తిరుమల: స్విమ్స్ ఆస్పత్రిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి మరింత మెరుగైన వైద్యం అందిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం చైర్మన్ అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవనంలో జరిగింది. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జేఈఓలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్‌ఓ నరసింహ కిషోర్ పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వైవీ మీడియాకు వెల్లడించారు. వాటిలో ముఖ్యమైనవి..
►స్విమ్స్ ఆసుపత్రిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు రూ.97 కోట్లతో కార్డియో న్యూరో బ్లాక్, రూ.7 కోట్లతో సెంట్రలైజ్డ్ వంటశాల, రూ.7.75 కోట్లతో సెంట్రలైజ్డ్ గోడౌన్ నిర్మాణానికి టెండర్లు ఆమోదం.
►రూ.4.15 కోట్లతో తిరుమలలో అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణానికి టెండర్ల ఆమోదం.
►రూ.2.35 కోట్లతో తిరుమల హెచ్‌వీసీ ప్రాంతంలోని 18 బ్లాకుల్లో గల 144 గదుల అభివృద్ధి పనులు..
►రూ.40.50 కోట్లతో తిరుమలలో వెస్ట్ ప్యాకేజీకి గాను మూడేళ్ల కాలపరిమితికి ఎఫ్‌ఎంఎస్ సేవలను ముంబైకి చెందిన సంస్థకు అప్పగించేందుకు టెండర్ల ఆమోదం.
►అదేవిధంగా.. రూ.29.50 కోట్లతో శ్రీవారి సేవాసదన్, వకుళమాత విశ్రాంతి గృహం, పీఏసీ 3, 4, బి–టైప్, డి–టైప్ క్వార్టర్స్ ప్రాంతాల్లో ఎఫ్‌ఎంఎస్ సేవలను అదే సంస్థకు అప్పగించేందుకు టెండర్ల ఆమోదం.
►గుజరాత్‌లోని గాందీనగర్, ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో శ్రీవారి ఆలయాలు నిరి్మంచేందుకు ప్రణాళిక.
►శ్రీవాణి నిధులపై శ్వేతపత్రం
►శ్రీవాణి ట్రస్టు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని.. ఈ అంశంపై రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం టీటీడీపై దు్రష్పచారం చేసేవారి మీద చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానించింది. అలాగే, టీటీడీలో పూర్తి పారదర్శక పాలన జరుగుతోందని.. ఇందుకు సంబంధించి టీటీడీ ఆస్తులపై 2021 జూన్ 21న, బంగారు, నగదు డిపాజిట్లపై 2022 నవంబరు 5న శ్వేతపత్రాలు విడుదల చేశారని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.. నిరాదరణకు గురైన ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం ప్రతినెలా ఆయా ఆలయ కమిటీల బ్యాంకు ఖాతాలో రూ.5 వేలు జమచేయాలని పాలకమండలి నిర్ణయించిందన్నారు. టీటీడీ నుంచి ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment