ఉత్తరప్రదేశ్‌లోని మిల్కిపూర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు (ఫిబ్రవరి 8) జరుగుతోంది. తొలి రౌండ్ పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీకి చెందిన చంద్రభాన్ పాశ్వాన్ ముందంజలో ఉన్నారు. ఈ సీటును గెలుచుకునేందుకు అటు బీజేపీ, ఎస్పీలు అన్ని ప్రయత్నాలు చేశాయి. ఈ సీటు గెలుపు బాధ్యతను సీఎం యోగి ఆదిత్యనాథ్ తన భుజస్కందాలపై వేసుకున్నారు.
ఎస్పీకి చెందిన అజిత్ ప్రసాద్, బీజేపీకి చెందిన చంద్రభాన్ పాస్వాన్ సహా 10 మంది అభ్యర్థులు మిల్కిపూర్ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ ఇద్దరు అభ్యర్థులు విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా తొలి రౌండ్ పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ అభ్యర్థి చంద్రభాన్ పాశ్వాన్ ముందంజలో ఉన్నారు. ప్రారంభ ట్రెండ్స్‌లో బీజేపీ ఆధిక్యత కనబరుస్తోంది. ఎస్పీ అభ్యర్థి అజిత్ ప్రసాద్ కౌంటింగ్‌కు ముందు పార్టీ నేతలకు, ఏజెంట్లకు హల్వా అందించారు.
ఇంతలో ఎస్పీ ఎంపీ అవధేష్ ప్రసాద్ విజయ నినాదం చేశారు. మిల్కీపూర్ చరిత్ర సృష్టించబోతోందని, ఎస్పీ అభ్యర్థి 35 వేల ఓట్ల తేడాతో గెలుస్తారన్నారు. ఓట్ల లెక్కింపునకు ముందు చంద్రభాన్ పాస్వాన్ తన ఇంట్లో పూజలు నిర్వహించారు. మిల్కిపూర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యింది. ఉదయం 10 గంటల నుండి ట్రెండ్స్ రావడం ప్రారంభంకానుంది. ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు 30 రౌండ్లలో పూర్తవుతుంది. 76 మంది ఉద్యోగులతో కూడిన 19 పార్టీలు ఓట్ల లెక్కింపు కోసం పనిచేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Delhi Election: కుటుంబ ప్రతిష్టకు అగ్నిపరీక్ష
Comments
Please login to add a commentAdd a comment