ఎస్వీ మెడికల్ కళాశాల పరిధిలోని మెటర్నటీకి అనుసంధానంగా నిర్మిస్తున్న 300 పడకల నూతన హాస్పిటల్ భవనాన్ని శ్రీపద్మావతి మహిళా మెడికల్ కళాశాలకు...
తిరుపతి కార్పొరేషన్ : ఎస్వీ మెడికల్ కళాశాల పరిధిలోని మెటర్నటీకి అనుసంధానంగా నిర్మిస్తున్న 300 పడకల నూతన హాస్పిటల్ భవనాన్ని శ్రీపద్మావతి మహిళా మెడికల్ కళాశాలకు తాత్కాలికంగా కేటాయించేందుకు రాష్ట్ర వైద్యవిద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ నిర్ణయం తీసుకున్నారు.
శనివారం తిరుపతి పర్యటనకు వచ్చిన మంత్రి ఎస్వీ మెడికల్ కళాశాలలో రుయా, మెటర్నిటీ, మెడికల్ కళాశాలల్లోని అన్ని విభాగాల విభాగాధిపతులతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి మొట్టమొదటి సారిగా మహిళలకు ప్రత్యేకంగా ఓ మెడికల్ కళాశాల మంజూరైందన్నారు. పద్మావతి మెడికల్ కళాశాల భవన నిర్మాణం పూర్తయ్యేంత వరకు వారికి ప్రత్యామ్నాయంగా 2014-16 వరకు రెండేళ్లు పాటు తాత్కాలికంగా నూతన భవనం కేటాయిద్దామన్నారు.
అవసరమైతే గతంలో స్విమ్స్‌కు కేటాయిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 78ని సవరిద్దామని తెలిపారు. దీంతో ఒకరిద్దరు మంత్రికి ఎదురు చెప్పినా ఆయన్ను ఒప్పించే ప్రయత్నం చేయలేక వైద్యాధికారులు తమ నిస్సహాయతను వ్యక్తం చేయాల్సి వచ్చింది.