ్ అలీ, దేవరకద్ర– అగ్గాని ఎన్. సాగర్, వనపర్తి– కొత్త అమరేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్– ఎన్. దిలీప్చారీ, నాగార్జున సాగర్– కె. నివేదిత, ఆలేరు– డి. శ్రీధర్‌రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ (ఎస్సీ)– పెరుమండ్ల వెంకటేశ్వర్లు, వరంగల్ వెస్ట్– ఎం. ధర్మారావ్, వర్ధన్నపేట (ఎస్సీ) – కొత్త సరంగారావ్, ఇల్లందు (ఎస్టీ)– మోకల్ల నగ స్రవంతి, వైరా (ఎస్టీ) – రేష్మా రాథోర్, అశ్వారావుపేట– డా.భూక్యా ప్రసాద్‌రావు నో సూర్యనారాయణ.. నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీచేసేందుకు యెండల లక్ష్మీనారాయణను ఎంపిక చేయడంతో ఇదే స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న సూర్యనారాయణకు నిరాశే మిగిలింది. ఈ స్థానం కోసం వీరిద్దరి మధ్య తీవ్ర పోటీ ఏర్పడిన నేపథ్యంలో అధిష్టానం యెండల వైపే మొగ్గుచూపింది. నటి రేష్మాకు వైరా టికెట్ సినీ నటి ‘ఈ రోజుల్లో’ ఫేం రేష్మా రాథోర్‌కు వైరా టికెట్ దక్కింది. ఇల్లందుకు చెందిన రేష్మా ఈ ఏడాది ఏప్రిల్‌లో బీజేపీలో చేరారు. రాజేంద్రనగర్ స్థానానికి మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డిని అధిష్టానం ఎంపిక చేయడంతో ఇదే స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్ శ్రీనివాస్ తండ్రి తోకల శ్రీశైలంరెడ్డికి నిరాశే ఎదురైంది. 5 ఎస్టీ, 2 ఎస్సీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటుగా చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, మలక్‌పేట్, బహదూర్ పురలో బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. -
కర్ణాటక ఎన్నికలు: కాంగ్రెస్ పార్టీ కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కీలకమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్ల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ నివాసంలో శనివారం పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమైంది. కర్ణాటక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల జాబితాపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఈ భేటీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు కీలక నేతలు హాజరయ్యారు. కర్ణాటక కాంగ్రెస్ నేతల మధ్య విభేదాల కారణంగా ఆ పార్టీ అభ్యర్థుల జాబితా ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే. ముందుగా ప్రకటించిన ప్రకారం 180మంది అభ్యర్థులతో తొలి జాబితాను శుక్రవారం విడుదల చేయాల్సి ఉంది. అయితే, పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అధ్యక్షతన రెండుసార్లు సమావేశమైనప్పటికీ అభ్యర్థుల విషయంలో ఏకాభిప్రాయం సాధ్యం కాలేదని, శనివారం మరోసారి భేటీ కానున్నామని సీఎం సిద్దరామయ్య ఇప్పటికే తెలిపారు. పార్టీ సీనియర్ నేతలంతా ఎవరికి వారు సొంత జాబితా తయారుచేసుకొని రావడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన జేడీఎస్, బీజేపీ, స్వతంత్ర ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడంపై కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నట్టు సమాచారం. సీఎం సిద్దరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు పరమేశ్వర, కొందరు సీనియర్ మంత్రుల కుటుంబసభ్యులకు టికెట్లు ఇస్తుండటంపైనా కాంగ్రెస్‌లో విభేదాలు భగ్గమంటున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ప్రాధాన్యం సంతరించుకుంది. -
ముంచుకొస్తున్న ఎన్నికలు.. బీజేపీ కీలక భేటీ!
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఉప ఎన్నికల్లో ఓటమి, త్వరలో కీలకమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది అత్యంత కీలకమైన లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయింది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్‌షాతోపాటు బీజేపీ అగ్రనేతలు పాల్గొన్నారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్, కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప తదితర ముఖ్యనేతలు ఈ భేటీకి హాజరయ్యారు. కర్ణాటక ఎన్నికలు, వచ్చే ఏడాది జరగనున్న కీలక ఎన్నికల విషయమై చర్చించి.. ఈ భేటీలో బీజేపీ అగ్రనేతలు పలు విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముందని భావిస్తున్నారు. -
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం
న్యూఢిల్లీ: బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆదివారం సాయంత్రం సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సమావేశానికి హాజరయ్యారు. త్వరలో జరిగే జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై చర్చలు జరిపారు. ఈ రెండు రాష్ట్రాల షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.