
సాక్షి, చిత్తూరు: కుమారుడికి బాల్య వివాహం చేసిన ఘటనలో తిరుపతి ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌పై అలిపిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాల్య వివాహ చట్టం కింద రిజిస్ట్రార్‌పై రాధే శ్యామ్, శ్రీదేవి దంపతులపై పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. శాంతి నగర్‌లో నివాసముంటున్న రిజిస్ట్రార్.. తిరుపతి రాఘవేంద్ర మట్టంలో మైనర్ అయిన తన కుమారుడికి మైనర్ బాలికతో వివాహం జరిపించారు. రిజిస్ట్రార్ రాధేశ్యామ్ పూర్వ సంప్రదాయ పద్దతిలో అయిదు రోజుల పెళ్లి జరిపించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడించి. అటు అమ్మాయి తల్లిదండ్రులు వెంకటేవ్వర్లు శ్రావణ కుమారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
చదవండి: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి అస్వస్థత
Comments
Please login to add a commentAdd a comment