సాక్షి, తిరుమల : శ్రీవారి ఆలయంలో నూతన పాలకమండలి శనివారం ప్రమాణం స్వీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్ ప్రమాణం చేశారు. ఆయనతోపాటు 11మంది పాలక మండలి సభ్యులు కూడా ప్రమాణం స్వీకరించారు. ఈ క్రమంలో ఉదయం దర్శనం కోసం వచ్చిన నూతన పాలక మండలి సభ్యులను, వారి కుటుంబ సభ్యులను వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో భక్తుల రద్దీ దృష్టి కొద్దిసేపు సిబ్బంది నిలిపేశారు.
దీంతో టీటీడీ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ నూతన పాలకమండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతసేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. టీటీడీ ఇన్‌చార్జ్ సీవీఎస్వో శివకుమార్ రెడ్డి, అధికారులు నూతన సభ్యులను బుజ్జగించి తీసుకొచ్చారు. మరోవైపు ప్రమాణ స్వీకారోత్సవం నేపథ్యంలో తమకు అసౌకర్యం కలుగజేస్తున్నారంటూ శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment