40 మంది పేర్లను ఖరారు చేసిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈసారి కూడా కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ(సీఈసీ) ఢిల్లీలో సమావేశమైంది. 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి 60 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. పోటీ చేసే 40 మంది అభ్యర్థుల పేర్లను సీఈసీ గురువారం రాత్రి ఖరారు చేసింది. అభ్యర్ధులను నేడు ప్రకటించనుంది హస్తం పార్టీ..
ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయా, లక్షద్వీప్‌కు సంబంధించి పలు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. సీఈసీ సమావేశంలో ఖర్గే, సోనియా గాం«దీ, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. కేరళలో తమ పార్టీ 16 స్థానాల్లో పోటీ చేయబోతోందని కాంగ్రెస్ నేత వి.డి.సతీశన్ చెప్పారు. తమ మిత్రపక్షాలకు 4 స్థానాలు కేటాయించామన్నారు.
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భుపేష్ బఘేల్ రాజ్‌నంద్‌గావ్ నుంచి, మాజీ మంత్రి తామ్రధ్వజ్ సాహూ మహసముంద్ నుంచి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అభ్యరి్థత్వం సైతం ఖరారైంది. రాహుల్ గాంధీ వయనాడ్‌తోపాటు ఉత్తరప్రదేశ్‌లోని ఆమేథీ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాయ్‌బరేలీ నుంచి ఈసారి ప్రియాంకాగాంధీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. 2019 నాటి ఎన్నికల్లో ఆమేథీ నుంచి ఓడిపోయిన రాహుల్ గాంధీ వయనాడ్‌లో గెలిచిన సంగతి తెలిసిందే. తొలి జాబితాను త్వరలో అధికారికంగా విడుదల చేస్తామని కాంగ్రెస్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment