panther
-
బర్డ్ ఫ్లూ కలకలం: వియత్నాంలో 47 పులుల మృతి
బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా దక్షిణ వియత్నాంలోని ఓ జూలో 47 పులులు, మూడు సింహాలు, ఓ పాంథర్ మరణించినట్లు స్థానిక మీడియా బుధవారం ఓ కథనంలో వెల్లడించింది. వియత్నాం న్యూస్ ఏజెన్సీ (VNA) మీడియా కథనం ప్రకారం.. లాంగ్ యాన్ ప్రావిన్స్‌లోని ప్రైవేట్ మై క్విన్ సఫారీ పార్క్ , హో చి మిన్ సిటీకి సమీపంలోని డాంగ్ నైలోని వూన్ జోయ్ జూలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఈ మరణాలు సంభవించాయని పేర్కొంది.నేషనల్ సెంటర్ ఫర్ యానిమల్ హెల్త్ డయాగ్నోసిస్ పరీక్ష ఫలితాల ప్రకారం ఈ జంతువులకు H5N1 రకం A బర్డ్ ఫ్లూ వైరస్ సోకటంతో మృతి చెందినట్లు తెలిపింది. అయితే పులుల మరణాలుపై జూ అధికారుల స్పందించకపోటం గమనార్హం. అదేవిధంగా జంతువులతో సన్నిహితంగా ఉన్న జూ సిబ్బంది ఎవరిలో కూడా శ్వాసకోశ లక్షణాలను బయటపడలేదని తెలుస్తోంది.⚠️Bird flu kills 47 tigers, 3 lions and a panther in Vietnam zoos, state media reports.47 tigers, 3 lions and a panther have died in zoos in south Vietnam due to the H5N1 bird flu virus, state media said Wednesday.@ejustin46@mrmickme2@DavidJoffe64https://t.co/P99Dn71HMF— COVID101 (@COVID19info101) October 2, 2024 ఎడ్యుకేషన్ ఫర్ నేచర్ వియత్నాం (ENV) ప్రకారం.. 2023 చివరి నాటికి వియత్నాంలో మొత్తం 385 పులులు జూలో ఉన్నాయి. ఇందులో 310 ప్రైవేట్ అధీనంలోని జూలలో ఉండగా.. మిగిలినవి ప్రభుత్వ అధీనంలోని జూల సంరక్షణలో ఉన్నాయి. 2022 నుంచి బర్డ్ ఫ్లూ వైరస్ H5N1 వేగంగా వ్యాప్తి చెందటం వల్ల పలు క్షీరదాల మరణాలు పెగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.ఈ H5N1 వైరస్ ఇన్ఫెక్షన్లు మానవుల్లో కూడా తేలికపాటి నుంచి తీవ్రమైన స్థాయి వరకు ఉండవచ్చని, కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా కూడా మారవచ్చని ప్రపంచ ఆగర్యో సంస్థ పేర్కొంది. మరోవైపు.. గతంలో 2004లో సైతం డజన్ల కొద్దీ పులులు బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోయాయని వియాత్నం స్థానిక మీడియా తెలిపింది.చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై భారత్ ఆందోళన చెందుతోంది: జై శంకర్ -
హడలెత్తిస్తున్న చిరుత.. 11 రోజుల్లో ఏడుగురిపై దాడి, మృతి
రాజస్థాన్‌లో ఓ చిరుత ప్రజలను హడలెత్తిస్తోంది. స్థానికులను వేటాడి చంపి తింటూ.. వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. తాజాగా ఉదయ్‌పూర్‌లోని ఓ గ్రామంలో పూజారి ప్రాణాన్ని బలిగొంది. సోమవారం తెల్లవారుజామున పూజారి విష్ణుగిరి(65) మృతదేహాన్ని స్థానిక అడివిలో గుర్తించారు. చిరుత అతనిపై దాడి చేసి అటవీ ప్రాంతంలోకి ఈడ్చుకెళ్లి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.మృతదేహాన్ని ఆలయానికి 150 మీటర్ల దూరంలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.అయితే చిరుత దాడిలో గత 11 రోజుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఏడుకు చేరింది. చిరుత దాడులు ఎక్కువవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను బంధించేందుకు పోలీసులు, అటవీశాఖ అధికారులు పలు చోట్ల బోనులు ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా పలు చిరుతలు చిక్కాయని చెబుతున్న అధికారులు.. మరోవైపు వాటి దాడులు మాత్రం ఆగడం లేదని పేర్కొంటున్నారు.చిరుతపులి భయంతో పోలీసులు, అటవీశాఖ అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో ఉచ్చులు బిగించారు. గత కొన్ని రోజులుగా కొన్ని పాంథర్లు పట్టుబడుతుండగా, చిరుతపులి దాడి కారణంగా మరణాల సంఖ్య పెరుగుతోంది. చిరుత దాడులు క్రమంగా పెరుగుతుండటంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఆ ప్రాంతంలో పాఠశాలలు మూతపడ్డాయి. సాయంత్రం దాటిన తర్వాత ప్రజలు బయటకు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బయటకు వస్తే ఒంటరిగా రావొద్దని.. గుంపులుగా రావాలని సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు ర్రలు లేదా ఇతర ఆయుధాలను తమ వెంట తీసుకెళ్లాలని గ్రామస్థులను అధికారులు కోరారు. అయితే అందరిపై దాడి చేసింది ఒకే చిరుతనా అనేది తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. అయిఏ అన్ని ఘటనల్లో జంతువు కదలికలు ఒకే రకంగా ఉన్నాయని.. దాడి స్వభావం కూడా ఒకే విధంగా ఉన్నట్లు తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దాని కదలికలను గమనిస్తున్నట్లు చెప్పారు. -
పర్ఫెక్ట్ టైమింగ్: కెమెరాకు చిక్కిన మూడు తలల చీతా!
అత్యంత వేగవంతమైన పరుగుకు చీతా కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. అది పరిగెడున్నప్పుడు చూస్తే అది గాలితో పోటీ పడుతున్నదేమో అని అనిపిస్తుంది. ఇంతటి వేగం కలిగిన చీతాకు అడ్డుపడే ఏ జీవి అయినా ప్రాణాలతో మిగలదని చెబుతుంటారు. ప్రపంచంలో చీతాల జాతి మెల్లమెల్లగా అంతరించిపోతున్నదని పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఆఫ్రికాలోని కొన్ని అడవుల్లో చీతాలు విరివిగా కనిపిస్తుంటాయి. ఇప్పుడు మీరు పైనున్న ఫొటోలో చీతాకు సంబంధించిన అద్భుతమైన ఫొటోను చూశారు. దీనిని ఒక వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో క్యాప్చర్ చేశారు. ఈ ఫొటోను చూసిన వారంతా ఆ ఫొటోగ్రాఫర్‌ను మెచ్చుకోవడంతోపాటు, అతను ఎంతో ధైర్యవంతుడైన క్రియేటర్ అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఫొటో కోసం 7 గంటల శ్రమ ఈ అద్భుతమైన ఫొటోను విబుల్డన్కు చెందిన వరల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ పాల్ గోల్డ్‌స్టీన్ తన కెమెరాలో బంధించారు. ఈ చీతా కెన్యాలోని మాసై మారా నేషనల్ పార్కులో కనిపించింది. పాల్ గోల్డ్ ఈ ఫొటో గురించి ఒక మీడియా హౌస్‌లో మాట్లాడుతూ తాను ఈ ఫొటో తీసేందుకు 7 గంటల పాటు వర్షంలో తడిసి ముద్దయ్యానని తెలిపారు. ఈ ఫొటోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ, తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే ‘ఆ క్షణంలో మంత్రముగ్ధుడనయ్యాను. అవును.. ఇందుకోసం ఏడు గంటలు వర్షంలో తడిశాను’ అనే కాప్షన్ రాశారు. ‘వారేవాహ్.. ఏం టైమింగ్‌రా బాబూ’ ఈ పొటోను పరీక్షగా చూస్తే ఒకే చిరుతకు మూడు తలలు ఉన్నాయని, అవి వేర్వేరు దిశల్లో చూస్తున్నాయని అనిపిస్తుంది. పొటోగ్రాఫర్ పర్ఫెక్ట్ టైమింగ్ అనేది ఈ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫొటోను చూసినవారంతా ‘వారేవాహ్.. ఏం టైమింగ్‌రా బాబూ’ అని ఆ ఫొటోగ్రాఫర్‌ను మెచ్చుకుంటున్నారు. నిజానికి అవి మూడు చీతాలు. అవి ఒక దగ్గరే వేర్వేరు యాంగిల్స్‌లో కూర్చున్నాయి. అది ఫొటోగ్రాఫర్ కంటపడింది. ఇది కూడా చదవండి: ఇదేమిటో తెలుసా? 90ల నాటి పిల్లలైతే ఇట్టే చెబుతారు! -
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వైద్యుడి కోసం మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్
ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు జరుపుతున్న క్రమంలో అక్కడ చిక్కుకున్న భారతీయులందరినీ స్వదేశానికి తీసుకువస్తోంది కేంద్రప్రభుత్వం. కానీ ఓ వ్యక్తి మాత్రం అక్కడి నుంచి రాలేనంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన డాక్టర్ గిరీష్‌కుమార్ ఉక్రెయిన్‌లో ఆర్థోపెడిక్ సర్జన్ వద్ద అసిస్టెంట్ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. జంతువులంటే ఇష్టపడే గిరికుమార్ జాగ్వార్ (మచ్చలు కలిగిన చిరుతపులి), బ్లాక్ పాంథర్ (నల్ల చిరుతపులి)ని పెంచుతున్నారు. తాను ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న వన్యప్రాణులను ఒంటరిగా వదిలేసి స్వదేశానికి రాలేనంటున్నారీ వైద్యుడు. హీరో చిరంజీవి నటించిన సినిమా స్ఫూర్తితోనే జాగ్వార్, పాంథర్ పులులను పెంచుకుంటున్నానని, కేవలం వాటిని రక్షించడం కోసమే ఉక్రెయిన్‌లో ఉండిపోయానని ఆయన పేర్కొన్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 'నా నుంచి ప్రేరణ పొంది మీరు జాగ్వార్, పాంథర్లను పెంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. యుద్ధ సమయంలో వాటిని వదిలి రాలేక ఆ మూగ జీవాల వెన్నంటే ఉండటం మా మనసులను కదిలిస్తోంది. వాటి మీద మీరు చూపిస్తున్న ప్రేమ, కరుణ నిజంగా ప్రశంసనీయం. మీరు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. త్వరలోనే యుద్ధం ముగిసి అంతా మామూలైపోవాలని కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్ చేశారు. చదవండి: నా పులులతోపాటే నేనూ: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వైద్యుడు -
వీటి స్నేహం బంధం చాలా గొప్పది
-
కుక్కతో చిరుత స్నేహం.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: జాత్యాహాంకారం, మత విద్వేషాలతో మనుషులు కొట్టుకు సచ్చిపోతున్నారు. కానీ ఈ జంతువులు మాత్రం జాతి వైరాన్ని మరిచి విభిన్న జాతులతో ఎంతో ప్రేమపూరితమైన స్నేహ భావంతో మెలుగుతున్నాయి. అచ్చం అలానే ఒక చిరుత, కుక్క ఎంత స్నేహ భావంగా ఉన్నాయో. పైగా అవి మొదట చూడగానే అవి ఒకే జాతి అనిపించేంత స్నేహంగా ఉంటాయి. (చదవండి: ప్రమాదం ఆ కుక్క జీవితాన్ని మార్చింది.. ఏకంగా మనిషిలా..) సరిగా చూస్తే ఈ రెండు ఎంత విభిన్న జాతులో తెలుస్తుంది. ఈ చిరుత ఎనిది నెలలు వయసులోనే తల్లికి దూరమవడంతో వెంజా రోట్వీలర్ అనే కుక్కను పెంచుకుంటున్న ఒక మహిళ ఈ చిరుతను దత్తత తీసుకుంది. ఈ చిరుతకు లునా అని పేరు పెట్టుకుని పెంచుతుంది. కానీ లునా(చిరుత), రోట్వీలర్ కొద్ది రోజుల్లోనే మంచి స్నేహితుల్లా మారిపోయాయి. అయితే దీనికి సంబంధించిన ఒక వీడియోను సదరు మహిళ "వాళ్లది విలువైన బంధం. లూనా మీపై దాడిచేయాలని సీరియస్ చూస్తుంది" అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో పాటు లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు ఓ లుక్ వేయండి. (చదవండి: ప్రతి డెలివరీ బోయ్‌కి అదే గిఫ్ట్‌గా ఇస్తాను) -
పులుల లెక్కే లేదు!
అచ్చంపేట: నల్లమల అభయారణ్య ప్రాంతంలో వన్యప్రాణుల గణన చేపట్టి ఏడాదిదాటినా ఇంతవరకు వాటి లెక్క తేలలేదు. పులులు, చిరుతలు, ఇతర జంతువులతో పాటు పక్షుల లెక్కలు కూడా ఇందులో రావాల్సి ఉంది. ప్రతి నాలుగేళ్లకోసారి దేశావ్యాప్తంగా పులుల గణన జరుగుతుంది. అందులో భాగంగా గత ఏడాది జనవరి 18 నుంచి 25 వరకు ఉమ్మడి రాష్ట్రంలోని శ్రీశైలం-నాగార్జునసాగర్, ఆదిలాబాద్ జిల్లా కావల్-జన్నారం అటవీ ప్రాంతంలో జంతువుల లెక్కింపు చేపట్టారు. పులులు సంచరించే ప్రాంతం నుంచి శాస్త్రీయ పద్ధతుల్లో పాదముద్రలు (ప్లగ్ మార్కులు) సేకరించారు. వాటిని జాతీయ పులుల సంరక్షణ సంస్థ(ఎన్టీసీఏ)కు పంపారు. అయితే ఇప్పటికీ పులుల సంఖ్య ఎంతో ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఎన్టీసీఏ పరిధిలో ఉన్న 44 టైగర్ ప్రాజెక్టుల అభయారణ్యంలో చివరిసారిగా 2010లో పులుల గణన జరిగింది. అప్పట్లో శ్రీశైలం-నాగార్జునసాగర్ ఆభయారణ్యంలో 53-67 మధ్య పులులు ఉన్నట్లు తేల్చారు. అటవీశాఖ లోతట్టు అటవీప్రాంతాల్లో లెక్కలు తీయడం లేదనే విమర్శలున్నాయి. సంప్రదాయ గణనను విశ్వసించని కేంద్రం ప్రతిఏటా కెమెరా ట్రాప్ మానిటరింగ్ టెక్నాలజీ ద్వారా పులుల గణన చేపడుతోంది. 2006 లెక్కల ప్రకారం 39 పులులుంటే... 2013లో ఆ సంఖ్య 19కి వచ్చింది. అటవీశాఖ కూడికలు, తీసివేతల ప్రకారం పులులు, చిరుతల లెక్కలు చెబుతున్నారే తప్ప వాస్తవంగా ఎన్ని ఉన్నాయన్న విషయం ఎవరికీ తెలియదు. విభజన తర్వాత.. నల్లమల అటవీప్రాంతమైన నాగార్జునసాగర్-శ్రీశైలం రాజీవ్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు మహబూబ్‌నగర్, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నల్లగొండ జిల్లాల పరిధిలో 3,568 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 2,220 చదరపు కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌కు 1,348 చదరపు కిలోమీటర్లు కేటాయించారు. తెలంగాణ పరిధిలో 15 నుంచి 20, ఆంద్రప్రదేశ్ పరిధిలో 33నుంచి47 వరకు పులులుంటాయని అధికారులు భావిస్తున్నారు. పులుల సంరక్షణకు అనుకూలం... ప్రకృతి సంపదకు పుట్టినిల్లు అయిన నల్లమల అడవి ప్రాంతంలో వన్యప్రాణులను అటవీశాఖ కాపాడుకోలేకపోతుంది. రాజీవ్ టైగర్ ప్రాజెక్టు అభివ ృద్ధికి కేంద్రం ప్రతి ఏటా రూ. కోట్లు ఖర్చు చేస్తోంది. గతంలో నల్లమలలో పర్యటించిన వన్యప్రాణుల విభాగం జాతీయ బృందం పులుల సంరక్షణకు అనుకూలమైన ప్రాంతమని తేల్చి చెప్పింది. ఎన్టీసీఏ నుంచి రావాల్సి ఉంది.. -వెంకటరమణ, డీఎఫ్ఓ అచ్చంపేట నల్లమలలో సేకరించిన జంతువుల వివరాలకు సంబంధించి జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్టీసీఏ)కు పంపించాం. అక్కడి నుంచి పూర్తి లెక్కలు రావాల్సి ఉంది. 2013లో సేకరించిన లెక్కల ప్రకారం అచ్చంపేట సబ్‌డివిజన్ పరిధిలో 19 పులులున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో మరోసారి పులుల గణన జరుగుతుంది. -
విద్యార్థులను వణికిస్తున్న చిరుతలు
తిరుపతి : తిరుపతి శివారు ప్రాంత ప్రజలను చిరుత పులుల సంచారం వణికిస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున స్థానికులతో పాటు శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్శిటీ సెక్యూరిటీ సిబ్బంది ... చిరుతల సంచారాన్ని ప్రత్యక్షంగా చూశారు. చిరుత ఆనవాళ్లు, కాలి గుర్తులు వేదిక్ వర్శిటీలో అటవీ శాఖ అధికారులు గుర్తించారు. చిరుత ఏ సమయంలో వస్తుందో, ఎవరిపైన దాడి చేస్తుందో అన్న భయం విద్యార్థులను, స్థానికులను వెంటాడుతుంది. ఎస్వీ వర్సిటీలోని హెచ్ బ్లాక్ వద్దకు తరచు చిరుత వచ్చిన ఆనవాళ్లు ఉన్నాయి. పది రోజుల కిందట కూడా చిరుత కన్పించినట్లు విద్యార్థులు చెబుతున్నారు. తరచుగా క్యాంపస్‌కు వస్తుండటంతో విద్యార్థులు హడలెత్తిపోతున్నారు. మరోవైపు అటవీశాఖ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. -
తిరుపతిలో చిరుత కలకలం
-
పరుగులు పెట్టించిన చిరుతపులి
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతిలో చిరుతపులి కలకలం రేపింది. శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సెస్(స్విమ్స్) సమీపంలో చిరుత సంచరిస్తోంది. ఆస్పత్రి వెనుకభాగంలో ఆవు, కుక్కలపై దాడి చేసి చంపేసింది. చిరుతపులిని చూసిన విద్యార్థులు, స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. అది మళ్లీ ఎప్పుడు దాడి చేస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చిరుత బారి నుంచి తమను కాపాడాలని అధికారులను కోరుతున్నారు.