సాక్షి,హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా హన్మకొండ జెడ్పీ చైర్మన్ మారేపల్లి సుధీర్‌కుమార్ అభ్యర్థిత్వాన్ని పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు పార్టీ శుక్రవారం( ఏప్రిల్ 12)అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. వరంగల్ అభ్యర్థిని నిర్ణయించేందుకు జిల్లా నేతలతో కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్‌లో శుక్రవారం భేటీ అయ్యారు.
ఈ భేటీకి ఇటీవలే పార్టీని వీడిన స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు కూడా పిలుపు అందడంతో వరంగల్ నుంచి ఆయన పోటీ చేస్తారన్న ప్రచారం ఒక దశలో ఊపందుకుంది. చివరకు సుధీర్‌కుమార్‌ను బరిలోకి దింపాలని కేసీఆర్ నిర్ణయించారు. వరంగల్ నుంచి ఇప్పటికే బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియ్యం కావ్య కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో బీఆర్‌ఎస్ తాజాగా మళ్లీ అభ్యర్థిని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కాగా, ప్రస్తుతం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. బీఆర్‌ఎస్‌కు ప్రత్యర్థులుగా ఉన్న రెండు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులిద్దరూ బీఆర్‌ఎస్‌ను ఇటీవల వీడి టికెట్ తీసుకున్న వారే కావడం గమనార్హం. దీంతో బీఆర్‌ఎస్‌కు తమ పార్టీ నుంచి వెళ్లిన వారిపైనే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ బీజేపీ నుంచి వర్థన్నపేట బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, కాంగ్రెస్ నుంచి స్టేషన్ ఘన్‌పూర్ కడియం కావ్య బరిలో ఉన్నారు.
ఇదీ చదవండి.. బీఆర్‌ఎస్‌లో డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. కడియం
Comments
Please login to add a commentAdd a comment