అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయముంది. 2024 నవంబర్ 5న పోలింగ్ జరగనుంది. కానీ రెండు ప్రధాన పక్షాల్లో ఒకటైన విపక్ష రిపబ్లికన్ పార్టీ ఇప్పటికే బరిలో దిగింది. పార్టీ అభ్యర్థిని నిర్ణయించే సుదీర్ఘమైన ఎంపిక ప్రక్రియకు బుధవారమే శ్రీకారం చుడుతోంది. ఇప్పటికైతే వివాదాస్పద మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రేసులో అందరి కంటే ముందున్నారు. ఇంకా చెప్పాలంటే ఆయన వైపే స్పష్టమైన మొగ్గుంది. అయినా సరే, ట్రంప్‌నకు ఎంతో కొంత పోటీ ఇస్తారని భావిస్తున్న ఫ్లోరిడా గవర్నర్ డి శాంటిస్‌తోపాటు మరో ఏడుగురు ఆశావహులు బరిలో దిగి అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
తొలి రౌండ్ డిబేట్ ఎప్పుడు?
► బుధవారం రాత్రి 9 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం)
వేదిక: రాజకీయంగా అతి కీలకమైన విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీలో
► రెండో రౌండ్ డిబేట్ సెపె్టంబర్ 27న కాలిఫోరి్నయాలో జరుగుతుంది.
అర్హత... అంత సులభం కాదు
రిపబ్లికన్ అభ్యరి్థత్వ బరిలో నిలవడం అంత సులువేమీ కాదు. అందుకు పార్టీ నేషనల్ కమిటీ పెట్టే ఎన్నో నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. మరెన్నో పార్టీపరమైన పరీక్షల్లో నెగ్గాల్సి ఉంటుంది.
► లేదంటే కనీసం రెండు నేషనల్ పోల్స్‌తో పాటు అయోవా వంటి ఒక అర్లీ ప్రెసిడెన్షియల్ ప్రైమరీలో కనీసం 1 శాతం ఓట్లు సాధించాలి.
► ప్రచారం కోసం కనీసం 40 వేల మంది నుంచి విడివిడిగా విరాళాలు సేకరించాలి.
► మూడు విడివిడి నేషనల్ పోల్స్‌లో కనీసం 1 శాతం ఓట్లు సాధించాలి.
► అంతిమంగా నెగ్గి రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో దిగే అభ్యరి్థకి పూర్తి మద్దతిస్తామని ప్రమాణ పత్రం మీద సంతకం చేయాలి. అయితే రేసులో ముందున్న ట్రంప్ మాత్రం ఇలా సంతకం చేయకపోగా, తిరస్కరించడం విశేషం!
డిబేట్‌లో వీరే...
1. టిమ్ స్కౌట్ (దక్షిణకరోలినా సెనేటర్)
2. డి శాంటిస్ (ఫ్లోరిడా గవర్నర్)
3. నిక్కీ హేలీ (ఐరాసలో అమెరికా మాజీ రాయబారి)
4. వివేక్ రామస్వామి (భారత సంతతి వ్యాపారవేత్త)
5. క్రిస్ క్రిస్టీ (న్యూజెర్సీ మాజీ గవర్నర్)
6. మైక్ పెన్స్ (మాజీ ఉపాధ్యక్షుడు)
7. డౌగ్ బర్గం (నార్త్ డకోటా గవర్నర్)
8. అసా అచిన్ సన్ (అర్కన్సాస్ మాజీ గవర్నర్)
ఏం ఒరిగేను?
రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్‌నకు మద్దతు వెల్లువెత్తుతోందనే చెప్పాలి. తమ అభ్యర్థి ఆయనేనని సీబీఎస్, యూగవ్ గత వారం చేసిన పోల్‌లో ఏకంగా 62 శాతం రిపబ్లికన్ ఓటర్లు కుండబద్దలు కొట్టారు.
అలాంటప్పుడు ఈ డిబేట్లతో పార్టీ సాధించేది ఏముంటుందని ప్రశ్నిస్తున్న వాళ్లూ ఉన్నారు. కానీ ఆశావహులు డిబేట్లలో ట్రంప్‌ను గుడ్డిగా వ్యతిరేకించడం కాకుండా తమకు ఎందుకు ఛాన్స్ ఇవ్వాలో సమర్థంగా చెప్పగలగాలని అదే సర్వేలో ఏకంగా 91 శాతం స్పష్టం చేశారు. కనుక ఏమైనా జరగొచ్చని, చివరికి అనూహ్యంగా ఎవరైనా అధ్యక్ష అభ్యర్థి కావచ్చని అంటున్న వారికీ కొదవ లేదు.
కొసమెరుపు
రేసులో అందరి కంటే ముందున్న డొనాల్డ్ ట్రంప్ మాత్రం తొలి రౌండ్ డిబేట్‌లో పాల్గొనడం లేదు. ‘నాకున్న పాపులారిటీకి ఇలాంటి పిల్ల పందాల్లో పాల్గొనడమా? నాన్సెన్స్! నేనెవరో, అధ్యక్షునిగా ఎంత సాధించానో పార్టీ ఓటర్లందరికీ బాగా తెలుసు’’ అంటున్నారాయన! అయితే, సరిగ్గా డిబేట్ల సమయానికే ప్రి రికార్డెడ్ ఇంటర్వ్యూ ప్రసారమయ్యేలా ట్రంప్ ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment