శ్రీవెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ
తిరుపతి మెడికల్: రోగుల సంఖ్యకు అనుగుణంగా శ్రీవెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) మెడిసిన్ ఓపీ విభాగం వైద్య సేవల్లో మార్పులు చేసినట్లు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టి.ఎస్.రవికుమార్ పేర్కొన్నారు. స్విమ్స్ మెడిసిన్ విభాగాన్ని నాలుగు విభాగాలుగా విభజించినట్లు తెలిపారు. సోమవారం నుంచి శనివారం వరకు ఈ విభాగాల ద్వారా రోగులకు మెడిసిన్ అవుట్, ఇన్ పేషంట్ వైద్య సేవలను అందించనున్నట్లు వెల్లడించారు. మెడిసిన్ 1వ యూనిట్‌లో డాక్టర్ అల్లాడి మోహన్ సోమవారం నుంచి గురువారం వరకు, మెడిసిన్ 2వ యూనిట్‌లో డాక్టర్ సిద్ధార్థకుమార్ మంగళవారం నుంచి శుక్రవారం వరకు, 3వ యూనిట్‌లో డాక్టర్ కత్యార్‌మాల్ బుధవారం నుంచి శనివారం వరకు ఓపీడీ విభాగం 25, 26 గదుల్లో ఓపీని నిర్వహిస్తారని తెలిపారు. అదే విధంగా స్విమ్స్ అనుబంధ ఐ.పి.డబ్లు్య బ్లాక్‌లో మెడిసిన్ 4వ యూనిట్‌లో డాక్టర్ సదాశివయ్య సోమ, బుధ, శుక్రవారాల్లో వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. రుమటాలజీ విభాగానికి చెందిన డాక్టర్ శిరీష ఓపీడీ బ్లాక్‌లోని 31వ గదిలో బుధ, శుక్రవారాల్లో రోగులకు వైద్య సేవలు అందిస్తారని పేర్కొన్నారు. ఈ నూతన విభాగం వైద్య సేవలు ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని, రోగులు మార్పులను గుర్తించి వైద్యసేవలు పొందాలని కోరారు.