డబ్బుల్లేవ్‌.. ప్రచారం చేసుకోలేకపోతున్నాం: కాంగ్రెస్‌ ఆవేదన | Congress Leaders Serious Comments On PM Modi Over Bank Accounts Seize, Details Inside - Sakshi
Sakshi News home page

ఎన్నికల టైమ్‌ చూసి ఖాతాలను బ్లాక్ చేశారు: కాంగ్రెస్‌ ఆవేదన

Published Thu, Mar 21 2024 12:46 PM | Last Updated on Thu, Mar 21 2024 1:44 PM

Congress Leaders Serious On PM Modi Over Bank Accounts Seize - Sakshi

సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి కొత్త కష్టాలు ఎదురువుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలను స్తంభింపజేసి ఎన్నికల్లో తమకు డబ్బులు లేకుండా దెబ్బతీయాలని బీజేపీ చూస్తోందని పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై అతి పెద్ద దాడి అని సోనియా గాంధీ అభివర్ణించారు. ఈ సందర్బంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై కాంగ్రెస్‌ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.

మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో లెవెల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌ ఉండాలి. బీజేపీ పెద్ద ఎత్తున రాజకీయ చందాలు వసూలు చేసింది. కానీ, వారు మా పార్టీ ఖాతాలను స్థంభింపజేశారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. మా బ్యాంకు ఖాతాలను తక్షణమే ఆపరేట్‌ చేసేందుకు అనుమతించాలి. బీజేపీ అన్ని వనరులపై ఏకఛత్రాధిపత్యం వహిస్తోంది. మాకు డబ్బు లేకుండా చేసి ఎన్నికల్లో దెబ్బతీయాలని చూస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సోనియా గాంధీ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. నెల కిందట కాంగ్రెస్‌ అకౌంట్లను అక్రమంగా సీజ్‌ చేశారు. ఎలక్టోరల్‌ బాండ్స్‌​ ద్వారా కాంగ్రెస్‌కు 11 శాతం ఫండ్స్‌ మాత్రమే వచ్చాయి. ఫండ్స్‌ను కట్టడి చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కేంద్రం తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎలక్టోరల్‌ బాండ్స్‌ ద్వారా బయటపడ్డ సమాచారంపై విచారణ జరగాల్సిందే. బీజేపీకి వచ్చిన బాండ్స్‌పై విచారణ జరగాలి. కాంగ్రెస్‌ను ఆర్థికంగా దెబ్బకొట్టాలని బీజేపీ చూస్తోంది. 

రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు సంబంధించిన అన్ని అకౌంట్లు ఫ్రీజ్‌ చేశారు. మా దగ్గర ఫండ్స్‌ లేవు. కాంగ్రెస్‌ను ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. ఈసీ దీనిపై స్పందించడం లేదు. దేశంలో 20 శాతం ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారు. 14 లక్షల రూపాయలకు సంబంధించిన లెక్కల వివాదంపై మొత్తం కాంగ్రెస్ పార్టీ ఖాతాలను స్తంభింప చేశారు. రూ.200 కోట్లు జరిమానా వేశారు. ఆలస్య చెల్లింపుకు రూ.10వేలకు మించి జరిమానా వేయకూడదు. ప్రధానమంత్రి క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్నారు. డబ్బులు లేకపోవడంతో ప్రచారాలు బుక్ చేసుకోలేకపోతున్నాం. మా అభ్యర్థులకు సహాయపడలేకపోతున్నాం. విమాన టికెట్లు కాదు, కనీసం రైల్వే టికెట్లు కొనలేకపోతున్నాం. ఈ అంశంపై దేశంలోని రాజ్యాంగ సంస్థలు, ప్రజలు స్పందించాలి అని కోరారు. 

అజయ్ మాకెన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఖాతాల స్తంభన ప్రజాస్వామ్యంపైన దాడి వంటిది. మా ఖాతాలో ఉన్న రూ.285కోట్ల రూపాయలను ఖర్చు చేయలేకపోతున్నాము. ఐదు వారాల నుంచి ఎన్నికల్లో ప్రచారం కోసం ఖర్చు చేయడానికి నిధులు లేకుండా చేశారు. 30ఏళ్ల కిందటి లెక్కలను ఆధారం చేసుకుని ఇప్పుడు మా ఖాతాలను ఎలా స్పందింప చేస్తారు. అన్ని రాజకీయ పార్టీలకు మినహాయింపు ఉన్నట్టు మేము మినహాయింపులు పొందాము. కానీ, సరిగ్గా ఎన్నికల ముందు మా ఖాతాలు నన్ను స్తంభింపచేశారు. ఆదాయం పన్ను చట్టం 230ఎఫ్ ప్రకారం ఆలస్య చెల్లింపులకు 10 వేలకు మించి జరిమానా వేయకూడదు. 210 కోట్ల రూపాయల పెనాల్టీ వేశారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement