సాక్షి, వరంగల్: తెలంగాణ ఇప్పుడిప్పుడే బాగుపడుతోందని.. ఇలాంటి పరిస్థితుల్లో నమ్మి రాబందుల చేతిలో పడితే మళ్లీ మోసపోతామని, ఆగమవుతామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. అదే జరిగితే మళ్లీ కోలుకోలేమని.. రౌడీలు, గుండాలు స్వైర విహా రం చేస్తారని వ్యాఖ్యానించారు.
తొమ్మిదేళ్లు గా అభివృద్ధి, సంక్షేమాలను జోడెద్దుల్లా కలిపి పరుగులు పెట్టిస్తున్నామని.. ప్రజలు ఆగం కాకుండా, రాష్ట్రాన్ని కాపాడుకోవా లని పిలుపునిచ్చారు. శనివారం వరంగల్‌లో రూ.618 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆజంజాహి మిల్లు మైదానంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
‘‘మోదీ 2014లో పేదల ఖాతాల్లో రూ. 15 లక్షల చొప్పున వేస్తానంటూ దేశాన్నంతా పిచ్చివాళ్లను చేసి గెలిచారు. నల్లధనం తెస్తానన్నారు. ఇప్పడు అడిగితే తెల్లముఖం వేస్తున్నారు. హిందుస్తాన్, పాకిస్తాన్.. ఇలా చిల్లర మాటలు తప్ప పనికొచ్చే పని ఒక్కటైనా చేశారా? కాజీపేటకు రావాల్సిన రూ. 25 వేల కోట్ల కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్‌కు తరలించుకుపోయారు. ట్రైబల్ వర్సిటీ హా మీ ఊసు లేదు.
వరంగల్‌లో ఎయిర్‌పోర్టు రాకుండా మోకాలడ్డుతున్నారు. వంటగ్యాస్ ధరను రూ.1,200కు పెంచేశారు. నాడు పెద్ద నోట్ల రద్దుతో ఆగం చేశారు. మళ్లీ రెండు వేల నోట్లను రద్దు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పాలనలో రైతులు, వ్యాపారులను రాబందుల్లా పీక్కుతిన్నారు. తాగు, సాగునీరు, కరెంట్ ఇచ్చి న ముఖం లేదుగానీ నొట్టికొచ్చినట్టు దూషణలు చేస్తున్నారు.
దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటే తప్పేంటి?
తెలంగాణ ఏర్పాటై పదో ఏడాదిలోకి అడుగుపెట్టిన వేళ దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటే తప్పేంటి? అన్ని రంగాల్లో సాధించిన అభివృద్ధి జనాలకు తెలిసేలా సీఎం కేసీఆర్ ఉ త్సవాలు చేస్తున్నారు. దసరా నాటికి తెలంగాణలోనే అతి పెద్ద హాస్పిటల్‌ను వరంగల్‌లో కేసీఆర్ ప్రారంభిస్తారు.
3,416 గిరిజన తండాలు, కోయ, ఆదివాసీ గూడేలను గ్రా మ పంచాయతీలుగా చేశాం. గిరిజనుల రిజర్వేషన్లను పది శాతానికి పెంచాం. దీనితో గిరిజనులు సంబురాలు చేసుకుంటున్నారు. గురుకుల పాఠశాలల్లో ఆరు లక్షల మంది పేద బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించాం. ఆ విద్యార్థులు నీట్‌లో ర్యాంకులు కొడుతూ సంబురాలు చేసుకోవద్దా?..’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఈ సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, దాస్యం వినయ్‌భాస్కర్, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment