candidate selection
-
టీడీపీ నేతకే ఇచ్చేసేనా?
సాక్షి, మచిలీపట్నం: కృష్ణాజిల్లా అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థి ఎంపికపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయోమయంలో పడ్డారు. ఇక్కడ పార్టీలోని ఆశావహులను కాదని టీడీపీ నేతల వైపు ఆయన చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూరుస్తూ జనసేన రోజుకో పేరుతో ఫోన్ సర్వేలు చేయిస్తుండడం పార్టీ శ్రేణుల్లో అసహనం పెంచుతోంది. గతనెలలో జనసేనలో చేరిన అవనిగడ్డకు చెందిన కాంట్రాక్టర్ విక్కుర్తి శ్రీనుతోపాటు ఎడ్లంకకు చెందిన ఎన్ఆర్ఐ బొబ్బా గోవర్ధన్, జనసేన ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, జనసేన మచిలీపట్నం నియోజకవర్గ కన్వినర్ బండి రామకృష్ణ ఈ సీటును ఆశిస్తున్నారు. బండ్రెడ్డి రామకృష్ణ సొంతూరు నాగాయలంక మండలం మర్రిపాలెం. ఈయన తొలి నుంచీ పార్టీలో ఉన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షుడిగా ఇంతకాలం పార్టీకి సేవలందించానని తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే బందరు అసెంబ్లీ టికెట్ టీడీపీకి కేటాయించడంతో తనకు అవనిగడ్డలో అవకాశం ఇవ్వాలని బండి రామకృష్ణ అడుగుతున్నారు. ఎన్ఆర్ఐ బొబ్బా గోవర్ధన్ ఇంగ్లాండ్‌లో ఉద్యోగం చేసుకుంటూ.. హోటల్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇంత వరకు పార్టీలో చేరలేదు. టికెట్‌పై స్పష్టమైన హామీ ఇస్తే చేరతానని చెబుతున్నట్టు సమాచారం. బాపట్ల జిల్లాకు చెందిన సర్పంచ్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు కూడా అవనిగడ్డ టికెట్ కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు. రేసులో ముందున్న టీడీపీ నేతలు ఈ సీటు కోసం జనసేన నుంచి టీడీపీ నేతలూ పోటీ పడుతున్నారు. ఇక్కడ వంగవీటి రాధాకృష్ణను బరిలోకి దించుతారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇక్కడ మండలి బుద్ధప్రసాద్‌కే టికెట్ ఇవ్వాలని టీడీపీ నేతలు రాజీనామాలు చేస్తున్నారు. -
వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎంపికపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ తరఫున వరంగల్ ఎంపీ స్థానానికి బలమైన అభ్యర్థిని బరిలో దించేదిశగా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. బీఆర్ ఎస్ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొని తన తండ్రి కడియం శ్రీహ రితో కలిసి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తి చెంది, బీఆర్ ఎస్ అధికారం కోల్పోగానే పార్టీకి దూరమైన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో బీఆర్ఎస్ వర్గా లు సంప్రదింపులు ప్రారంభించినట్టు తెలిసింది. అయితే తన అనుచరులతో భేటీ అయిన తర్వాత తిరిగి పార్టీలోకి రావడంపై స్పష్టత ఇస్తానని రాజ య్య చెప్పినట్టు సమాచారం. ఓ వైపు రాజయ్యను తిరిగి పార్టీలోకి తీసుకొని ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపడంపై కసరత్తు చేస్తూనే, మరోవైపు ఇతర ప్రత్యామ్నాయాలను కేసీఆర్ అన్వేషిస్తున్నట్టు సమా చారం. పార్టీ తరపున టికెట్ ఆశించిన బోడ డిన్న, నిరంజన్, జింక రమేశ్ తదితరులు తమవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు హనుమ కొండ జిల్లా పరిషత్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి భార్య, జెడ్పీటీసీ సభ్యురాలు పెద్ది స్వప్న తదితరుల పేర్లు కూడా తెరమీదకు వస్తున్నాయి. ఇదిలాఉంటే తన అను చరులతో కడియం శ్రీహరి శనివారం హైదరాబా ద్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా స్టేషన్ఘనపూర్ నేతలతో నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం సమావేశం ఏర్పాటు చేసింది. -
‘జగనైక’ విజయం 2.0...రేసుగుర్రాలు ‘సిద్ధం’
సాక్షి,అమరావతి: సామాజిక న్యాయాన్ని కేవలం మాటల్లోనే కాక చేతల్లోనూ చేసి చూపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ పదేపదే స్పష్టం చేసిన ఆయన అదే నినాదాన్ని అక్షరసత్యం చేశారు. 50 శాతం సీట్లు బడుగు బలహీనవర్గాలకు కేటాయించారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలు కలిపి 200 మొత్తం సీట్లకు 100 సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చి తాను విశ్వసనీయతకు మారుపేరని మరోమారు చాటుకున్నారు. ఈ నిర్ణయం అనన్యసామాన్యం.. అనితర సాధ్యం. ఇది ఇప్పటివరకు ఎవరూ సాహసించని అరుదైన ఘట్టంగా చరిత్రలో నిలిచిపోతోంది. ఒక్క అనకాపల్లి పార్లమెంట్ స్థానం మినహా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు శనివారం ఇడుపులపాయ వేదికగా, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పవిత్ర సమాధి సాక్షిగా వైఎస్సార్ సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభ్యర్థులను ప్రకటించారు. జనబలమే గీటురాయిగా అభ్యర్థులను ఎంపిక చేశారు. సామాజిక సమతూకం పాటించారు. బీసీలకు, మహిళలకు అగ్రతాంబూలం ఇచ్చారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెనుకబడిన వర్గాల వారి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే తాను మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తానని చెప్పిన మాటను సీఎం జగన్ నిబబెట్టుకున్నారు. మొత్తం 175 శాసనసభా స్థానాల్లో 48 మంది బీసీలకు అవకాశం కల్పించారు. మొత్తం 25 లోక్‌సభ సీట్లలో బీసీలకు 11 సీట్లు ఇచ్చారు. భవిష్యత్తులోనూ తాను బడుగు, బలహీనవర్గాల వెన్నంటే ఉంటానని, వారే నా బలం.. నా బలగం అని చాటిచెప్పారు. టీడీపీ అగ్రజులపై బీసీల పోటీ కుప్పంలో చంద్రబాబుపై వన్నికుల క్షత్రియకు చెందిన కేఆర్జే భరత్, మంగళగిరిలో నారా లోకేశ్‌పై పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన మురుగుడు లావణ్య పోటీ చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణపై కురుబ సామాజిక వర్గానికి చెందిన టీజీఎన్ దీపిక పోటీకి దిగుతున్నారు. వీరు ముగ్గురూ బీసీలే కావటం విశేషం. గత ఎన్నికల్లోనూ బడుగు, బలహీనవర్గాలకు ప్రాధాన్యం గత ఎన్నికల్లోనూ ప్రాధాన్యం వైఎస్సార్ సీపీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ప్రాధాన్యం ఇచ్చింది. ఎస్సీలకు 29, ఎస్టీలకు 7, బీసీలకు 41 శాసనసభ స్థానాల్లో అవకాశం కల్పించింది. ఇందులో మహిళలకు 15, మైనార్టీలకు 5 స్థానాల్లో అవకాశం ఇచ్చింది. 2019 ఎన్నికల కంటే ఇప్పుడు శాసనసభ స్థానాల్లో మహిళలకు నాలుగు, మైనార్టీలకు రెండు స్థానాలు అదనంగా కేటాయించింది. పార్లమెంటు స్థానాల విషయానికి వస్తే గత ఎన్నికల్లో ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, బీసీలకు 7 లోక్‌సభ స్థానాల్లో సీఎం జగన్ అవకాశం ఇచ్చారు. గత ఎన్నికల్లో లోక్‌సభ స్థానాల్లో మహిళలకు నాలుగు చోట్ల అవకాశం కల్పిస్తే ఇప్పుడు ఐదు నియోజకవర్గాలు కేటాయించారు. సామాజిక న్యాయం, జనులకు సుపరిపాలనే లక్ష్యంగా సీఎం జగన్ అభ్యర్థులను ఎంపిక చేశారని రాజకీయ విశ్లేషకులు సైతం ప్రశంసిస్తున్నారు. తన రాజకీయ భవిష్యత్తునూ పణంగా పెట్టి ఇంతలా బీసీల కోసం నిలబడిన నేత మరొకరు లేరని శ్లాఘిసు్తన్నారు. డబ్బు, పొత్తులు, ఎత్తులను నమ్ముకొని ఎన్నికల క్షేత్రానికి వచ్చే టీడీపీ, బీజేపీ, జనసేన లాంటి పెట్టిబడి పార్టీలకు సీఎం జగన్ నిర్ణయం గొడ్డలిపెట్టు అని మేధావులు అభివర్ణిస్తున్నారు. ప్రతిపక్ష కూటమి బీసీలకు ఇచ్చింది 25 సీట్లే వైఎస్సార్ సీపీ బీసీలకు 48 సీట్లు కేటాయిస్తే ఇప్పటివరకు ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 135 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా, అందులో బీసీలకు కేవలం 25 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. సీఎం చెప్పారంటే.. చేస్తారంతే.. సీఎం జగన్ చెప్పారంటే ... చెస్తారంతే అనే నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య ఓ సభలో మాట్లాడుతూ ‘‘సీఎం జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సమస్యలు ఏవైనా ఉంటే తక్షణం పరిష్కారానికి పూనుకునే వారు. ఇప్పుడు సీఎం జగన్ కూడా బీసీలు, మహిళలు, పేదల ఉజ్వల భవిత కోసం పరితపిస్తున్నారు. బడుగు, బలహీనవర్గాల సాధికారత దిశగా కృషి చేస్తున్నారు. ఆయన చెప్పిందే చేస్తున్నారు. ఆయన వెంట నడవాల్సిన బాధ్యత మన బీసీలతోపాటు అన్ని కులాలు, అన్నివర్గాలపైనా ఉంది. 2024 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్, బీజేపీ ప్రలోభాలకు లొంగవద్దు’’ అన్నారు. ఇప్పుడు కృష్ణయ్య మాటలను నిజం చేస్తూ సీఎం జగన్ అభ్యర్థుల ప్రకటనల్లో బీసీలకు, మహిళలకు పూర్తి న్యాయం చేశారు. కనుక ఇక వైఎస్సార్సీపీకి మద్దతునిచ్చే బాధ్యత బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపైనే ఉందనే అభిప్రాయం సర్వత్రా వెల్లడవుతోంది. -
నేడు కాంగ్రెస్ తొలి జాబితా.. మళ్లీ వయనాడ్ నుంచే రాహుల్
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈసారి కూడా కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ(సీఈసీ) ఢిల్లీలో సమావేశమైంది. 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి 60 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. పోటీ చేసే 40 మంది అభ్యర్థుల పేర్లను సీఈసీ గురువారం రాత్రి ఖరారు చేసింది. అభ్యర్ధులను నేడు ప్రకటించనుంది హస్తం పార్టీ.. ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయా, లక్షద్వీప్‌కు సంబంధించి పలు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. సీఈసీ సమావేశంలో ఖర్గే, సోనియా గాం«దీ, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. కేరళలో తమ పార్టీ 16 స్థానాల్లో పోటీ చేయబోతోందని కాంగ్రెస్ నేత వి.డి.సతీశన్ చెప్పారు. తమ మిత్రపక్షాలకు 4 స్థానాలు కేటాయించామన్నారు. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భుపేష్ బఘేల్ రాజ్‌నంద్‌గావ్ నుంచి, మాజీ మంత్రి తామ్రధ్వజ్ సాహూ మహసముంద్ నుంచి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అభ్యరి్థత్వం సైతం ఖరారైంది. రాహుల్ గాంధీ వయనాడ్‌తోపాటు ఉత్తరప్రదేశ్‌లోని ఆమేథీ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాయ్‌బరేలీ నుంచి ఈసారి ప్రియాంకాగాంధీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. 2019 నాటి ఎన్నికల్లో ఆమేథీ నుంచి ఓడిపోయిన రాహుల్ గాంధీ వయనాడ్‌లో గెలిచిన సంగతి తెలిసిందే. తొలి జాబితాను త్వరలో అధికారికంగా విడుదల చేస్తామని కాంగ్రెస్ వెల్లడించింది. -
బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
సాక్షి, అమరావతి: రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు బీజేపీ శ్రీకారం చుట్టింది. ఇందుకోసంజాతీయ నాయకత్వం సూచనల మేరకు కేంద్ర పార్టీ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాష్ ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చారు. ఆయన శనివారం జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశమై, ఆ జిల్లాలోని ప్రతి అసెంబ్లీ, లోక్‌సభ స్థానం కోసం ముగ్గురు చొప్పున ప్రతిపాదిత అభ్యర్థుల జాబితాలను తీసుకున్నారు. ఆ జాబితాలోనూ మొదటి, రెండు, మూడవ ప్రాధాన్యతగా ఏ నేతల పేర్లను ఆయా జిల్లా కమిటీలు సూచిస్తున్నాయో అడిగి తెలుసుకుని మరీ జాబితాను సిద్ధం చేసుకున్నారు. అదేవిధంగా శివప్రకాష్తోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర సంఘటనా కార్యదర్శి మధుకర్‌లతో కూడిన కమిటీ విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జిల్లాల వారీగా పార్టీ నేతలతో ఈ సమావేశాలు నిర్వహించింది. తొలి రోజు రాయలసీమ నాలుగు జిల్లాల పరిధిలోని 8 లోక్‌సభ స్థానాలు, ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలోని 5 లోక్‌సభ స్థానాలతో పాటు నరసరావుపేటతో కలిపి మొత్తం 14 లోక్‌సభ స్థానాలు, వాటి పరిధిలోని 98 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి సంబంధించి ముగ్గురు చొప్పున∙ప్రతిపాదిత అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని తెలిసింది. మిగిలిన 11 లోక్‌సభ స్థానాలు, వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు ఈ తరహాలోనే ముగ్గురు చొప్పున ప్రతిపాదిత అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేసేందుకు ఆదివారం ఆయా జిల్లాల నాయకులతో సమావేశాలు కొనసాగనున్నాయి. కాగా, ఈ సమావేశాల్లో పొత్తులకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ చెప్పారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పొత్తుల వ్యవహారం ఏదైనా ఉంటే పార్టీ అధిష్టానం చూసుకుంటుందని స్పష్టం చేశారు. -
ఎస్ఐ అభ్యర్థుల ఎంపిక జాబితా విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్ఐ పోస్టులకు ఎంపికైనవారి జాబితాను రాష్ట్ర పోలీసు నియామక మండలి శుక్రవారం ప్రకటించింది. అత్యంత పారదర్శకంగా అభ్యర్థుల ప్రతిభ, రిజర్వేషన్ల ప్రకారం సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో మొత్తం 411 ఎస్ఐ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. 315 సివిల్ ఎస్ఐ (పురుషులు, మహిళలు), 96 ఏపీఎస్పీ ఎస్ఐ (పురుషులు) పోస్టులకు రాత పరీక్షల ఫలితాల అనంతరం నాలుగు జోన్ల వారీగా మెరిట్ జాబితాను ప్రకటించింది. సివిల్ ఎస్ఐ పోస్టులకు ఏకంగా 102 మంది మహిళలు ఎంపికవ్వడం విశేషం. మొత్తం సివిల్ ఎస్ఐ పోస్టులకు సంబంధించి విశాఖపట్నం జోన్లో 50, ఏలూరులో 105, గుంటూరులో 55, కర్నూలులో 105 మందిని ఎంపిక చేశారు. టాపర్లు వీరే.. సివిల్ ఎస్ఐ పురుషుల విభాగంలో గోనబోయిన విజయభాస్కరరావు (రి.నం. 5033539) 400 మార్కులకు గాను 284 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు. ఈయన ఏలూరు జోన్‌కు ఎంపికయ్యారు. మహిళల్లో లోగిసా కృష్ణవేణి (రి.నం.5052468) 273 మార్కులతో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. ఏపీఎస్పీ విభాగంలో రానెల్లి కోటారావు (రి.నం.5036787) 300 మార్కులకు గాను 190.5 మార్కులతో ప్రథమ స్థానం సాధించారు. త్వరలో పోలీసు నియామక మండలి ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలతోపాటు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేపట్టనుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఎంపికైన అభ్యర్థులకు అనంతపురంలోని ఏపీ పోలీసు అకాడమీలో శిక్షణ ఇవ్వనుంది. సంక్రాంతి తర్వాత శిక్షణ ఉండొచ్చని పోలీసు నియామక మండలి తెలిపింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను https://slprb.ap.gov.in/ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ప్రతిభ, రోస్టర్ ప్రకారం.. రాష్ట్రంలో 411 ఎస్ఐ పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ ఇవ్వగా 1,73,047 దరఖాస్తులు వచ్చాయి. 1,40,453 మంది పురుషులు, 32,594 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 19న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో 1,51,288 మంది పరీక్ష రాస్తే 57,923 మంది (38.28 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించగా 31,193 మంది తుది రాత (మెయిన్స్) పరీక్షకు ఎంపికయ్యారు. అక్టోబర్ 14, 15 తేదీల్లో తుది పరీక్ష జరగ్గా ఈ నెల 6న ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 18,637 మంది అర్హత సాధించారు. వీరిలో ప్రతిభావంతుల జాబితాను రూపొందించి రోస్టర్ ప్రకారం మెరిట్లో నిలిచిన 411 మంది అభ్యర్థులను పోలీసు నియామక మండలి ఎస్ఐ పోస్టులకు ఎంపిక చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌తో పాటు ప్రత్యేక కోటా రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థుల తుది ఎంపికలు చేపట్టింది. పోలీస్ ఎగ్జిక్యూటివ్ (పీఈ)కు 2 శాతం, ఎన్సీసీకి 3 శాతం, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ (ఎంఎస్పీ)కు 2 శాతం, పోలీసు సిబ్బంది పిల్లలు (సీపీపీ)కు 2 శాతం, సీడీఐకి 2 శాతం, పోలీసు మినిస్టీరియల్ (పీఎం)కు 1 శాతం రిజర్వేషన్ కల్పించింది. -
US presidential election 2024: రిపబ్లికన్ రేస్ షురూ
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయముంది. 2024 నవంబర్ 5న పోలింగ్ జరగనుంది. కానీ రెండు ప్రధాన పక్షాల్లో ఒకటైన విపక్ష రిపబ్లికన్ పార్టీ ఇప్పటికే బరిలో దిగింది. పార్టీ అభ్యర్థిని నిర్ణయించే సుదీర్ఘమైన ఎంపిక ప్రక్రియకు బుధవారమే శ్రీకారం చుడుతోంది. ఇప్పటికైతే వివాదాస్పద మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రేసులో అందరి కంటే ముందున్నారు. ఇంకా చెప్పాలంటే ఆయన వైపే స్పష్టమైన మొగ్గుంది. అయినా సరే, ట్రంప్‌నకు ఎంతో కొంత పోటీ ఇస్తారని భావిస్తున్న ఫ్లోరిడా గవర్నర్ డి శాంటిస్తోపాటు మరో ఏడుగురు ఆశావహులు బరిలో దిగి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. తొలి రౌండ్ డిబేట్ ఎప్పుడు? ► బుధవారం రాత్రి 9 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) వేదిక: రాజకీయంగా అతి కీలకమైన విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీలో ► రెండో రౌండ్ డిబేట్ సెపె్టంబర్ 27న కాలిఫోరి్నయాలో జరుగుతుంది. అర్హత... అంత సులభం కాదు రిపబ్లికన్ అభ్యరి్థత్వ బరిలో నిలవడం అంత సులువేమీ కాదు. అందుకు పార్టీ నేషనల్ కమిటీ పెట్టే ఎన్నో నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. మరెన్నో పార్టీపరమైన పరీక్షల్లో నెగ్గాల్సి ఉంటుంది. ► లేదంటే కనీసం రెండు నేషనల్ పోల్స్‌తో పాటు అయోవా వంటి ఒక అర్లీ ప్రెసిడెన్షియల్ ప్రైమరీలో కనీసం 1 శాతం ఓట్లు సాధించాలి. ► ప్రచారం కోసం కనీసం 40 వేల మంది నుంచి విడివిడిగా విరాళాలు సేకరించాలి. ► మూడు విడివిడి నేషనల్ పోల్స్‌లో కనీసం 1 శాతం ఓట్లు సాధించాలి. ► అంతిమంగా నెగ్గి రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో దిగే అభ్యరి్థకి పూర్తి మద్దతిస్తామని ప్రమాణ పత్రం మీద సంతకం చేయాలి. అయితే రేసులో ముందున్న ట్రంప్ మాత్రం ఇలా సంతకం చేయకపోగా, తిరస్కరించడం విశేషం! డిబేట్లో వీరే... 1. టిమ్ స్కౌట్ (దక్షిణకరోలినా సెనేటర్) 2. డి శాంటిస్ (ఫ్లోరిడా గవర్నర్) 3. నిక్కీ హేలీ (ఐరాసలో అమెరికా మాజీ రాయబారి) 4. వివేక్ రామస్వామి (భారత సంతతి వ్యాపారవేత్త) 5. క్రిస్ క్రిస్టీ (న్యూజెర్సీ మాజీ గవర్నర్) 6. మైక్ పెన్స్ (మాజీ ఉపాధ్యక్షుడు) 7. డౌగ్ బర్గం (నార్త్ డకోటా గవర్నర్) 8. అసా అచిన్ సన్ (అర్కన్సాస్ మాజీ గవర్నర్) ఏం ఒరిగేను? రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్‌నకు మద్దతు వెల్లువెత్తుతోందనే చెప్పాలి. తమ అభ్యర్థి ఆయనేనని సీబీఎస్, యూగవ్ గత వారం చేసిన పోల్‌లో ఏకంగా 62 శాతం రిపబ్లికన్ ఓటర్లు కుండబద్దలు కొట్టారు. అలాంటప్పుడు ఈ డిబేట్లతో పార్టీ సాధించేది ఏముంటుందని ప్రశ్నిస్తున్న వాళ్లూ ఉన్నారు. కానీ ఆశావహులు డిబేట్లలో ట్రంప్‌ను గుడ్డిగా వ్యతిరేకించడం కాకుండా తమకు ఎందుకు ఛాన్స్ ఇవ్వాలో సమర్థంగా చెప్పగలగాలని అదే సర్వేలో ఏకంగా 91 శాతం స్పష్టం చేశారు. కనుక ఏమైనా జరగొచ్చని, చివరికి అనూహ్యంగా ఎవరైనా అధ్యక్ష అభ్యర్థి కావచ్చని అంటున్న వారికీ కొదవ లేదు. కొసమెరుపు రేసులో అందరి కంటే ముందున్న డొనాల్డ్ ట్రంప్ మాత్రం తొలి రౌండ్ డిబేట్లో పాల్గొనడం లేదు. ‘నాకున్న పాపులారిటీకి ఇలాంటి పిల్ల పందాల్లో పాల్గొనడమా? నాన్సెన్స్! నేనెవరో, అధ్యక్షునిగా ఎంత సాధించానో పార్టీ ఓటర్లందరికీ బాగా తెలుసు’’ అంటున్నారాయన! అయితే, సరిగ్గా డిబేట్ల సమయానికే ప్రి రికార్డెడ్ ఇంటర్వ్యూ ప్రసారమయ్యేలా ట్రంప్ ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై క్లారిటీ వచ్చేసిందా..? ప్రకటన అప్పుడేనా?
సాక్షి, హైదరాబాద్/నల్గొండ: మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక సాఫీగా జరుగుతుందా? టిక్కెట్ రాని ఆశావహుల్ని దారికి తెచ్చుకోగలుగుతారా? గాంధీభవన్‌లో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. అభ్యర్థి ఎంపికపై అనేకసార్లు మీటింగులు జరుగుతున్నాయి. నలుగురు ఆశావహులతో కూడా భేటీలు నిర్వహించారు. అభ్యర్థి ఎంపికపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఇక పీసీసీ స్థాయిలో తేలదని తేలిపోయింది. ఎంపిక బాధ్యతను హైకమాండ్ మీదికి నెట్టేసి కూల్ అయిపోయారు టీ కాంగ్రెస్ నాయకులు.. చదవండి: మునుగోడులో బీజేపీకి బూస్ట్ ఎప్పుడు ప్రకటిస్తారు? మునుగోడు ఉప ఎన్నికపై అందరికంటే ముందే స్పందించింది కాంగ్రెస్ పార్టీ.. ఉప ఎన్నికకు సిద్ధం అవుతున్నామంటూ రేవంత్ రెడ్డి ఇతర పార్టీల నేతలకంటే ముందే ప్రకటించారు.. ఆ తర్వాత మునుగోడు నియోజకవర్గ పార్టీ మీటింగ్ నిర్వహించి ఎన్నికకు శంఖారావం కూడా పూరించారు. అభ్యర్థిని కూడా ఈ నెలాఖరుకు ప్రకటిస్తామని టీపీసీసీ తెలిపింది. నెలాఖరు అయిపోయింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇండియాలోనే లేరు. చికిత్స కోసం మొత్తం కుటుంబం అంతా విదేశాలకు వెళ్ళింది. ఇంతకీ అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తారు? ఎటూ తేల్చుకోలేక.. మునుగోడు అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇప్పటికే పదుల సార్లు గాంధీభవన్‌లో సమీక్షలు నిర్వహించింది హస్తం పార్టీ. మరో వైపు నేతలందరి అభిప్రాయమూ సేకరించారు. ఇంకో వైపు సునీల్ కనుగోలు సర్వే రిపోర్ట్ ఇచ్చినా అభ్యర్థిని తేల్చే విషయంలో కాంగ్రెస్ తర్జనభర్జనలు పడుతోంది. అభ్యర్థిని ప్రకటించకపోవడం వల్ల మునుగోడులో పార్టీ క్యాడర్ చే జారిపోతుందనే ఆందోళన అక్కడి పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఓ వైపు బీజేపీ, మరోవైపు టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌కు దిగుతున్నాయి. దీంతో కాంగ్రెస్ క్యాడర్ అంతా చెల్లా చెదురు అవుతోంది. అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఆశావాహ నేతలంతా తమకేమీ పట్టనట్లుగా ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో మునుగోడులో కాంగ్రెస్ క్యాడర్ ఖాళీ అవుతుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికిప్పుడు ప్రకటించినా.. మరోవైపు వ్యూహాత్మకంగానే అభ్యర్థిని ప్రకటించడం లేదనే చర్చ కాంగ్రెస్‌లో నడుస్తోంది. టిక్కెట్ రాని నేతల్ని చేర్చుకునేందుకు టీఆర్ఎస్, బీజేపీ రెడీగా ఉన్నాయి. దీంతో ఎన్నికల షెడ్యూల్ రాకముందే అభ్యర్థిని ప్రకటిస్తే అసంతృప్తి చాలా కాలం కొనసాగి పరిస్థితి చేజారి పోయే ప్రమాదం ఉందని, అందుకే టీఆర్ఎస్ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించిన తర్వాతే కాంగ్రెస్ అభ్యర్ధిని ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ప్రకటించినా.. కొద్ది రోజుల తర్వాత ప్రకటించినా పెద్ద తేడా ఏమీ ఉండదని, కేంద్రం, రాష్ట్రంలోని రెండు అధికార పార్టీలు నయానో, భయానో తమ నేతల్ని, కార్యకర్తల్ని లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆశావాహుల్లో టెన్షన్.. ఇప్పటికే టిక్కెట్ ఆశిస్తున్న నలుగురు ఆశావహ నేతలతో గాంధీభవన్‌లో సమావేశం నిర్వహించారు. తమ అభిప్రాయాలను సీల్డ్ కవర్లో ఢిల్లీకి పంపించారు టీపీసీసీ నేతలు. మంగళవారం నాడు గాంధీ భవన్లో పార్టీ ముఖ్యనేతలు, మునుగోడు మండల ఇంఛార్జ్‌లతో కూడా సమావేశం నిర్వహించారు. అభ్యర్థిని ప్రకటించే బాధ్యత హైకమాండ్‌దే అంటున్నారు టీపీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి. అయితే ఆశావాహుల్లో మాత్రం టెన్షన్ కొనసాగుతోంది. వీలైనంత తొందరగా అభ్యర్థిని ప్రకటించి క్యాడర్‌ను కాపాడుకోవాలని కోరుతున్నారు. -
హుజూరాబాద్.. నాలుగు ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో రాష్ట్రస్థాయిలో పలు అభిప్రాయాలు వచ్చినందున అభ్యర్థి ఎంపిక వ్యవహారాన్ని అధిష్టానం కోర్టులోకి నెట్టింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ నాలుగురోజుల పాటు రాష్ట్రంలో ఉన్నా అభ్యర్థి ఖరారు కాకపోవడంతో దామోదర రాజనర్సింహ నేతృత్వంలోని ఎన్నికల కమిటీ నాలుగు పేర్లను అధిష్టానం పరిశీలనకు పంపినట్టు తెలుస్తోంది. ఇందులో మాజీ మంత్రి కొండాసురేఖ పేరు మొదటి వరుసలో ఉండగా, ఆ తర్వాత కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, స్థానిక నేతలు పత్తి కృష్ణారెడ్డి, తిప్పారపు సంపత్ పేర్లు ఉన్నాయి. సురేఖ పేరు ఖరారైనా... వాస్తవానికి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొండా సురేఖ పేరు దాదాపు ఖరారైంది. ఈనెల 18న రావిర్యాలలో జరిగిన సభలో ఆమె పేరును ప్రకటిస్తారని, మరుసటి రోజున సురేఖ పుట్టినరోజు వేడుకలను హుజూరాబాద్ కేంద్రంగా జరుపుకుంటారనే చర్చ జరిగింది. కానీ, అలా జరగలేదు. ఇందుకు స్థానిక అభ్యర్థిని పోటీలో ఉంచాలనే డిమాండ్ గట్టిగా వినిపించడమే కారణమని తెలుస్తోంది. మహిళతోపాటు నియోజకవర్గంలో పెద్దసంఖ్యలోనే ఉన్న మున్నూరుకాపు, పద్మశాలీ ఓట్లు పడతాయనే కోణంలో సురేఖ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినప్పటికీ ఆ తర్వాత పార్టీలో పలు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ అభ్యర్థి అయితే మహిళాస్త్రం ఉపయోగపడుతుందని, కానీ, బీజేపీ తమ అభ్యర్థిగా రాజేందర్ సతీమణి జమునను ఖరారు చేస్తే సురేఖ ఎంపిక టీఆర్ఎస్కు మేలు చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతోపాటు ముగ్గురూ బీసీ అభ్యర్థులే అయితే ఇతర వర్గాల ఓట్లను టీఆర్ఎస్ సులువుగా మేనేజ్ చేయగలుగుతుందనే వాదన కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీలు బీసీ అభ్యర్థిని దింపుతున్నందున కాంగ్రెస్ పక్షాన ఎస్సీ అభ్యర్థిని నిలపాలని, అప్పుడు దళితబంధు ఓట్లను కూడా గంపగుత్తగా టీఆర్ఎస్కు పడకుండా అడ్డుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ పేరు పరిశీలనకు వచ్చింది. ఈయనకు తోడు స్థానిక నేతలు పత్తి కృష్ణారెడ్డి, తిప్పారపు సంపత్‌లతో పాటు పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు కొమురయ్య అభ్యర్థిత్వాలపై కూడా దామోదర రాజనర్సింహతో మాణిక్యం ఠాగూర్ చర్చించినట్టు తెలిసింది. వీరిలో సురేఖ, సత్యనారాయణలలో ఒకరిని హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్టానం రెండు, మూడు రోజుల్లోపు ప్రకటిస్తుందని గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి. -
‘సాగర్’ అభ్యర్థిగా మళ్లీ యాదవులకే చాన్స్!
సాక్షి, హైదరాబాద్: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక షెడ్యూలు వెలువడుతుందని భావించినా.. నేటికీ స్పష్టత రావట్లేదు. ఎన్నికల షెడ్యూల్‌తో సంబంధం లేకుండా 3 నెలలుగా క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్ఎస్లో అభ్యర్థి ఎంపిక కసరత్తు ఇంకా కొనసాగుతోంది. తాజాగా కొత్తపేర్లు తెరపైకి వచ్చాయి. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుటుంబీకులకే టికెట్ ఇస్తారని, ఆయన కుమారుడు భగత్‌కు పోటీచేసే అవకాశం ఉందని మొదట్లో ప్రచారం జరిగింది. ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, స్థానిక నేత కోటిరెడ్డి పేర్లు సైతం పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో వినిపించింది. ఈ ముగ్గురి అభ్యర్థిత్వానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, పార్టీ నేతల నుంచి కేసీఆర్ సేకరించి వివిధ కోణాల్లో విశ్లేషించినట్లు సమాచారం. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎదురయ్యే పోటీ, రెండు జాతీయ పార్టీల నుంచి పోటీ చేసే అవకాశమున్న ఆశావహులు, వారి బలాబలాలు... తదితర అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థిని ఎంపిక చేయాలనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు. వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్న కేసీఆర్ అభ్యర్థి ఖరారు విషయంలో మాత్రం ఆచితూచి అడుగువేస్తున్నట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ప్రచార ఇన్‌చార్జీలుగా ఎమ్మెల్యేలు ఓ వైపు దీటైన అభ్యర్థి కోసం అన్వేషణ సాగిస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోవైపు క్షేత్రస్థాయి ప్రచారంలో పార్టీ వెనుకబడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదివరకే మండలాల వారీగా పార్టీ ఇన్చార్జిలను నియమించి కార్యకర్తలతో టీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు నిర్వహించింది. గత నెల 10న ముఖ్యమంత్రి కేసీఆర్ సాగర్ నియోజకవర్గం పరిధిలోని హాలియా బహిరంగ సభలో పాల్గొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు మూడు నెలలుగా నియోజకవర్గంలోనే మకాం వేసి పార్టీ పరిస్థితితో పాటు, కాంగ్రెస్, బీజేపీ కదలికలపై కూడా ఎప్పటికప్పుడు నివేదికలు అందజేస్తున్నారు. నేడో రేపో ఎన్నికల షెడ్యూలు వెలువడుతుందనే వార్తల నేపథ్యంలో తాజాగా పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు, ఓ మున్సిపల్ మేయర్‌కు క్షేత్రస్థాయిలో ప్రచార బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ వారిని ఇన్చార్జీలను నియమించారు. ఇన్‌చార్జీలుగా నియమితులైన ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, నల్లమోతు భాస్కర్‌రావు, భూపాల్‌రెడ్డి, కోరుకంటి చందర్, శంకర్ నాయక్, కోనేరు కోనప్ప, కరీంనగర్ మేయర్ సునీల్‌రావు తదితరులు ఇప్పటికే నియోజకవర్గానికి చేరుకుని తమకు కేటాయించిన మండలాలు, మున్సిపాలిటీల్లో పార్టీ క్రియాశీల నేతలు, సర్పంచ్‌లు, ఇతర నేతలతో సమావేశమవుతున్నారు. ఎన్నికలు ముగిసేవరకు సాగర్ నియోజకవర్గంలోనే ఉండాలని ఇన్చార్జీలను కేసీఆర్ ఆదేశించారు. కాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత మరికొందరు ఎమ్మెల్యేలకు కూడా ప్రచార బాధ్యతలు అప్పగించే అవకాశముంది. యాదవులకే చాన్స్! నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్నా అభ్యర్థి ఎంపికలో వివిధ సామాజికవర్గాలకు చెందిన ఓటర్ల గణాంకాలు కీలకంగా మారాయి. నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు కలిగిన యాదవ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దివంగత ఎమ్మెల్యే నోముల కూడా ఇదే సామాజికవర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. అయితే ఆయన కుమారుడు నోముల భగత్‌కు వేరే అవకాశం ఇవ్వాలని పార్టీ అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే యాదవ సామాజికవర్గానికి చెందిన ఇతరులకు టికెట్ కేటాయిస్తే ఎలా ఉంటుందనే కోణంలో కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం యాదవ సామాజికవర్గానికి చెందిన స్థానికులు మన్నె రంజిత్ యాదవ్, పెద్దబోయిన శ్రీనివాస్, కట్టెబోయిన గురువయ్య యాదవ్‌తో కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఆరా తీయడంతో పాటు ఈ ముగ్గురు నేతల పూర్వపరాలను తెలుసుకున్నారు. నోముల నర్సింహయ్య మరణం తర్వాత నియోజకవర్గంలో టీఆర్ఎస్ శ్రేణుల సమన్వయ బాధ్యతలు చూస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి అభిప్రాయం అభ్యర్థి ఎంపికలో కీలకమని పార్టీ నేతలు చెబుతున్నారు. -
మీ నిర్ణయం మాకు శిరోధార్యం
సాక్షి, అమరావతి : తిరుపతి ఎస్సీ రిజర్వుడు లోక్‌సభా స్థానం ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు పార్టీ అభ్యర్థి ఎంపిక బాధ్యతను వైఎస్సార్సీపీ నేతలు సీఎం వైఎస్ జగన్‌కే అప్పగించారు. గురువారం సాయంత్రం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, పలువురు మంత్రులు, తిరుపతి లోక్‌సభా స్థానం పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. అభ్యర్థి విషయంలో అందరి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిప్యూటీ సీఎం నారాయణస్వామి మీడియాతో మాట్లాడారు. తిరుపతి అభ్యర్థి విషయంలో సీఎం ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకున్నారని, అందరం ఏకగ్రీవంగా సీఎంకే ఎంపిక బాధ్యతను అప్పగించామని తెలిపారు. భారీ మెజారిటీతో గెలిపిస్తాం : కాకాణి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ విస్తృత ప్రయోజనాలు, స్థానిక పరిస్థితులపై సీఎం జగన్‌కు పూర్తి అవగాహన ఉంది కనుక అభ్యర్థి ఎంపికపై నిర్ణయాన్ని ఆయనకే వదిలిపెట్టామని చెప్పారు. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి ఎవరిని ఖరారు చేసినా అందరమూ కలసికట్టుగా పనిచేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు. అభ్యర్థి ఎవరు? అనే ప్రస్తావనే సమావేశంలో రాలేదని వెల్లడించారు. తాము కేవలం నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను సీఎంకు వివరించామన్నారు. గతంలో కన్నా ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తామని మాట ఇచ్చామన్నారు. అభ్యర్థి విషయంలో సీఎం ఏరోజు నిర్ణయం తీసుకుంటే ఆరోజు నుంచే క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగుతామని చెప్పారు. మీడియా సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, కె.ఆదిమూలం, బియ్యపు మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు జరిగిన సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, పి.అనిల్‌కుమార్, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వి.వరప్రసాద్, శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
ఎంపిక తేలేదెన్నడో..!
సాక్షిప్రతినిధి, వరంగల్: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా అభ్యర్థుల ఎంపికపై స్పష్టత రాలేదు. గెలుపు గుర్రాల జాబితా వడపోతలో తలమునకలైన ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఖరారుపై ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల్లో అధికార పార్టీకి చెందిన నేతలే ‘సిట్టింగ్’లుగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పొత్తులపై ప్రతిష్టంభన కారణంగా కూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కిరాలేదు. మరోవైపు బీజేపీ, వామపక్ష పార్టీలు సైతం అభ్యర్థులను బరిలో దింపే యోచన చేస్తుండగా... టీడీపీ వైఖరి బయటపడటం లేదు. ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అదే రోజు నుంచి నామినేషన్ల పర్వం మొదలు కానుంది. ఇందుకు మరో నాలుగు రోజులే గడువే ఉండటంతో రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తాయనేది చర్చనీయాంశంగా మారింది. జోరు మీదున్న కారు.. అభ్యర్థుల ఎంపికపై టీఆర్ఎస్ అంతర్గతంగా కసరత్తును పూర్తి చేసినట్లుగా చెప్తున్నారు. అయితే అన్ని కోణాల్లో సర్వే చేస్తున్న ఆ పార్టీ అధిష్టానం ఈసారి సిట్టింగ్‌లకే అవకాశం ఇస్తుందా? లేక మార్పులు చేర్పులు చేస్తుందా? అన్న చర్చ జరుగుతోంది. ఓవైపు పసునూరి దయాకర్ ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి ఈసారి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కడియం కావ్య పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే జనగామ ప్రాంతానికి చెందిన డాక్టర్ పగిడిపాటి సుగుణాకర్రాజుతో పాటు మాజీ ఎంపీపీ, సీనియర్ నాయకుడు రామగళ్ల పరమేశ్వర్ తదితరులు వరంగల్ టికెట్ కావాలని దరఖాస్తు చేసుకున్నారు. మహబూబాబాద్ స్థానం నుంచి ప్రొఫెసర్ సీతారాంనాయక్ ఎంపీగా ఉండగా.. ఇక్కడినుంచి అవకాశం ఇస్తే పోటీ చేసేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి రామచంద్రునాయక్, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ ఒకరు సైతం టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చాలా చోట్ల ఇప్పటికే లోక్‌సభ అభ్యర్థుల పేర్లు పరోక్షంగా ప్రకటించినా.. వరంగల్, మహబూబాబాద్ స్థానాలపై తేల్చకపోవడం చర్చనీయాంశం కాగా, టీఆర్ఎస్ జాబితా వెల్లడిలో జాప్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. మహబూబాబాద్‌లో ఈ నెల 16న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నాహక సమావేశం కూడా రద్దు చేశారు. కాంగి‘రేసు’లో ఎవరో..? కాంగ్రెస్ నుంచి వరంగల్, మహబూబాబాద్ స్థానాల కోసం 77 మంది టిక్కెట్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. ఎవరికి ఆ టికెట్ దక్కుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలోనే వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల డీసీసీ అధ్యక్షుడిగా నాయిని రాజేందర్‌రెడ్డి, మహబూబాబాద్ జిల్లాకు భరత్‌చంద్రారెడ్డి, జనగామకు రాఘవరెడ్డిలను నియమించారు. ఈ కమిటీల ద్వారా వరంగల్ లోక్‌సభ స్థానం కోసం 34, మహబూబాబాద్ కోసం 43 మంది దరఖాస్తులను టీపీసీసీ ఎన్నికల కమిటీ పరిశీలన కోసం పంపించారు. రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్‌సభ స్థానాల అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు చేసిన ఎన్నికల కమిటీ వరంగల్ నుంచి నాలుగు, మహబూబాబాద్ నుంచి రెండు పేర్లను ఏఐసీసీకి పంపించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రధానంగా వరంగల్ కోసం గత ఎన్నికల్లో ఓటమి చెందిన సర్వే సత్యనారాయణ, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, దొమ్మాటి సాంబయ్య, ఇందిర, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, మానవతారాయ్‌లతో పాటు 34 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే మహబూబాబాద్ కోసం మాజీ ఎంపీ పోరిక బలరాంనాయక్, బెల్లయ్యనాయక్‌లతో పాటు 43 మంది దరఖాస్తులను టీపీసీసీ ఎన్నికల కమిటీ పరిశీలించినట్లు తెలిసింది. త్వరలోనే ప్రకటిస్తారని చెప్తున్నా.. ఎవరికి టికెట్ దక్కుతుందనేది సస్పెన్స్‌గా మారింది. బీజేపీలో కనిపించని సందడి.. ‘దేశం’లో అస్పష్టత కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసినా బీజేపీలో ఎన్నికల సందడి కనిపించడం లేదు. ఒకవైపు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎంపీ టికెట్ల కోసం తమదైన శైలిలో ప్రయత్నాలు సాగుతుండగా బీజేపీలో మాత్రం స్తబ్దుగా ఉంది. గత లోక్‌సభ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఓటమి చెందారు. టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ పోటీలో నిలబడే ఆశావహుల దగ్గరి నుంచి దరఖాస్తులను స్వీకరించింది. నోటిఫికేషన్ విడుదల కాగానే అభ్యర్థులను ప్రకటించేందుకు రెండు పార్టీలు సిద్ధమవుతుండగా బీజేపీ మాత్రం దరఖాస్తుల స్వీకరణ చేపట్టడం లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమిగా కాంగ్రెస్, టీజేఎస్‌లతో కలిసి నడిచిన టీడీపీ ఈసారి పోటీ చేస్తుందా? లేదా? తెలియ డం లేదు.మునుపెన్నడూ లేనిరీతిలో టీడీపీలోనూ అభ్యర్థుల ఎంపికపై స్పష్టత రావడంలేదు. కాగా సీపీఐ, సీపీఎం పార్టీలు అభ్యర్థులను బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించాయి. -
రాష్ట్రపతి ఎన్నికల సందడి
రాష్ట్రపతి పదవికి అభ్యర్థిని ఎంపిక చేసే వ్యవహారంలో తొలి అంకం ప్రారంభ మైంది. సరిగ్గా మరో రెండు నెలల్లో... అంటే జూలై 25న ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిష్క్రమించి ఆ స్థానంలో కొత్తవారు బాధ్యతలు స్వీకరిస్తారు. రెండోసారి ఈ పదవికి పోటీపడదల్చుకోలేదని ప్రణబ్ తేల్చగా... ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న అంశాన్ని చర్చించడానికి శుక్రవారం యూపీఏ మిత్ర పక్షాలు సమావేశమవుతున్నాయి. అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని ఎంపిక చేయడానికి ఎన్డీఏ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ఏకగ్రీవ ఎన్నికకు అభ్యంతరం లేదంటూ కాంగ్రెస్ ఇప్పటికే చెప్పినా... విజయావకాశాలు మెరుగ్గా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ అలాంటి ప్రయత్నం చేస్తుందన్న నమ్మకం లేదు. రాజ్యసభలో ఎన్డీఏకు సంఖ్యా బలం పెద్దగా లేకపోయినా ఇతరత్రా అంశాలు దానికే అను కూలంగా ఉన్నాయి. యూపీఏ మిత్రపక్షాల సమావేశంలో పాల్గొనడానికొచ్చిన మమత గురువారం ప్రధాని నరేంద్ర మోదీని కలవడంతోపాటు రాష్ట్రపతి పదవికి ఏకగ్రీవ ఎన్నికే అన్నివిధాలా మంచిదనడం, బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ సమావేశానికి గైర్హాజరు కానుండటం గమనిస్తే విపక్ష శిబిరం ఏమంత పటిష్టంగా లేదని అర్ధమవుతుంది. ఇది ‘సిద్ధాంత సమరం’ అని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటిం చింది గనుకా... బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు సన్నద్ధమవుతున్న విపక్షాలకు రాష్ట్రపతి ఎన్నిక తొలి పరీక్ష అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇప్పటికే ప్రకటించి ఉన్నారు గనుకా విపక్షాల అభ్యర్థి రంగంలో ఉంటారనుకో వచ్చు. కానీ ఆ పోటీ నామమాత్రంగా మిగిలిపోవడానికే అవకాశాలు ఎక్కువు న్నాయి. విపక్షంలో ఉన్నా రాష్ట్రపతి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన చరిత్ర ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు దయనీయ స్థితిలో ఉంది. ఆ పార్టీకి పార్లమెంటులో చెప్పు కోదగ్గ సంఖ్యా బలం లేదు. రాష్ట్రాల్లోనూ అది అంతంతమాత్రమే. సమీప భవిష్యత్తులో అది పుంజుకోగలదన్న నమ్మకం ఎవరికీ లేదు. ఈ కారణాలన్నిటి వల్లా ఆ పార్టీ అభిప్రాయాలకు ఇతర విపక్షాలు పెద్దగా విలువనిస్తాయని అను కోనవసరం లేదు. నిజానికి రాష్ట్రపతి పదవి అలంకారప్రాయమైనది. కానీ అది దేశ రాజ్యాంగానికి, గణతంత్ర రాజ్యానికీ ప్రతీక. పరిమితమైన అధికారాలే ఉన్నా ప్రభుత్వ వ్యవహారాలన్నీ ఆ పదవి పేరిటే నడుస్తాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ముసాయిదా ఆర్డినెన్స్లపైనో, పార్లమెంటు అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపైనో సంతకాలు చేయడానికి పరిమితమయ్యే రాష్ట్రపతి ఒక్కోసారి కీలకపాత్ర పోషిం చాల్సి రావొచ్చు కూడా. దేశ చరిత్రలో బిల్లుల్ని లేదా ఆర్డినెన్స్లనూ రాష్ట్రపతి తిప్పి పంపిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అరుదుగానే కావొచ్చుగానీ... రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన సిఫార్సును నిరాకరించిన సందర్భం... ఆర్డినెన్స్‌పై వివరణ కోరి వెనక్కు పంపిన సందర్భం అక్కడక్కడా లేకపోలేదు. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లేనప్పుడు, సంకీర్ణ రాజకీయాలు అయోమయంగా ఉన్నప్పుడు రాష్ట్రపతి పాత్ర అత్యంత కీలకమైనది. అయితే కేంద్రంలో ఇప్పుడు పేరుకు ఎన్డీఏ ప్రభుత్వమే ఉన్నా బీజేపీకి సొంతంగానే అవసరమైనంత మెజారిటీ ఉంది గనుక అలాంటి పరిస్థితే ఏర్పడదు. నూతన రాష్ట్రపతిని పార్లమెంటు ఉభయ సభల సభ్యులు, రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ సభ్యులు ఉండే ఎలక్టోరల్ కాలేజీ ఎన్ను కుంటుంది. ఎమ్మెల్యేల ఓట్ల విలువ ఆయా రాష్ట్రాల్లోని జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఉంటుంది. ఎలక్టోరల్ కాలేజీలోని ఓట్ల విలువ 10,98,824. అత్యధిక జనాభా గల యూపీలోని ఎమ్మెల్యేల ఓట్ల విలువ 83,824. అక్కడ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన బీజేపీకే ఇందులో సింహభాగం ఉంటాయని వేరే చెప్పనవసరం లేదు. బీజేపీ ప్రస్తుతం పది రాష్ట్రాలు–యూపీ, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, అస్సాం, ఉత్తరాఖండ్, అరుణాచల్, ఛత్తీస్‌గఢ్‌లలో సొంతంగా ప్రభుత్వాలు నడుపుతోంది. జమ్మూ–కశ్మీర్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, సిక్కింలలో మిత్రులతో అధికారం పంచుకుంటున్నది. 2007లో ఎన్డీఏ మిత్రపక్షంగా ఉంటూ కూడా యూపీఏ అభ్యర్థి తమ రాష్ట్రానికి చెందిన ప్రతిభా పాటిల్ కనుక ఆమెకే మద్దతిస్తామని చెప్పిన మిత్రపక్షం శివసేన ఈసారి కూడా బీజేపీని ఇరుకున పెట్టే అవకాశం ఉంది. యూపీఏ అభ్యర్థిగా శరద్ పవార్ రంగంలో ఉంటే అది మరోసారి మరాఠీ అభిమానం పేరుతో అటువైపు వెళ్లినా ఆశ్చర్యం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్, తమిళనాడులో అధికార అన్నా డీఎంకే ఎన్డీఏ అభ్యర్థికే మద్దతిస్తామని చెప్పాయి. తెలంగాణలో టీఆర్ఎస్, ఒదిశాలో బీజేడీ సైతం ఆ పనే చేయవచ్చు. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినట్టు రాష్ట్రపతిలాంటి రాజ్యాంగ పదవికి ఏకగ్రీవ ఎన్నిక జరిగేలా చూడటమే ఉత్తమం. జరుగుతున్న పరిణామాలు గమనిస్తే సీనియర్ బీజేపీ నేత ఎల్కే ఆడ్వాణీకి ఎన్డీఏ అభ్యర్థిత్వం దక్కకపోవచ్చునని అర్ధమవుతుంది. అయితే రాష్ట్రపతి పదవి కుండే విలువనూ, గౌరవప్రతిష్టలనూ నిలబెట్టగలవారే, రాజ్యాంగ స్ఫూర్తి అమల య్యేలా చూడగలిగేవారే, క్లిష్ట పరిస్థితుల్లో చొరవతో ఒక మంచి మాటనో, సల హానో చెప్పగలిగినవారే ఆ పదవిని అధిష్టిస్తే దేశ గౌరవం ఇనుమడిస్తుంది. దేశా ధిపతిగా గణతంత్ర వ్యవస్థ పవిత్రతనూ, దాని జీవధాతువునూ సంరక్షించవల సిన కర్తవ్యం రాష్ట్రపతికి ఉంటుంది. అధికారంలో ఉన్నవారికి రబ్బర్ స్టాంపులా మారి, వారు చెప్పినట్టల్లా విని దేశాన్ని సంక్షోభం అంచులకు తీసుకుపోవడంలో తమ వంతు పాత్ర వహించిన రాష్ట్రపతులు మనకు లేకపోలేదు. అలాంటి వారివల్ల అధికారంలో ఉండేవారికి తప్ప దేశానికి ఒరిగేదేమీ ఉండదు. దేశ పౌరులందరికీ ఆదర్శప్రాయం కాగలిగిన వ్యక్తిత్వం ఉన్న నేత రాష్ట్రపతి పదవికి ఎన్నిక కావడం అవసరం. అభ్యర్థిని ఎంపిక చేసేటపుడు పార్టీలు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని అందరూ కోరుకుంటారు. -
లోకేష్ ఒత్తిడితో ప్రదీప్‌కు టికెట్
హైదరాబాద్: ఓటుకు నోట్లు కేసులో పోలీసులు ముందు విచారణకు హాజరైన ప్రదీప్ చౌదరి ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆయన ప్రస్తుతం వెంగళరావు నగర్ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ డివిజన్ నుంచి వేరొకరికి టికెట్ ఇవ్వాలని ఒత్తిడి రావడంతో పాటు ఈ స్థానం తమకు కేటాయించాలని బీజేపీ సైతం ఒత్తిడి తెచ్చింది. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఒత్తిడి మేరకు చివరి క్షణంలో జోక్యం చేసుకుని తన సన్నిహితుడు ప్రదీప్ చౌదరి పేరు ఖరారు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో లోకేష్ తన సన్నిహితులకు పలువురికి టికెట్లు ఇప్పించుకున్నారు. అందులో ప్రధానంగా వి. ప్రదీప్ చౌదరి పేరు తొలి వరుసలో ఉండటం విశేషం. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి భారీ ఎత్తున డబ్బులు ఎరగా వేసి కొనుగోలు చేయడానికి సంబంధించిన వ్యవహారం తీవ్ర సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్న తెలంగాణ ఏసీబీ భారీ ఎత్తున డబ్బు తరలించడంపై అనేక కోణాల్లో విచారణ చేపట్టింది. కాల్ లిస్ట్ ఆధారంగా ప్రదీప్ చౌదరి నంబర్ నుంచి కూడా అనేకసార్లు ఫోన్ సంభాషణలు ఉన్న నేపథ్యంలో ఆయనను పిలిచి విచారించారు. తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో సీట్ల పంపిణీ విషయంలో మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీల మధ్య అనేకసార్లు విబేధాలు పొడచూపాయి. తమకు గెలిచే అవకాశాలున్న డివిజన్లు టీడీపీ కోరడంపై బీజేపీలో అసంతృప్తి వ్యక్తమైంది. అందులో భాగంగా వెంగళరావునగర్ డివిజన్ నుంచి పోటీ చేయాలని బీజేపీ భావించినప్పటికీ లోకేష్ జోక్యంతో ఆ స్థానాన్ని వదులుకోవలసి వచ్చిందని చెబుతున్నారు. మరోవైపు ఈ స్థానం నుంచి ప్రదీప్ పేరును మాత్రమే పరిశీలించాలని పార్టీ నేతలను ఆదేశించడంతో ఆయన టికెట్ ఖాయమైనట్టు టీడీపీ నగర నేతలు అంటున్నారు. -
‘చంద్ర’ డ్రామా
సాక్షి, ఒంగోలు : ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా కార్యకర్తలు, పార్టీ నాయకుల ఫోన్ నంబర్లకు వాయిస్ మెయిల్ చేసి అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు అభిప్రాయాలు సేకరించడం మాటున దాగున్న అంతరార్థం తమకు ఎరుకేనంటున్నారు ఆ పార్టీ నేతలు. ఇన్నాళ్లూ కష్టపడిన వారిని పక్కకు తప్పించి.. ఇప్పటికిప్పుడు పార్టీకి భారీగా ఫండ్నిచ్చే వారికి సీట్లు కట్టబెట్టేందుకు బాబు అభిప్రాయసేకరణ పేరిట డ్రామా ఆడుతున్నారని చెబుతున్నారు. జిల్లాలో 12 నియోజకవర్గాలుండగా, ఏఒక్క చోటా అసెంబ్లీ అభ్యర్థి పేరును ఖరారు చేసి ప్రచారం చేసుకోవాల్సిందిగా అధినేత హామీనివ్వకపోవడంతో.... పార్టీ సీనియర్లు, ఆశావహులు డైలామాలో ఉన్నారు. ఎన్నికలకు ఏడాది ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తానని గతంలోనే పలికిన చంద్రబాబు నేడు, ప్రయోగాల ప్రణాళిక అమలు చేస్తాననడంపై పార్టీ సీనియర్లు మదనపడుతున్నారు. జిల్లా నాయకుల మధ్య సమన్వయం లేక ఆందోళన చెందుతున్న పార్టీ శ్రేణులకు రాష్ట్ర అధినాయకత్వం అనుసరిస్తున్న వైఖరి మరింత ఇబ్బందికరంగా మారుతుందనే భయం తలెత్తుతోంది. పార్టీ నేతల్లో నిరాశా నిస్పృహలు.. ‘మీ ఊరు, మీ అభివృద్ధి, మీకు నచ్చిన వ్యక్తే.. నాకూ నచ్చుతాడు..’ అని చెబుతూ ప్రజల నుంచి అభిప్రాయ సేకరణతోనే తమ పార్టీ ఎన్నికల అభ్యర్థులను ఎంపికచేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు మాటల్ని నేత బీర చందమేనంటున్నాయి ఆపార్టీ వర్గాలు. ఒంగోలు లోక్‌సభ స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారనేది ఇప్పటికీ తేలని అంశమైంది. బాపట్ల లోక్‌సభను ఆశించి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి పార్టీలో చేరిన మాజీ ఐఏఎస్ అధికారి దేవానంద్ విషయంలో బాబు ఏనిర్ణయం తీసుకోలేదు. ఒంగోలు అసెంబ్లీ స్థానానికి కిందటి ఎన్నికల్లో పోటీచేసి ఓడిన జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ మరోమారు టికెట్ ఆశిస్తుండగా, అక్కడ అతని ప్రాధాన్యతను తగ్గించే వ్యూహాలు నడుస్తున్నాయి. ఈవిషయంలో దామచర్లకు వ్యతిరేకంగా రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు కరణం బలరాంను చంద్రబాబు ప్రోత్సహిస్తూనే.. అతనికీ అద్దంకి సీటును ఖరారు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. కనిగిరిలో కూడా తాజాగా మాజీ ఎమ్మెల్యే ఇరిగినేని తిరుపతినాయుడు టీడీపీలోకి రావడంతో.. అక్కడ ఇప్పటికే పనిచేస్తున్న కదిరి బాబురావును ఏవిధంగా పక్కకు తప్పించాలనే ప్రణాళిక నడుస్తోందని తెలిసింది. గిద్దలూరుకు సాయికల్పనారెడ్డి పేరును కాదని, ఆమె కొడుకు అభిషేక్‌రెడ్డికి సీటు కేటాయింపుపై ఆలోచిస్తున్నామని రాష్ట్ర పార్టీ నాయకులు వెల్లడిస్తున్నారు. తల్లీకొడుకులకు చెరోవిధంగా చెబుతూనే... అక్కడ్నే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేరు చంద్రబాబు మదిలో ఉందని సమాచారం. దర్శిలో శిద్దా రాఘవరావుదీ అదే పరిస్థితిగా ఉంది. అతనికీ చివరి వరకు సీటు ఖరారవుతుందా..? లేదా..? అనేది చెప్పలేమని పార్టీ వర్గాల అభిప్రాయం. చీరాలలో పోతుల సునీత మినహా సంతనూతలపాడు, యర్రగొండపాలెం, పర్చూరు స్థానాల్లో తామే అభ్యర్థులుగా చెప్పుకుంటున్న వారికి చంద్రబాబు ఆఖరున చెంపచెళ్లమనిపించే ప్రమాదం పొంచి ఉందనేది పార్టీ సీనియర్ల అభిప్రాయం. పర్చూరు విషయంలో ఏలూరు సాంబశివరావు దగ్గర్నుంచి పార్టీకి భారీగా ఫండ్ తీసుకున్నట్లు.. ఆయన నామా నాగేశ్వరరావు, సుజనాచౌదరికి బినామీగా ఉన్నందున సీటు విషయంలో గట్టెక్కవచ్చనేది ‘ఏలూరి’ అనుచరుల వాదన. ప్రయోగాలతో తప్పని పతనం: ఎన్నికలొచ్చిన ప్రతీసారీ ఏదోరకంగా ప్రయోగాల పేరిట పార్టీ అభ్యర్థులను ముప్పుతిప్పలు పెట్టి.. భారీగా డబ్బు ఖర్చుపెట్టించడం.. ఆఖరికి సీటు లేదనడం ఆనవాయితీగా వస్తున్నదేనని జిల్లా పార్టీశ్రేణులు బహిరంగంగానే చెబుతున్నాయి. గడచిన ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపిక, రాజ్యసభ సీట్ల కేటాయింపు తీరు.. తాజాగా చంద్రబాబు ప్రకటించిన అభిప్రాయసేకరణ ప్రయోగంతో పోల్చుకుంటూ పార్టీవర్గాలు విశ్లేషించుకుంటున్నాయి. పొలిట్‌బ్యూరో సభ్యుల్ని విడివిడిగా పిలిచి మాట్లాడేక్రమంలో.. చంద్రబాబు తన మదిలోని మాటను ఇతరుల అభిప్రాయంగా వినిపించి.. ఏకాభిప్రాయానికి తేవడం అందరికీ తెలిసిందే. సీఎం రమేష్, సుజనాచౌదరి తదితరులు పార్టీని ఆర్థికంగా ఆదుకుంటున్నారని బాబు జిల్లా నేతలకు సందర్భానుసారం చెబుతూనే ఉన్నారు. వారందర్నీ రాజ్యసభకు పంపిన తీరుపై అప్పట్లో నేతల రాద్ధాంతాన్ని జిల్లా శ్రేణులు గుర్తుకు తెచ్చుకుంటున్నాయి. నియోజకవర్గాల్లో నమ్మకం కోల్పోయిన టీడీపీ తాజాగా ప్రయోగాల పేరుతో మరింత పతనం దిశగా అడుగులేస్తుందని.. రానున్న ఎన్నికల్లో ఆపార్టీ ఘోరపరాభవం చవిచూస్తుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.