ముంచుకొస్తున్న ఎన్నికలు.. బీజేపీ కీలక భేటీ! | BJP Central Election Committee Meeting begins | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 8 2018 7:05 PM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

BJP Central Election Committee Meeting begins  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ ఉప ఎన్నికల్లో ఓటమి, త్వరలో కీలకమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది అత్యంత కీలకమైన లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయింది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్‌షాతోపాటు బీజేపీ అగ్రనేతలు పాల్గొన్నారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, సుష్మాస్వరాజ్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌సింగ్‌ చౌహాన్‌, కర్ణాటక బీజేపీ చీఫ్‌ యడ్యూరప్ప తదితర ముఖ్యనేతలు ఈ భేటీకి హాజరయ్యారు.

కర్ణాటక ఎన్నికలు, వచ్చే ఏడాది జరగనున్న కీలక ఎన్నికల విషయమై చర్చించి.. ఈ భేటీలో బీజేపీ అగ్రనేతలు పలు విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముందని భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement