న్యూఢిల్లీ: జాత్యాహాంకారం, మత విద్వేషాలతో మనుషులు కొట్టుకు సచ్చిపోతున్నారు. కానీ ఈ జంతువులు మాత్రం జాతి వైరాన్ని మరిచి విభిన్న జాతులతో ఎంతో ప్రేమపూరితమైన స్నేహ భావంతో మెలుగుతున్నాయి. అచ్చం అలానే ఒక చిరుత, కుక్క ఎంత స్నేహ భావంగా ఉన్నాయో. పైగా అవి మొదట చూడగానే అవి ఒకే జాతి అనిపించేంత స్నేహంగా ఉంటాయి.
(చదవండి: ప్రమాదం ఆ కుక్క జీవితాన్ని మార్చింది.. ఏకంగా మనిషిలా..)
సరిగా చూస్తే ఈ రెండు ఎంత విభిన్న జాతులో తెలుస్తుంది. ఈ చిరుత ఎనిది నెలలు వయసులోనే తల్లికి దూరమవడంతో వెంజా రోట్‌వీలర్ అనే కుక్కను పెంచుకుంటున్న ఒక మహిళ ఈ చిరుతను దత్తత తీసుకుంది. ఈ చిరుతకు లునా అని పేరు పెట్టుకుని పెంచుతుంది. కానీ లునా(చిరుత), రోట్‌వీలర్ కొద్ది రోజుల్లోనే మంచి స్నేహితుల్లా మారిపోయాయి.
అయితే దీనికి సంబంధించిన ఒక వీడియోను సదరు మహిళ "వాళ్లది విలువైన బంధం. లూనా మీపై దాడిచేయాలని సీరియస్ చూస్తుంది" అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో పాటు లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు ఓ లుక్ వేయండి.
Comments
Please login to add a commentAdd a comment