Svims
-
పూర్తిస్థాయిలో ‘స్విమ్స్’ అభివృద్ధి
తిరుమల: స్విమ్స్ ఆస్పత్రిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి మరింత మెరుగైన వైద్యం అందిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం చైర్మన్ అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవనంలో జరిగింది. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జేఈఓలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్ఓ నరసింహ కిషోర్ పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వైవీ మీడియాకు వెల్లడించారు. వాటిలో ముఖ్యమైనవి.. ►స్విమ్స్ ఆసుపత్రిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు రూ.97 కోట్లతో కార్డియో న్యూరో బ్లాక్, రూ.7 కోట్లతో సెంట్రలైజ్డ్ వంటశాల, రూ.7.75 కోట్లతో సెంట్రలైజ్డ్ గోడౌన్ నిర్మాణానికి టెండర్లు ఆమోదం. ►రూ.4.15 కోట్లతో తిరుమలలో అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణానికి టెండర్ల ఆమోదం. ►రూ.2.35 కోట్లతో తిరుమల హెచ్వీసీ ప్రాంతంలోని 18 బ్లాకుల్లో గల 144 గదుల అభివృద్ధి పనులు.. ►రూ.40.50 కోట్లతో తిరుమలలో వెస్ట్ ప్యాకేజీకి గాను మూడేళ్ల కాలపరిమితికి ఎఫ్ఎంఎస్ సేవలను ముంబైకి చెందిన సంస్థకు అప్పగించేందుకు టెండర్ల ఆమోదం. ►అదేవిధంగా.. రూ.29.50 కోట్లతో శ్రీవారి సేవాసదన్, వకుళమాత విశ్రాంతి గృహం, పీఏసీ 3, 4, బి–టైప్, డి–టైప్ క్వార్టర్స్ ప్రాంతాల్లో ఎఫ్ఎంఎస్ సేవలను అదే సంస్థకు అప్పగించేందుకు టెండర్ల ఆమోదం. ►గుజరాత్‌లోని గాందీనగర్, ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో శ్రీవారి ఆలయాలు నిరి్మంచేందుకు ప్రణాళిక. ►శ్రీవాణి నిధులపై శ్వేతపత్రం ►శ్రీవాణి ట్రస్టు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని.. ఈ అంశంపై రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం టీటీడీపై దు్రష్పచారం చేసేవారి మీద చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానించింది. అలాగే, టీటీడీలో పూర్తి పారదర్శక పాలన జరుగుతోందని.. ఇందుకు సంబంధించి టీటీడీ ఆస్తులపై 2021 జూన్ 21న, బంగారు, నగదు డిపాజిట్లపై 2022 నవంబరు 5న శ్వేతపత్రాలు విడుదల చేశారని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.. నిరాదరణకు గురైన ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం ప్రతినెలా ఆయా ఆలయ కమిటీల బ్యాంకు ఖాతాలో రూ.5 వేలు జమచేయాలని పాలకమండలి నిర్ణయించిందన్నారు. టీటీడీ నుంచి ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టంచేశారు. -
రాధిక కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం
సాక్షి, అమరావతి: తిరుపతి స్విమ్స్ శ్రీ పద్మావతి కోవిడ్ హాస్పిటల్ ప్రమాదంలో మృతి చెదిన కుటుంబాన్ని, గాయపడిన కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. అదే విధంగా ప్రమాదంలో మృతి చెందిన రాధిక కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.10లక్షలు ఆర్ధిక సహాయం ప్రకటించారు. గాయపడిన రాజా, నాగరత్నమ్మలకు ఒక్కొక్కరికి రూ. 2లక్షలు ఆర్ధిక సహాయం అందిస్తామని తెలిపారు. ఈ ప్రమాదంలో ఒక ఉద్యోగి మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఈ సంఘటన జరిగిన తీరుపై తక్షణమే స్పందించిన మంత్రి.. తిరుపతి స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ నుంచి ప్రమాద వివరాలను ఫోన్లో అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై సీరియస్ అయిన మంత్రి గాయపడిన కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ వెంగమ్మను ఆదేశించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన ప్రిన్సిపాల్ సెక్రటరీ డాక్టర్ జవహర్ రెడ్డితో ఫోన్ మాట్లాడి పూర్తి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై వెనువెంటనే విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఏపీ హెచ్ఎంఐడీసీ ఎండీ చంద్ర శేఖర్‌రెడ్డిని ఆదేశించారు. తిరుపతి స్విమ్స్ మొదటి అంతస్తులో కోవిడ్ బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్విమ్స్ డైరెక్టర్లకు సూచించారు. స్విమ్స్‌లో కొత్తగా నిర్మిస్తున్న ఈ భవనం మొదటి బ్లాక్‌లోకి వస్తున్న సమయంలో కరోనా పేషెంట్లకు గాయాలు అయ్యాయని చెప్పారు. ఆకస్మికంగా పెచ్చులు ఊడి పడటంతో ప్రమాదం జరిగిందని, పూర్తిస్థాయి విచారణకు ఆదేశించామని తెలిపారు. ఈ ప్రమాద ఘటనలో ఎవరైనా బాద్యులు అని తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ ఆస్పత్రుల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆళ్ల నాని చెప్పారు. -
స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రిలో గోడ కూలి మహిళ మృతి
సాక్షి, చిత్తూరు: తిరుపతి స్విమ్స్ శ్రీ పద్మావతి స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో ఆదివారం రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తగా నిర్మిస్తున్న ఈ భవనం గ్రౌండ్, మొదటి అంతస్తును కరోనా వార్డుగా వినియోగిస్తున్నారు. పై మూడంతస్తుల నిర్మాణం పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి 10.10 గంటల సమయంలో నిర్మాణంలో ఉన్న ఓ గోడ కూలి విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా వర్కర్ రాధిక(37)పై పడింది. అలాగే, కరోనా బారిన పడి చికిత్స కోసం ఆస్పతిలోకి ప్రవేశిస్తున్న మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. పెద్ద పెట్టున గోడకూలిన శబ్దానికి సిబ్బంది, కరోనా బాధితులు హడలిపోయారు. తీవ్ర గాయాలపాలై కొన ఊపిరితో ఉన్న రాధికను అంబులెన్స్‌లో స్విమ్స్ అత్యవసర విభాగానికి తరలించగా అప్పటికే మృతిచెందారు. విషయం తెలుసుకున్న మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ ఘటనా స్థలానికి చేరుకొని, గాయపడిన వారికి కరోనా వార్డులోనే చికిత్స చేస్తున్నారు. గోడ కూలిన ఘటన స్థలాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం పరిశీలించారు. గోడ కూలడానికి గల కారణలు తెలుసుకొని తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితులు, వారి కుటంబ సభ్యులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ఆయన చెప్పారు. -
ప్లాస్మా ట్రయిల్స్ నిర్వహణకు స్విమ్స్‌కు అనుమతి
సాక్షి, చిత్తూరు: ప్లాస్మా థెరపీ నిర్వహించడానికి తిరుతిలలోని స్విమ్స్‌కు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ఐసీఎంఆర్) అనుమతినిచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి తెలిపారు. కొవిడ్-19 పెషేంట్లకు ట్రయల్ బేసిస్‌పై ప్లాస్మా థెరపీ నిర్వహిస్తామన్నారు. ఈ విధానంలో కరోనా నుంచి కోరుకున్న వారి ద్వారా ప్లాస్మాను సేకరిస్తారని జవహర్ రెడ్డి తెలిపారు. దానిని అర్హులైన కొవిడ్ పేషెంట్లకు ఎక్కించి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. (చంద్రబాబుపై హైకోర్టులో పిల్..) -
టీటీడీలో ‘స్విమ్స్’ విలీనం
సాక్షి, తిరుపతి/తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇటు ఉద్యోగులు... అటు రోగులకు... భక్తులకు కొండంత అండగా నిలవనుంది. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడేందుకు పాలక మండలి నడుం బిగించింది. తిరుమల అన్నమయ్య భవన్లో బుధవారం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్) ఆసుపత్రిని టీటీడీలో విలీనం చేసి, ‘నిమ్స్’ తరహాలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా తిరుమల తిరుమలలో సంక్రాంతి తర్వాత ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. స్వామివారి లడ్డూ ప్రసాదం తీసుకెళ్లేందుకు ప్లాస్టిక్ కవర్లకు బదులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారు. ప్లాస్టిక్ నీళ్ల సీసాల స్థానంలో గాజు సీసాలు ప్రవేశపెట్టాలని, ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని టీటీడీ పాలకమండలి తీర్మానించింది. అలాగే మినరల్ వాటర్ కంటే మరింత బాగా శుద్ధి చేసిన తాగునీటిని భక్తులకు పంపిణీ చేయాలని టీటీడీ పాలక మండలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు. దీనికి స్వామివారి జలప్రసాదంగా నామకరణం చేశారు. తిరుమల తరహాలో తిరుపతిని మద్యరహిత నగరంగా మార్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. తిరుపతికి 10 కిలోమీటర్ల దూరం వరకూ మద్యం అమ్మకాలు సాగించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనున్నారు. గరుడ వారధితో ట్రాఫిక్ సమస్యకు చెక్ తిరుపతిలో ట్రాఫిక్ సమస్య నియంత్రణకు గరుడ వారధిని రీడిజైన్ చేసి, రీటెండర్లు పిలువాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల కల సాకారం టీటీడీ విద్యాసంస్థల్లో పని చేస్తున్న 382 మంది కాంట్రాక్టు టీచర్లు, లెక్చరర్లు, కల్యాణకట్టలోని 246 మంది పీస్‌రేట్ క్షురకులకు మినిమమ్ టైం స్కేల్ వర్తింపజేసేందుకు పాలక మండలి అంగీకారం తెలిపింది. టీటీడీ అటవీ విభాగంలో పనిచేస్తున్న 162 మంది సిబ్బందిని రెగ్యులరైజ్ చేయడంతోపాటు మిగిలిన 200 మందికి మినిమమ్ టైం స్కేల్ వర్తింపజేయనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల బహుమానం కింద శాశ్వత ఉద్యోగులకు రూ.14 వేలు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రూ.6,850 చొప్పున అందజేయనున్నారు. అలిపిరి వద్ద శ్రీవారి భక్తిధామం తిరుమల, తిరుపతి ప్రజల దాహార్తి తీర్చేందుకు బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి అంచనాలు రూపొందించి, ప్రభుత్వానికి పంపించాలని నిర్ణయించారు. తిరుపతిలోని అలిపిరి వద్ద 200 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో శ్రీవారి భక్తిధామం నిర్మించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. మత మార్పిడులను అరికట్టేందుకు పలు ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు శ్రీవాణి ట్రస్టు ద్వారా విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. టీటీడీ పాలక మండలి సమావేశంలో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, తుడా ఛైర్మన్, ఎక్స్ అఫిషియో సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు మేడా మల్లికార్జునరెడ్డి, అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి, తిరుపతి జేఈవో పి.బసంత్‌కుమార్, బోర్డు సభ్యులు భూమన కరుణాకరరెడ్డి, శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నంబర్ వన్ ఆసుపత్రిగా స్విమ్స్ ‘‘తిరుపతి స్విమ్స్‌ను టీటీడీలో విలీనం చేస్తున్నాం. రాష్ట్రంలోనే నంబర్ వన్ ఆసుపత్రిగా స్విమ్స్‌ను తీర్చిదిద్దుతాం. టీటీడీ సేవలను మరింత విస్తృతం చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. మెరుగైన వైద్య సేవల కోసం ఇక దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. తిరుపతి స్విమ్స్‌లోనే అత్యాధునిక వైద్యసేవలు అందించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు తిరుమలలో సంక్రాంతి తర్వాత ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది’’ – వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ చైర్మన్ టీటీడీ నిర్ణయం హర్షణీయం ‘‘స్విమ్స్‌కు టీటీడీ అండగా నిలవడం సంతోషకరం. ఈ నిర్ణయంలో సామాన్యులకు ఎంతో మేలు జరుగుతుంది. రాష్ట్ర విభజన తర్వాత కోస్తా ప్రాంతం నుంచి కూడా రోగులు అధికంగా వస్తున్నారు. టీటీడీ సహకారంతో స్విమ్స్ ఆసుపత్రి మరింత అభివృద్ధి చెందుతుంది. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి’’ – వెంగమ్మ, స్విమ్స్ డైరెక్టర్ -
టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌పై ఫిర్యాదు
సాక్షి, తిరుమల: టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌పై స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్ ఫిర్యాదు చేశారు. తాను సిఫారసు చేసిన వారిందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటూ స్విమ్స్ డైరెక్టర్‌పై ఒత్తిడి చేస్తున్నట్లు టీటీడీ వర్గాలు పేర్కొంటున్నాయి. స్విమ్స్ గవర్నింగ్ కౌన్సిల్ తీర్మానాలకు వ్యతిరేకంగా ఉద్యోగాలు ఇవ్వాలని సుధాకర్ యాదవ్ కోరుతుండటంతో స్విమ్స్ డైరెక్టర్ ఈ విషయంపై టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై విచారణ నిర్వహించిన టీటీడీ అధికారులు దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్‌కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినా..ఆ ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్‌గా నియమితులైన పుట్టా సుధాకర్ యాదవ్ ఇంకా అదే పదవిలో కొనసాగుతుండటం గమనార్హం. -
ప్రాణాలతో కోట్లాట!
అత్యంత ప్రతిష్టాత్మకమైన ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్)లో డబ్బులుంటేనే వైద్య సేవలు అన్న విధంగా మారిపోయింది. శ్రీవారి పాదాల చెంతవెలసిన స్విమ్స్‌లో వైద్యానికి రేటుకడుతున్నారు. గత వారం రోజులుగా ఈఎస్ఐ కార్పొరేషన్ రూ.10 కోట్ల బకాయి చెల్లించలేదని వైద్య సేవలను నిలుపుదల చేశారు. ఈఎస్ఐ శాఖ ముందస్తుగా రూ.కోటి చెల్లించినా ఉపయోగం లేకుండా పోయింది. పూర్తిస్థాయి బకాయి చెల్లిస్తేనే వైద్య సేవలు కొనసాగిస్తామని స్విమ్స్ యాజమాన్యం తేల్చి చెప్పింది. బకాయిలో కేవలం రూ.4 కోట్లు చెల్లిస్తే చాలని ఈఎస్ఐ అధికారులు స్విమ్స్ యాజమా న్యానికి విన్నవించారు. స్విమ్స్ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి బకాయి చెల్లించాల్సిందేని స్విమ్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. రెండు సంస్థల మధ్య బకాయి చెల్లింపు విషయం గందరగోళంగా మారడంతో ఈఎస్ఐ సేవలు నిలిచిపోయాయి. ఈఎస్ఐ లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. తిరుపతి (అలిపిరి): స్విమ్స్, ఈఎస్ఐ సంస్థల మధ్య బకాయి చెల్లింపుల విషయం వివాదంగా మారడంతో స్విమ్స్ యాజమాన్యం ఈఎస్ఐ సేవలు నిలిపివేసింది. రూ.10 కోట్లు బకాయి చెల్లిస్తేనే వైద్యసేవలు కొనసాగిస్తామని గత నెల ఆస్పత్రిలో బోర్డులు పెట్టి మే ఒకటో తేదీ నుంచి పూర్తిస్థాయిలో సేవలు నిలిపివేసింది. ఈఎస్ఐ అధికారులు తర్జనభర్జనల అనంతరం స్విమ్స్ ఖాతాలో రూ.కోటి జమచేశారు. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీం రేట్ల ప్రకారం ఇక రూ.4కోట్లు మాత్రమే బకాయి ఉందని ఈఎస్ఐ అధికారులు ప్రకటించడంతో వివాదం చెలరేగింది. స్విమ్స్ యాజమాన్యం మాత్రం బకాయి మొత్తం చెల్లిస్తేనే వైద్య సేవలు కొసాగిస్తామని తేల్చి చెప్పింది. ఈఎస్ఐ నిబంధనల ప్రకారమే రేట్లు వేశామని పేర్కొంది. రెండు సంస్థల మధ్య బకాయి చెల్లింపు విషయం ఇంకా కొలిక్కిరాలేదు. డబ్బుంటేనే వైద్యం? స్విమ్స్ నిరుపేదలకు సూపర్ స్పెషాలిటీవైద్యం అందిస్తోంది. ప్రాణదాన పథకం ద్వారా నిరుపేదలకు ప్రాణాలు పోస్తోంది. నిత్యం శ్రీవారి నామస్మరణతో నడుస్తున్న ఆస్పత్రిలో డబ్బులుంటేనే వైద్య సేవలు అనేలా మారుతోంది. కార్మిక రాజ్య బీమా సంస్థ రూ.10 కోట్లు బకాయి చెల్లించలేదని ఏకంగా కార్మికులకు వైద్య సేవలు నిలిపివేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. స్విమ్స్ యాజమాన్యం మొండిపట్టు కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన స్విమ్స్ యాజమాన్యం ఈఎస్ఐ సంస్థ బకాయి చెల్లిస్తేనే వైద్యం చేస్తామని చెప్పడంతో కార్మికులు అవస్థలు పడుతున్నారు. ఈఎస్ఐ సంస్థ బకాయిని ఈనెల 15వ తేదీ లోపు చెల్లించే అవకాశం ఉందని రాతపూర్వకంగా స్విమ్స్ యాజమాన్యానికి విన్నవించినా ఉపయోగం లేకుండా పోయింది. బకాయి మొత్తం చెల్లిస్తేనే వైద్య సేవలు అంటూ మొండిపట్టు పట్టింది. అసలేం జరిగిందంటే.. సీజీహెచ్ఎస్ రేట్ల ప్రకారం స్విమ్స్ వైద్య ఖర్చులు కేవలం రూ.5 కోట్లు మాత్రమేనని ఈఎస్ఐ అధికారులు వెల్లడించారు. అయితే దీనిపై స్విమ్స్ యాజమాన్యం ఘాటుగా స్పందించింది. నిబంధనల ప్రకారం రేట్లు వేశామని స్పష్టం చేసింది. డయాలసిస్ బ్యాగులు, కేన్సర్ విభాగానికి సంబంధించి మాత్రమే రూ.3.5 కోట్లు అయినట్లు స్విమ్స్ అధికారులు చెబుతున్నారు. ఈఎస్ఐ అధికారులు మాత్రం స్విమ్స్ వాదను వ్యతిరేకిస్తున్నారు. రెండు సంస్థల మధ్య బకాయి చెల్లింపు కొలిక్కిరాలేదు. అవస్థలు పడుతున్న లబ్ధిదారులు స్విమ్స్ వైద్య సేవలను నిలిపివేయడంతో డయాలసిస్ రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈఎస్ఐ కింద ప్రైవేట్ ఆస్పత్రుల్లో డయాలసిస్ చేసుకుంటున్నారు. అయితే స్విమ్స్‌లో కొంత మేర నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. తాజా పరిణామాలతో ఈఎస్ఐ లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైన స్విమ్స్ యాజమాన్యం మానవతాదృక్పథంతో బకాయి చెల్లింపు పక్కనబెట్టి ఈఎస్ఐ లబ్ధిదారులకు వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బకాయి చెల్లిస్తేనే వైద్య సేవలు స్విమ్స్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కఠినమైన నిర్ణయం తీసుకున్నాం. ఈఎస్ఐ నిబంధనల ప్రకారమే బిల్లులు కోడ్ చేశాం. పూర్తి స్థాయి బకాయి చెల్లిస్తేనే ఈఎస్ఐ లబ్ధిదారులకు నగదు రహిత వైద్య సేవలు కొనసాగుతాయి. – డాక్టర్ అలోక్ సచన్, మెడికల్ సూపరింటెండెంట్,స్విమ్స్, తిరుపతి రూ.కోటి చెల్లించాం డయాలసిస్ బ్యాగులు, మందులు, కొన్ని ఇతరత్రా వైద్య సేవలు ఈఎస్ఐ పరిధిలోకి రావు. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీం రేట్ల ప్రకారమే ఆన్లైన్ బిల్లులు అనుమతిస్తారు. స్విమ్స్ ఖాతాలో రూ.కోటి చెల్లించాం.– బి. రామకోటి,రీజినల్ డైరెక్టర్, ఈఎస్ఐ, ఏపీ సొంత ఖర్చుతో డయాలసిస్ స్విమ్స్‌లో ఈఎస్ఐ సేవలను నిరాకరించడంతో సొంత ఖర్చులతో డయాలసిస్ చేసుకుంటున్నా. రెండు డయాలసిస్‌లకు రూ.3 వేలు చెల్లించా. ఈఎస్ఐ రెఫరెన్స్ ఉన్న ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతాయో లేవో తెలియదు. స్విమ్స్‌లో సీనియన్ టెక్నీషియన్లు ఉన్నారు. రోగులకు ఇబ్బందులు వుండవు.– గోపాలకృష్ణమూర్తి, ఈఎస్ఐ లబ్ధిదారు, తిరుపతి సేవలు కొనసాగించాలి స్విమ్స్‌లో ఈఎస్ఐ సేవలు కొనసాగించాలి. సొంత ఖర్చుతో డయాలసిస్ చేసుకుంటున్నాం. స్విమ్స్ అధికారులు స్పందించి ఈఎస్ఐ లబ్ధిదారులను ఆదుకోవాలి. ఇలానే మరికొంత కాలం కొనసాగితే లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు పడక తప్పదు. – శేఖర్, ఈఎస్ఐ లబ్ధిదారు, తిరుపతి -
ప్రాణాలతో చెలగాటం
స్విమ్స్‌లో మెరుగైన సేవలు అందని ద్రాక్షలా మారాయి. ఇక్కడ ఇన్‌పేషెంట్లకు కూడా సరైన సేవలందడం లేదు. కొందరు అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడడంతో ఫార్మసీ విభాగంలో అరకొర మందులుంటున్నాయి. వైద్యులు రాస్తున్న ప్రిస్క్రిప్షన్ ఒకటైతే ఫార్మసీలో ఇస్తున్నవి వేరొకటి. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఔట్ సోర్సింగ్ నర్సుల సేవలపై రోగులు పెదవి విరుస్తున్నారు. సిఫార్సు ఉంటేనే అత్యవసర విభాగంలో ఎమర్జెన్సీ కేసులను అనుమతిస్తున్నారు. ఏడుకొండల వేంకటేశ్వర స్వామి పాదాల చెంత టీటీడీ నిర్వహిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని స్విమ్స్ డైరెక్టర్ పట్టించుకోవడం మానేశారనే విమర్శలు పెరుగుతున్నాయి. తిరుపతి (అలిపిరి): రాయలసీమలోని నిరుపేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందించేందుకు 1986లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడంతో స్విమ్స్‌లోనూ తెల్లరేషన్ కార్డులున్న పేదలకు సూపర్‌స్పెషాలిటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ ఆస్పత్రి నిర్వహణ తీరు విమర్శలకు తావిస్తోంది. నిరుపేదలకు ఆదరణ కరువవుతోంది. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రి ఎమర్జెన్సీ విభాగానికి వస్తే ప్రాణాలు వదులుకోవాల్సినదుస్థితి. రోగులను అడుగడుగునా వివక్ష వెంటాడుతోంది. నిర్లక్ష్యపు వైద్యం.. స్విమ్స్‌లో 900 మందికిపైగా ఇన్పేషెంట్లుంటారు. 28కిపైగా విభాగాలున్నాయి. జనరల్ మెడిసిన్, సిటీ సర్జరీ వార్డులలో వైద్య సేవలపై యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. బీపీ, షుగర్ వంటి పరీక్షలు నిర్వహించే సమయంలో కూడా నర్సులు బాధ్యతారహితంగా పనిచేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఉదయం అల్పాహారం తీసుకోకుండా షుగర్ శాతం కొలుస్తాయి. ఈ పరీక్ష ఇన్‌పేషెంట్లకు తెల్లవారుజామును 2.30లకే చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. ఇలా చేయడం వల్ల షుగర్ శాతం అధికంగా చూపించే ప్రమాదముంది. షుగర్ శాతం అనుగుణంగా వైద్యులు మందులు రాస్తే ఇక ఆ రోగి ఆరోగ్యం మరింత క్షీణించక తప్ప దు. స్విమ్స్‌కు వచ్చి అనారోగ్యం బారిన పడుతున్నామని రోగులంటున్నారు. స్విమ్స్‌లో ఔట్ సోర్సింగ్ నర్సులు మొక్కుబడిగా పనిచేస్తున్నారు. వీరిపై అధికారులకు ఫిర్యా దు చేసినా స్పందన లేదు. అవినీతి ఫార్మసీ.. ఫార్మసీ విభాగం అవినీతిమయంగా మారింది. కమీషన్లందుకుని తిరుపతిలోని కొన్ని మెడికల్ ఏజెన్సీలకు మందుల సరఫరా కాంట్రాక్ట్ అప్పగించారు. ఇందులో అధికంగా జనరిక్ మందులే ఉంటున్నా యి. వైద్యులు సూచించే మందులు ఫార్మసీలో దొరకడం లేదు. ఏజెన్సీలకు లాభమొచ్చే కొన్ని రకాల మందులు మాత్రమే సరఫరా చేస్తున్నారు. రోగులకు అవగాహన లేకుండా ఇక్కడిచ్చే మందులు వేసుకుంటే మరింత అనారోగ్యం పాలవ్వక తప్పదు. స్విమ్స్‌లో ఉన్నత పదవుల్లో ఉన్న సీఎం బంధువుల కమీషన్ల వ్యవహారం వల్ల ఫార్మసీ సేవలు దెబ్బతింటున్నాయి. అత్యవసర విభాగం సేవలు అధ్వానమే. 15 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరో 10 కేసులకు స్ట్రెచర్లపై ఉంచి సేవలందిస్తున్నారు. ఇంతపెద్ద విభాగంలో 10 వెంటిలేటర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సిఫారసు ఉంటేనే ఇక్కడ చేర్చుకుంటున్నారు. ప్రముఖులకు కూడా ఇక్కడ నామమాత్ర వైద్య సేవలే. సాధారణ రోగుల పరిస్థితి దారుణంగా మారింది. 300 మందికిపైగా వైద్యులు, 250 మందికిపైగా నర్సులు పనిచేస్తున్నారు. పీజీలు, నర్సింగ్, ఎంబీబీఎస్, పారామెడికల్ విద్యార్ధులు రోగులకు సేవలందిస్తున్నారు. అయినా ఇన్‌పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. రాయలసీమ ప్రాంతం నుంచే గాక నెల్లూరు నుంచి ఓపీ నిమిత్తం రోజుకు 2వేల మంది రోగులు వస్తుంటారు. పట్టించుకోని డైరెక్టర్.. స్విమ్స్‌లో పరిపాలన పూర్తిగా గాడితప్పింది. డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ నెలలో ఎన్ని రోజులు ఆస్పత్రిలో ఉంటారన్నది చెప్పలేని పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిగట్టుకుని ఈయన్ను నియమించారు. గత డైరెక్టర్ డాక్టర్ వెంగ మ్మ ఓపీ, వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న సేవలను ఆరా తీసేవారు. సేవా లోపం ఉంటే తక్షణం చర్యలు తీసుకునేవారు. ప్రస్తుత డైరెక్టర్ అందుబాటులో ఉండడం లేదు. వైద్య సేవలపై ఫిర్యాదు చేయాలనుకుంటే కనీసం డైరెక్టర్ ఛాంబర్ గేటు వరకు వెళ్లడం కష్టమే. -
వసూళ్ల దందా..!
స్విమ్స్ పాలన గాడి తప్పిందని చెప్పే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. మొన్నటికి మొన్న స్విమ్స్‌లో జర్నలిస్టులపై దాడి, ఆ తర్వాత టీటీడీ అంబులెన్స్ డ్రైవర్‌కు వైద్యం నిరాకరణ, ఆరోగ్యశ్రీ అమలులో అవినీతి, ఇప్పుడేమో స్విమ్స్ ఉద్యోగులు, వైద్యుల నుంచి అక్రమ వసూళ్లకు లిఖిత పూర్వక ఉత్తర్వులు జారీ చేయడం సీఎం బంధువు కీలకమైన పదవిలో కూర్చుని అక్రమాలకు తెర తీశారన్న ఆరోపణలకు ఈ సంఘటనలు బలం చేకూరుస్తున్నాయి. సాక్షి, తిరుపతి: స్విమ్స్ అధికారులు సిల్వర్ జూబ్లీ పేరుతో నేరుగా వసూళ్ల దందాకు దిగారు. స్విమ్స్ సిల్వర్ జూబ్లీ ఆర్చ్(స్వాగత తోరణం) ఏర్పాటుకు రెగ్యులర్ ఉద్యోగుల నుంచి ముక్కుపిండి వసూలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే విరాళాలకు సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేయడం గమనార్హం. ఉద్యోగులు నేరుగాగాని, వేతనం నుంచి అయినా అందించవచ్చని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొనడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇప్పటికే ఈ దందాను అధిక శాతం మంది వైద్యులు తిరస్కరించారు. వారం రోజులు గా ఈ తంతు స్విమ్స్‌లో గుట్టుగా సాగుతోంది. సిల్వర్ జూబ్లీ వసూళ్లు.. స్విమ్స్ ఆస్పత్రి 1993 ఫిబ్రవరి 26న ప్రారంభమైంది. ఇప్పుడు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఫిబ్రవరి 24 నుంచి 26వ తేదీ వరకు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు సమీప బంధువుగా చలామణి అవుతూ స్విమ్స్‌లో కీలక పదవిలో ఉన్న వ్యక్తి చక్రం తిప్పుతూ స్విమ్స్ పరువు తీస్తున్నారని చెప్పడానికి నిదర్శనమే ఈ వసూళ్లు. సిల్వర్ జూబ్లీ ఆర్చ్ ఏర్పాటుకు స్విమ్స్‌లోని 600 మంది రెగ్యులర్ ఉద్యోగుల నుంచి నగదును సమకూర్చాలని సీఎం సమీప బంధువు ఉన్నతాధికారులకు సూచించి నట్లు çసమాచారం. ఆయన సూచించడమే తడువుగా వారం రోజుల క్రితం స్విమ్స్‌లోని అన్ని విభా గాలకు సర్క్యులర్ జారీ చేశారు. విరాళం ఇవ్వడానికి ఇష్టమైతే ఒక రోజు, రెండు రోజుల వేతనం, అంతకంటే ఎక్కువే ఇవ్వచ్చని ఉత్తర్వుల్లో సూచిం చారు. నగదును నేరుగా అధికారులకు అందజేసే వెసులుబాటును కూడా కల్పించారు. వసూళ్ల దందాతో ఉద్యోగులు బిత్తరపోతున్నారు. అధికా రులు జారీ చేసిన సర్క్యులర్‌లో ఆర్చ్ ఎస్టిమేషన్ చూపకపోవడం కొసమెరుపు. అయితే ఈ వసూళ్ల దందాను సగానికి పైగా వైద్యులు తిరస్కరిం చారు. కార్డియాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాల్లోని వైద్యులు పూర్తిగా దీన్ని వ్యతిరేకించి నట్లు సమాచారం. టీటీడీ తలచుకుంటే... స్విమ్స్ సిల్వర్ జూబ్లీ ఆర్చ్ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు టీటీడీకి రిక్విజేషన్ లెటర్ పెట్టుకుంటే చాలు ఆర్చ్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుంది. అయితే స్విమ్స్‌లో కీలక పదవిలో ఉన్న సీఎం బంధువు ఉన్నతాధికారులను తప్పుదారి పట్టించడం వల్లే వసూళ్ల దందాకు తెరతీశారు. ఇప్పటికే దీనిపై స్విమ్స్ ఉద్యోగుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. స్విమ్స్ పరువును బజారుపాలు చేసే ఇటువంటి నిర్ణయాలపై ఉన్నతాధికారులు పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్విమ్స్ ఉద్యోగులు చెబుతున్నారు. వసూళ్లపై సాక్షి అధికారులను వివరణ అడిగే ప్రయత్నం చేయగా వారు అందుబాటులోకి రాలేదు. -
ఈ కేన్సరుకు మందులేదా..
► ఆంకాలజీ ఓపీలో పడిగాపులు ► ఫుట్‌పాత్‌లను ఆశ్రయిస్తున్న వైనం ► పట్టించుకోని వైద్యులు..సిబ్బంది ► పరికరాలున్నా అందని సేవలు తిరుపతి మెడికల్: శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞా న సంస్థ (స్విమ్స్) కేన్సర్ విభాగంలో రోగులకు పడిగాపులు తప్పడం లేదు. స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నా రోగులకవి చేరే పరిస్థితి లేదు. ఆసుపత్రిలోని వైద్య విభాగాల మధ్య సమన్వయం తీసుకురావడంలో విఫలం అవుతున్నారు. ప్రధానంగా కేన్సర్ విభాగంలో ఆంకాలజి, సర్జికల్ ఆం కాలజి, రేడియేషన్ ఆంకాలజి అనే మూడు ఉప విభాగాలున్నాయి. రూ.12 కోట్లతో పెట్ స్కానింగ్, రూ.14 కోట్లతో వ్యాధి నిర్థారణ పరికరాలు, రూ.1.2 కోట్ల విలువైన రెండు రేడియోథెరపీ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. 80 పడకల సామర్థ్యముంది. రేడియేషన్ ఆంకాలజీకి ఆరోగ్యశ్రీ అనుమతి ఉంది. నిర్ధారించేందుకు ఖరీదైన పరికరాలున్నాయి. రేడియేషన్ థెరపీలోనూ ఆధునిక పరికరాలున్నాయి. మూడు విభాగాలకూ వైద్యాధికారులున్నారు. రెండు విభాగాల్లో ఐదుగురు రెసిడెన్స్ డాక్టర్లు (పీజీ), నలుగురు రేడియో థెరపీ టెక్నీషియన్లు ఉన్నారు. వీరితో పాటు నర్సులు .. సిబ్బంది 50 మంది వరకూ ఉన్నారు. రాయలసీమ పేదలు ఇక్కడికే వస్తుంటారు. ఇక్కడ సమస్యల్లా వైద్యులు అందుబాటులో ఉండరనేదే. ఇద్దరు విభాగాధిపతుల ఉదాశీనత ఫలితంగా రోగులకు కష్టమేర్పడుతోందని తెలుస్తోంది. సోమవారం రేడియేషన్ థెరపీ కోసం 150 మందికి పైగా రోగులు వెనుదిరిగారు. కారణం డాక్టర్లు లేకపోవడమే. వి«భాగాధిపతులు పట్టనట్టు వ్యవహరించడంతో సేవలకు ఇబ్బంది కలుగుతోందనేది విమర్శ. తమకు పరిపాలనా విభాగంలో ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఇద్దరు విభాగాధికారులు వైద్యసేవలు అందించేందుకు ఆసక్తి చూపడం లేదని తెలిసింది. మరో ప్రాంతానికి బదిలీపై వెళ్లి పోయేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో విధులకు సరిగ్గా రావడం లేదు. దీంతో కింది స్థాయి వైద్యులు, వైద్య సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా సేవలందిస్తున్నారు. సరిపడని పడకలు రోజు రోజుకూ పెరుగుతున్న రోగుల సంఖ్యకు తగ్గట్టుగా పడకలు సరిపోవడం లేదు. 300 పడకలు కావాల్సి ఉంది. గతంలో యాజమాన్యం ప్రభుత్వానికి నివేదిక కూడా పంపింది. 300 పడకలతో పాటు వంద మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు కావాలని కోరింది. ప్రభుత్వం స్పందించక పోవడంతో ప్రత్యామ్నాయంగా టీటీడీకి చెందిన సత్రంలో 20 గదులను తీసుకుని రోజూ ప్రత్యేక వాహనంలో రోగులను తరలిస్తున్నారు. -
స్విమ్స్ ఓపీ సేవల్లో మార్పులు
తిరుపతి మెడికల్: రోగుల సంఖ్యకు అనుగుణంగా శ్రీవెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) మెడిసిన్ ఓపీ విభాగం వైద్య సేవల్లో మార్పులు చేసినట్లు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టి.ఎస్.రవికుమార్ పేర్కొన్నారు. స్విమ్స్ మెడిసిన్ విభాగాన్ని నాలుగు విభాగాలుగా విభజించినట్లు తెలిపారు. సోమవారం నుంచి శనివారం వరకు ఈ విభాగాల ద్వారా రోగులకు మెడిసిన్ అవుట్, ఇన్ పేషంట్ వైద్య సేవలను అందించనున్నట్లు వెల్లడించారు. మెడిసిన్ 1వ యూనిట్లో డాక్టర్ అల్లాడి మోహన్ సోమవారం నుంచి గురువారం వరకు, మెడిసిన్ 2వ యూనిట్లో డాక్టర్ సిద్ధార్థకుమార్ మంగళవారం నుంచి శుక్రవారం వరకు, 3వ యూనిట్లో డాక్టర్ కత్యార్మాల్ బుధవారం నుంచి శనివారం వరకు ఓపీడీ విభాగం 25, 26 గదుల్లో ఓపీని నిర్వహిస్తారని తెలిపారు. అదే విధంగా స్విమ్స్ అనుబంధ ఐ.పి.డబ్లు్య బ్లాక్‌లో మెడిసిన్ 4వ యూనిట్లో డాక్టర్ సదాశివయ్య సోమ, బుధ, శుక్రవారాల్లో వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. రుమటాలజీ విభాగానికి చెందిన డాక్టర్ శిరీష ఓపీడీ బ్లాక్‌లోని 31వ గదిలో బుధ, శుక్రవారాల్లో రోగులకు వైద్య సేవలు అందిస్తారని పేర్కొన్నారు. ఈ నూతన విభాగం వైద్య సేవలు ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని, రోగులు మార్పులను గుర్తించి వైద్యసేవలు పొందాలని కోరారు. -
తిరుమల కొండపై రోడ్డు ప్రమాదం
తిరుమల: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులతో వెళుతున్న ఓ బొలెరో వాహనం అదుపు తప్పి రెండో ఘాట్‌రోడ్డులోని 10 వ మలుపు వద్ద వద్ద పిట్టగోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో 10మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాగా క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. బాధితులు నెల్లూరు జిల్లావాసులుగా గుర్తించారు. -
స్విమ్స్ లో కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి కార్పొరేషన్: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) లో వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు పొందేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని డెరైక్టర్ డాక్టర్ టి.ఎస్.రవికుమార్ శుక్రవారం తెలిపారు. బిఎస్సీ నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బిఎస్సీ పారామెడికల్, డిప్లొమో ఇన్ రేడియోథెరపీ టెక్నాలజీ కోర్సుల్లో అడ్మిషన్లు ఉన్నట్టు తెలిపారు. ఆసక్తిగల ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఏదైనా మీ సేవ, ఆన్లైన్ సెంటర్ల ద్వారా జూన్ 3లోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు స్విమ్స్ వెబ్సైట్ http://svimstpt.ap.nic.in లో సంప్రదించవచ్చని డెరైక్టర్ తెలిపారు. -
తిరుమలలో ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
తిరుమలలోని పీయూసీ-3 వద్ద కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ సోమవారం మధ్యాహ్నం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారికి స్థానిక అశ్వనీ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. -
రెడ్‌క్రాస్ ముసుగులో అవినీతి
► జనరిక్ మెడికల్ షాపు పేరుతో రూ.15 లక్షలు స్వాహా ► డిఫెన్స్ డ్ర గ్స్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ► అధికారి చేతివాటం విచారణకు ఆదేశించిన స్విమ్స్ యాజమాన్యం తిరుపతి కార్పొరేషన్ : వడ్డించేవాడు మనోడైతే ఏ బంతిలో కూర్చుంటే ఏముంది అన్న సామెతలా మారింది స్విమ్స్‌లోని అధికారుల తీరు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (రెడ్‌క్రాస్) అంటే మంచి బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్‌ను తమకు అనుకూలంగా మలుచుకుని స్విమ్స్‌లోని కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. జనరిక్ మెడికల్ షాపు నుంచి బ్రాండెడ్ డ్రగ్స్ కొనుగోలు చేసి లక్షలాది రూపాయలు స్వాహా చే సిన ఘటనలో స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్‌పై చెక్ బౌన్స్ కేసు నమోదు కావడం, విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్విమ్స్‌లోని షాపు నంబరు 2లో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో జనరిక్ మెడికల్ షాపు నిర్వహిస్తున్నారు. ఇందులో హాస్పిటల్ డ్రగ్స్ అతి తక్కువ ధరకు విక్రయిస్తుంటారు. అయితే జనరిక్ షాపు తిరుపతి కార్యదర్శి శ్రీశెట్టి, కోశాధికారి, ప్రస్తుత స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ సత్యనారాయణరెడ్డి పేరుతో ఆంధ్రాబ్యాంక్ అకౌంట్ నుంచి 2015 జనవరిలో రూ.24లక్షలకు బ్రాండెడ్ మందులు కొనుగోలు చేశారు. వాటిని అధిక ధరలకు విక్రయాలు చేసి సొమ్ము చేసుకున్నారు. మందులు తీసుకొచ్చిన హైద రాబాద్‌కు చెందిన శ్రీశక్తి జనరిక్ ఏజెన్సీ, గుంటూరుకు చెందిన విశ్వసాయి జనరిక్ ఏజెన్సీ, తిరుపతికి చెందిన వీరేంద్ర సర్జికల్ ఏజెన్సీలకు మాత్రం రూ.15.60లక్షలు చెల్లించకుండా స్వాహా చేశారు. సదరు ఏజెన్సీలు తమకు చెల్లని చెక్ ఇచ్చి మోసం చేశారని కేసు పెట్టడంతో వారికి నోటీసులు జారీ చేశారు. విచారణకు ఆదేశించిన మంత్రి.. ఇక్కడ జరిగిన మోసాన్ని ఏజెన్సీలు మంత్రి దృష్టికి తీసుకెళ్లాయి. ఆయన ఆదేశాల మేరకు స్విమ్స్ యాజమాన్యం గత ఏడాది నవంబర్‌లో సత్యనారాయణ, శ్రీశెట్టిపై విచారణకు క్రెడిట్ సెల్ ఏడీ స్థాయి అధికారి ఆదికృష్ణయ్యను నియమించింది. ఈ కేసులో ఉన్న మెడికల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ ఇదివరకే స్విమ్స్‌కు డిఫెన్స్ డ్రగ్స్ సరఫరా చేసిన ఆరోపణలో విచారణ ఎదుర్కొంటున్నారు. మరో నిందితుడు శ్రీ శెట్టి మాత్రం అజ్ఞాతంలో ఉన్నారు. షాపు కేటాయింపులోనూ అవినీతి.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాలసుబ్రమణ్యం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీకి రాష్ట్ర కార్యదర్శిగా ఉంటూ స్విమ్స్‌లో జనరిక్ మెడికల్ (జీవనధార ఫార్మసీ) షాపు పొందారు. 2014 ఆగస్టు 21న రెడ్‌క్రాస్ సొసైటీ పేరుతో షాపు నెంబరు 2ను మూడేళ్ల కాల పరిమితిపై వర్క్ ఆర్డర్ ఇచ్చారు. నెలకు రూ.15లక్షలకు పైగా బాడుగ వస్తున్న షాపు నెంబరు 2ను కేవలం నెలకు రూ.10వేలు బాడుగ చెల్లించేలా, అదికూడా మూడేళ్లకు వర్క్ ఆర్డర్ ఉంటే 5 సంవత్సరాలకు లోపాయికారి అగ్రిమెంట్‌పై అడ్డంగా కట్టబెట్టేశారు. తద్వారా సంస్థకు నెలకు లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లిందని స్విమ్స్ యాజమాన్యం భావిస్తోంది. -
స్విమ్స్ కూడా ‘సీమ’ వాసులకే కాదు
సాక్షి ప్రతినిధి-తిరుపతి: తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల సీట్ల భర్తీ వ్యవహారంలో రాయలసీమ వాసుల గొంతుకోసిన రాష్ట్ర ప్రభుత్వం తన పంతం నెగ్గించుకోవడానికి స్విమ్స్ కూడా రాయలసీమది కాదనే వాదన అందుకుంది. ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 28వ తేదీ దాఖలుచేసిన పిటిషన్లో స్విమ్స్ రాష్ట్ర యూనివర్శిటీ అనీ, అలాంటప్పుడు దాని ఆధీనంలో నడుస్తున్న శ్రీపద్మావతీ మహిళా వైద్య కళాశాల రాయలసీమ వాసులది మాత్రమే ఎలా అవుతుందనే వాదన లేవదీసింది. మెడిసిన్ సీట్ల వ్యవహారంలోనే తమకు అన్యాయం జరిగిందని పెద్దఎత్తున ఆందోళనకు దిగిన సీమవాసులకు, ఇకపై స్విమ్స్‌లో జరిగే ఉద్యోగ నియామకాల్లో కూడా అన్యాయం చేయడానికి కత్తి సిద్ధమైంది. శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాల.. శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ పరిధిలోకి వస్తుంది. దీని ప్రకారం ఈ కళాశాలలోని 150 సీట్లలో 107 సీట్లు రాయలసీమ, నెల్లూరు వాసులకు కేటాయించాలి. 85 శాతం కోటాకు రాష్ట్ర ప్రభుత్వం 120 జీవోతో కత్తెర వేసింది. ఈ కళాశాలను రాష్ట్ర కళాశాలగా చూపుతూ ఇక్కడి సీట్లను భర్తీ చేయడంతో రాయలసీమ, నెల్లూరు జిల్లాల వాసులు 95 మెడిసిన్ సీట్లు కోల్పోయారు. ఈ సీట్లన్నీ కోస్తా ప్రాంతానికి చెందిన విద్యార్థులకు దక్కాయి. ఈ అన్యాయంపై రాయలసీమ విద్యార్థుల తల్లిదండ్రులు హైకోర్టుకెక్కారు. ప్రభుత్వం జారీచేసిన 120 జీవో రాజ్యాంగ విరుద్ధమైనదనీ, దీన్ని కొట్టేసి తమ ప్రాంతానికి 85 శాతం సీట్లు లభించేలా తిరిగి కౌన్సెలింగ్ జరిపేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును అభ్యర్థించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు జీవో 120 రాజ్యాంగ విరుద్ధమైందిగా తేల్చి రాయలసీమ, నెల్లూరు జిల్లాల విద్యార్థులకు 85 శాతం సీట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రాయలసీమ వ్యతిరేక తీరుపై జనం పెద్ద ఎత్తున ఉద్యమించారు. ప్రభుత్వ పట్టుదలతో శాశ్వత అన్యాయం శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాల సీట్ల భర్తీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తన పంతం నెగ్గించుకోడానికి సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌తో రాయలసీమ వాసులకు శాశ్వతంగా అన్యాయం జరిగే ప్రమాదం ఏర్పడింది. 1995లో స్విమ్స్ యూనివర్శిటీగా ప్రభుత్వం చట్టం చేసింది. దీన్ని ఆయుధంగా వాడుకుని తమ వాదన నెగ్గించుకునే ఎత్తుగడ వేసింది. శ్రీపద్మావతి మెడికల్ కళాశాలే కాదు స్విమ్స్ కూడా రాయలసీమకు మాత్రమే చెందినది కాదనే వాదన లేవదీసింది. రాయలసీమ, నెల్లూరు జిల్లాల వాసులకు 85 శాతం సీట్లు కేటాయించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టి వేయాలనీ, అలా కాని పక్షంలో తీవ్ర ఇబ్బందులు పడతామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు విన్నవించుకుంది. సుప్రీం కోర్టు ఈ వాదనతో ఏకీభవిస్తే భవిష్యత్తులో స్విమ్స్లోను, టీటీడీలో కూడా ఉద్యోగాల భర్తీ విషయంలో రాయలసీమ వాసులకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఏర్పడుతుంది. స్విమ్స్‌ను కేవలం రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోని పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతోనే దివంగత సీఎం ఎన్టీ రామారావు నిర్మింప చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం దీన్ని రాష్ట్రం మొత్తానికి సంబంధించిన సంస్థగా పేర్కొంటూ సుప్రీం కోర్టు కెక్కడంతో భవిష్యత్తులో ఇతర ప్రాంతాల వాసులు చట్టపరమైన వివాదాలు లేవనెత్తేందుకు ప్రభుత్వమే అవకాశం కల్పించింది. -
స్విమ్స్ డెరైక్టర్‌గా డాక్టర్ టీఎస్ రవికుమార్
సాక్షి ,ప్రతినిధి తిరుపతి: శ్రీవెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) డెరైక్టర్‌గా టీఎస్.రవికుమార్‌ను నియమించా రు. విజయవాడలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని మంత్రి వెల్లడించారు. స్విమ్స్ డెరైక్టర్‌గా పోలా భాస్కర్ బాధ్యతలు స్వీకరించిన రోజునే ఈయన నియామకాన్ని ప్రకటించడం గమనార్హం. రవికుమార్ విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో మంత్రి కామినేనితో పాటు, వైద్య శాఖ ఉన్నతాధికారులను సైతం శనివారం కలిసినట్టు తెలుస్తోంది. నియమాక ఉత్తర్వులు సోమవారంవెలువడే అవకాశం ఉంది. ఇంతకు మునుపు టీఎస్.రవికుమార్ చెన్నైలోని జిప్మర్ ఆసుపత్రిలో రెండేళ్ల పాటు డెరైక్టర్‌గా పని చేశారు. చెన్నై మెడికల్ కళాశాలలో ఎంఎస్ జనరల్ సర్జన్ చేశారు. అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌తో పాటు వివిధ హోదాల్లో పని చేశారు. ఆంకాలజీలో ప్రొఫెసర్‌గా గుర్తింపు పొందారు. -
స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ తొలగింపు
తిరుపతి : స్విమ్స్ (శ్రీవెంకటేశ్వర వైద్య విజ్ఞానసంస్థ) డెరైక్టర్ డాక్టర్ వెంగమ్మను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమె స్థానంలో ఇంఛార్జ్ బాధ్యతలను టీటీడీ జేఈవో కోలా భాస్కర్‌కు అప్పగించారు. స్విమ్స్ డైరెక్టర్ గా వెంగమ్మ బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధి వేగవంతమైన విషయం తెలిసిందే. అయితే, కొన్ని నెలలుగా స్విమ్స్ లో జరుగుతున్న పరిణామాలు ఆమెను తీవ్రంగా బాధించిన నేపథ్యంలో వ్యక్తిగత కారణాల పేరిట ఆమె రాజీనామా చేశారు. కానీ, అంతకుముందు జిల్లా పర్యటనకు వచ్చిన వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రేణిగుంట ఎయిర్‌పోర్టుకు డాక్టర్ వెంగమ్మను పిలిపించుకుని పదవి నుంచి తప్పుకోవాలని హెచ్చరికలు చేసినట్టు సమాచారం. ఇంతకుమునుపే ఆమెను స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలగేలా చేసేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను ప్రభుత్వం పాచికగా ప్రయోగించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే స్విమ్స్‌లోని కొన్ని పైళ్లను తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ తనిఖీల్లో ఎలాంటి ఆరోపణలు, అవినీతి ఆధారాలు లభించకపోగా డెరైక్టర్ నిక్కచ్చిగా వ్యవహరించినట్టు ప్రాథమిక సమాచారం అందింది. దీంతో స్విమ్స్ డెరైక్టర్ పదవి నుంచి వెంగమ్మను తప్పించి, తమకు అనుకూలమైన వారిని నియమించుకోనేందుకు వీలుగా చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే స్విమ్స్ డెరైక్టర్ వెంగమ్మను కుప్పానికి పిలిపించుకుని పదవి నుంచి తప్పుకోవాలని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుగుదేశం వర్గాల్లోనే చర్చ జరిగింది. ఈలోగానే స్విమ్స్ డైరెక్టర్‌గా వెంగమ్మను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
విద్యార్థులను వణికిస్తున్న చిరుతలు
తిరుపతి : తిరుపతి శివారు ప్రాంత ప్రజలను చిరుత పులుల సంచారం వణికిస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున స్థానికులతో పాటు శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్శిటీ సెక్యూరిటీ సిబ్బంది ... చిరుతల సంచారాన్ని ప్రత్యక్షంగా చూశారు. చిరుత ఆనవాళ్లు, కాలి గుర్తులు వేదిక్ వర్శిటీలో అటవీ శాఖ అధికారులు గుర్తించారు. చిరుత ఏ సమయంలో వస్తుందో, ఎవరిపైన దాడి చేస్తుందో అన్న భయం విద్యార్థులను, స్థానికులను వెంటాడుతుంది. ఎస్వీ వర్సిటీలోని హెచ్ బ్లాక్ వద్దకు తరచు చిరుత వచ్చిన ఆనవాళ్లు ఉన్నాయి. పది రోజుల కిందట కూడా చిరుత కన్పించినట్లు విద్యార్థులు చెబుతున్నారు. తరచుగా క్యాంపస్‌కు వస్తుండటంతో విద్యార్థులు హడలెత్తిపోతున్నారు. మరోవైపు అటవీశాఖ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. -
తిరుపతిలో చిరుత కలకలం
-
పరుగులు పెట్టించిన చిరుతపులి
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతిలో చిరుతపులి కలకలం రేపింది. శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సెస్(స్విమ్స్) సమీపంలో చిరుత సంచరిస్తోంది. ఆస్పత్రి వెనుకభాగంలో ఆవు, కుక్కలపై దాడి చేసి చంపేసింది. చిరుతపులిని చూసిన విద్యార్థులు, స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. అది మళ్లీ ఎప్పుడు దాడి చేస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చిరుత బారి నుంచి తమను కాపాడాలని అధికారులను కోరుతున్నారు. -
స్విమ్స్, నిమ్స్ అప్‌గ్రేడేషన్
కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన(పీఎంఎస్ఎస్వై) కింద మొదటి, రెండవ విడతల్లో 19 ప్రభుత్వ వైద్య కళాశాలలను అప్‌గ్రెడేషన్ చేస్తోందని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా శుక్రవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీవెంక టేశ్వర ఇన్స్టి ట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీ (తిరుపతి) 95 శాతం అప్‌గ్రెడేషన్ పూర్తైదని, రూ.57.87 కోట్ల నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (హైదరాబాద్) అప్‌గ్రెడేషన్ పూర్తైదని, రూ.94.93 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. తెలంగాణలోని గాంధీ మెడికల్ కళాశాల (సికింద్రాబాద్)కు రూ.3.15 కోట్లు, కాకతీయ వైద్య కళాశాల(వరంగల్)కు రూ.3.96 కోట్లు, ఉస్మాని యా వైద్య కళాశాలకు రూ.16.45 కోట్లు, ఏపీలోని ఆంధ్రా మెడికల్ కళాశాల (వైజాగ్)కు రూ.5.41 కోట్లు, గుంటూరు వైద్యకళాశాలకు రూ.7.55 కోట్లు, సిద్ధార్థ మెడికల్ కళాశాల (విజయవాడ)కు రూ.11.84 కోట్లు, రంగరాయ వైద్య కళాశాల (కాకి నాడ)కు రూ.3.33 కోట్లు, కర్నూలు వైద్య కళాశాలకు రూ.10.09 కోట్లు, ఎస్వీ వైద్య కళాశాల (తిరుపతి)కు రూ.6.85 కోట్లు, ప్రభుత్వ వైద్య కళాశాల(అనంతపూర్)కు రూ.కోటి నిధులు విడుదలైనట్టు తెలిపారు. పీఎంఎస్ఎస్వై పథకం కింద మూడో విడతలో అప్ గ్రెడేషన్ కోసం సిద్థార్థ వైద్య కళాశాల (విజయవాడ), రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఆదిలాబాద్), కాకతీయ వైద్య కళాశాల (వరంగల్) నుంచి ప్రతిపాద నలు అందాయని మంత్రి జేపీ నడ్డా వివరించారు. -
ఆ భవనం ఎవరికి? విద్యకా.. వైద్యానికా..
ఒకవైపు తిరుపతిలో మొట్టమొదటి మహిళా వైద్య కళాశాల.. మరో వైపు వేలాది మంది పేదలు వచ్చే మెటర్నిటీ ఆస్పత్రి.. ఇటు కళాశాల నిర్వహణకు సరైన భవనం లేదు.. అటు గర్భవతులు, బాలింతలు పడుకునేందుకు బెడ్లు లేవు.. ఈ నేపథ్యంలో మెటర్నిటీ ఆస్పత్రి కోసం నిర్మిస్తున్న 300 పడకల భవనంపై స్విమ్స్ మెడికల్ కళాశాల కన్నుపడింది. దీనికోసం రెండు సంస్థలూ పోరాడుతున్నాయి. చివరికి ఈ భవనం ఎవరికి దక్కుతుందో.. తిరుపతి కార్పొరేషన్: రాయలసీమకే తలమానికంగా ఏర్పాటు చేస్తున్న మూడు వందల పడకల మెటర్నిటీ భవన నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. అయితే ఈ భవనాన్ని ఎవరికి కేటాయించాలన్నది వివాదాస్పదంగా మారుతోంది. ప్రస్తుతం మెటర్నిటీ ఆస్పత్రికి అనుబంధంగా రూ.72 కోట్లతో 300 పడకలతో అత్యాధునిక వసతులతో భవన నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈ భవనాన్ని స్విమ్స్‌కు కేటాయించేందుకు రంగం సిద్ధమైంది. దీనికి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ ఉన్నతాధికారి తీవ్రంగా కృషి చేస్తున్నట్టు ఆస్పత్రి వర్గాలు బహిరంగంగా ఆరోపిస్తున్నాయి. అయితే ఆ నూతన భవనం తమకే కేటాయించాలని ఎస్వీ మెడికల్ కళాశాల (మెటర్నిటీ ఆస్పత్రి) అధికారులు పట్టుబడుతున్నారు. దీనికి తోడు సంబంధిత మంత్రి తిరుపతికి వచ్చిన ప్రతిసారీ నూతన భవనం కేటాయింపుపై పొంతనలేని ప్రకటనలు చేస్తుండడంతో గందరగోళానికి వేదికగా మారింది. ఇటీవల తిరుపతికి వచ్చిన వైద్య విద్యా ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసులు ఈ భవనాన్ని స్విమ్స్‌కు ఇస్తున్నట్టు వైద్యాధికారులతో చెప్పారు. పైగా మొదటి సారి శ్రీపద్మావతి మెడికల్ కళాశాల తిరుపతికి వచ్చిందని, అందులో వైద్య విద్యను అభ్యసించేందుకు ఈ భవనాన్ని తాత్కాలిక పద్ధతిలో కేటాయిస్తున్నామని, మీరు సహకరించాలని కోరారు. ఈ నిర్ణయాన్ని ఎమ్మెల్సీ శ్రీనివాసులురెడ్డి వ్యతిరేకిస్తూ, అలాంటి ప్రయత్నంచేస్తే ప్రజా ఉద్యమాన్ని ఎదుర్కోవలసి వస్తుందని మంత్రికి చెప్పారు. అయినా సరే స్విమ్స్‌కు అనుబంధంగా ఉన్న శ్రీపద్మావతి మెడికల్ కళాశాల విద్యార్థులకు భవ నం కేటాయించేందుకు చకచకా ఏర్పా ట్లు పూర్తవుతున్నాయి. ఈ ప్రతిపాదనను సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సౌకర్యాల లేమితో ఇబ్బందులు... ప్రస్తుతం ఉన్న మెటర్నిటీ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది అలుపెరగకుండా విధులు నిర్వహిస్తున్నా సౌకర్యాల లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన రోగులకు తగ్గట్టుగా వైద్య సౌకర్యాలు పెరగకపోవడంతో ప్రసవానికి వస్తున్న గర్భిణులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. మెటర్నిటీలో 150 బెడ్లు ఉన్నాయి. గతంలో రోజుకు 30 నుంచి 35 ప్రసవాలు జరుగుతుండగా, అందుకు తగ్గట్టుగానే పీఎన్ వార్డులో 40 బెడ్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రసవాల సంఖ్య 50 నుంచి 60కి పెరగడంతో బెడ్ల కొరత పీడిస్తోంది. ఈనెల 7న ఓకే రోజు రికార్డు స్థాయిలో 66 ప్రసవాలు జరిగాయి. దీంతో ఉన్న 40 బెడ్లలో వీరిని పడుకోబెట్టడం కష్టంగా మారింది. ఒక్కో బెడ్‌పై ఇద్దరు, ముగ్గురు చొప్పున ఉండాల్సి వచ్చింది. పిల్లలను పక్కలో పడుకోబెట్టుకునేందుకు స్థలం లేకపోవడంతో నేల పైన పడుకోబెట్టాల్సి వస్తోంది. నూతన భవనం కేటాయిస్తే మెరుగైన సేవలు ఈ సమస్య పరిష్కారం కోసం మెట ర్నిటీ సమీపంలోనే మూడు వందల పడకలతో అధునాతన సౌకర్యాలతో భవన నిర్మాణం ప్రారంభించారు. మొత్తం 72 కోట్లతో రూపుదిద్దుకుంటున్న ఆస్పత్రి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటి వరకు మొదటి దశలో కేవలం 80 బెడ్లతో కూడిన విభాగం మాత్రమే సిద్ధమైంది. రెండవ దశలో 37.5 కోట్లతో ప్రతిపాదనలు పంపిం చామని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. పనులు త్వరగా పూర్తయితే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని, తమ కల నెరవేరుతుందని వైద్యులు అంటున్నారు. దీనికి తోడు గర్భిణులు సైతం వెయ్యి కళ్లతో నూతన ఆస్పత్రి భవనం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ భవనాన్ని ఎవరికి కేటాయిస్తుందో ఇంతవరకు తేల్చలేదు. -
క్షీణించిన ఎమ్మెల్యే వెంకటరమణ ఆరోగ్యం!
తిరుపతి: స్థానిక టీడీపి ఎమ్మెల్యే ఎం.వెంకట రమణ ఆరోగ్యం క్షీణించింది. ఆయనకు షుగర్ లెవల్స్ బాగా తగ్గాయి. కిడ్నీ, గుండె జబ్బులతో ఆయన బాధపడుతున్నారు. వెంకట రమణ ప్రస్తుతం స్విమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ** -
300 పడకల ఆస్పత్రి స్విమ్స్కే
తిరుపతి కార్పొరేషన్ : ఎస్వీ మెడికల్ కళాశాల పరిధిలోని మెటర్నటీకి అనుసంధానంగా నిర్మిస్తున్న 300 పడకల నూతన హాస్పిటల్ భవనాన్ని శ్రీపద్మావతి మహిళా మెడికల్ కళాశాలకు తాత్కాలికంగా కేటాయించేందుకు రాష్ట్ర వైద్యవిద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ నిర్ణయం తీసుకున్నారు. శనివారం తిరుపతి పర్యటనకు వచ్చిన మంత్రి ఎస్వీ మెడికల్ కళాశాలలో రుయా, మెటర్నిటీ, మెడికల్ కళాశాలల్లోని అన్ని విభాగాల విభాగాధిపతులతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి మొట్టమొదటి సారిగా మహిళలకు ప్రత్యేకంగా ఓ మెడికల్ కళాశాల మంజూరైందన్నారు. పద్మావతి మెడికల్ కళాశాల భవన నిర్మాణం పూర్తయ్యేంత వరకు వారికి ప్రత్యామ్నాయంగా 2014-16 వరకు రెండేళ్లు పాటు తాత్కాలికంగా నూతన భవనం కేటాయిద్దామన్నారు. అవసరమైతే గతంలో స్విమ్స్‌కు కేటాయిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 78ని సవరిద్దామని తెలిపారు. దీంతో ఒకరిద్దరు మంత్రికి ఎదురు చెప్పినా ఆయన్ను ఒప్పించే ప్రయత్నం చేయలేక వైద్యాధికారులు తమ నిస్సహాయతను వ్యక్తం చేయాల్సి వచ్చింది. -
తిరునగరికి జ్వరం
తిరుపతి కార్పొరేషన్: తెరపనివ్వకుండా కురుస్తున్న వర్షం, వణికిస్తున్న చలితో తిరుపతి ప్రజలు జ్వరాల బారిన పడ్డారు. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పు కారణంగా వందలమందికి జ్వరం సోకింది. వీరిలో కొందరు డెంగీయేమో అని భయపడ్డారు. అం దరూ రుయా, స్విమ్స్‌కు క్యూ కట్టారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి సాధారణ జ్వరాలేనని తేల్చారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షంతో పలు సీజనల్ వ్యాధులు పీడిస్తున్నాయి. దీంతో తిరుపతి నగరం తో పాటు పరిసర ప్రాంతాలనుంచి రుయా ఆస్పత్రికి రోగులు క్యూ కడుతున్నారు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దాదాపు 1800 మంది అవుట్ పేషెంట్లు పలు వ్యాధులకు వైద్య సేవలు పొందారు. ముఖ్యంగా విషజ్వరాలు, దగ్గు, సాధారణ జ్వరాలు,జలుబు వంటి వ్యాధులకు పరీక్షలు చేయించుకున్నారు. డెంగీ లక్షణాలు ఉన్నాయన్న భయంతో వచ్చిన వారు ఎక్కువగా ఉండడం విశేషం. వీరికి పరీక్షలు నిర్వహించి ప్రమాదం లేదని వైద్యులు మందులు ఇచ్చి పంపించారు. సాధారణంగా ప్రతి సోమవారం వెయ్యి నుంచి 1,200 వందల మంది రోగులు ఓపీకి వస్తుంటారని, అయితే వరుస వర్షాల ప్రభావంతో ఒకేరోజు 1,800 మంది వరకు రావడం రికార్డుగా వైద్యులు తెలిపారు. ఇక స్విమ్స్‌లోనూ ఓపీల ద్వారా జ్వరం, దగ్గు, జలుబుకు వైద్య సేవలు పొందిన వారు ఉన్నారు. అయితే వైద్యులు మాత్రం వాతావరణంలో మార్పుల వలనే ఇలాంటి జ్వరాలు వస్తున్నాయని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వేడి చేసి చల్లార్చిన, గోరు వెచ్చని నీటిని మాత్రమే తాగాలని, కూల్డ్రింకులు, ఐస్‌క్రీంలు, తీపి వుస్తువులకు దూరంగా ఉండాలని చెప్పారు. -
మానవసేవే మాధవ సేవ
వైద్య విద్యార్థులకు స్విమ్స్ వైస్‌చాన్స్‌లర్ వెంగమ్మ పిలుపు స్నాతకోత్సవంలో ఏడుగురికి గోల్డ్‌మెడల్స్.. కోర్సులు పూర్తిచేసుకున్న 296 మందికి డిగ్రీలు ప్రదానం తిరుపతి కార్పొరేషన్ : మానవ సేవే మాధవ సేవ అని, అదే స్ఫూర్తితో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని స్విమ్స్ డెరైక్టర్, వైస్ చాన్స్‌లర్ డాక్టర్ బి.వెంగమ్మ పిలుపునిచ్చారు. స్విమ్స్ 5వ స్నాతకోత్సవ వేడుకలు సోమవారం తిరుపతి మహతి కళాక్షేత్రంలో వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పద్మవిభూషణ్ గ్రహీత, మణిపాల్ యూనివర్సిటీకి చెందిన జాతీయ పరిశోధనాచార్యులు డాక్టర్ మార్తాండ వర్మ శంకరన్ వలియాతన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి స్నాతకోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.వెంగమ్మ మాట్లాడుతూ డిగ్రీలు పొందిన వైద్యులు నిరుపేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలన్నారు. 1993లో ప్రారంభించిన స్విమ్స్ ఆసుపత్రి ద్వారా వైద్య, విద్య పరంగా పరిశోధనలు చేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలిచామని గుర్తుచేశారు. ప్రాణదానం వంటి పథకాలతో పాటు పేదలకు ఉచిత వైద్యం, గ్రామీణ ప్రాంతాల్లో వై ద్యశిబిరాలు నిర్వహించి వైద్యసేవలు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యవిద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పంపిన స్నాతకోత్సవ ప్రసంగాన్ని వేదికపై ఆమె చదివి వినిపించారు. టెంపుల్ సిటీగా ఉన్న తిరుపతిలో స్విమ్స్ మెడికల్ హబ్‌గా ఎదగాలని మంత్రి సందేశంలో వినిపించారు. అనంతరం, స్విమ్స్ యూనివర్సిటీలో వివిధ కోర్సులు పూర్తి చేసుకున్న 296 మంది వైద్య విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. అందులో ఉత్తమ ప్రతిభ చూపిన ఏడుగురికి బంగారు పతకాలు, నలుగురికి మెరిట్ సర్టిఫికెట్లు అందించారు. వీరందరికీ ప్రొఫెసర్ అల్లాడి మోహన్ నేతృత్వంలో వేద పండితులు వేదమంత్రోచ్ఛారణతో ఆశీర్వచనాలు, శ్రీవారి పుస్తక ప్రసాదాలు అందించారు. అనంతరం డాక్టర్ వెంగమ్మ చేతుల మీదుగా అతిథులైన డాక్టర్ మార్తాండ వర్మ శంకరన్ వలియాతన్, టీటీడీ ఈవో ఎంజీ గోపాల్, ఎస్వీయూ వీసీ రాజేంద్ర, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ టి.రవిరాజులకు శ్రీవారి చిత్రపటాలను జ్ఞాపికలుగా అందించారు. చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, స్విమ్స్ రిజిస్ట్రార్ ఆంజనేయులు, శ్రీపద్మావతి మహిళా మెడికల్ కళాశాల డీన్ రామసుబ్బారెడ్డి, మాజీ స్పీకర్ డాక్టర్ అగరాల ఈశ్వర్‌రెడ్డి, శ్రీసాయిసుధా హాస్పిటల్స్ డెరైక్టర్ డాక్టర్ సుధారాణి, తిరుమల డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, స్విమ్స్‌లోని అన్ని వైద్య విభాగాధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు. -
శ్రీవారి సేవకు పునరంకితమవుతా
తిరుపతి: శ్రీవారి సేవకు తాను పునరంకితమవుతానని తిరుమల ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల ఒకటవ తేదీన ఆయన గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. స్విమ్స్‌లో చికిత్స అనంతరం ఆయనను చెన్నై ఆపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొంది ఆరోగ్యం మెరుగుపడడంతో సోమవారం రాత్రి 7.45 గంటలకు తిరుపతి సరోజినీదేవి రోడ్‌లోని స్వగృహానికి చేరుకున్నారు. ఆయన తోబుట్టువులు దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించారు. శేషాద్రి వెంట చెన్నై నుంచి టీటీడీ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రెడ్డివారి ప్రభాకర్‌రెడ్డి, సుబ్రమణ్యయాదవ్ (పరదాల మణి) వచ్చా రు.. సంపూర్ణ ఆరోగ్యంతో స్వగృహానికి చేరుకున్న శేషాద్రిని ‘సాక్షి’పలకరించింది. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన మనోభావాలు.. బాగా విశ్రాంతి పొంది వచ్చాను. ప్రస్తుతం కులాసాగానే ఉన్నాను. ఇక విశ్రాంతి అవసరం లేదు. బుధవారం నుంచి శ్రీవారి సేవకు పునరంకితం అవుతా. స్వామి నాకు పునర్జన్మ ప్రసాదించాడు. మునుపటి కంటే ఉత్సాహంగా స్వామి సేవలో పాల్గొంటా. సెప్టెంబర్ 30వ తేదీ రాత్రి శ్రీవారి గరుడసేవలో ఎప్పటిలాగే పాల్గొన్నా. మరుసటి రోజు ఉదయం హనుమంత వాహన సేవలో ఉండగా ఆయాసం వచ్చింది. 10 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని కాసేపు కూర్చున్నా. అయినా తగ్గలేదు. అశ్వని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. స్విమ్స్‌లో చేర్పించిన తర్వాత మరుసటి రోజు కొంత తేరుకున్నా. 3వ తేదీ ఉదయం వచ్చిన వాళ్లతో మాట్లాడగలిగాను. తిరుమలలో జేఈవో, ఆలయ డెప్యూటీ ఈవో, పేష్కార్ సహకారం బాగుంది. నేను అస్వస్థతకు గురైంది మొదలు క్షేమంగా ఇంటికి చేరేంత వరకు వారందరూ నా ఆరోగ్యం కోసం పరితపించారు. శేషాద్రి ఓఎస్డీ పదవీ కాలాన్ని పొడిగించినందుకు ఎవైరె నా బాధపడి ఉంటే నేనేమి చేయగలను? శ్రీవారిని సేవించే అవకాశం మళ్లీ ఎందుకు కల్పించారో వారు ఆ స్వామినే అడగాలి. శేషాద్రి కంట కన్నీరు చెన్నై నుంచి ఇంటికి చేరుకున్న శేషాద్రి తనను ఎక్కువగా అభిమానించే తోబుట్టువులు ఆప్యాయంగా తల నిమిరి పలకరించే సరికి దుఃఖాన్ని ఆపుకోలేక పోయారు. కంట తడి పెట్టారు. స్వామి దయ వల్ల క్షేమంగా తిరిగి వచ్చానని వారిని ఓదార్చారు. -
విజృంభిస్తున్న విషజ్వరాలు
డెంగీతో జిల్లాలో ఇప్పటికే ఆరుగురి మృతి అల్లాడుతున్న ప్రజలు రోజుల తరబడి ఆస్పత్రుల్లో ఇబ్బందులు అధికారికంగా నమోదైన విషజ్వరాలే 218 అనధికారికంగా వేలల్లోనే సాక్షి, చిత్తూరు: పుత్తూరు మండలం టీఆర్ కండ్రిగకు చెందిన వై.మంగమ్మ(35)కు పది రోజుల క్రితం జ్వరం సోకింది. పుత్తూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయించారు. జ్వరం తగ్గలేదు. డెంగీ లక్షణాలున్నట్లు భావించిన వైద్యులు తిరుపతి స్విమ్స్‌కు సిఫారసు చేశారు. అక్కడ వైద్యులు డెంగీ అని తేల్చారు. చికిత్స చేస్తుండగా మంగమ్మ ఈ నెల 12న మృతి చెందింది. మంగమ్మతో పాటు ఆమె భర్త బాలాజీ, కుమారుడు ప్రకాష్, కుమార్తె వెన్నెలకు కూడా ఇదే సమయంలో డెంగీ సోకింది. అందరూ స్విమ్స్‌లో చికిత్స చేయించుకున్నారు. రామకుప్పం మండలం అల్లెకుప్పంలో వసుంధర(7)కు జ్వరం సోకింది. స్థానికంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా ఫలితం లేదు. కుప్పం మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగా మృతి చెందింది. డెంగీతో చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. ..వీళ్లిద్దరే కాదు...ఈ ఏడాది డెంగీ దెబ్బకు ఆరుగురు మరణించారు. అధికారులు మాత్రం ఈ ఏడాది 15 డెంగీ కేసులు నమోదయ్యాయని, అందులో ఒకరు మాత్రమే చనిపోయారని చెబుతున్నారు. జిల్లాలోని ప్రజలు విషజ్వరాల దెబ్బకు విలవిలాడిపోతున్నారు. ఆస్పత్రుల్లో రోజుల తరబడి వైద్యం చేయించుకుం టున్నారు. వారిలో కొందరు మరణిస్తున్నారు. అయినా అధికారులు మాత్రం విషజ్వరాల నివారణకు చర్యలు తీసుకోవడం లేదు. ఓవైపు దోమల తీవ్రత, మరో వైపు వాతావరణంలోని మార్పులతోనే విషజ్వరాలు వ్యాపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో ఈ సీజన్లో 79 మలేరియా, 67 టైఫాయిడ్ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కలను పక్కన పెడితే ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునేవారి సంఖ్య వేలల్లో ఉంటుందని చెబుతున్నారు. అయినా దోమల నివారణ కోసం ఫాగింగ్, గంబూషియా చేపలను మురుగుకాలువల్లో వదలడం, పారిశుద్ధ్య మెరుగుకు చర్యలు తీసుకోవడంలో వైద్య, ఆరోగ్యశాఖ, మునిసిపల్‌శాఖ అధికారులు మాత్రం నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. ఇంత నిర్లక్ష్యమా? వర్షాకాలం కావడంతో దోమలు తాకిడి అధికంగా ఉంది. పల్లెలు, పట్టణాల్లో ఫాగింగ్ చేయూల్సి ఉంది. ఈ ఏడాది ఫాగింగ్ కోసం మలేరియా నియంత్రణ శాఖకు 1210 లీటర్ల మలాథియాన్ ద్రావణం వచ్చింది. జిల్లాలో ఫాగింగ్ చేసేందుకు ఇది ఏమాత్రం సరిపోదు. ఇందులోనూ అధికారులు కేవలం 50 లీటర్లు మాత్రమే ఫాగింగ్ చేశారు. జిల్లాలోని 20 క్లస్టర్లు ఉన్నాయి. వచ్చిన మలాథియన్ తీసుకెళ్లి ఫాకింగ్ చేయడంలోనూ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ద్రావణం తీసుకెళ్లిన వారిలో కొంతమంది మాత్రమే ఫాగింగ్ చేశారు. పల్లెల్లో వైద్యశిబిరాలు ఎక్కడ? జిల్లావ్యాప్తంగా 76 పీహెచ్సీ(ప్రైమరీ హెల్త్ సెంట ర్)లు ఉన్నాయి. 418 దాకా సబ్‌సెంటర్లు ఉన్నాయి. వీటి పరిధిలోని ప్రజలు రోగాలబారిన పడి అల్లాడుతుంటే, గ్రామాల్లో వైద్యశిబిరాలను నిర్వహించి చికి త్స చేయడంలో కూడా పీహెచ్‌సీలు నిర్లిప్తంగా ఉన్నా యి. ఉదయం 9 నుంచి 12 గంటలు, సాయంత్రం 2 నుంచి 4 గంటల వరకు ఓపీ ఉండాలి. ఈ సమయం లో డాక్టర్లు అందుబాటులో ఉండాలి. అయితే చాలాచోట్ల 10.30 గంటల వరకూ డాక్టర్లు రాని పరిస్థితి. పైగా మధ్యాహ్నం 12 గంటలకే చాలామంది ఇంటిదారి పడుతున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా నర్సులు మాత్రమే ఉంటున్నారు. జ్వరం వచ్చిందని రోగులు వెళితే మాత్రలు చేతిలో పెడుతున్నారు. ఇంజెక్షన్ అవసరమైతే నీడిల్, సిరంజి రోగులు తెచ్చుకోవల్సిందే!. దీంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. అక్కడికి వెళితే రక్తపరీక్షలు, మందులకు కలిపి ఒక్కొక్కరికీ రూ.1500 నుంచి 3వేల రూపాయల వరకు ఖర్చవుతోంది. డెంగీతో ఒకరు చనిపోయారు జిల్లాలో ఈ సీజన్లో 15 మంది డెంగీ బారినపడ్డారు. మంగమ్మ మాత్రమే చనిపోయారు. తక్కిన వారు డెంగీతో చనిపోయినట్లు నిర్ధారణ కాలేదు. ల్యాబ్‌లో సరైన రిపోర్టులు లేని కారణంగా వాటిని మేం డెంగీ డెత్కేసులుగా పరిగణించలేం. మలాథియాన్ అందుబాటులో ఉంది. పూర్తి స్థాయిలో ఫాగింగ్ చేసేందుకు ప్రయత్నిస్తాం. -దోసారెడ్డి, జిల్లా మలేరియా నియంత్రణ అధికారి -
మెడికల్ హబ్ దిశగా తిరుపతి!
ఆరు వైద్య కేంద్రాలను అనుసంధానించే యోచన 12 మంది కమిటీతో కీలక నివేదిక నిర్వహణతోపాటు కీలకపోస్టులో టీటీడీ ఈవో హబ్ డెరైక్టర్‌పై ఆశలు పెంచుకున్న బర్డ్ డెరైక్టర్ నేడు సీఎం చంద్రబాబు అంగీకారమే తరువాయి తిరుపతి సిటీ: వైద్య రంగంలో తిరుపతి మరో ముందడుగు వేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఆరు వైద్య కే్రందాలను అనుసంధానిస్తూ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం నగరంలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్స్, బర్డ్, సెంట్రల్ హాస్పిటల్స్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ పెత్తనంతో నడుస్తున్న ఎస్వీ వైద్యకళాశాల, రుయా, మెటర్నిటీ హాస్పిటల్స్‌ను ప్రాథమికంగా ఎంపిక చేశారు. మెడికల్ హబ్ ఏర్పాటు కు సంబంధించిన వ్యవహారాలపై రెండు రో జులుగా జిల్లా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి టీటీడీ ఈవో ఎంజీ గోపాల్‌తోపాటు ఆరు వైద్య కేంద్రాల ప్రధాన అధికారులతో చర్చలు జరుపుతున్నారు. దీనిపై అధికారులు పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించారు. ఆస్పత్రులలో ప్రధానంగా రోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, లోపాలను గుర్తించి నివేదిక తయారు చేసేందుకు 12 మందితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. కమిటీలో టీటీడీ ఈవో, జేఈవోలతో పాటు డీఎంఈ, అడిషనల్ జాయింట్ కలెక్టర్, అర్బన్ ఎస్పీ, మున్సిపల్ కమిషనర్, ఎండోమెంట్ కార్యదర్శి, ఆరు విభాగాలకు చెందిన హెచ్వోడీలు ఉండేవిధంగా నిర్ణయం తీసుకున్నారు. ఏర్పాటు కాబోయే మెడికల్ హబ్‌కు టీటీడీ ఈవో చైర్మన్‌గా వ్యవహరించే విధంగా చర్యలు తీసుకోనున్నారు. శ్రీవెంకటేశ్వర మెడికల్ హబ్.. కొత్తగా ఏర్పడే మెడికల్ హబ్ ఎక్కువగా టీటీడీ ఆధ్వర్యంలో నడవనున్న నేపథ్యంలో ‘శ్రీవేంకటేశ్వర మెడికల్ హబ్’గా పిలిస్తేనే సార్థకత అవుతుందనే ఉద్దేశంతో అధికారులు ఉన్నట్లు సమాచారం. నేడు తిరుపతికి సీఎం చంద్రబాబు రానున్నారు. దీనిని సీఎం ముందు ఉంచి గ్రీన్ సిగ్నల్ పొందాలనే యోచనలో అధికారులు ఉన్నారు. ఏది ఏమైనా తమను ప్రభుత్వం, టీటీడీ ఇబ్బందులకు గురిచేయకుండా నిధులను సకాలంలో అందించాలని ఆరు వైద్య కేంద్రాలకు చెందిన అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వరుస సమావేశాలలో ఆస్పత్రులకు సంబంధించిన పాత జీవోలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ప్రతి 3 నెలలకు వైద్య కేంద్రాలకు అవసరమయ్యే నిధులు ప్రభుత్వం నుంచి రావడం ఆలస్యమైతే వాటిని తొలుత టీటీడీ భరించి ప్రభుత్వ నిధులు వచ్చిన వెంటనే పొందేవిధంగా కమిటీ నిర్ణయించింది. అలాగే పేదరోగుల సహాయార్థం స్విమ్స్ ఆస్పత్రికి అందిస్తున్న విధంగా రుయా, మెటర్నిటీ ఆస్పత్రులకు కూడా టీటీడీ ప్రాణదాన నిధులను అందించేందుకు అంగీకారం తెలపాలని ఎండోమెంట్‌కు నివేదిక పంపాలని కమిటీ నిర్ణయించింది. బర్డ్ డెరైక్టర్ కోసమే.. అని ప్రచారం ప్రస్తుతం బర్డ్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న జగదీష్‌కు సీఎం చంద్రబాబుతో సుదీర్ఘ పరిచయం ఉంది. చంద్రబాబు అధికారంలో ఉన్నా లేక పోయినా పార్టీకి సంబంధించిన కేడర్‌కు బర్డ్ ఆస్పత్రిలో వైద్యం అవసరమైతే అందుబాటులో ఉంటూ చంద్రబాబుకు మరింత దగ్గరయ్యారు. దీంతో పదేళ్ల తర్వాత బాబు అధికారంలోకి రావడంతో బర్డ్ డెరైక్టర్ చిరకాల కోరిక తీర్చేందుకే మెడికల్ హబ్ ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన దిశా నిర్దేశకాలు బర్డ్ డెరైక్టర్ ఇచ్చినవే అనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. తాత్కాలిక కమిటీలో కూడా జిల్లా మంత్రి బర్డ్ డెరైక్టర్ ఆలోచన మేరకు నివేదిక సిద్ధం చేయాలని పరోక్షంగా ఆదేశించినట్లు తెలిసింది. ఒక్క బర్డ్ ఆస్పత్రికే డెరైక్టర్‌గా ఇన్నాళ్లు చేశాం.. దీనికంటే పెద్ద పదవి కావాలంటే ఆరు వైద్య కేంద్రాలను కలిపి అందులో డెరైక్టర్‌గా కూర్చోవాలనే ఆలోచనతోనే ఈ కొత్త హబ్ ప్రస్తావన వచ్చినట్లు విమర్శలు ఉన్నాయి. అయితే ఎన్ని హబ్‌లు ఏర్పాటైనా సామాన్యుడికి వైద్యం అందుబాటులోకి తేవాలనే విషయాన్ని పాలకులు విస్మరించకుంటే చాలు. -
శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాల అడ్మిషన్లకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి ప్రతినిధి, తిరుపతి: శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (స్విమ్స్) నేతృత్వంలోని శ్రీపద్మావతి మహిళా వైద్యకళాశాల అడ్మిషన్లకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లను భర్తీ చేయడానికి మార్గదర్శకాలు (జీవో 120)ను శనివారం వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్వీ.సుబ్రమణ్యం జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. స్విమ్స్ నేతృత్వంలో శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాలను రెండేళ్ల క్రితమే ప్రభుత్వం మంజూరు చేసింది. వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు.. బోధన సిబ్బందిని స్విమ్స్ యాజమాన్యం నియమించుకుంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఏడాది క్రితం తనిఖీ చేసి వైద్య కళాశాలకు అనుమతి ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచి వైద్య కళాశాలను ప్రారంభించడానికి స్విమ్స్ డెరైక్టర్ డాక్టర్ బీ.వెంగమ్మ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈనెల 14న సీఎం చంద్రబాబు నేతృత్వంలో స్విమ్స్ పాలకమండలి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో మెరిట్ ఆధారంగా మన రాష్ట్ర విద్యార్థులకు 70 శాతం సీట్లు, 15 శాతం సీట్లను ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు, 15 శాతం సీట్లను ఎన్ఆర్ఐలతో భర్తీ చేయాలని నిర్ణయించారు. మన రాష్ట్ర, ఇతర రాష్ట్ర కోటాల్లో భర్తీ చేసే సీట్లకు రూ.60 వేల వంతున, ఎన్ఆర్ఐ సీట్లకు 20 వేల అమెరికన్ డాలర్ల వంతున ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించారు. తాజాగా ఇతర రాష్ట్రాలకు కేటాయించిన 15 శాతం సీట్లను కూడా మన రాష్ట్ర విద్యార్థులతోనే భర్తీ చేయాలని నిర్ణయించారు. తరగతులను ఈ ఏడాది నుంచే ప్రారంభించడానికి పాలకమండలి సమావేశంలో అనుమతి ఇచ్చారు. ఈ మహిళా వైద్య కళాశాలలో 150 సీట్లను భర్తీ చేయనున్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సెన్సైస్ నేతృత్వంలో నిర్వహించే ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా మెరిట్ ఆధారంగా 127 సీట్ల (85 శాతం)ను మన రాష్ట్ర విద్యార్థులతో భర్తీ చేయనున్నారు. ప్రసూతి ఆస్పత్రి భవనం విషయంలో జూనియర్ డాక్టర్లకు, సిమ్స్‌కు మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో మహిళా వైద్య కళాశాల తరగతుల ప్రారంభంపై నెలకొన్న సందిగ్ధతకు ప్రభుత్వం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలతో బ్రేక్ పడింది. -
78 జీవోను రద్దు చేయాలి
- అసెంబ్లీలో రోజా డిమాండ్ తిరుపతి : తిరుపతిలో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి అనుబంధంగా నిర్మించిన 300 పడకల ఆస్పత్రిని స్విమ్స్‌కు అప్పగించడాన్ని నగరి శాసనసభ్యురాలు ఆర్కే.రోజా తీవ్రంగా వ్యతిరేకించారు. ఆందుకు సంబంధించిన జీవో 78ని రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో రోజా మెటర్నిటీ ఆస్పత్రి అంశాన్ని లేవనెత్తారు. రాయలసీమకు తలమానికంగా ఉన్న తిరుపతి ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రి పేద మహిళలకు విశిష్ట సేవలు అందిస్తోందన్నారు. ఆస్పత్రికి కాన్పుల కోసం వచ్చే గర్భిణీలు, గైనిక్ సంబంధ జబ్బులతో వచ్చే మహిళారోగుల సంఖ్య విపరీతంగా పెరిగిన నేపథ్యంలో గతంలో జీవోనెంబర్ 87 ద్వారా నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ నిధులతో 300 పడకల ఆస్పత్రి మంజూరైందన్నారు. అయితే ఆ ఆస్పత్రిని జీవో 78 ద్వారా కార్పొరేట్ సేవలకు ప్రతీకగా ఉన్న స్విమ్స్‌కు అప్పగించడం అనుచితమైన చర్యగా రోజా పేర్కొన్నారు. జీవో 78ని రద్దు చేసి 300 పడకల భవనాన్ని మెటర్నిటీ ఆస్పత్రికి అనుబంధంగానే కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు. జీవో 78 కి వ్యతిరేకంగా మూడు వారాలుగా జూనియర్ డాక్టర్ల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళనను ఆమె ఈసందర్భంగా గుర్తు చేశారు. -
పద్మావతి మహిళా వైద్య కళాశాలకు..డీమ్డ్ వర్సిటీ హోదా!
ఈ ఏడాది ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారానే సీట్ల భర్తీ! వచ్చే ఏడాది ప్రత్యేక సెట్ నిర్వహణకు సన్నాహాలు సాక్షి ప్రతినిధి, తిరుపతి: శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(స్విమ్స్) నేతృత్వంలోని పద్మావతి మహిళా వైద్య కళాశాలకు డీమ్డ్ వర్సిటీ హోదా సాధించేం దుకు ఆ సంస్థ యాజమాన్యం ప్రణాళిక రచించింది. అనుబంధంగా నర్సింగ్, డెం టల్, పారా మెడికల్ కాలేజీలతోపాటు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు కసరత్తు చేస్తోంది. తద్వారా డీమ్డ్ వర్సిటీ హోదా పొంది.. అత్యుత్తమ వైద్య నిపుణులను అందించడానికి వ్యూహం రచించింది. వివరాల్లోకి వెళితే.. స్విమ్స్ నేతృత్వంలో ఏర్పాటుచేస్తున్న పద్మావతి మహిళా వైద్య కళాశాలను ఈ ఏడాది నుంచే ప్రారంభించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోం ది. ఈ ఏడాది ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా 150 సీట్లను భర్తీ చేయాల ని నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి ప్రత్యేక సెట్ ద్వారా సీట్లను భర్తీ చేయాలని భావిస్తోంది. ఆ క్రమంలో డీమ్డ్ వర్సిటీ హోదా పొందడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించే దిశగా యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది. బోధనాసుపత్రి, వైద్య కళాశాల, నర్సింగ్, డెంటల్, పారామెడికల్ కాలేజీలతో పాటూ వైద్యరంగంలో పరిశోధన కేంద్రాన్ని కూడా నెలకొల్పితేనే డీమ్డ్ వర్సిటీ హోదా పొందవచ్చు. స్విమ్స్‌కు సమీపంలో బీవీబీ ప్రాంతంలో భవనాల నిర్మాణాన్ని పూర్తి చేసింది. గతేడాది స్విమ్స్‌ను తనిఖీ చేసిన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వైద్య కళాశాలకు అనుమతి ఇచ్చింది. ఈలోగా మెటర్నిటీ ఆస్పత్రికి రూ.వంద కోట్ల వ్యయంతో మూడు వందల పడకలతో నిర్మించిన భవనాన్ని పద్మావతి మహిళా వైద్య కళాశాలకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇది వివాదాస్పదంగా మారిన విషయం విదితమే. కానీ.. పద్మావతి మెడికల్ కాలేజీకి ఎంసీఐ అనుమతించిన సమయంలో మెటర్నిటీ భవనాన్ని స్విమ్స్ యాజమాన్యం చూపించలేదు. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీ ప్రారంభానికి ఎలాంటి అవాంతరాలు ఉండవు. మెటర్నిటీ భవన వివాదాన్ని పరిష్కరించుకుని.. నర్సింగ్, డెంటల్, పారామెడికల్ కాలేజీలు, పరిశోధన కేంద్రం ఏర్పాటుకు అవసరమైన భవనాలను నిర్మించేం దుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. వీటికి భూమి కేటాయింపునకు అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం భూమిని కేటాయించిన తక్షణమే యుద్ధప్రాతిపదికన నర్సింగ్, డెంటల్, పారా మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అవసరమైన భవనాలను నిర్మించి.. సంబంధిత విభాగాల నుంచి కాలేజీల ప్రారంభానికి అనుమతి తీసుకోవాలని నిర్ణయించారు. 2015 విద్యా సంవత్సరం ప్రారంభానికి ఈ ప్రక్రియను పూర్తిచేసి.. డీమ్డ్ వర్సిటీ హోదా సాధించాలని భావిస్తున్నారు. పద్మావతి మహిళా మెడికల్ కాలేజీలో ఈ ఏడాది ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా 150 సీట్లను భర్తీ చేయనున్నారు. ఇందులో 15 శాతం సీట్లు ఎన్ఆర్ఐలకు కేటాయించనున్నారు. ఒక్కో సీటుకు 20 వేల అమెరికన్ డాలర్లు ఫీజుగా నిర్ణయించారు. మరో 15 శాతం ఇతర రాష్ట్రాల విద్యార్థులకు.. తక్కిన 70 శాతం సీట్లను మన రాష్ట్ర విద్యార్థులకు కేటాయించారు. వీరికి ఫీజు రూ.60 వేలుగా నిర్ణయించారు. వచ్చే ఏడాది డీమ్డ్ వర్సిటీ హోదా పొందాక ప్రత్యేక సెట్ నిర్వహించి.. పద్మావతి మహిళా మెడికల్ కాలేజీతోపాటు నర్సింగ్, డెంటల్, పారా మెడికల్ సీట్లను భర్తీ చేయనున్నారు. -
బాబు సర్కారుపై జూనియర్ వైద్యుల ఆగ్రహం
చంద్రబాబు సర్కార్‌పై జూనియర్ డాక్టర్లు నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఇప్పటికీ రెండుకళ్ల సిద్ధాంతాన్ని పాటిస్తున్నారని జూనియర్ డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను హైదరాబాద్ చర్చలకు పిలిచి సమాధానం చెప్పకుండా చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించారని జూనియర్ డాక్టర్ల సంఘం నాయకులు మండిపడ్డారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగడతామని చెప్పారు. తక్షణమే జీవో నంబరు 78 రద్దు చేసి, స్విమ్స్‌కు ఇచ్చిన భవనాలను మెటర్నిటీ ఆస్పత్రికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రేపటినుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జూనియర్ డాక్టర్ల సమ్మె ఫలితంగా ఇప్పటికే రుయా, మెటర్నిటీ ఆస్పత్రులు రెండింటిలోనూ వైద్యసేవలు దాదాపుగా నిలిచిపోయాయి. ప్రభుత్వం మాత్రం ఈ విషయమై ఇప్పటివరకు స్పందించిన పాపన పోలేదు. -
పేదల ఆస్పత్రులంటే చిన్నచూపా!
జగన్ అండతో మరింత ముందుకెళ్దాం విరాళాలతోనైనా స్విమ్స్‌కు న్యాయం చేద్దాం జూ.డాల ఆందోళనలో భూమన కరుణాకరరెడ్డి తిరుపతి అర్బన్: ఎస్వీ మెడికల్ కాలేజీ పరిధిలోని రుయా, మెటర్నిటీ ఆస్పత్రులు పూర్తిగా పేదలవనే భావనతోనే ప్రభుత్వం, వైద్య శాఖ ఉన్నతాధికారులు చిన్నచూపు చూస్తున్నారని వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. మెటర్నిటీ హాస్పిటల్‌కు అనుబంధంగా నిర్మించిన 300 పడకల ఆస్పత్రి భవనాలను తిరిగి మెడికల్ కాలేజీ పరిధిలోకి తెచ్చే విధంగా భవన పరిరక్షణ జేఏసీ కన్వీనర్లు డాక్టర్ జీ.పార్థసారథిరెడ్డి, డాక్టర్ కిరీటి ఆధ్వర్యంలో జూనియర్ డాక్టర్లు చేపట్టిన ఆందోళన శనివారం 11వ రోజుకు చేరుకుంది. ఉదయం 9 గంటలకు నిరసనకారులు రుయా, మెటర్నిటీ ఆస్పత్రుల వద్దకు చేరుకుని అన్ని ఓపీలను బంద్ చేయించారు. రుయా పరిపాలనా భవనం ఎదుట జూనియర్ డాక్టర్ల (యూజీ, పీజీ) సంఘాల నాయకుల ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడికి చేరుకున్న కరుణాకరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి తమవంతు విరాళాలను అందజేశారు. వారు మాట్లాడుతూ స్విమ్స్‌కు కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీని మంజూరు చేస్తే కనీసం అందుకు అనువైన భవనాలను, సౌకర్యాలను కల్పించేందుకు కూడా నిధులు లేవంటే ఎలా అని ప్రశ్నించారు. ఈ అంశంపై తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డితో సంప్రదించి ఆయన అండతో పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. చివరగా జూనియర్ డాక్టర్లు రుయా నుంచి ర్యాలీగా బయల్దేరి రుయా చిన్న పిల్లల ఆస్పత్రికి చేరుకుని ఉద్యమ కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. జూడాల సంఘం(పీజీ) అధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్, కార్యదర్శి డాక్టర్ సురేష్, ఉపాధ్యక్షుడు డాక్టర్ గోపీకృష్ణ, యూజీ అధ్యక్షుడు డాక్టర్ విష్ణుభరద్వాజ్, కార్యదర్శి డాక్టర్ సత్యవాణి, ఉపాధ్యక్షుడు డాక్టర్ భానుప్రకాష్, సభ్యులు డాక్టర్ కిరణ్‌రెడ్డి, డాక్టర్ సేతుమాధవ్, హౌస్ సర్జన్ల సంఘం నాయకులు డాక్టర్ ప్రమోద్, డాక్టర్ వినయ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ బిల్లుల్లో పైరవీల హవా
టీటీడీలో పలుకుబడి ఉంటే రూ.లక్షల్లో బిల్లులు సాధారణ ఉద్యోగులకు భారీగా కోత తిరుపతి సిటీ : టీటీడీ తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన మెడికల్ బిల్లుల(రీయింబర్స్మెంట్) చెల్లింపులు వివాదాస్పదంగా మారుతున్నాయి. పలుకుబడి, పైరవీలు చేయిస్తున్న ఉద్యోగులకు రూ.లక్షల్లో బిల్లులు ముట్టజెబుతున్నారని, చిన్న ఉద్యోగులకు జబ్బు చేస్తే పెట్టిన ఖర్చులను సైతం చెల్లించకుండా ఆంక్షలు విధిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో అధిక వడ్డీలకు అప్పులు చేసి ఆపరేషన్లకు ఖర్చు చేసిన చిన్నస్థాయి ఉద్యోగులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రూ.2 లక్షలు దాటితే.. సాధారణంగా అటెండర్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు వ్యక్తిగతంగానూ, కుటుం బసభ్యులకైనా గరిష్టంగా టీటీడీ రూ.2 లక్షల మేరకు మెడికల్ బిల్లులకు పరిమి తి ఇచ్చింది. స్విమ్స్, నిమ్స్ ఆస్పత్రుల్లో తప్ప ఇతర ఆస్పత్రుల్లో వెద్యం పొందేవారికి ఇది వర్తిస్తుంది. బయట వైద్యం పొందడానికి గల కారణాలు తెలుపుతూ స్విమ్స్, నిమ్స్ వైద్యుల రెఫరల్ ఫాం అందించాల్సి ఉంటుంది. రూ. 2 లక్షల వరకు చెల్లించడానికి టీటీడీ ఈవోకు అధికారం ఉంది. ఈ పరిమితి దాటితే పాలకమండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇటీవల పాలక మండలి ఇద్దరికి పెద్దమొత్తంలో మెడికల్ బిల్లులు చెల్లించినట్లు సమాచారం. ఈ వ్యవహారాలపై బాధిత సామాన్య ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు తమ దగ్గరకు వస్తేనే వర్తిసాయా? పెద్దస్థాయిలో పైరవీలు చేసే వారికి నిబంధనలు వర్తించవా? అని ప్రశ్నిస్తున్నారు. పరిమితిని దాటితే తిప్పలే పరిమితిని మించే మెడికల్ బిల్లుల వ్యవహారంలో తిప్పలు తప్పడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. రూ.2.50 లక్షలు బిల్లు వస్తే అందులో నాలుగో వంతు మాత్రమే ఇస్తున్నారని సమాచారం. అదేమని ప్రశ్నిస్తే నిబంధనల ప్రకారమే చెల్లిస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు వెళ్లిన సమయంలో గుండె పోటు లాంటివి సంభవిస్తే అకస్మాత్తుగా అయ్యే ఆపరేషన్ల విషయంలోనూ కొర్రీలు వేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. టీటీడీ కొన్ని సర్జరీలకు బాధితులకు రూ.2 లక్షలు చెల్లిస్తుంది. ఇదే తరహాలో కొందరు ఉద్యోగులు మహానగరాలలో అడ్వాన్స్ టెక్నాలజీల ద్వారా కోతలేని ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. ఇవి ఓపెన్‌హార్ట్ కిందకు రావని.. కేవ లం రూ.50 వేలు మాత్రమే మంజూరవుతుందని చెబుతున్నట్లు సమాచారం. నిబంధనల మేరకే బిల్లులు.. టీటీడీ నిబంధనల మేరకే మెడికల్ బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయి. వంద రకాల జబ్బు లు ఉన్నాయి. వాటిలో కొన్ని రూ.10 వేల బిల్లు కూడా మించనివి ఉన్నాయి. వాటన్నింటికీ నిర్ణయించిన మేరకే చెల్లిస్తున్నాం. ఎంత పరిమితి ఉంటే అంతా చెల్లించలేం కదా.. వైద్యులు ధ్రువీకరించిన మేరకే నిర్ణయాలు ఉంటాయి. - డాక్టర్ ఎన్.వికాస్, సీఎంవో, టీటీడీ -
స్విమ్స్‌లో ఏసీబీ సోదాలు
తిరుపతి : టీటీడీ ఆర్థిక సహకారంతో, ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తిరుపతిలోని స్విమ్స్‌లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీబీ జాయింట్ డెరైక్టర్ సత్యనారాయణ, డీఎస్పీ శంకర్‌రెడ్డి నేతృత్వంలో ఆరుగురు బృందాలు (ఒక్కో బృందంలో 15మంది అధికారులు) స్విమ్స్‌లోని వివిధ పరిపాలన, వైద్య విభాగాలతో పాటు మెడికల్ యూనివర్సిటీ పరిధిలోని అకడమిక్ విభాగాల్లో ఉదయం 10 గంటల నుంచి సోదాలు చేపట్టాయి. ప్రతి విభాగానికి సంబంధించిన అన్ని ఫైళ్లను ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముఖ్యంగా ఆస్పత్రి పాత భవనంలోని సంజయ్ మెహ్రా బ్లాక్‌లోని జీఎం పేషీ, ఎంఎస్ కార్యాలయాల్లోని ప్రతి ఫైలును ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తనిఖీ చేపట్టి కొన్ని అనుమానాస్పద ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. స్విమ్స్‌లో ఏసీబీ సోదాలు చేస్తున్న సమాచారం అందుకున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అక్కడకు చేరుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి మీడియా వద్దకు వచ్చి సోదాల గురించి వివరించారు. తాము స్విమ్స్‌లోనే కాకుండా రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ మంగళవారం సోదాలు చేపట్టామన్నారు. ఇందులో రాజకీయ ఒత్తిళ్లు ఏవీ లేవని, నిధులు ఎక్కువగా కేటాయింపు జరుగుతున్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో తనిఖీలు చేయడం తమకు సాధారణమని వివరించారు. స్విమ్స్‌కు సంబంధించిన సోదాలు మంగళవారం రాత్రంతా కొనసాగుతాయన్నారు. -
స్విమ్స్‌లో లైఫ్‌కేర్ ఫార్మసీ సీజ్
తిరుపతి సిటీ: స్విమ్స్ ఆస్పత్రి అత్యవసర విభాగానికి ఆనుకుని హిందూస్థాన్ లేటెక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న లైఫ్‌కేర్ ఫార్మసీని డ్రగ్ కంట్రోల్ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రద్దయిన లెసైన్స్‌తో మందులు విక్రయిస్తుండడంతో రెండు నోటీసులు అనంతరం డ్రగ్ అధికారులు దీనిని సీజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏడాది క్రితం ఈ ఫార్మసీ ప్రారంభమైంది. ఇందులో 24 గంటలకు ముగ్గురు ఫార్మాసిస్టులను నియమించారు. నాలుగు మాసాల క్రితం వారందరూ ఫార్మసీ సర్టిఫికెట్లను డ్రగ్ కంట్రోల్ నుంచి వెనక్కి తీసేసుకున్నారు. దీంతో పలుమార్లు హెచ్చరించిన అధికారులు చివరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపై సంబంధిత నిర్వాహకుడితో మాట్లాడగా తాము మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఫార్మసీని మూతవేసినట్లు తెలిపారు. స్విమ్స్ రోగులకు కుచ్చుటోపీ స్విమ్స్ ఆస్పత్రికి వచ్చే రోగులకు మందులపై 10 నుంచి 60 శాతం వరకు తగ్గింపు ఇస్తామని చెప్పిన లైఫ్‌కేర్ ఫార్మసీ నిర్వాహకులు ఆచరణలో మాత్రం మొండిచెయ్యి చూపారు. రోగులకు కేవలం 10 శాతం మాత్రమే తగ్గింపు ఇచ్చి కుచ్చుటోపీ పెట్టారు. సాధారణంగా స్విమ్స్‌లో మెడికల్ షాపు నిర్వహించాలంటే నెలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు అద్దె టెండర్ ద్వారా పలుకుతోంది. అయితే వీరు ముందుగా రోగుల సేవలను ప్రస్తావించినందున యాజమాన్యం నెలకు కేవలం రూ.లక్ష నామమాత్రపు అద్దెకు కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. నిబంధనలు పాటించలేదు డ్రగ్ యాక్ట్‌లోని నిబంధనలను అతిక్రమించినందునే లైఫ్‌కేర్ సెంటర్‌ను సీజ్ చేశాం. నిర్వాహకులు రెండు నోటీసులు జారీ చేసినా స్పందించలేదు. దీంతో సీజ్ చేశాం. స్విమ్స్ అధికారులు రోగులకు ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలి. - విజయభాస్కర్‌రావు, డ్రగ్ ఇన్స్పెక్టర్, తిరుపతి -
వేగంగా మెడికల్ కళాశాల పనులు
తిరుపతి, న్యూస్‌లైన్: స్విమ్స్‌కు అనుబంధంగా శ్రీపద్మావతి అమ్మవారి పేరుతో ఏర్పాటు అవుతున్న తొలి మహిళా మెడికల్ కళాశాల పనులు వేగంగా సాగుతున్నాయి. 2014-15 విద్యాసంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభించే లక్ష్యం తో పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. స్విమ్స్‌కు అనుబంధంగా రేణిగుంట విమానాశ్రయం వద్ద ప్రభుత్వ స్థలంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు గతంలో చర్యలు చేపట్టారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేణిగుంట విమానాశ్రయం వద్ద మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం మార్కెట్ ధరకు 150 ఎకరాల ప్రభుత్వ భూమిని స్విమ్స్‌కు కేటాయిం చారు. అక్కడ టీటీడీ సహకారంతో మెడికల్ కళాశాల, ఫార్మసీ కళాశాల, స్విమ్స్ పరిపాలన భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. స్విమ్స్ నిధులతో ప్రభుత్వం కేటాయించిన భూమి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి కళాశాల కోసం నిర్మాణాలు ప్రారంభించారు. మెడికల్ కళాశాల ఏర్పాటుకు ఆర్థిక సహకారం అందించేందుకు టీటీడీ గతంలో ఇచ్చిన హామీని విరమించుకుంది. దాంతో పద్మావతి మెడికల్ కళాశాల పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. వైఎస్సార్ మరణం తర్వాత కళాశాల ఏర్పాటుకు సహకరించేందుకు కంచి మఠం ముందుకు వచ్చింది. స్విమ్స్ అధికారులు కంచి మఠం ప్రతినిధులు సమావేశమై ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు. అయితే ఆ ఒప్పందం కూడా అటకెక్కింది. మెడికల్ కళాశాలను తామే సొంతంగా ఏర్పాటు చేస్తామంటూ కంచిమఠం నిర్వాహకులు అడ్డం తిరిగారు. మెడికల్ కళాశాల ఏర్పాటుకు సహకరించేందుకు టీటీడీ వెనక్కు తగ్గడంతో కంచిమఠం ఆధ్వర్యంలో కళాశాల ఏర్పాటుకు అప్పటి రోశయ్య ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.అయితే అది కూడా వివాదాస్పదమై వ్యవహారం కోర్టుకు చేరింది. తిరుపతిలోనే మెడికల్ కళాశాల ఈ నేపథ్యంలో తిరుపతిలోని భారతీయ విద్యా భవన్ ఏరియాలో మహిళలకోసం మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది.దాంతో పనులు ప్రారంభించి, వచ్చే విద్యాసంవత్సరానికల్లా పూర్తిచేసి తరగతులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. కళాశాల నిర్మాణ పనులు వేగవంతం చేసిన అధికారులు ఎస్వీ మెడికల్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్, గతంలో స్విమ్స్ జనరల్ సర్జన్‌గా పనిచేసిన డాక్టర్ పీవీ రామసుబ్బారెడ్డిని డీన్‌గా నియమించారు. కళాశాల అడ్మినిస్ట్రేషన్, అడ్మిషన్లు తదితర వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తారు. కశాళాల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకాలకు చర్యలు చేపట్టనున్నారు. అంతవరకు స్విమ్స్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న వారికి బాధ్యతలు అప్పజెప్పారు.