విద్యార్థులను వణికిస్తున్న చిరుతలు | Cheetah fear haunts sri venkateswara vedic university | Sakshi
Sakshi News home page

విద్యార్థులను వణికిస్తున్న చిరుతలు

Published Mon, Jan 12 2015 9:46 AM | Last Updated on Sat, Sep 2 2017 7:36 PM

Cheetah fear haunts sri venkateswara vedic university

తిరుపతి : తిరుపతి శివారు ప్రాంత ప్రజలను చిరుత పులుల సంచారం వణికిస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున స్థానికులతో పాటు శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్శిటీ సెక్యూరిటీ సిబ్బంది ... చిరుతల సంచారాన్ని ప్రత్యక్షంగా చూశారు.  చిరుత ఆనవాళ్లు, కాలి గుర్తులు వేదిక్ వర్శిటీలో అటవీ శాఖ అధికారులు గుర్తించారు.

చిరుత ఏ సమయంలో  వస్తుందో, ఎవరిపైన దాడి చేస్తుందో అన్న భయం విద్యార్థులను, స్థానికులను వెంటాడుతుంది. ఎస్వీ వర్సిటీలోని హెచ్ బ్లాక్ వద్దకు తరచు చిరుత వచ్చిన ఆనవాళ్లు ఉన్నాయి. పది రోజుల కిందట కూడా చిరుత కన్పించినట్లు విద్యార్థులు చెబుతున్నారు. తరచుగా క్యాంపస్కు వస్తుండటంతో విద్యార్థులు హడలెత్తిపోతున్నారు. మరోవైపు అటవీశాఖ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement