
సాక్షి,విజయవాడ: కూటమి ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పీపీలు, ఏపీపీల నియామకంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నిస్తూ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది.
ఏపీపీఎస్సీ చైర్మన్ ,సభ్యుల నియామకం నిబంధనల ప్రకారం జరగలేదని, కాబట్టి వాటిని వెంటనే రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో పాటు కింది కోర్టులో పీపీలు ,ఏపీపీలు తోపాటు మరికొన్ని పోస్టుల నియామకానికి చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.
విచారణలో భాగంగా ఏపీపీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామక నోట్ ఫైళ్లను తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు, పీపీలు,ఏపీపీల నియామకంలో జాప్యంపై ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ స్వయంగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment