మొన్నటి యూపీ లోక్‌సభ ఎన్నికల్లో నిరాశాజనక ఫలితాల తర్వాత బీజేపీలో అంతర్గత పోరు చోటుచేసుకుంది. ఇప్పుడు దీనిని ఆపేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సంఘ్ నేత అరుణ్‌కుమార్‌ల సమక్షంలో సమావేశం జరిగింది.
ప్రభుత్వం- సంఘ్ మధ్య మెరుగైన సమన్వయంతో పాటు ఉప ఎన్నికల వ్యూహం, పార్టీ ప్రతినిధుల నియామకం తదితర పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. రాబోయే ఉప ఎన్నికల సన్నాహాల్లో బీజేపీతో పాటు సంఘ్ కార్యకర్తలను కూడా భాగస్వాములను చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
దాదాపు రెండున్నర గంటల పాటు సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో.. పార్టీలో పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు బీజేపీ నష్టపోవాల్సి వస్తుందని సంఘ్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికలతో పాటు ప్రభుత్వం, సంఘ్ మధ్య పరస్పర సమన్వయంపై చర్చ జరిగింది. రాబోయే ఉప ఎన్నికల్లో కీలక బాధ్యతలను సంఘ్‌కు అప్పగించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఉపముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ధరంపాల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment