ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్: విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ తాజాగా స్ల్పాష్ సేల్‌ను ప్రకటించింది. దీని ప్రకారం తమ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా ఎక్స్‌ప్రెస్ లైట్ కింద బుక్ చేసుకుంటే ఛార్జీలు రూ. 883 నుంచి ప్రారంభమవుతాయని సంస్థ తెలిపింది.
అలాగే ఇతర మాధ్యమాల ద్వారా ఎక్స్‌ప్రెస్ వేల్యూ కింద బుక్ చేసుకుంటే రూ. 1,096 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. సెప్టెంబర్ 30 వరకు చేసే ప్రయాణాల కోసం జూన్ 28 వరకు చేసుకునే బుకింగ్స్‌కి ఇవి వర్తిస్తాయని సంస్థ వివరించింది.
దీనితో పాటు airindiaexpress.com లో బుక్ చేసుకునే వినియోగదారులు ఇటీవల లాంచ్ చేసిన జీరో చెక్-ఇన్ బ్యాగేజ్ ఎక్స్ ప్రెస్ లైట్ కు ప్రత్యేక డిస్కౌంట్లతో ఎక్స్ క్లూజివ్ యాక్సెస్ పొందవచ్చు. ఎక్స్‌ప్రెస్ లైట్ ఛార్జీలు అదనంగా 3 కిలోల క్యాబిన్ బ్యాగేజీని ఎటువంటి రుసుము లేకుండా ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశాన్ని అందిస్తాయి. అలాగే దేశీయ విమానాలలో 15 కిలోలకు రూ .1000, అంతర్జాతీయ విమానాలలో 20 కిలోలకు రూ .1300 చొప్పున చెక్-ఇన్ బ్యాగేజీ కోసం డిస్కౌంట్ ఫీజును అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment