ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు జరుపుతున్న క్రమంలో అక్కడ చిక్కుకున్న భారతీయులందరినీ స్వదేశానికి తీసుకువస్తోంది కేంద్రప్రభుత్వం. కానీ ఓ వ్యక్తి మాత్రం అక్కడి నుంచి రాలేనంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన డాక్టర్ గిరీష్‌కుమార్ ఉక్రెయిన్‌లో ఆర్థోపెడిక్ సర్జన్ వద్ద అసిస్టెంట్ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. జంతువులంటే ఇష్టపడే గిరికుమార్ జాగ్వార్ (మచ్చలు కలిగిన చిరుతపులి), బ్లాక్ పాంథర్ (నల్ల చిరుతపులి)ని పెంచుతున్నారు. తాను ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న వన్యప్రాణులను ఒంటరిగా వదిలేసి స్వదేశానికి రాలేనంటున్నారీ వైద్యుడు. హీరో చిరంజీవి నటించిన సినిమా స్ఫూర్తితోనే జాగ్వార్, పాంథర్ పులులను పెంచుకుంటున్నానని, కేవలం వాటిని రక్షించడం కోసమే ఉక్రెయిన్‌లో ఉండిపోయానని ఆయన పేర్కొన్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.
'నా నుంచి ప్రేరణ పొంది మీరు జాగ్వార్, పాంథర్లను పెంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. యుద్ధ సమయంలో వాటిని వదిలి రాలేక ఆ మూగ జీవాల వెన్నంటే ఉండటం మా మనసులను కదిలిస్తోంది. వాటి మీద మీరు చూపిస్తున్న ప్రేమ, కరుణ నిజంగా ప్రశంసనీయం. మీరు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. త్వరలోనే యుద్ధం ముగిసి అంతా మామూలైపోవాలని కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్ చేశారు.
చదవండి: నా పులులతోపాటే నేనూ: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వైద్యుడు
Comments
Please login to add a commentAdd a comment