తెలంగాణ లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (హైదరాబాద్) అప్‌గ్రెడేషన్ పూర్తైదని, రూ.94.93 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.
- కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన(పీఎంఎస్‌ఎస్‌వై) కింద మొదటి, రెండవ విడతల్లో 19 ప్రభుత్వ వైద్య కళాశాలలను అప్‌గ్రెడేషన్ చేస్తోందని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా శుక్రవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీవెంక టేశ్వర ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీ (తిరుపతి) 95 శాతం అప్‌గ్రెడేషన్ పూర్తైదని, రూ.57.87 కోట్ల నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (హైదరాబాద్) అప్‌గ్రెడేషన్ పూర్తైదని, రూ.94.93 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. తెలంగాణలోని గాంధీ మెడికల్ కళాశాల (సికింద్రాబాద్)కు రూ.3.15 కోట్లు, కాకతీయ వైద్య కళాశాల(వరంగల్)కు రూ.3.96 కోట్లు, ఉస్మాని యా వైద్య కళాశాలకు రూ.16.45 కోట్లు, ఏపీలోని ఆంధ్రా మెడికల్ కళాశాల (వైజాగ్)కు రూ.5.41 కోట్లు, గుంటూరు వైద్యకళాశాలకు రూ.7.55 కోట్లు, సిద్ధార్థ మెడికల్ కళాశాల (విజయవాడ)కు రూ.11.84 కోట్లు, రంగరాయ వైద్య కళాశాల (కాకి నాడ)కు రూ.3.33 కోట్లు, కర్నూలు వైద్య కళాశాలకు రూ.10.09 కోట్లు, ఎస్వీ వైద్య కళాశాల (తిరుపతి)కు రూ.6.85 కోట్లు, ప్రభుత్వ వైద్య కళాశాల(అనంతపూర్)కు రూ.కోటి నిధులు విడుదలైనట్టు తెలిపారు.
పీఎంఎస్‌ఎస్‌వై పథకం కింద మూడో విడతలో అప్ గ్రెడేషన్ కోసం సిద్థార్థ వైద్య కళాశాల (విజయవాడ), రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఆదిలాబాద్), కాకతీయ వైద్య కళాశాల (వరంగల్) నుంచి ప్రతిపాద నలు అందాయని మంత్రి జేపీ నడ్డా వివరించారు.