సాక్షి, తిరుమల: టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌పై స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్ ఫిర్యాదు చేశారు. తాను సిఫారసు చేసిన వారిందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటూ స్విమ్స్ డైరెక్టర్‌పై ఒత్తిడి చేస్తున్నట్లు టీటీడీ వర్గాలు పేర్కొంటున్నాయి. స్విమ్స్ గవర్నింగ్ కౌన్సిల్ తీర్మానాలకు వ్యతిరేకంగా ఉద్యోగాలు ఇవ్వాలని సుధాకర్ యాదవ్ కోరుతుండటంతో స్విమ్స్ డైరెక్టర్ ఈ విషయంపై టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై విచారణ నిర్వహించిన టీటీడీ అధికారులు దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్‌కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినా..ఆ ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్‌గా నియమితులైన పుట్టా సుధాకర్ యాదవ్ ఇంకా అదే పదవిలో కొనసాగుతుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment