తిరిగి బీఆర్‌ఎస్ గూటికి రాజయ్య?
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ తరఫున వరంగల్ ఎంపీ స్థానానికి బలమైన అభ్యర్థిని బరిలో దించేదిశగా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. బీఆర్ ఎస్ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొని తన తండ్రి కడియం శ్రీహ రితో కలిసి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తి చెంది, బీఆర్ ఎస్ అధికారం కోల్పోగానే పార్టీకి దూరమైన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో బీఆర్‌ఎస్ వర్గా లు సంప్రదింపులు ప్రారంభించినట్టు తెలిసింది. అయితే తన అనుచరులతో భేటీ అయిన తర్వాత తిరిగి పార్టీలోకి రావడంపై స్పష్టత ఇస్తానని రాజ య్య చెప్పినట్టు సమాచారం.
ఓ వైపు రాజయ్యను తిరిగి పార్టీలోకి తీసుకొని ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపడంపై కసరత్తు చేస్తూనే, మరోవైపు ఇతర ప్రత్యామ్నాయాలను కేసీఆర్ అన్వేషిస్తున్నట్టు సమా చారం. పార్టీ తరపున టికెట్ ఆశించిన బోడ డిన్న, నిరంజన్, జింక రమేశ్ తదితరులు తమవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు హనుమ కొండ జిల్లా పరిషత్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి భార్య, జెడ్పీటీసీ సభ్యురాలు పెద్ది స్వప్న తదితరుల పేర్లు కూడా తెరమీదకు వస్తున్నాయి. ఇదిలాఉంటే తన అను చరులతో కడియం శ్రీహరి శనివారం హైదరాబా ద్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ కూడా స్టేషన్‌ఘనపూర్ నేతలతో నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం సమావేశం ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment