నేడు సగానికి పైగా అభ్యర్థుల ఖరారు! | Congress Central Election Committee meeting in Delhi | Sakshi
Sakshi News home page

నేడు సగానికి పైగా అభ్యర్థుల ఖరారు!

Published Fri, Oct 13 2023 2:51 AM | Last Updated on Fri, Oct 13 2023 10:19 AM

Congress Central Election Committee meeting in Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కు పార్టీ అభ్యర్థులను ఖ రారు చేసేందుకు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమి టీ (సీఈసీ) శుక్రవారం భేటీ కానుంది. చైర్మన్‌ మల్లికార్జున ఖర్గే అ ధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీల తో పాటు కమిటీ సభ్యులు పాల్గొననున్నారు. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్‌ అభ్యర్థుల ఎంపికపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు.

మురళీధరన్‌ నేతృత్వంలోని స్క్రీనింగ్‌ కమిటీ ఇప్పటికే 70కి పైగా స్థానాల్లో సింగిల్‌ పేరును, మరో 30 స్థానాల్లో రెండేసి పేర్లను సీఈసీకి పంపింది. ఈ పేర్లపై సీఈసీ చర్చించి ఆమోదం తెలపనుంది. రెండేసి పేర్లున్న చోట పార్టీ పెద్దలు కొన్ని మార్గదర్శకాలు సూచించనున్నారు. ఈ నెల 15 లేదా 16వ తేదీన తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement