
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా కసరత్తు ముగిసింది. బుధవారం హస్తినలో ఐదు గంటలపాటు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. అలాగే వామపక్షాలతో పొత్తులపై కమిటీ చర్చించినట్లు సమాచారం.
ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సోనియా గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, భట్టి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే పాల్గొన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాందీద ఈ భేటీకి హాజరు కాలేకపోయారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే తొలి విడతలో 55 మంది అభ్యర్థులను ప్రకటించింది హస్తం పార్టీ. పొత్తులో భాగంగా.. నాలుగు సీట్లను వామపక్షాలకు కేటాయించిన కాంగ్రెస్ మరో 60 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment