సాక్షి, ఢిల్లీ: ఎన్నికల వేళ కాంగ్రెస్ హైకమాండ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 16 మంది సభ్యులతో కాంగ్రెస్ ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కీలక కమిటీలో మాజీ టీపీసీసీ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి చోటు కల్పించడం విశేషం.
వివరాల ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగానే ఎన్నికల కమిటీని కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కేంద్ర ఎన్నికల కమిటీని ఏర్పాటు చేశారు. 16 మంది సభ్యులతో కేంద్ర ఎన్నికల కమిటీ ఏర్పాటైంది. అయితే, రానున్న ఎన్నికలకు ఎన్నికల కమిటీనే అభ్యర్థులను ఎంపిక చేయనుండటం విశేషం. ఇక, ఈ కీలకమైన ఎన్నికల కమిటీలో టీపీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చోటు కల్పించింది హైకమాండ్.
ఇక, సీఈసీలో సభ్యులుగా మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అంబికా సోనీ, అధిర్ రంజన్ చౌదరీ, సల్మాన్ ఖుర్షీద్, మధుసూదన్ మిస్త్రీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీఎస్ సింగ్ డియో, కేజీ జార్జ్, ప్రీతమ్ సింగ్, మహ్మాద్ జావేద్, ఆమ్మె యాజ్నిక్, పీఎల్ పూనియా, ఓంకార్ మాక్రామ్, కేసీ వేణుగోపాల్‌కు చోటు కల్పించారు.
Congress President Shri @kharge has constituted the Central Election Committee. The list is as follows- pic.twitter.com/jfdcR8KSEN
— Congress (@INCIndia) September 4, 2023
ఇది కూడా చదవండి: వన్ నేషన్-వన్ ఎలక్షన్.. ప్రశాంత్ కిషోర్ ఏమన్నారంటే?
Comments
Please login to add a commentAdd a comment