స్విమ్స్ డెరైక్టర్‌గా డాక్టర్ టీఎస్ రవికుమార్ | Svims as Director Dr TS Ravi Kumar | Sakshi
Sakshi News home page

స్విమ్స్ డెరైక్టర్‌గా డాక్టర్ టీఎస్ రవికుమార్

Published Sun, Aug 30 2015 3:29 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM

స్విమ్స్ డెరైక్టర్‌గా డాక్టర్ టీఎస్ రవికుమార్ - Sakshi

స్విమ్స్ డెరైక్టర్‌గా డాక్టర్ టీఎస్ రవికుమార్

సాక్షి ,ప్రతినిధి తిరుపతి: శ్రీవెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) డెరైక్టర్‌గా టీఎస్.రవికుమార్‌ను నియమించా రు. విజయవాడలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని మంత్రి వెల్లడించారు. స్విమ్స్ డెరైక్టర్‌గా పోలా భాస్కర్ బాధ్యతలు స్వీకరించిన రోజునే ఈయన నియామకాన్ని ప్రకటించడం గమనార్హం. రవికుమార్ విజయవాడలోని ఎన్టీఆర్  హెల్త్ యూనివర్సిటీలో మంత్రి కామినేనితో పాటు, వైద్య శాఖ ఉన్నతాధికారులను సైతం శనివారం కలిసినట్టు తెలుస్తోంది. నియమాక ఉత్తర్వులు సోమవారంవెలువడే అవకాశం ఉంది. ఇంతకు మునుపు టీఎస్.రవికుమార్ చెన్నైలోని జిప్‌మర్ ఆసుపత్రిలో రెండేళ్ల పాటు డెరైక్టర్‌గా పని చేశారు. చెన్నై మెడికల్ కళాశాలలో ఎంఎస్ జనరల్ సర్జన్ చేశారు. అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌తో పాటు వివిధ హోదాల్లో పని చేశారు. ఆంకాలజీలో ప్రొఫెసర్‌గా గుర్తింపు పొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement