sri venkateswara vedic university
-
కొడుక్కి బాల్య వివాహం.. ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌పై కేసు నమోదు
సాక్షి, చిత్తూరు: కుమారుడికి బాల్య వివాహం చేసిన ఘటనలో తిరుపతి ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌పై అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాల్య వివాహ చట్టం కింద రిజిస్ట్రార్‌పై రాధే శ్యామ్, శ్రీదేవి దంపతులపై పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. శాంతి నగర్లో నివాసముంటున్న రిజిస్ట్రార్.. తిరుపతి రాఘవేంద్ర మట్టంలో మైనర్ అయిన తన కుమారుడికి మైనర్ బాలికతో వివాహం జరిపించారు. రిజిస్ట్రార్ రాధేశ్యామ్ పూర్వ సంప్రదాయ పద్దతిలో అయిదు రోజుల పెళ్లి జరిపించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడించి. అటు అమ్మాయి తల్లిదండ్రులు వెంకటేవ్వర్లు శ్రావణ కుమారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి అస్వస్థత -
విద్యార్థులను వణికిస్తున్న చిరుతలు
తిరుపతి : తిరుపతి శివారు ప్రాంత ప్రజలను చిరుత పులుల సంచారం వణికిస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున స్థానికులతో పాటు శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్శిటీ సెక్యూరిటీ సిబ్బంది ... చిరుతల సంచారాన్ని ప్రత్యక్షంగా చూశారు. చిరుత ఆనవాళ్లు, కాలి గుర్తులు వేదిక్ వర్శిటీలో అటవీ శాఖ అధికారులు గుర్తించారు. చిరుత ఏ సమయంలో వస్తుందో, ఎవరిపైన దాడి చేస్తుందో అన్న భయం విద్యార్థులను, స్థానికులను వెంటాడుతుంది. ఎస్వీ వర్సిటీలోని హెచ్ బ్లాక్ వద్దకు తరచు చిరుత వచ్చిన ఆనవాళ్లు ఉన్నాయి. పది రోజుల కిందట కూడా చిరుత కన్పించినట్లు విద్యార్థులు చెబుతున్నారు. తరచుగా క్యాంపస్‌కు వస్తుండటంతో విద్యార్థులు హడలెత్తిపోతున్నారు. మరోవైపు అటవీశాఖ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.