చంద్రబాబు సర్కార్‌పై జూనియర్ డాక్టర్లు నిప్పులు చెరిగారు.
చంద్రబాబు సర్కార్‌పై జూనియర్ డాక్టర్లు నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఇప్పటికీ రెండుకళ్ల సిద్ధాంతాన్ని పాటిస్తున్నారని జూనియర్ డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను హైదరాబాద్ చర్చలకు పిలిచి సమాధానం చెప్పకుండా చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించారని జూనియర్ డాక్టర్ల సంఘం నాయకులు మండిపడ్డారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగడతామని చెప్పారు.
తక్షణమే జీవో నంబరు 78 రద్దు చేసి, స్విమ్స్కు ఇచ్చిన భవనాలను మెటర్నిటీ ఆస్పత్రికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రేపటినుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జూనియర్ డాక్టర్ల సమ్మె ఫలితంగా ఇప్పటికే రుయా, మెటర్నిటీ ఆస్పత్రులు రెండింటిలోనూ వైద్యసేవలు దాదాపుగా నిలిచిపోయాయి. ప్రభుత్వం మాత్రం ఈ విషయమై ఇప్పటివరకు స్పందించిన పాపన పోలేదు.